పలు టీవీ ఛానళ్లపై ఇండియా కూటమి నిషేధం.. ఎందుకంటే..? | INDIA Bloc To Boycott Some Anchors, TV Shows | Sakshi
Sakshi News home page

పలు టీవీ ఛానళ్లపై ఇండియా కూటమి నిషేధం.. ఎందుకంటే..?

Published Thu, Sep 14 2023 12:43 PM | Last Updated on Thu, Sep 14 2023 1:13 PM

INDIA Bloc To Boycott Some AnchorsTV Shows - Sakshi

ఢిల్లీ: తమపై దుష్ప్రచారం చేస్తున్న టీవీ ఛానళ్లు, షోలపై నిషేధం విధించాలని ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంది.  తమపై విషం చిమ్ముతున్నవారి జాబితాను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. నిన్న ఢిల్లీలో జరిగిన కూటమి సమన్వయ కమిటీ భేటీలో ఈ మేరకు తీర్మానించింది.

నిన్న ఢిల్లీలో ఇండియా కూటమి సమన్వయ కమిటీ మొదటిసారి సమావేశమైంది. ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో భేటీ అయి ఎన్నికల ప్రచారం, సీట్ల షేరింగ్‌పై చర్చించారు. అక్టోబర్‌లో మొదటి బహిరంగ సభ నిర్వహించాలని తీర్మానించారు. ఈ క్రమంలోనే కొన్ని మీడియా సంస్థలు తమను పట్టించుకోవట్లేదని ఆరోపణలు చేసింది. పైగా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడింది. అలాంటి ఛానళ్లను, షోలను, యాంకర్‌లను ఇకపై నిషేధించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆయా జాబితాను సిద్ధం చేస్తున్నట్లు స్పష్టం చేసింది. 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సమయంలో కొన్ని మీడియా ఛానళ్లు పట్టించుకోలేదని కాంగ్రెస్ ఆరోపించింది. తమకు వ్యతిరేకమైన అంశాలనే ప్రచారం చేసినట్లు తెలిపింది. జోడో యాత్రపై సోషల్ మీడియాలో విశేష స్పందన లభించినప్పటికీ ప్రధాన మీడియా పక్కకు పెట్టినట్లు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ ఆరోపించారు. 

'కొన్ని మీడియా సంస్థల ఎడిటర్లు భారత్ జోడో యాత్రను నిషేధించారు. లక్షల మంది పాల్గొన్నప్పటికీ తగినంత ప్రచారం కల్పించలేదు. పైగా వ్యతిరేకమైన వార్తలనే ప్రచారం చేశారు' అని రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ మండిపడ్డారు. 2019 మేలోనూ కొన్ని మీడియా ఛానళ్లపై కాంగ్రెస్ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. టీవీ డిబేట్‌లకు కాంగ్రెస్ తమ ప్రతినిధులను పంపకూడదని సీనియర్ నాయకుడు రణదీప్ సుర్జేవాలా అప్పట్లో పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: Sanatan Dharma Remark Controversy: సనాతన ధర్మంపై మాట్లాడకండి.. పార్టీ శ్రేణులకు స్టాలిన్ సూచన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement