సిద్ధూకు గ్రీన్ సిగ్నల్ | Punjab AG green flags Navjot Singh Sidhu's work on TV show, says no need to change portfolio | Sakshi
Sakshi News home page

సిద్ధూకు గ్రీన్ సిగ్నల్

Published Fri, Mar 24 2017 10:02 AM | Last Updated on Tue, Sep 5 2017 6:59 AM

సిద్ధూకు గ్రీన్ సిగ్నల్

సిద్ధూకు గ్రీన్ సిగ్నల్

చండీగఢ్‌: టీవీ షోలు చేసేందుకు పంజాబ్ మంత్రి, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూకు అనుమతి లభించింది. పంజాబ్ అడ్వకేట్ జనరల్ అతుల్ నందా నుంచి ఆయనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. మంత్రిగా కొనసాగుతూ టీవీ షోలు చేసుకోవడానికి అభ్యంతరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. అతుల్ నందా నుంచి తనకు నివేదిక అందిన విషయాన్ని ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ధ్రువీకరించారు. అడ్వకేట్ జనరల్ పచ్చజెండా ఊపడంతో మంత్రిగా కొనసాగేందుకు సిద్ధూకు అడ్డంకులు తొలగిపోయాయి. ఆయన శాఖను కూడా మార్చే అవకాశం లేదు.

సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రిగా సిద్ధూను మారుస్తారని అంతకుముందు వార్తలు వచ్చాయి. డబ్బు సంపాదనకు తనకు టీవీ షోలు మినహా ప్రత్యామ్నాయం లేదని సిద్ధూ అంతకుముందు వ్యాఖ్యానించారు. అవినీతికి పాల్పడకుండా తాను టీవీ షోలు చేసుకుంటే తప్పేందని ఆయన ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో సీఎం అమరీందర్ అడ్వకేట్ జనరల్ ను న్యాయసలహా కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement