Kalyan Ram Postponed His Song Release Due To Taraka Ratna Health Condition - Sakshi
Sakshi News home page

Kalyan Ram : క్రిటికల్‌గా తారకరత్న ఆరోగ్యం.. రిలీజ్‌ వాయిదా వేసుకున్న కల్యాణ్‌ రామ్‌

Published Sat, Jan 28 2023 3:46 PM | Last Updated on Sat, Jan 28 2023 5:28 PM

Kalyan Ram Postponed His Song Release Due To Taraka Ratna Health Condition - Sakshi

సినీనటుడు నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని బెంగళూరు హృదయాలయ ఆస్పత్రి వైద్యులు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు  హెల్త్‌ బుటిటెన్‌ విడుదల చేసిన వైద్యులు.. తారకరత్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు  పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో సినిమా ప్రమోషన్స్‌ చేయడం సరికాదనుకున్నారు నందమూరి కల్యాణ్‌ రామ్‌.

ఆయన నటిస్తున్న తాజా చిత్రం అమిగోస్‌ ఫిబ్రవరి10న విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్‌ మొదలుపెట్టిన మేకర్స్‌ ఈ సినిమాలోని ఫస్ట్‌ సింగిల్‌ను రిలీజ్‌ చేశారు. బాలకృష్ణ సూపర్ హిట్ సాంగ్స్ లో ఒకటైన ‘ఎన్నో రాత్రులొస్తాయి గాని రాధే వెన్నల’ పాటని ఈ సినిమాలో రీమేక్ చేశాడు కళ్యాణ్ రామ్.

ఇప్పటికే ఈ పాట ప్రోమోను విడుదల చేయగా, ఫుల్‌సాంగ్‌ను రేపు(ఆదివారం)సాయంత్రం గం.5:09 నిమిషాలకు విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. అయితే ప్రస్తుతం తారకరత్న ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా సాంగ్‌ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు అమిగోస్‌ మేకర్స్‌ ప్రకటించారు. తారకరత్న త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌ చేశారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement