IMDB Top 10 Most Popular Indian Movies And Web Series in 2022 - Sakshi
Sakshi News home page

Top 10 Movies Web Series 2022: మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్‌ సినిమాలు, సిరీస్‌లు..

Published Sat, Jul 30 2022 7:02 PM | Last Updated on Sat, Jul 30 2022 8:38 PM

IMDB Top 10 Most Popular Indian Movies And Web Series 2022 - Sakshi

ఓటీటీలు వచ్చాక సినీ ప్రియుల నుంచి ప్రేక్షకుల దాకా అభిరుచి మారింది. రొటీన్‌, రొడ్డకొట్టుడు సినిమాలకు స్వస్తి పలుకుతూ కొత్త తరహా కథాంశాలతో వచ్చిన చిత్రాలకు సై కొడుతున్నారు. సినిమాలో ఎంత పెద్ద తారాగణం ఉన్నప్పటికీ కథలో దమ్ము, కథనంలో బలం లేకుంటా చూసేదే లే అంటున్నారు.

IMDB Top 10 Most Popular Indian Movies And Web Series 2022: ఓటీటీలు వచ్చాక సినీ ప్రియుల నుంచి ప్రేక్షకుల దాకా అభిరుచి మారింది. రొటీన్‌, రొడ్డకొట్టుడు సినిమాలకు స్వస్తి పలుకుతూ కొత్త తరహా కథాంశాలతో వచ్చిన చిత్రాలకు సై కొడుతున్నారు. సినిమాలో ఎంత పెద్ద తారాగణం ఉన్నప్పటికీ కథలో దమ్ము, కథనంలో బలం లేకుంటా చూసేదే లే అంటున్నారు. ఇక ప్రస్తుతం విభిన్నమైన స్టోరీస్‌తో వచ్చే సినిమాలే కాకుండా వెబ్‌ సిరీస్‌లను కూడా మూవీ లవర్స్‌ హిట్టు బాట పట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే 2022లో అనేక సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు విడుదల కాగా ప్రేక్షకులు కొన్నింటిని ఆదరిస్తే.. మరికొన్నింటిని తిరస్కరించారు. 

ప్రేక్షకుల ఆదరణను బట్టి తాజాగా ఐఎమ్‌డీబీ (ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌) టాప్‌ 10 మోస్ట్‌ పాపులర్ మూవీస్‌, వెబ్‌ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. ఇండియాలోని ఐఎమ్‌డీబీ (IMDB)ఆడియెన్స్‌ పేజీ వీక్షణ ఆధారంగా ఈ రేటింగ్‌లను కేటాయిస్తారనే విషయం తెలిసిందే. 2022 జనవరి 1 నుంచి జులై 5 వరకు ఇటు థియేటర్స్, అటు ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు ఈ రేటింగ్స్‌ను ఇచ్చింది. మరి ఆ సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, ఆ రేటింగ్స్‌ ఏంటో ఓ లుక్కేయండి.  

మోస్ట్‌ పాపులర్ ఇండియన్‌ చిత్రాలు..

1. విక్రమ్‌- 8.8
2. కేజీఎఫ్‌ 2- 8.5
3. ది కశ్మీర్ ఫైల్స్‌- 8.3
4. హృదయం- 8.1
5. ఆర్‌ఆర్‌ఆర్‌- 8.0
6. ఏ థర్స్‌ డే- 7.8
7. ఝుండ్‌- 7.4
8. రన్‌వే-34- 7.2
9. సామ్రాట్‌ పృథ్వీరాజ్‌- 7.2
10. గంగూబాయి కతియావాడి- 7.0
 

మోస్ట్‌ పాపులర్‌ ఇండియన్ వెబ్ సిరీస్‌లు..
 
1. క్యాంపస్‌ డైరీస్‌ (ఎమ్‌ఎక్స్‌ ప్లేయర్‌)- 9.0
2. రాకెట్ ‍బాయ్స్‌ (సోనీ లివ్‌)- 8.9
3. పంచాయత్‌ 2 (అమెజాన్ ప్రైమ్‌ వీడియో)- 8.9
4. అపహరణ్‌ (వూట్‌/ఆల్ట్‌ బాలాజీ)- 8.4
5. హ్యూమన్‌ (డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌)- 8.0
6. ఎస్కేప్‌ లైవ్‌ (డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌)- 7.7
7. ది గ్రేట్ ఇండియన్‌ మర్డర్‌ (డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌)- 7.3
8. మాయి (నెట్‌ఫ్లిక్స్‌)- 7.2
9. యే కాళీ కాళీ ఆంఖే (నెట్‌ఫ్లిక్స్‌)- 7.0
10. ది ఫేమ్‌ గేమ్‌ (నెట్‌ఫ్లిక్స్‌)- 7.0
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement