indian movies
-
గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో ఇండియన్ సినిమాకు నిరాశ
ప్రపంచవ్యాప్తంగా సినీ నటీనటులు ప్రతిష్టాత్మకంగా భావించే 82వ గోల్డెన్ గ్లోబ్స్ అవార్డుల వేడుక లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా ప్రారంభమైంది. అయితే, అవార్డ్ కోసం భారత్ నుంచి బరిలో ఉన్న ‘ఆల్ వి ఇమాజిన్ యాజ్ లైట్’ సినిమాకు నిరాశే మిగిలింది. బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ మోషన్ పిక్చర్, బెస్ట్ డైరెక్టర్ కేటగిరీల్లో పోటీలో నిలిచిన ఈ చిత్రానికి రెండు విభాగాల్లోనూ నిరాశే ఎదురైంది. ఫ్రెంచ్ మ్యూజికల్ క్రైమ్ కామెడీ చిత్రం 'ఎమిలియా పెరెజ్' చిత్రం బెస్ట్ నాన్ ఇంగ్లిష్ లాంగ్వేజ్ విభాగంలో అవార్డ్ అందుకుంది. ఇండియన్ సినిమా అవార్డ్ కోల్పోయినప్పటికీ హాలీవుడ్ మూవీలతో పోటీ పడి ఆర్హత సాధించింది. దీంతో ఈ చిత్రంపై అందరి నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి.సినిమా రంగంలో విశేష ప్రతిభ చూపిన వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపునిచ్చే ఉద్దేశంతో హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (హెచ్. ఎఫ్. పి. ఎ) వారు ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డులకు నాంది పలికారు. 1944 నుంచి ఈ అవార్డు కార్యక్రమాన్ని ప్రతి ఏడాది ప్రారంభంలో వారు నిర్వహిస్తున్నారు. హాలీవుడ్ సినిమాలతో పాటు అంతర్జాతీయ చిత్రాలను కూడా గుర్తించి వాటికి పురస్కారాలు ఇస్తుంటారు. ప్రస్తుతం హెచ్. ఎఫ్. పి. ఎ టీమ్‌లో సుమారు 60 దేశాలకు చెందిన 105 మంది సభ్యులున్నారు. వారందరూ ఓకే అనుకున్న తర్వాతే గోల్డెన్ గ్లోబ్స్ ఖరారు చేస్తారు. సినిమా రంగంతో పాటు టెలివిజన్ రంగంలో ప్రతిభ చూపిన వారికీ అవార్డులు ఇస్తుండటం విశేషం.‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్‌ను ఆర్ఆర్ఆర్ దక్కించుకుంది. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ‘నాటు నాటు’ పాటకుగాను అవార్డు వరించింది. టాలీవుడ్ నుంచి ఈ పురస్కారం అందుకున్న తొలి వ్యక్తిగా సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి రికార్డ్ క్రియేట్ చేశారు. అయితే, ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ వ్యక్తిగా సంగీత దర్శకుడు ఎ. ఆర్. రెహమాన్ కావడం విశేషం. 2009లో వచ్చిన ‘స్లమ్‌డాగ్ మిలీనియర్’ సినిమాకుగాను ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’ విభాగంలో ఆయన ఈ అవార్డు అందుకున్నారు. అలా ఇప్పటి వరకు వారిద్దరు మాత్రమే ఈ అవార్డ్ దక్కించుకున్నారు. ఈ పుస్కారం సాధిస్తే 'ఆస్కార్' అవార్డ్ వచ్చినట్టే అని చాలామంది సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతుంటారు.గోల్డెన్ గ్లోబ్ విజేతలుఉత్తమ చిత్రం - ఎమిలియా పెరెజ్ (ఫ్రెంచ్)ఉత్తమ దర్శకుడు - అమెరికాకు చెందిన బ్రాడీ కార్బెట్ ( ది బ్రూటలిస్ట్)ఉత్తమ నటుడు - రొమానియా నటుడు సెబాస్టియన్ స్టాన్ ( ఎడిఫరెంట్ మ్యాన్)ఉత్తమ నటి - మెక్సికోకు చెందిన డెమి మూర్ (ది సబ్‌స్టాన్స్)ఉత్తమ యానిమేటెడ్ చిత్రం - ఫ్లో (ఫ్రెంచ్) -
భారతీయ సినిమాలంటే ఇష్టం.. బాలీవుడ్‌పై పుతిన్ ప్రశంసలు
మాస్కో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈనెల 22, 23 తేదీల్లో రష్యాలోని కజాన్ వేదికగా జరిగే 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్యానించారు. దీంతో ప్రధాని మోదీ.. రష్యా పర్యటనకు మరోసారి వెళ్లనున్నారు.ఈ నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్ రష్యా మీడియాతో మాట్లాడుతూ.. భారతీయు సినిమాలు, బాలీవుడ్‌పై ప్రసంశలు కురిపించారు. భారతీయ సినిమాలకు తమ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉందని అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాలలో సినిమా షూటింగ్‌లకు రష్యా ప్రోత్సాహకాలు అందిస్తుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. పుతిన్ మాట్లాడుతూ..‘‘ బ్రిక్స్ సభ్య దేశాలను పరిశీలిస్తే.. రష్యాలో భారతీయ చలనచిత్రాలకు అధిక ప్రజాదరణ ఉందని నేను భావిస్తున్నా. మాకు ప్రత్యేకంగా టీవీ ఛానెల్ ఉంది. భారతీయ చలనచిత్రాలపై చాలా ఆసక్తిని కలిగి ఉన్నాం. ఈ ఏడాది మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా బ్రిక్స్ దేశాల్లోని సినిమాలను పరిచయం చేస్తాం. #WATCH | On being asked about if Russia will give incentives to BRICS memeber states for shooting of films in the country, Russian President Putin says, "If we look at BRICS member states, I think in this country Indian films are most popular. We have a special TV channel with… pic.twitter.com/w0QGNdH0IV— ANI (@ANI) October 18, 2024 ..నేను భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కావడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రతిపాదనపై నా స్నేహితుడు మోదీతో చర్చించడానికి ఎదురు చూస్తూన్నా. తమ మధ్య మా మధ్య 100 శాతం సానుకూల ఒప్పందాలు జరుగుతాయని నమ్మకం ఉంది. ఇక.. భారతీయ చలనచిత్రాలు మాత్రమే కాకుండా వారి సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే బ్రిక్స్ దేశాల నటీనటులు, చైనీస్, ఇథియోపియన్ నటులు ఉన్నారు. అదేవిధంగా మేం థియేట్రికల్ ఫెస్టివల్ నిర్వహించాలని బ్రిక్స్ దేశాలతో చర్చించాం. సినిమా అకాడమీని కూడా నెలకొల్పాం’’ అని పుతిన్ అన్నారు.ఇక.. గడిచిన నాలుగు నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తరువాత తొలిసారి మాస్కోలో ఈ ఏడాది జులై నెలలో మోదీ పర్యటించారు. ఆ సమయంలో 22వ భారత్–రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. 2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు బ్రిక్ గ్రూపును ప్రారంభించాయి. 2010లో దక్షిణాఫ్రికా చేరిన తరువాత అది బ్రిక్స్‌గా మార్చారు. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా చేరాయి. ప్రస్తుతం ఈ బ్రిక్స్ గ్రూపులో పది దేశాలు ఉన్నాయి. -
మొదటిరోజు అత్యధిక కలెక్షన్స్ సాధించిన టాప్-10 ఇండియన్ సినిమాలు (ఫొటోలు)
-
All We Imagine as Light: ఆస్కార్ బరిలో...!
భారతీయ దర్శకురాలు పాయల్ కపాడియా తెరకెక్కించిన ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం ఆస్కార్ బరిలో నిలిచే చాన్స్ ఉంది. కనికస్రుతి, దివ్య ప్రభ ప్రధాన పాత్రలో, ఛాయాకందం ఓ కీలక పాత్రలో నటించిన చిత్రం ఇది. ఫ్రాన్స్, ఇండియా, నెదర్లాండ్స్, ఇటలీ, లక్సెంబర్గ్ దేశాలు ఈ సినిమా నిర్మాణంలో పాలు పంచుకున్నాయి. ఈ ఏడాది మేలో జరిగిన 77వ కాన్స్ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ఈ సినిమాను ప్రదర్శించారు. కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రతిష్టాత్మకమైన గ్రాండ్ ప్రీ అవార్డు ఈ చిత్రం గెలుచుకుంది. తాజాగా ఈ సినిమాను 2025 ఆస్కార్ బరిలో నిలిపేందుకు మేకర్స్ సన్నాహాలు మొదలు పెట్టారట. ఈ చిత్రాన్ని ఆస్కార్‌కు పంపేందుకు ఫ్రాన్స్ దేశం షార్ట్ లిస్ట్ చేసిందని టాక్. ఇక 97వ ఆస్కార్ అవార్డుల వేడుక 2025 మార్చిలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇక ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ చిత్రం అక్టోబరు 2న ఫ్రాన్స్‌లో రిలీజ్ కానుందని, మలయాళం, హిందీ, మరాఠీ భాషల్లో రూ΄÷ందిన ఈ సినిమాను ఇండియాలో హీరో రానా నిర్మాణసంస్థ ‘స్పిరిట్ మీడియా’ డిస్ట్రిబ్యూట్ చేయనుందట. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ముంబైలో పని చేస్తున్న ఇద్దరు కేరళ నర్సులు ప్రభ (కనికస్రుతి), అను (దివ్య) జీవితాల్లో జరిగిన ఘటనల నేపథ్యంలో ‘ఆల్ ఉయ్ ఇమాజిన్ యాజ్ ఏ లైట్’ కథనం సాగుతుంది. -
కేన్స్‌లో ఇండియన్ సినిమాకు మొదటి బహుమతి
ఫ్రాన్స్‌లో 76వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ అట్టహాసంగా కొనసాగుతున్నాయి. యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ చిత్రోత్సవాలు మే 25న ముగియనున్నాయి. ప్రతిష్ఠాత్మక కేన్స్ చిత్రోత్సవాల్లో భారత్‌కు చెందిన 'సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో' షార్ట్‌ఫిలిం సత్తా చాటింది. 2024కు గాను ఉత్తమ షార్ట్‌ఫిలిం బహుమతిని సొంతం చేసుకుంది.చిదానంద S నాయక్ తెరకెక్కించిన 'సన్‌ఫ్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో' అనే చిత్రం వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి మొదటి బహుమతి అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 555 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 2,263 మంది దరఖాస్తుదారులు ఇందులో పోటీ పడ్డారు. 16 నిమిషాల పాటు నిడివితో ఉన్న ఈ షార్ట్ ఫిలింను కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు.ఇదే విభాగంలో బన్నీహుడ్' అనే UK చిత్రానికి మూడో బహుమతి లభించింది. ఈ చిత్రాన్ని మీరట్‌లో జన్మించిన భారతీయ చిత్రనిర్మాత మహేశ్వరి రూపొందించడం విశేషం. మే 23న ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఉత్తమ షార్ట్ ఫిలిం అవార్డును గెలుచుకున్న టీమ్‌కు 15,00 యూరోలు, మూడో స్థానానికి 7,500 యూరోలు అందించారు. ఈ రెండు షార్ట్ ఫిలిం టీమ్‌కు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Festival de Cannes (@festivaldecannes) -
భారత్ సినిమాలపై పాక్ ప్రముఖ హీరో రియాక్షన్
పాకిస్థాన్‌లో భారతీయ సినిమాలను విడుదల చేయాలని ప్రముఖ నటుడు, నిర్మాత ఫైసల్ ఖురేషీ అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. స్థానిక సినిమా ఎగ్జిబిషన్ రంగాన్ని పునరుజ్జీవింపజేసేందుకు ఆ దేశంలో భారతీయ చిత్రాలను విడుదల చేయాలని పాక్ అగ్రనటులు, నిర్మాతల్లో ఒకరైన ఫైసల్ ఖురేషీ పేర్కొన్నాడు. పాకిస్థాన్ సినిమా ఇండస్ట్రీలో అనేక హిట్ సీరియల్స్‌తో పాటు ఎన్నో సినిమాల్లో ఆయన నటించాడు. ఎన్నో బ్లాక్‌బస్టర్ సిరీస్‌లను ఖురేషీ నిర్మించాడు. పాక్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఇలా అన్నాడు. ' పాకిస్తాన్లో సినిమా మనుగడ ఉండాలంటే భారతీయ చిత్రాల ప్రదర్శనపై నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలి. నేను కూడా పాకిస్థానీనే.. దేశభక్తుడిని కూడా. కానీ, మీరు పాకిస్తానీ సినిమాలను నడపాలనుకుంటే... ముందుగా భారతీయ చిత్రాలను ప్రదర్శించడం చాలా ముఖ్యం. పాకిస్థాన్ ప్రేక్షకులు కూడా భారతీయ సినిమాలను చూడాలనుకుంటున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. భారత్‌తో సంబంధాలను మెరుగుపరిచేందుకు కృషి చేద్దాం.' అని ఆయన అన్నారు. (ఇదీ చదవండి: న్యూ ఇయర్ స్పెషల్.. ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 25 సినిమాలు) 2019 చివరి నుంచి పాకిస్తాన్‌లోని థియేటర్లలో భారతీయ చిత్రాల ప్రదర్శన పూర్తిగా నిషేధించబడింది. కానీ సినీ ప్రియులు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో వంటి విభిన్న స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో భారత్ సినిమాలను చూస్తున్నారని ఆయన గుర్తుచేశారు. 'పాకిస్థాన్‌లో భారతీయ చిత్రాలపై నిషేధం లేకుంటే, పాకిస్థానీ చలనచిత్ర- నాటక పరిశ్రమ మరింతగా అభివృద్ధి చెంది ఉండేది. భారతీయ స్ట్రీమింగ్ పోర్టల్‌తో పాటు కొన్ని ఛానెల్‌లలో పాకిస్తానీ కంటెంట్‌ను కూడా మరింతగా ప్రదర్శించేందుకు అవకాశం ఉండేది. భారత్ సినిమాలు పాక్‌లో ప్రదర్శిస్తే.. వినోద వ్యాపారం ద్వారా సంవత్సరానికి రూ. 6000 కోట్లకు పైగానే ఆర్జించేది. మన సినిమాలు, సీరియల్స్ భారత్ ఆన్లైన్ పోర్టల్లలో ప్రదర్శించబడుతున్నాయి. మన ప్రజలు గతంలో భారతీయ సినిమాలను చూడటానికి థియేటర్లకు వెళ్లేవారు, ఇది మన పరిశ్రమకు విలువైన ఆదాయాన్ని తెచ్చిపెట్టింది. కానీ ఇప్పుడు మన ఆదాయ మార్గాలను మనమే మూసివేయబడటం విచిత్రంగా ఉంది. పాక్‌లోని సినిమా థియేటర్లలో భారతీయ సినిమాలను ప్రదర్శించడానికి అనుమతి ఇచ్చేంత వరకు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందదని ఆయన తేల్చిచెప్పారు. -
ఆస్కార్ టార్గెట్ గా తెరకెక్కుతున్న సినిమాలు
-
సీక్వెల్ కు జై కొడుతున్న స్టార్ హీరోలు..
-
Oscar 2023: వావ్.. భారత్‌కు ‘ఆస్కార్’.. ఏ చిత్రమో తెలుసా?
లాస్ ఏంజెల్స్: లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో వేదికగా జరుగుతున్న 95వ ఆస్కార్ వేడుకలో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరిలో ’ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకుంది. కార్తికి గోన్సాల్వెస్ ’ది ఎలిఫెండ్ విస్పరర్స్’కు దర్శకత్వం వహించింది. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ ఈ ఆస్కార్‌ను దక్కించుకుంది. ఈ అవార్డ్‌ను కార్తికి గోన్సాల్వెస్ అందుకున్నారు. ఇక ఈ షార్ట్ ఫిలిం విషయానికొస్తే.. తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ రూందించిన డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’. -
IMDb: ఈ ఏడాది టాప్ 10 మూవీస్ ఇవే.. అగ్రస్థానంలో 'ఆర్ఆర్ఆర్'
ఈ ఏడాది ఇండియాలో టాప్ టెన్ మూవీస్‌లో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబి ఈ జాబితాను విడుదల చేసింది. టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ ఆఫ్ 2022’ పేరుతో విడుదల చేసిన జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అత్యంత భారీ బడ్జెడ్ ఆర్ఆర్ఆర్తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదటిస్థానంలో ఆర్ఆర్ఆర్, రెండోస్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, మూడోస్థానంలో కేజీఎఫ్-2, నాలుగో స్థానంలో విక్రమ్, ఐదో ప్లేస్‌లో కాంతార నిలిచింది. ఆ తర్వాత వరుసగా రాకెట్రీ, మేజర్, సీతారామం, పొన్నియిన్ సెల్వన్, చార్లీ 777 చిత్రాలు టాప్ టెన్‌లో స్థానం దక్కించుకున్నాయి. ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు.. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన కన్నడ హీరో రిషబ్ శెట్టి చిత్రం కాంతార మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే బ్రహ్మరథం పట్టారు. టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్- 2022 ఆర్ఆర్ఆర్ ది కశ్మీర్ ఫైల్స్ కేజీయఫ్-2 విక్రమ్ కాంతార రాకెట్రీ మేజర్ సీతారామం పొన్నియిన్ సెల్వన్ 777 చార్లీ Presenting the IMDb Top 10 Most Popular Indian Movies of the year 2022 🥁💛 How many of your favourites made it to the list?#IMDbBestof2022 pic.twitter.com/0GggT44fG8 — IMDb India (@IMDb_in) December 14, 2022 -
ఈ ఏడాది దుమ్మురేపిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
IMDB Top 10 Most Popular Indian Movies And Web Series 2022: ఓటీటీలు వచ్చాక సినీ ప్రియుల నుంచి ప్రేక్షకుల దాకా అభిరుచి మారింది. రొటీన్, రొడ్డకొట్టుడు సినిమాలకు స్వస్తి పలుకుతూ కొత్త తరహా కథాంశాలతో వచ్చిన చిత్రాలకు సై కొడుతున్నారు. సినిమాలో ఎంత పెద్ద తారాగణం ఉన్నప్పటికీ కథలో దమ్ము, కథనంలో బలం లేకుంటా చూసేదే లే అంటున్నారు. ఇక ప్రస్తుతం విభిన్నమైన స్టోరీస్‌తో వచ్చే సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లను కూడా మూవీ లవర్స్ హిట్టు బాట పట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే 2022లో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కాగా ప్రేక్షకులు కొన్నింటిని ఆదరిస్తే.. మరికొన్నింటిని తిరస్కరించారు. ప్రేక్షకుల ఆదరణను బట్టి తాజాగా ఐఎమ్‌డీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) టాప్ 10 మోస్ట్ పాపులర్ మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. ఇండియాలోని ఐఎమ్‌డీబీ (IMDB)ఆడియెన్స్ పేజీ వీక్షణ ఆధారంగా ఈ రేటింగ్లను కేటాయిస్తారనే విషయం తెలిసిందే. 2022 జనవరి 1 నుంచి జులై 5 వరకు ఇటు థియేటర్స్, అటు ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఈ రేటింగ్స్‌ను ఇచ్చింది. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఆ రేటింగ్స్ ఏంటో ఓ లుక్కేయండి. మోస్ట్ పాపులర్ ఇండియన్ చిత్రాలు.. 1. విక్రమ్- 8.8 2. కేజీఎఫ్ 2- 8.5 3. ది కశ్మీర్ ఫైల్స్- 8.3 4. హృదయం- 8.1 5. ఆర్ఆర్ఆర్- 8.0 6. ఏ థర్స్ డే- 7.8 7. ఝుండ్- 7.4 8. రన్‌వే-34- 7.2 9. సామ్రాట్ పృథ్వీరాజ్- 7.2 10. గంగూబాయి కతియావాడి- 7.0 View this post on Instagram A post shared by IMDb (@imdb) మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్‌లు.. 1. క్యాంపస్ డైరీస్ (ఎమ్ఎక్స్ ప్లేయర్)- 9.0 2. రాకెట్ బాయ్స్ (సోనీ లివ్)- 8.9 3. పంచాయత్ 2 (అమెజాన్ ప్రైమ్ వీడియో)- 8.9 4. అపహరణ్ (వూట్/ఆల్ట్ బాలాజీ)- 8.4 5. హ్యూమన్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- 8.0 6. ఎస్కేప్ లైవ్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- 7.7 7. ది గ్రేట్ ఇండియన్ మర్డర్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- 7.3 8. మాయి (నెట్‌ఫ్లిక్స్)- 7.2 9. యే కాళీ కాళీ ఆంఖే (నెట్‌ఫ్లిక్స్)- 7.0 10. ది ఫేమ్ గేమ్ (నెట్‌ఫ్లిక్స్)- 7.0 View this post on Instagram A post shared by IMDb (@imdb) -
కాన్స్ ఫిలిం ఫెస్టివల్లో మన మూవీస్
-
75వ స్వాతంత్య్ర దినోత్సవం.. పాడవోయి భారతీయుడా
పాటకు పదిమందిని కూడగట్టే శక్తి ఉంది. ‘రఘుపతి రాఘవ రాజారామ్’... పాటతోనే గాంధీజీ ప్రజలను ఒక చోటకు చేర్చారు. ‘సుజలాం సుఫలాం మలయజ శీతలాం’... వందేమాతర గేయం రేపిన స్వేచ్ఛాకాంక్ష సామాన్యం కాదు. ‘సారే జహాసే అచ్ఛా హిందూ సితా హమారా’ లక్షలాది మంది ముక్తకంఠంతో గానం చేశారు. స్వాతంత్రోద్యమంలో పాట యుద్ధభేరి. స్వాతంత్య్రం సిద్ధించాక అదే విజయనాదం. ఆ పాట కొనసాగింది. సినిమా ఆ స్ఫూర్తిని కొనసాగించింది. సినీ దేశభక్తి గేయం జాతిని ఉత్సాహపరుస్తూనే ఉంది. స్వాతంత్య్రం వచ్చింది. ఆసేతు హిమాచలం పులకరించింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు లక్షలాది మంది యువకులు, మహిళలు, పిల్లలు, వృద్ధులు... వీరందరినీ సమాయత్తపరిచిన నాయకులు... త్యాగాలు, బలిదానాలు, లాఠీదెబ్బలు, చెరసాలలు, ఉరికొయ్యలు... ఓహ్... ఒక గొప్ప పోరాటంతో భరతజాతి తనకు కావలసింది పొందింది. తెల్లవాళ్లు నిష్క్రమించారు. జనులెల్ల కొలుచువారు పాలనను అందుకున్నారు. ఇప్పుడు మన దేశాన్ని మనం కీర్తించుకోవాల్సిన సమయం. మన దేశాన్ని మనం స్తుతించుకోవాల్సిన సమయం. నేడే స్వాతంత్య్ర దినం వీరుల త్యాగఫలం నేడే నవోదయం నేడే ఆనందం... ‘పాడవోయి భారతీయుడా... ఆడిపాడవోయి విజయగీతిక’ అని శ్రీశ్రీ ‘వెలుగు నీడలు’లో రాసి తెలుగువారిని ఉత్తేజపరిచారు. ఇప్పుడు మన పాలన మనం చేసుకుంటున్నాం కనుక శ్రీశ్రీయే ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ సుఖపడాలి నందనందనా’ అని ‘రాముడు భీముడు’లో సామాన్యుణ్ణి రాజును చేసే భవిష్యత్తును కాంక్షించారు. ఆ సమయంలో సినిమావారికి బాధ్యత ఎలా ఉండేదంటే కథకు సంబంధం లేకపోయినా ఒక నృత్యప్రదర్శన పెట్టి స్టేజ్ మీద దేశభక్తి గీతాన్ని చిత్రించేవారు. ‘అందరి కోసం ఒక్కరు నిలిచి ఒక్కరి కోసం అందరూ నిలిచే’ విధంగా ఈ దేశం ఉండాలని హితబోధ చేసేవారు. హీరోలూ దేశం గొప్పతనాన్ని పాడుకోవడాన్ని ఒక ఆదర్శంగా భావించేవారు. ‘నా జన్మభూమి ఎంత అందమైన దేశము’ అని ‘సిపాయి చిన్నయ్య’లో అక్కినేని, ‘నేను నా దేశం పవిత్ర భారతదేశం’ అంటూ ‘నేను నా దేశం’లో రామకృష్ణ, ‘మన జన్మభూమి బంగారు భూమి’ అని ‘పాడిపంటలు’లో కృష్ణ, ‘జననీ జన్మభూమిశ్చ’ అంటూ ‘బొబ్బిలిపులి’లో ఎన్.టి.ఆర్... పాడుతూ దేశభక్తిని కలిగి ఉండటం ఒక ధీరోదాత్త లక్షణంగా చూపించారు. ఎన్.టి.ఆర్ తన చివరి సినిమా ‘మేజర్ చంద్రకాంత్’లో కూడా ‘పుణ్యభూమి నా దేశం నమోనమామి’ అంటూ ఉర్రూతలూగించారు. భారతమాతకు జేజేలు అయితే పిల్లలే కదా భవిష్యత్ నిర్మాతలు. దేశభక్తి పాదుకొనాల్సింది వారిలోనే. దేశం కోసం పని చేయాలనే లక్ష్యం ఏర్పడాల్సింది వారికే. అందుకే తెలుగు సినిమా పిల్లల కోసం ప్రత్యేకం పాటలు చేసింది. ‘భారతమాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు’ అని ఆత్రేయ ‘బడిపంతులు’ కోసం, ‘భలే తాత మన బాపూజీ బాలల తాత బాపూజీ’ అని సీనియర్ సముద్రాల ‘దొంగరాముడు’లో ‘చెడు అనవద్దు చెడు వినవద్దు చెడు కనవద్దు... ఇది బాపూజీ పిలుపు’ అని ‘మేలుకొలుపు’లో సి.నారాయణ రెడ్డి పిల్లలు పాడుకునే పాటలు రాశారు. ‘గాంధీ పుట్టిన దేశం రఘురాముడు ఏలిన రాజ్యం’ (గాంధీ పుట్టిన దేశం), ‘నీ సంఘం నీ ధర్మం మరువద్దు’ (కోడలు దిద్దిన కాపురం) పాటలు కూడా ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి. ఇక ప్రయివేటు గేయాలుగా ఉన్న కృష్ణశాస్త్రి ‘జయజయహే ప్రియభారత జనయిత్రి దివ్యధాత్రి’ (రాక్షసుడు), శంకరంబాడి ‘మా తెలుగుతల్లికి మల్లెపూదండ’ (బుల్లెట్, లీడర్), రాయప్రోలు సుబ్బారావు ‘శ్రీలు పొంగిన జీవగడ్డయి’ (లీడర్)... సినిమాల్లో కూడా వినిపించాయి. తెలుగువీర లేవరా దేశం అంటే మట్టి కాదు. మనుషులు. ఆ మనుషులు ప్రాదేశిక జాతులుగా కూడా తమను తాము కూడదీసుకోవాల్సిన సమయం అది. భరతజాతి, తెలుగుజాతి రెండూ వెలగాల్సిందే. ‘తెలుగు జాతి మనది నిండుగ వెలుగుజాతి మనది’ అని ‘తల్లా పెళ్లామా’లో సినారె రాశారు. నేడు ‘తెలుగుజాతి మనది రెండుగ వెలుగుజాతి మనది’ అని రెండు రాష్ట్రాల ప్రగతిని ఆశించేలా ఆ పాట మారింది. శ్రీశ్రీ ‘తెలుగు వీర లేవరా దీక్షబూని సాగరా’ అని ‘అల్లూరి సీతారామరాజు’లో ఉత్తేజం నింపుతారు. ‘కలసి పాడుదాం తెలుగుపాట... కదలి సాగుదాం వెలుగుబాట’ అదే శ్రీశ్రీ ‘బలిపీఠం’లో వెలుగుబాటను చూపిస్తారు. ‘ఏ దేశమేగినా ఎందు కాలిడినా’ రాయప్రోలు గీతాన్ని పల్లవిగా తీసుకొని ‘అమెరికా అబ్బాయి’ లో సినారె తెలుగువారు నిలబెట్టుకోవాల్సిన నిండు గౌరవం గురించి మాట్లాడారు. తరం మారుతున్నది ఆ స్వరం మారుతున్నది అయితే స్వాతంత్య్రం వచ్చిన కొన్నాళ్లకే తెల్ల పాలకులకు తీసి పోని రీతిలో మన పాలకులు కూడా తయారయ్యారన్న ఆశాభంగం ప్రజలకు కలిగింది. సినిమా ఆ నిరసనను పట్టుకుంది. ‘గాంధి పుట్టిన దేశమా ఇది నెహ్రు కోరిన సంఘమా ఇది’ (పవిత్ర బంధం), ‘భారతమాతను నేను బందీనై పడి ఉన్నాను’ (నేటి భారతం), ‘వందేమాతర గీతం వరస మారుతున్నది’ (వందే మాతరం)..లాంటి పాటలు వచ్చాయి. కుర్రాళ్లు ‘సాపాటు ఎటూ లేదు పాటైన పాడు బ్రదర్’ అని నిరుద్యోగ దరిద్రాన్ని అనుభవిస్తున్న రోజులను చూపాయి. చివరకు ‘మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది’ అని విప్లవ మార్గాన్ని ఎంచుకునే వరకూ తీసుకెళ్లాయి. వినరా వినరా దేశం మనదేరా అయితే ఆ రోజులను దేశం దాట గలిగింది. వ్యవసాయ, పారిశ్రామిక, సాంకేతిక రంగాలలో అద్భుతమైన ప్రగతిలో సాగింది. విద్య, ఉపాధి, అన్ని వర్గాల వారికి అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు సాగింది. లోపాలు, కొరతలు ఎన్ని ఉన్నా ఇది మన దేశం. దీని తప్పులను సరి చేసుకుంటూ ముందుకు సాగాలనే సంకల్పం కొత్తతరంలో ఏర్పడింది. ‘దేశమ్ము మారిందిరోయ్... కాలమ్ము మారిందిరోయ్’ అని గతంలో కవి రాస్తే ‘ఏ మేరా జహా ఏ మేరా ఆషియా’ అని ఇప్పటి కవి రాశాడు. కొత్తతరం దర్శకులు, నిర్మాతలు కూడా దేశభక్తి గీతాలను సినిమాల్లో కొనసాగిస్తూనే వచ్చారు. ‘దేశం మనదే తేజం మనదే’ (జై), ‘మేమే ఇండియన్స్ మేమే ఇండియన్స్’ (ఖడ్గం), ‘ఈ జెండా పసిబోసి నవ్వురా’ (బాబీ), ‘వందేమాతరం గాంధీ ఓంకారం’ (శంకర్‌దాదా జిందాబాద్), ‘జగతి సిగలో జాబిలమ్మకు వందనం’ (పరదేశి), ‘దేశమంటే మట్టికాదోయ్’ (ఝుమ్మంది నాదం).... ఇలా ఎన్నో పాటలు ఆగస్టు 15 వచ్చిన ప్రతిసారీ చౌరాస్తాలో మార్మోగుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. తెలుగు సినిమా మరి కొన్నేళ్లలో 100 ఏళ్ల వయసుకు చేరనుంది. స్వాతంత్య్రం కంటే సీనియర్ అయిన తెలుగు సినిమా ఒక ఇండస్ట్రీగా దేశ ఆర్థిక కార్యకలాపాలలో పాల్గొంటూనే దేశాన్ని, యువతను ఉత్తేజపరిచే సినిమాలను, గీతాలను అందిస్తూనే ఉంటుందని, ఉండాలని కోరుకుందాం. ఎక్కువమందికి తెలియని పేరు కనక్లత బారువా. అస్సాంకు చెందిన ఈ స్వాతంత్య్ర సమరయోధురాలిని ‘బీర్బలా’ (గుండెధైర్యం ఉన్న మహిళ) అని పిలుచుకునేవారు. పదిహేడు సంవత్సరాల వయసులో పోలీసు కాల్పుల్లో మరణించింది. ఆమె మరణం అస్సాంను అట్టుడికించింది. బారువా పై 2017లో ‘పూరబ్ కి అవాజ్’ అని హిందీలో ఒక సినిమా వచ్చింది. బాలీవుడ్ హీరో మనోజ్‌కుమార్ షాహీద్ (1965) సినిమా క్లాసిక్. ఈ సినిమా తీయడానికి ముందు మనోజ్‌కుమార్ నిర్మాత కెవల్ కశ్యప్‌తో కలిసి చండీఘడ్‌లోని ఒక ఆస్పత్రిలో ఉన్న భగత్‌సింగ్ తల్లి విద్యావతిని కలుసుకున్నాడు. మనోజ్ కుమార్‌ను ఆమె పరిశీలించడం ప్రారంభించింది. ‘ఒప్పుకుంటారో లేదో’ అనే సందేహం మనోజ్‌కుమార్‌కు కలిగింది. విద్యావతి నిర్మాత కశ్యప్‌ను దగ్గరకు పిలిచి ‘ఈయన మా అబ్బాయిలాగే ఉన్నాడు’ అని మనోజ్‌కుమార్‌ను ఉద్దేశించి చెప్పింది. బెంగాలి నాటకరంగ దిగ్గజం గిరిష్చంద్రఘోష్ చారిత్రక నేపథ్యం ఉన్న నాటకాలు రాసేవారు. అయితే అవి పేరుకు చారిత్రక నాటకాలే అయినప్పటికీ అంతర్లీనంగా వాటిలో బ్రిటీష్ వారి దుర్మార్గాలను చీల్చిచెండాడే పదునైన డైలాగులు ఉండేవి. గిరీష్ రాసిన ‘సిరాజ్–వుద్–దౌలా’ నాటకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. 1945లో వచ్చిన హిందీ సినిమా ‘హమ్రహీ’ లో ‘జనగణమన’ కోరస్సాంగ్గా వినిపిస్తుంది. బిమల్ రాయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రాయ్‌చంద్ బరోల్ సంగీతం సమకూర్చారు. పట్నా(బిహార్)లో షాహీద్ పీర్ అలీ ఖాన్ పార్క్ చాలా ఫేమస్. ఎవరీ పీర్ అలీ? సామాన్య బుక్‌బైండర్ అయిన పీర్ అలీ కరపత్రాలు పంచడం, కోడ్ మెసేజ్‌లు ఇవ్వడంలాంటి పనులతో స్వాతంత్య్ర సమరయోధులకు సహాయపడేవాడు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికి పీర్ ఆలిఖాన్ను బ్రిటిష్‌వారు బహిరంగంగా ఉరి తీశారు. స్వాతంత్య్ర ఉద్యమకాలంలో భావజాల ప్రచారం లో అండర్‌గ్రౌండ్ కాంగ్రెస్ రేడియో బలమైన పాత్ర నిర్వహించింది. బ్రిటీష్ కంట్రోల్డ్ ఏఐఆర్‌కు కౌంటర్‌గా వచ్చిన ఈ రేడియోను 22 సంవత్సరాల ఉషా మెహతా నిర్వహించేవారు. ‘ఆజాద్’గా ప్రసిద్ధుడైన చంద్రశేఖర్ తివారి సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యాడు. అప్పుడు అతని వయసు 15 సంవత్సరాలు. ‘నీ పేరు ఏమిటి?’ అని జడ్జి అడిగితే ‘ఆజాద్’ అని; ‘తండ్రి పేరు ఏమిటి?’ అని అడిగితే ‘స్వతంత్రత’ అని చెప్పాడు. -
ఆటలతో ఆకట్టుకున్న హిట్ సినిమాలివే!
కోడి రామ్మూర్తి బయోపిక్ రానుంది. పి.వి.సింధు ఆటను బిగ్ స్క్రీన్ మీద చూస్తాం. పుల్లెల గోపిచంద్ బయోపిక్‌లో ఆయన్ను పోలిన నటుడు ఎవరో? ఆటను సినిమాగా చెప్పడం కూడా పెద్ద ఆట. బాల్ వెళ్లి సూటిగా తాకినట్టుగా ప్రేక్షకుడికి తాకితేనే హిట్టు. లేకుంటే అంతే. చాలాకాలం స్పోర్ట్స్‌ను పట్టించుకోని ఇండియన్ సినిమా నేడు వరుస పెట్టి స్పోర్ట్స్ మూవీలు తీస్తోంది. ఒలింపిక్స్ ఇచ్చే ఉత్సాహంతో మరిన్ని తీయనుంది కూడా. అసలు ఇంతకు ముందు ఏం స్పోర్ట్స్ మూవీస్ వచ్చాయి.. ఇక మీదట ఏం రానున్నాయి మనకు తెలియాలి... ఎస్... తెలియాలి... జమీందారు కూతురైన హీరోయిన్– బంగ్లా లాన్లో బాడ్మింటన్ బ్యాట్ పట్టుకుని, ఫ్రెండ్స్‌తో రెండు బాల్స్ ఆడి, అప్పుడే కారులో వచ్చిన తండ్రి వైపు పరిగెత్తుకుంటూ వచ్చి ‘డాడీ’ అనడం వరకే మన సినిమాల్లో ఆటలు కనిపించేవి. సినిమాలో ఆట ఎప్పుడైనా ఒక భాగమే తప్ప ఆటే సినిమా కావడం ఏమిటి ఎవరు చూస్తారు అని మన వాళ్లు ఆ జానర్‌ని ఔట్ చేసి కోర్ట్ బయట ఎప్పుడో కూచోబెట్టారు. కాని ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఇప్పుడు ఆటే కథ. ఆటే క్లయిమాక్స్. ఆటే హీరో. ఆటగాడే హీరో. నీవు లేని నేను లేను శోభన్‌బాబు నటించిన ‘మంచి మనుషులు’లో స్కేటింగ్ కనిపిస్తుంది. ఆ తర్వాత ‘గంగ–మంగ’ సినిమాలో శోభన్‌బాబు, వాణిశ్రీ ‘గాలిలో పైరగాలిలో’ అని పాట స్కేటింగ్ చేస్తారు. ‘గండికోట రహస్యం’ సినిమాలో ఎన్.టి.ఆర్ కబడ్డీ ఆడటం, ‘యుగపురుషుడు’లో కరాటే చేయడం తప్ప ఆటల ప్రస్తావన మనకు లేదు. విలువిద్య ఉంది కాని సినిమా విలువిద్యలో ఒకరు ఆగ్నేయాస్త్రం వేస్తే ఒకరు వరుణాస్త్రం వేస్తారు. రెండు ఆకాశంలో గంటసేపు ప్రయాణించి ఢీకొంటాయి. ఇలాంటివి ఒలింపిక్స్ వారు ఒప్పుకోరు. కాలం మారి చిరంజీవి వచ్చి ‘ఇంటిగుట్టు’లో మిక్స్డ్ కబడ్డీ ఆడాడు నళినితో. ఆ తర్వాత ‘విజేత’లో ఫుట్‌బాల్ గోల్ కీపర్‌గా కనిపించాడు. మెల్లగా ఆటల బంతి దొర్లడం మొదలెట్టింది. ఆట మార్చిన అశ్వని 1991లో తెలుగులో ‘అశ్వని’ వచ్చింది. జాతీయ స్థాయిలో పరుగుల రాణిగా నిలిచిన అశ్వని నాచప్ప జీవితం స్ఫూర్తితో ఆమెనే హీరోయిన్గా పెట్టి ‘ఉషాకిరణ్ మూవీస్’ తీసిన ఈ సినిమా ఒక సంచలనం అని చెప్పాలి తెలుగులో. ఒక పేదింటి అమ్మాయి కూడా క్రీడాకారిణి కావచ్చు అని చెప్పిన కథ ఇది. ఆట నేపథ్యంలో పూర్తి సినిమా తీయవచ్చని నిరూపించింది. కాని ఆ స్థాయి కథ లేదా ఆ వాతావరణం ఏర్పడలేక పోయింది. పవన్ కల్యాణ్ ‘తమ్ముడు’ ఆ తర్వాత కిక్ బాక్సింగ్‌ని నేపథ్యంగా తీసుకుంది. పూరి జగన్నాథ్ వచ్చి ‘అమ్మా నాన్న తమిళమ్మాయి’లో కూడా అదే కిక్ బాక్సింగ్‌ని తీసుకున్నాడు. హీరో పంచ్ విసిరే ఆటలే ఆటలుగా మనకు ఉన్నాయి. ఎందుకంటే ఈత కొట్టే హీరో కంటే పంచ్ కొట్టే హీరోకు హిట్ కొట్టే చాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కొండారెడ్డి బురుజు దగ్గర ‘ఒక్కడు’ 2003లో వచ్చిన ‘ఒక్కడు’ సినిమా ఒక సూపర్ డూపర్ హిట్ కథకు ఆటను నేపథ్యంగా తీసుకోవచ్చని మరోసారి గట్టిగా ఇండస్ట్రీకి చెప్పింది. ఇందులో మహేశ్ బాబు కబడ్డీ ప్లేయర్‌గా కనిపిస్తాడు. దీనికి కొద్దిగా ముందు వచ్చిన శ్రీహరి ‘భద్రాచలం’ తైక్వాన్డును కథగా తీసుకున్నప్పటికీ పూర్తి విజయం మాత్రం ‘ఒక్కడు’ సొంతం చేసుకుంది. ఆ తర్వాత రెగ్యులర్‌గానే స్పోర్ట్స్ కథలు కనిపిస్తూ వచ్చాయి. ‘బీమిలి కబడ్డీ జట్టు’ (కబడ్డీ), ‘గోల్కొండ్ హైస్కూల్’ (క్రికెట్), ప్రకాష్ రాజ్ ‘ధోని’ (క్రికెట్), ‘మళ్లీ మళ్లీ ఇది రానిరోజు’ (అథ్లెట్), ‘సై’ (రగ్బీ)... ఇవన్నీ ఆటలను చూపినవే. హీరో నాని క్రికెట్ నేపథ్యంలో ‘జెర్సీ’ చేసి పెద్ద హిట్ అందుకుంటే నాగ చైతన్య కూడా అదే క్రికెట్ నేపథ్యంలో ‘మజిలీ’ చేసి విజయం సాధించాడు. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రెడ్’లో క్రికెట్, సందీప్ కిషన్ ‘ఏ1ఎక్స్‌ప్రెస్’లో హాకీ ఆటలు ప్రేక్షకుల్ని గ్రౌండ్స్‌లోకి తీసుకెళ్లాయి. అన్నింటికి మించి మహిళా బాక్సింగ్‌ను తీసుకుని వెంకటేశ్ హీరోగా, రితికా మోహన్ సింగ్ హీరోయిన్గా వచ్చిన ‘గురు’, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్గా మహిళా క్రికెట్‌ను తీసుకుని వచ్చిన ‘కౌసల్యా క్రిష్ణమూర్తి’, మహిళా ఫుట్‌బాల్‌ను తీసుకుని విజయ్ హీరోగా వచ్చిన ‘బిగిల్’ క్రీడల్లోనే కాదు సినిమాల్లో కూడా మహిళల విజయాన్ని చూపించాయి. వరుస కట్టిన సినిమాలు ఇక మీదట కూడ బోలెడు స్పోర్ట్స్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. బాక్సింగ్ నేపథ్యంలో విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ రానుంది. కీర్తి సురేశ్ హీరోయిన్గా ‘గుడ్‌లక్ సఖీ’ (షూటింగ్), నాగ శౌర్య హీరోగా ‘లక్ష్య’ (విలువిద్య) రానున్నాయి. ఇవి కాకుండా కోడి రామ్మూర్తి, పి.వి.