కరాచీ: పాకిస్తాన్ టీవీ చానళ్లలో భారతీయ సినిమాలు, టీవీ కార్యక్రమాల ప్రసారంపై నిషేధాన్ని అక్కడి సుప్రీంకోర్టు శనివారం పునరుద్ధరించింది. ఎలాంటి అభ్యంతరం లేని కార్యక్రమాలను మాత్రమే ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. యునైటెడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(యూపీఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన జడ్జి జస్టిస్ సకీజ్ నిసార్ ఈ మేరకు తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ‘దైయమెర్–భాషా ప్రాజెక్టు నిర్మాణాన్ని భారత్ అడ్డుకుంటోంది. కనీసం ఆ దేశపు సినిమాలు, టీవీ కార్యక్రమాలను కూడా మనం అడ్డుకోలేమా?’ అని ప్రశ్నించారు. దీంతో జడ్జి పాక్ అధికారులు ఆమోదించిన చిత్రాలు, కార్యక్రమాలనే ప్రసారం చేయాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment