పాకిస్తాన్‌లో భారత సినిమాలపై రెండు నెలల క్రితం విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ దేశ థియేటర్ల సంఘం నిర్ణయించింది.
కరాచీ: పాకిస్తాన్‌లో భారత సినిమాలపై రెండు నెలల క్రితం విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ దేశ థియేటర్ల సంఘం నిర్ణయించింది. దీంతో సోమవారం నుంచి యథావిధిగా భారత చిత్రాలను పాక్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు.
‘భారత చిత్రాలపైనే పాక్‌లో సినిమా వ్యాపారం బాగా నడుస్తుంది. సినీప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌ల నిర్మాణం థియేటర్లకు మరమ్మత్తులు చేసేందుకు పెట్టుబడులు పెట్టాం. అందుకే నిషేధాన్ని ఎత్తేయాలని నిర్ణయించాం’అని పాక్ సినిమా ఎగ్జిబిటర్ల సంఘం పేర్కొంది. ఉడీ ఘటన తర్వాత భారత–పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మన చిత్రాలపై పాక్‌లో నిషేధం విధించడం తెలిసిందే.