సింధు, పుల్లెల గోపీచంద్, కరణం మల్లీశ్వరి, విశ్వనాథన్ ఆనంద్‌ల బయోపిక్‌లు వరుసలో ఉన్నాయి. ఇక తమిళం నుంచి డబ్ అయిన తాజా సినిమా ‘సార్పట్టా’ కాలం వెనక్కు వెళ్లి మన దేశీయులు ఆడిన బాక్సింగ్‌లో పల్లె పౌరుషాలు పట్టుదలలు ఏ విధంగా ఉంటుందో చూపింది. అసలు గతాన్ని తవ్వుకుంటూ వెళితే ఎన్ని స్పోర్ట్స్ డ్రామాలు దొరుకుతాయో కదా. ఓడటం తెలిసినవాడే గెలవడం నేరుస్తాడు. ఆటల్లో ఉంటేనే ఓడటం గెలవడం ఓడినా గెలిచినా సాధన కొనసాగించడం తెలుస్తాయి. మనిషిని మానసికంగా శారీరకంగా తీర్చిదిద్దడంలో ఆటను మించింది లేదు. ఆటలో ఉండే ఉద్వేగం కూడా మనిషిని ఆకర్షిస్తుంది. సెల్‌ఫోన్‌ను అంటుకుపోతున్న నేటి తరాన్ని క్రీడామైదానం వైపు తరమాలంటే బయట, బడులలో, సినిమాల్లో ఎంత క్రీడా వాతావరణం కనిపిస్తే అంత మేలు. క్రీడలకు జయం. ఒలింపిక్స్‌లో ఉన్న భారతీయులకు జయం. ఈ ఒలింపిక్స్ జరిగినన్నాళ్లు అంతటా క్రీడా వాతావరణమే ఉంటుంది. ఒకవైపు ఆటలూ చూడొచ్చు. చూడని స్పోర్ట్స్ సినిమాలనూ చూడొచ్చు. నిజంగా ఇది క్రీడా వీక్షణ సమయమే. ‘లగాన్’ నుంచి సిక్సర్లే 2001లో ఏ ముహూర్తాన బాలీవుడ్లో ‘లగాన్’ వచ్చిందో అక్కడ స్పోర్ట్స్ సినిమాలు హిట్ మీద హిట్ కొడుతూనే ఉన్నాయి. బ్రిటిష్ కాలమేంటి... అక్కడ పన్ను పెంచడమేంటి... దానిని ఎదుర్కొనడానికి పల్లెటూరివాళ్లు బ్రిటిష్ వారితో క్రికెట్ ఆడటం ఏంటి... అసలా కథను తీయడం ఎలా సాధ్యం. దర్శకుడు అశితోష్ గొవారికర్ తీశాడు. సినిమా దేశాన్నే కాదు ప్రపంచాన్నే ఆకర్షించింది. మన తెలుగువాడు నగేశ్ కుకునూర్ మూగ, చెవిటి ఆటగాడి కథను తీసుకుని అద్భుతంగా తీసిన ‘ఇక్బాల్’ ఒక గ్రామీణ క్రికెట్ బౌలర్ కథను చెప్పింది. ఆ తర్వాత మహిళా హాకీని తీసుకు షారూక్ ఖాన్ ‘చక్‌దే ఇండియా’ తీస్తే సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. వయసు మీరిన కోచ్ పాత్రలో షారూక్ కనిపించడానికి సిద్ధమయ్యి మరీ హిట్ కొట్టాడు. పరుగుల నేపథ్యంలో ఇర్ఫాన్ ఖాన్ హీరోగా ‘పాన్‌సింగ్ తోమార్’, మిల్కా సింగ్ ఆత్మ కథ ‘భాగ్ మిల్కా భాగ్’, ‘మేరీ కోమ్’, ‘ధోని’, ‘సైనా’, ‘సుల్తాన్’... ఇవన్నీ ఉద్వేగపూరిత క్రీడా అనుభవాన్ని ఇచ్చాయి. మహిళా కుస్తీ నేపథ్యంలో ఆమిర్ ఖాన్ ‘దంగల్’ రికార్డుల చరిత్రను తిరగరాసింది. ఇక 1983 వరల్డ్ కప్ నేపథ్యలో ‘1983’ రానుంది. ఫర్హాన్ ఖాన్ బాక్సర్‌గా ‘తూఫాన్’ తాజాగా విడుదలైంది. మిథాలి రాజ్ బయోపిక్ ‘శభాష్ మితూ’ వరుసలో ఉంది. ‘మైదాన్’ (ఫుట్‌బాల్) కూడా. -
అదిగదిగో ఆస్కార్... మన తరఫున ‘వైట్ టైగర్’...
అకాడమీ అవార్డులంటేనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డులని సినీ రంగ ప్రముఖులు భావిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఆలోచనాత్మకమైన కథలతో పాటుగా ఆకట్టుకునే పాత్రలు సైతం ఈ అవార్డుల రేస్‌లో పోటీపడుతుంటాయి. గత 2002లో లగాన్ తరువాత ఈ సంవత్సరం వైట్ టైగర్ చిత్రం ఆస్కార్ 2021లో ఇండియా నుంచి పోటీపడుతోంది. దాదాపు 20 సంవత్సరాల తరువాత ఇండియన్ మూవీ పోటీపడుతుండడంతో ఈ సారి అకాడమీ పండుగ మనవారికీ ఆసక్తిగా మారింది. ఈ ఏప్రిల్ 26వ తేదీ ఉదయం 5.30 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకూ స్టార్ మూవీస్, స్టార్ వరల్డ్ ఛానెల్స్‌లో ఈ పురస్కారాల పండుగ ప్రసారమవుతోంది. అవార్డుల వేడుకలను తిలకించడమే...అవార్డుల వేడుకకు ఇంకా కొద్ది రోజులే మిగిలిన వేళ ఈ అకాడమీ అవార్డులలో పోటీపడుతున్న చిత్రాలను ఓ సారి పరిశీలిస్తే... ద వైట్ టైగర్: లగాన్ తరువాత ఇండియా నుంచి ఆస్కార్‌కు నామినేట్ కాబడ్డ చిత్రమిది. రాజ్‌కుమార్ రావు, ప్రియాంక చోప్రా లాంటి తారాగణం ఉన్న ఈ చిత్రంలో సామాన్యుని జీవితం ఒడిసిపట్టారు. స్లమ్‌డాగ్ మిలియనీర్, పారాసైట్ల సమ్మేళనంలా కనిపిస్తుందీ చిత్రం. ద పాధర్: ఫ్లోరియన్ జెల్లర్ ప్లే లీ పీరీ ఆధారంగా తీర్చిదిద్దారు. వయసు మీద పడిన తండ్రి నెమ్మదిగా అన్నీ మరిచిపోతుండటం... ఈ నేపథ్యంలో కనిపించే భావోద్వేగాలు. ఆంథోనీ హోప్కిన్స్ ప్రదర్శనకు పరాకాష్ట అనతగ్గ రీతిలో ఉంటుంది. జుడాస్ అండ్ ద బ్లాక్ మెసయ్య: చారిత్రాత్మక బయోపిక్ ఇది. దర్శకత్వం మొదలు, చిత్ర నటీనటుల ఎంపిక, నటన, స్క్రిప్ట్... ప్రతిఒక్కటీ అద్భుతమే ! మంక్: డేవిడ్ ఫించర్ దర్శకత్వం వహించిన చిత్రమిది. విశేషమేమిటంటే ఈ చిత్ర స్క్రీన్‌ప్లేను ఆయన తండ్రి జాక్ ఫించర్ తీర్చిదిద్దడం. ఇటీవలనే ఆయన మరణించారు. మినారీ: లీ ఇసాక్ రచనదర్శకత్వం వహించిన కొరియన్ అమెరికన్ ఫ్యామిలీ చిత్రమిది. స్ఫూర్తిదాయక కుటుంబ కథా చిత్రాలలో ఒకటి. రోజువారీ సగటు అమెరికన్ జీవిత గాథను ఇది వెల్లడిస్తుంది. నోమడ్‌ల్యాండ్: అందాన్ని ఆస్వాదించాలనుకునే వారు తప్పనిసరిగా చూడాల్సిన చిత్రమది. ఓ సంక్షోభంలో అన్నీ కోల్పోయిన 60ఏళ్ల వయసులోని మహిళ జీవిత ప్రయాణాన్ని కళ్లకు కడుతుంది. ప్రామిసింగ్ యంగ్ ఉమెన్: ఊహాతీత సంఘటనలతో కూడిన కథనం ఈ చిత్రబలం. ఓ అమ్మాయి జీవితంలో జరిగే అనూహ్య సంఘటనలతో సాగుంది. అద్భుతమైన అభినయం, దర్శకత్వాల కలయిక ఈ చిత్రం. సౌండ్ ఆఫ్ మెటల్:తన వినికిడి శక్తిని కోల్పోవడం ప్రారంభించిన ఓ హెవీ మెటల్ డ్రమ్మర్ జీవితంపై దృష్టి సారించిన చిత్రమిది. ఈ సినిమా ఆద్యంతం భావోద్వేగాలతో, వాస్తవికంగా సాగుతుంది. ఈ సినిమాలో కధానాయకుడు ఫీలయ్యే అనేక భావాలను మనమూ ఫీలయ్యేంతగా మనల్ని లీనం చేసుకుంటుంది. రిజ్ అహ్మద్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు. ద ట్రయల్ ఆఫ్ ద చికాగో: కోర్ట్ రూమ్‌లో సంభవించే ఆసక్తికర అంశాలను అద్భుతంగా చిత్రీకరించిన వైనం ఆకట్టుకుంటుంది. కొన్ని దశాబ్ధాల క్రితం 1969లో నిజంగా చికాగోలో జరిగిన ఓ ఉదంతం ఆధారంగా తీసిన చిత్రమిది. చదవండి: ఎంత వరకు సమంజసం? మీరే ఆలోచించండి: చిరంజీవి -
ఆస్కార్‌లో భారతీయం..
అకాడమీ అవార్డ్స్... గెలువడం ప్రపంచ వ్యాప్తంగా సినీ రంగ ప్రముఖులకు ఓ కల. అకాడమీ అవార్డు సాధించారంటే చాలు తమ జీవితాశయం నెరవేరినట్లే సంబరపడిపోతారు. భారతీయ సినీ ప్రముఖులూ అందుకు మినహాయింపేమీ కాదు. ఆ క్రమంలోనే అద్భుతమైన చిత్రాలు తీస్తూనే ఉన్నారు. వాటిల్లో కొన్ని ఆస్కార్ దాకా వెళ్తున్నాయి కూడా. నాటి మదర్ ఇండియా మొదలు నేడు వైట్ టైగర్ దాకా ఆస్కార్‌లో భారతీయ చిత్రాలు పోటీపడుతూనే ఉన్నాయి. మన దేశం తరపున ఏ చిత్రం నామినేట్ అయినా భారత్‌తో ఆస్కార్ అనుబంధం మీద చర్చ సహజమే. 93వ అకాడమీ అవార్డ్స్ లైవ్ స్టార్ మూవీస్, స్టార్ వరల్డ్ ఛానెల్స్‌లో ఏప్రిల్ 26న ఉదయం 5.30 గంటలకు ప్రసారం కానుండగా, ఈ కార్యక్రమాన్ని అదే రోజు రాత్రి 8.30 గంటలకు పునః ప్రసారం అవుతుంది. ఈ నేపధ్యంలో మన సినిమాలతో ఆస్కార్ కున్న అనుబంధం ఒకసారి పరిశీలిస్తే... ఆస్కార్‌లో భారతీయ చిత్ర ప్రవేశం 1958లో జరిగింది. మదర్ ఇండియా చిత్రం ఉత్తమ అంతర్జాతీయ చిత్రంలో పోటీపడింది. అయితే ఒకే ఒక్క ఓటు తేడాతో ఇటాలియన్ చిత్రం నైట్స్ ఆఫ్ కబ్రినాకు అవార్డును కోల్పోయింది ఆస్కార్ గెలుచుకున్న మొట్టమొదటి భారతీయులు అనగానే చాలామంది రక రకాలుగా చెప్తారు కానీ, 1983లో ఓ భారతీయ కాస్ట్యూమ్ డిజైనర్‌కు ఆస్కార్ లభించిందంటే ఆశ్చర్యం కలుగక మానదు. గాంధీ చిత్రానికి గానూ భాను అథైయా గోల్డెన్ ట్రోఫీ అందుకున్నారు. ఇదే చిత్రానికి రవిశంకర్ సైతం నామినేట్ చేయబడ్డారు. మన దేశానికి ఆస్కార్‌లో లభించిన అరుదైన గౌరవం మాత్రం సత్యజిత్‌రేకు హానరరీ అకాడమీ అవార్డును 1992లో అందించడమే. ఇప్పటిదాకా ఈ గౌరవాన్ని అందుకున్న ఏకైక భారతీయుడు సత్యజిత్‌రే మాత్రమే. భారతీయ కథతో రూపుదిద్దుకున్న బ్రిటీష్ చిత్రం స్లమ్ డాగ్ మిలియనీర్ 2008లో ఏకంగా 8 అవార్డులు అందుకుంది. సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ ఒరిజినల్ సాంగ్, ఒరిజినల్ స్కోర్ పేరిట రెండు అవార్డులు అందుకున్నారు. ఒకటి కన్నా ఎక్కువ అవార్డులు అందుకున్న తొలి భారతీయుడు రెహ్మాన్. ఇండియా నుంచి ఉత్తమ అంతర్జాతీయ చిత్ర విభాగాలలో నామినేషన్లు పొందిన చిత్రాలుగా మదర్ ఇండియా, లగాన్, సలామ్ బాంబే మాత్రమే నిలిచాయి. ఈ సంవత్సరం వైట్ టైగర్ చిత్రానికి బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో నామినేషన్ లభించింది. ప్రియాంక చోప్రా, రాజ్‌కుమార్ రావు, ఆదర్శ్ గౌరవ్ లు దీనిలో నటించారు. మరి ఈ చిత్రం ఈ ఏడాది ఆస్కార్‌లో ఏం సాధించనుందో...చూడాల్సి ఉంది. -
పాక్ టీవీ ఛానెళ్లలో భారత సినిమాలపై నిషేధం
ఇస్లామాబాద్ : భారతీయ సినిమాలను ప్రైవేట్ చానెల్స్, టీవీ షోల్లో ప్రసారం చేయడాన్ని పాకిస్తాన్ సుప్రీం కోర్టు నిషేధించింది. పుల్వామా ఉగ్రదాడులతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో పాక్ సర్వోన్నత న్యాయస్ధానం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పాకిస్తాన్లో భారత టీవీ ఛానెళ్లను అనుమతిస్తూ లాహోర్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ గుల్జార్ అహ్మద్ నేతృత్వంలోని సుప్రీం బెంచ్ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. పిటిషన్ దాఖలు చేసిన పాకిస్తాన్ ఎలక్ర్టానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పీఈఎంఆర్ఏ) న్యాయవాది కోర్టులో తన వాదన వినిపిస్తూ స్ధానిక ఛానెళ్లలో పది శాతం విదేశీ కంటెంట్‌ను అనుమతిస్తూ 2006లో ప్రభుత్వం ఓ విధాన నిర్ణయం తీసుకున్నా, 2016, అక్టోబర్ 19న పాక్ టీవీ ఛానెళ్లలో భారత కంటెంట్ ప్రసారంపై పీఈఎంఆర్ఏ పూర్తి నిషేధం విధించిందని నివేదించారు. కాగా, భారత అధికారులు పాక్ కంటెంట్ ప్రసారాన్ని నిలిపివేసిన క్రమంలో పాక్‌లో సైతం భారత కంటెంట్‌ను పీఈఎంఆర్ఏ నిషేధించిందని చెప్పారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు లాహోర్ హైకోర్టు ఉత్తర్వులను తోసిపుచ్చి పాక్ ఛానెళ్లలో భారత కంటెంట్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. -
పాకిస్తాన్లో భారత సినిమాలు బంద్
కరాచీ: పాకిస్తాన్ టీవీ చానళ్లలో భారతీయ సినిమాలు, టీవీ కార్యక్రమాల ప్రసారంపై నిషేధాన్ని అక్కడి సుప్రీంకోర్టు శనివారం పునరుద్ధరించింది. ఎలాంటి అభ్యంతరం లేని కార్యక్రమాలను మాత్రమే ప్రసారం చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. యునైటెడ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్(యూపీఏ) దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన ప్రధాన జడ్జి జస్టిస్ సకీజ్ నిసార్ ఈ మేరకు తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ‘దైయమెర్–భాషా ప్రాజెక్టు నిర్మాణాన్ని భారత్ అడ్డుకుంటోంది. కనీసం ఆ దేశపు సినిమాలు, టీవీ కార్యక్రమాలను కూడా మనం అడ్డుకోలేమా?’ అని ప్రశ్నించారు. దీంతో జడ్జి పాక్ అధికారులు ఆమోదించిన చిత్రాలు, కార్యక్రమాలనే ప్రసారం చేయాలని ఆదేశించారు. -
పాక్‌లో ఇండియన్ సినిమాలపై బ్యాన్!
