కేన్స్‌లో ఇండియన్‌ సినిమాకు మొదటి బహుమతి | Indian Film Sunflowers Were the First Ones to Know Get First Prize In Cannes 2024, Post Goes Viral | Sakshi
Sakshi News home page

Cannes 2024: కేన్స్‌లో ఇండియన్‌ సినిమాకు మొదటి బహుమతి

Published Fri, May 24 2024 11:15 AM | Last Updated on Fri, May 24 2024 1:54 PM

Sunflowers Were the First Ones to Know Get First Prize In Cannes

ఫ్రాన్స్‌లో 76వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ అట్టహాసంగా కొనసాగుతున్నాయి. యావత్తు సినీ పరిశ్రమ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ చిత్రోత్సవాలు మే 25న ముగియనున్నాయి. ప్రతిష్ఠాత్మక కేన్స్‌ చిత్రోత్సవాల్లో భారత్‌కు చెందిన 'సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో' షార్ట్‌ఫిలిం సత్తా చాటింది. 2024కు గాను ఉత్తమ షార్ట్‌ఫిలిం బహుమతిని సొంతం చేసుకుంది.

చిదానంద S నాయక్ తెరకెక్కించిన 'సన్‌ఫ్లవర్స్‌ వర్‌ ద ఫస్ట్ వన్‌ టు నో' అనే చిత్రం వివిధ భాషలకు చెందిన 17 చిత్రాలతో పోటీ పడి మొదటి బహుమతి అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా 555 ఫిల్మ్ స్కూల్స్ నుంచి 2,263 మంది దరఖాస్తుదారులు ఇందులో పోటీ పడ్డారు. 16 నిమిషాల పాటు నిడివితో ఉన్న ఈ షార్ట్‌ ఫిలింను కన్నడ జానపద కథ ఆధారంగా తెరకెక్కించారు.

ఇదే విభాగంలో బన్నీహుడ్' అనే UK చిత్రానికి మూడో బహుమతి లభించింది. ఈ చిత్రాన్ని మీరట్‌లో జన్మించిన భారతీయ చిత్రనిర్మాత మహేశ్వరి రూపొందించడం విశేషం. మే 23న ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. ఉత్తమ షార్ట్‌ ఫిలిం అవార్డును గెలుచుకున్న టీమ్‌కు 15,00 యూరోలు, మూడో స్థానానికి 7,500 యూరోలు అందించారు. ఈ రెండు షార్ట్‌ ఫిలిం టీమ్‌కు నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement