most popular
-
ప్రభాస్ నంబర్ వన్ ... సమంత హ్యాట్రిక్
రికార్డ్ ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతి నెలా దేశంలోని సెలబ్రిటీలపై సర్వే నిర్వహించి, టాప్ ΄పోజిషన్లోని వారి జాబితాలను విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగా నవంబరు నెలకుగాను మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను ప్రకటించగా హీరో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. హీరోయిన్లలో సమంత తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు... కథానాయికల జాబితాలో సమంత వరుసగా మూడో సారి (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్) ఫస్ట్ ప్లేస్‌లో నిలవడం విశేషం.ప్రభాస్ వరుసగా రెండో సారి (అక్టోబర్, నవంబర్) నిలిచారు. ఇక నవంబర్ నెలకు ప్రకటించిన మోస్ట్ పాపులర్ స్టార్ జాబితాలో ప్రభాస్ తర్వాతి స్థానంలో విజయ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వరుసగా అల్లు అర్జున్, షారుక్ ఖాన్, ఎన్టీఆర్, అజిత్ కుమార్, మహేశ్‌బాబు, సూర్య, రామ్‌చరణ్, అక్షయ్ కుమార్ నిలిచారు.ఇక హీరోయిన్ల విషయానికొస్తే... సమంత తొలి స్థానంలో నిలిచారు. వరుసగా మూడు నెలలపాటు ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ హీరోయిన్ల జాబితాలో తొలి స్థానంలో నిలిచి, హ్యాట్రిక్ రికార్డ్ సృష్టించారు సమంత. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ జాబితాలో సమంత తర్వాతి ప్లేస్‌లలో ఆలియా భట్, నయనతార, సాయి పల్లవి, దీపికా పదుకోన్, త్రిష, కాజల్ అగర్వాల్, రష్మికా మందన్నా, శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్ ఉన్నారు. -
IMDb Ranks 2024: శోభితకు 5వ ప్లేస్.. సమంత 8వ స్థానం (ఫోటోలు)
-
మోస్ట్ పాపులర్ హీరోగా విజయ్.. ప్రభాస్ ప్లేస్ ఎంతంటే!
ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సినీ స్టార్స్‌కు సంబంధించిన ర్యాంకులను ప్రకటిస్తుంది. హీరో, హీరోయిన్ల క్రేజ్ ఆధారంగా ప్రతినెల మోస్ట్ పాపులర్ స్టార్స్ పేరిట టాప్ టెన్ జాబితాను రిలీజ్ చేస్తోంది. తాజాగా సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆ జాబితాను విడుదల చేసింది.తాజాగా రిలీజైన జాబితాలో మోస్ట్ పాపులర్ మేల్ స్టార్స్‌లో విజయ్ మొదటిస్థానంలో నిలవగా.. రెబల్ స్టార్ ప్రభాస్, షారూఖ్ ఖాన్ టాప్-3లో నిలిచారు. ఆ తర్వాత అజిత్ కుమార్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, మహేశ్ బాబు, అక్షయ్ కుమార్, రామ్ చరణ్, సల్మాన్ ఖాన్ ఉన్నారు. ఫస్ట్ ప్లేస్‌లో నిలిచిన విజయ్ ఇటీవలే ది గోట్ మూవీతో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.టాప్‌లో సమంత.. రష్మిక ప్లేస్ ఎక్కడంటే?ఆర్మాక్స్ మీడియా వెల్లడించిన మోస్ట్ పాపులర్ ఫీమేల్ స్టార్స్ జాబితాలో సమంత టాప్‌లో నిలిచింది. రెండు, మూడు స్థానాల్లో బాలీవుడ్ భామలు ఆలియా భట్, దీపికా పదుకొణెలు నిలిచారు. ఆ తర్వాత వరుసగా..నయనతార, త్రిష, శ్రద్ధాకపూర్, కాజల్ అగర్వాల్, సాయిపల్లవి, రష్మిక మందన్నా, పదో స్థానంలో గేమ్ ఛేంజర్ భామ కియారా అద్వానీ నిలిచింది.కాగా.. సమంత ప్రస్తుతం సిటాడెల్ హన్నీ బన్నీ ఇండియన్ వర్షన్లో కనిపించనుంది. ఇటీవల ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. రెండో స్థానంలో నిలిచిన ఆలియా భట్ ఇటీవలే జిగ్రా మూవీతో ప్రేక్షకులను పలకరించింది. మూడో ప్లేస్‌లో ఉన్న దీపికా పదుకొణె కల్కి సినిమాతో అభిమానులను అలరించింది. Ormax Stars India Loves: Most popular female film stars in India (Sep 2024) #OrmaxSIL pic.twitter.com/wAxa5GF5DP— Ormax Media (@OrmaxMedia) October 22, 2024 Ormax Stars India Loves: Most popular male film stars in India (Sep 2024) #OrmaxSIL pic.twitter.com/ei4bfglzlm— Ormax Media (@OrmaxMedia) October 22, 2024 -
పాన్ ఇండియాలో మోస్ట్ క్రేజీ స్టార్స్.. తొలి స్థానంలో ఎవరంటే?
