
సాక్షి, న్యూఢిల్లీ : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సరిహద్దులో కాల్పుల విరమణను మరోసారి భారత్ ప్రకటించి పాక్‌కు శాంతి సందేశాన్ని పంపింది. కానీ పాక్ మాత్రం తమ వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. భారతీయ సినిమాలను తాత్కాలికంగా తమ దేశంలో ప్రదర్శించవద్దంటూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ ఉన్నతాధికారి దన్యాల్ గిలానీ ట్వీట్‌లో జీవో ప్రకటనలను పోస్ట్ చేశారు.
ఈద్ పర్వదినానికి రెండు రోజుల ముందు, ఈద్ ముగిశాక రెండు వారాల పాటు పాక్‌లో ఇండియన్ ఫిల్మ్స్ ప్రదర్శనను నిలిపివేస్తూ ప్రకటించింది. ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ అజా సమయంలో భారత్ సినిమాలను ప్రదర్శించవద్దని, నిషేధం ముగిసిన తర్వాత మళ్లీ కొనసాగించవచ్చునని తెలిపింది. భారతీయ, ఇతర దేశాల సినిమాల కారణంగా పాక్ సినిమాలకు వసూళ్లు ఎక్కువగా రావడం లేదన్న కారణంగా పాక్ ఇలా చేసిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు భారతీయ సినిమాలకు పాక్‌లో అభిమానులు ఎక్కువగా ఉండటం వల్ల, పాకిస్తానీ మూవీలకు థియేటర్లు దొరకడం వారికి ఎప్పటినుంచో ఉన్న సమస్య అన్న విషయం తెలిసిందే.