సాక్షి, న్యూఢిల్లీ : పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా సరిహద్దులో కాల్పుల విరమణను మరోసారి భారత్ ప్రకటించి పాక్‌కు శాంతి సందేశాన్ని పంపింది. కానీ పాక్ మాత్రం తమ వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టుకుంది. భారతీయ సినిమాలను తాత్కాలికంగా తమ దేశంలో ప్రదర్శించవద్దంటూ పాక్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాక్ ఉన్నతాధికారి దన్యాల్ గిలానీ ట్వీట్లో జీవో ప్రకటనలను పోస్ట్ చేశారు. ఈద్ పర్వదినానికి రెండు రోజుల ముందు, ఈద్ ముగిశాక రెండు వారాల పాటు పాక్‌లో ఇండియన్ ఫిల్మ్స్ ప్రదర్శనను నిలిపివేస్తూ ప్రకటించింది. ఈద్ ఉల్ ఫితర్, ఈద్ ఉల్ అజా సమయంలో భారత్ సినిమాలను ప్రదర్శించవద్దని, నిషేధం ముగిసిన తర్వాత మళ్లీ కొనసాగించవచ్చునని తెలిపింది. భారతీయ, ఇతర దేశాల సినిమాల కారణంగా పాక్ సినిమాలకు వసూళ్లు ఎక్కువగా రావడం లేదన్న కారణంగా పాక్ ఇలా చేసిందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు భారతీయ సినిమాలకు పాక్‌లో అభిమానులు ఎక్కువగా ఉండటం వల్ల, పాకిస్తానీ మూవీలకు థియేటర్లు దొరకడం వారికి ఎప్పటినుంచో ఉన్న సమస్య అన్న విషయం తెలిసిందే. -
నేటి నుంచి పాక్‌లో మళ్లీ భారత సినిమాలు
కరాచీ: పాకిస్తాన్లో భారత సినిమాలపై రెండు నెలల క్రితం విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని ఆ దేశ థియేటర్ల సంఘం నిర్ణయించింది. దీంతో సోమవారం నుంచి యథావిధిగా భారత చిత్రాలను పాక్ థియేటర్లలో ప్రదర్శించనున్నారు. ‘భారత చిత్రాలపైనే పాక్‌లో సినిమా వ్యాపారం బాగా నడుస్తుంది. సినీప్లెక్స్‌లు, మల్టీప్లెక్స్‌ల నిర్మాణం థియేటర్లకు మరమ్మత్తులు చేసేందుకు పెట్టుబడులు పెట్టాం. అందుకే నిషేధాన్ని ఎత్తేయాలని నిర్ణయించాం’అని పాక్ సినిమా ఎగ్జిబిటర్ల సంఘం పేర్కొంది. ఉడీ ఘటన తర్వాత భారత–పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మన చిత్రాలపై పాక్‌లో నిషేధం విధించడం తెలిసిందే. -
పాక్ నటీనటులపై నిషేధం లేదు.. కానీ!
పాకిస్థానీ నటీనటులు భారతదేశంలో పనిచేయకూడదంటూ ప్రభుత్వం నిషేధం ఏమీ విధించలేదని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. అయితే, వారితో పనిచేయించే విషయంలో ప్రజల సెంటిమెంటును దర్శక నిర్మాతలు గౌరవించాలని మాత్రం ఆయన సూచనప్రాయంగా చెప్పారు. ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదల విషయంలో ఎంఎన్ఎస్కు, సినిమా నిర్మాతకు మధ్యవర్తిత్వం జరపడంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఎలాంటి తప్పు చేయలేదని ఆయన అన్నారు. ఇతర దేశాల కళాకారులు మన దేశంలోని సినిమాల్లో పనిచేయడంపై నిషేధం విధించడానికి తాను అనుకూలం కాదని వెంకయ్య తెలిపారు. అయితే, పొరుగుదేశంతో పరోక్ష యుద్ధం కొనసాగుతున్నప్పుడు పరిస్థితులను దర్శక నిర్మాతలు దృష్టిలో పెట్టుకోవాలని మాత్రం అన్నారు. కళలకు హద్దులు లేవని అందరూ అంటారని.. కానీ దేశాలకు మాత్రం ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. ప్రజల సెంటిమెంట్లను హర్ట్ చేయకూడదన్న బాధ్యత నటీనటులపై కూడా ఉంటుందని తెలిపారు. సాధారణ పరిస్థితుల్లో అయితే పర్వాలేదు గానీ, రెండు దేశాల మధ్య పరిస్థితి సున్నితంగా ఉన్నప్పుడు, ఉగ్రవాదులకు పొరుగుదేశం నిధులిచ్చి మన జవాన్లను, వందలాది మంది ప్రజలను చంపిస్తున్నప్పుడు.. ఇలాంటి పరిస్థితుల్లో కళ అనేది తమ హక్కని చెబితే ప్రజలు మరోలా భావిస్తారన్నారు. అదే సమయంలో ప్రభుత్వం మాత్రం ఎవరి మీదా నిషేధం విధించలేదన్నారు. -
మన సినిమాలపై నిషేధం ఎత్తివేత?
భారతీయ సినిమాలపై నిషేధాన్ని ఎత్తేసి.. వాటిని కూడా తమ థియేటర్లలో ప్రదర్శించాలని పాక్ థియేటర్ యజమానులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్ నటించిన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా విడుదలకు భారతదేశంలో పరిస్థితులు చక్కబడటం వల్లే ఇలా చేస్తున్నట్లు థియేటర్ల యజమానులు చెబుతున్నారు. ముంబై పోలీసులు, మహారాష్ట్ర ప్రభుత్వాధినేతలు కూడా ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి అడ్డంకులు లేకుండా చూస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఇండియన్ మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ (ఐఎంపీపీఏ) ఈ నెల ఆరంభంలో పాకిస్థానీ నటీనటులపై నిషేధం విధించడంతో.. పాకిస్థాన్‌లో భారతీయ సినిమాలను విడుదల కానివ్వబోమని అక్కడి థియేటర్ల యజమానులు చెప్పిన విషయం తెలిసిందే. ఉడీ ఉగ్రదాడిలో భారత సైనికులు 19 మంది మరణించడంతో ఐఎంపీపీఏ ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి పాక్ థియేటర్లు చాలావరకు బాలీవుడ్ సినిమాల మీదే ఆధారపడ్డాయి. ఆ సినిమాలు ఆడిస్తేనే తమకు నాలుగు డబ్బులు వస్తాయని, అందువల్ల ఎక్కువ కాలం బాలీవుడ్ సినిమాలు ఆపేసి తాము మనుగడ సాగించలేమని పాకిస్థాన్‌కు చెందిన ప్రముఖ సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ యజమాని ఒకరు తెలిపారు. భారతీయ సినిమాలపై నిషేధం ఎత్తేస్తున్నామన్న అధికారిక ప్రకటన కూడా వెలువడొచ్చని అంటున్నారు. -
ఈ మాటలన్నీ ఇక సినిమాల్లో నిషేధం!
సినిమాల్లో ద్వంద్వార్థాలు, తిట్లు, ఇతర దుష్టపదాల ఉపయోగాన్ని నిషేధిస్తూ కేంద్ర సెన్సార్ బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. ముందుగా ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఏయే పదాలను ఉపయోగించకూడదో ఒక పెద్ద జాబితా విడుదల చేసింది. వీటిని పూర్తిగా నిషేధిస్తున్నామని, ఇక మీదట సినిమాలలో వీటిని ఉపయోగించకూడదని ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ పహ్లజ్ నిహలానీ పేరుతో జారీ అయిన ఈ ఉత్తర్వులను నిర్మాతల సంఘాలన్నింటికీ, సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాలకు కూడా పంపారు. ఈ పదాలను ఇక మీదట ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పహ్లజ్ నిహలానీ తెలిపారు. ఇంగ్లీషులో ఉపయోగించకూడని పదాల జాబితా ఇదీ.. బాస్టర్డ్ సనాఫ్ ఎ బిచ్, మాస్టర్బేటింగ్ ఫక్, ఫకర్ లేదా ఫకింగ్ మదర్ ఫకర్ ఫకింగ్ కంట్ కాక్ సకర్ ఫకింగ్ డిక్ స్క్రూ డిక్ యాష్హోల్ బిచ్ పుస్సీ -
పాక్‌లోకి ఇండియన్ ఫిల్మ్స్ దిగుమతి చట్టవిరుద్ధం