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా సంస్థ ప్రకటించిన జాబితాలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తొలిస్థానంలో నిలిచారు. జూన్ నెలకు సంబంధించి ఇండియా వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను తాజాగా ప్రకటించింది. ఈ లిస్ట్‌లో ప్రభాస్ మొదటిస్థానంలో నిలవగా.. ఆ తర్వాత ప్లేస్‌లో షారుక్ ఖాన్ నిలిచారు.ఆర్మాక్స్ మీడియా తాజాగా విడుదల చేసిన జాబితాలో దళపతి విజయ్ మూడోస్థానం, అల్లు అర్జున్ నాలుగు, జూనియర్ ఎన్టీఆర్ ఐదోప్లేస్ దక్కించుకున్నారు. ఆ తర్వాత వరుసగా.. మహేశ్ బాబు, అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రామ్ చరణ్, హృతిక్ రోషన్ ఉన్నారు.కాగా.. ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన ఎపిక్ సైన్స్ ఫిక్షన్ చిత్రం కల్కి 2898 ఏడీ జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. విడుదలైన రెండు వారాల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్, దీపికా, కమల్ హాసన్, దిశాపటానీ కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా తర్వాత మారుతి డైరెక్షన్లో రాజాసాబ్‌లో ప్రభాస్ కనిపించనున్నారు. Ormax Stars India Loves: Most popular male film stars in India (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/ghuiir9wgG— Ormax Media (@OrmaxMedia) July 21, 2024 -
తెలుగులో మోస్ట్ పాపులర్ హీరో ఎవరంటే.. లిస్ట్ ఇదే!
ప్రముఖ ఆర్మాక్స్ మీడియా టాలీవుడ్ తారలకు ర్యాంకింగ్స్ ప్రకటించింది. జూన్ నెలకు సంబంధించి టాప్ టెన్‌లో ఉన్న హీరోల జాబితాను వెల్లడించింది. ఈ లిస్ట్‌లో మొదటిస్థానంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నిలిచారు. ఆ తర్వాత స్థానాల్లో వరుసగా జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్ టాప్ ఫైవ్‌లో చోటు దక్కించుకున్నారు.మోస్ట్ పాపులర్ తెలుగు స్టార్స్ పేరిట ఈ జాబితాను ట్విటర్లో పోస్ట్ చేసింది. ఈ లిస్ట్‌లో పవన్ కల్యాణ్, నాని, రవితేజ, చిరంజీవి, విజయ్ దేవరకొండ టాప్‌టెన్‌లో నిలిచారు. ప్రభాస్ తొలిస్థానంలో నిలవడంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. రెబల్ స్టార్ నటించిన కల్కి 2898 ఏడీ జూన్ 27న థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. నాగ్ అశ్విన్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. Ormax Stars India Loves: Most popular male Telugu film stars (Jun 2024) #OrmaxSIL pic.twitter.com/XNWOfiaDaA— Ormax Media (@OrmaxMedia) July 15, 2024 -
వెబ్సైట్ల రారాజు గూగులే..
ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే చాలు మొదట వెళ్లేది గూగుల్ వెబ్‌సైట్‌కే. వార్తల నుంచి ఫొటోలు, వీడియోల దాకా ఏ సమాచారం కావాలన్నా వెతికేది అందులోనే.. అందుకే ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ పాపులర్ వెబ్‌సైట్‌గా గూగుల్ నిలిచింది. అంతేకాదు.. అత్యధిక యూజర్ ట్రాఫిక్ ఉండే టాప్–10 వెబ్సైట్లలో నాలుగు గూగుల్‌కు చెందినవే. ► నిజానికి చాలా ఏళ్లుగా గూగుల్ వెబ్‌సైటే టాప్‌లో ఉంటూ వస్తోంది. అయితే టిక్‌టాక్ వెబ్సైట్ 2021 ఏడాది చివరిలో కొద్దిరోజులు గూగుల్‌ను వెనక్కి నెట్టి టాప్‌లో నిలవడం గమనార్హం. ► పాపులర్ సైట్ల లిస్టులో యూట్యూబ్ 11వ స్థానంలో, అమెజాన్ 18వ, ఇన్‌స్ట్రాగామ్ 24వ, నెట్‌ఫ్లిక్స్ 25వ, వాట్సాప్ 29వ, స్పాటిఫై 35వ, స్నాప్‌చాట్ 40వ, ట్విట్టర్ 45వ, లింక్డ్ఇన్ 68వ, జీమెయిల్ 79వ స్థానాల్లో ఉన్నాయి. -
ఆ ఓటీటీ షోలు చూస్తే డబ్బులే డబ్బులు! స్నాక్స్ ఖర్చు కూడా..
ఇటీవల ఓటీటీలకు ప్రేక్షకుల ఆదరణ బాగా పెరిగింది. చాలా సినిమాలు, షోలు ప్రత్యేకంగా ఓటీటీల్లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ (Netflix)కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే షోలకు కోట్లాది మంది ప్రేక్షకులు ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత జనాదరణ పొందిన షోలను వీక్షించే ఒక అదృష్ట అభిమాని 2,500 డాలర్లు (రూ.2.07 లక్షలు) గెలుచుకోవచ్చు. ఆన్లైన్ క్యాసినోస్ అనే సంస్థ ఈ ఆఫర్ అందిస్తోంది. సెప్టెంబర్ 25న నేషనల్ బింజ్ డే నాటికి విజేతను ఎంపిక చేయనుంది. విజేతకు పేమెంట్ రూపంలో 2,000 డాలర్లు (రూ.1.65 లక్షలు) అందిస్తారు. అలాగే స్నాక్స్ ఖర్చు కోసం మరో 500 డాలర్లు (రూ.41,000) చెల్లిస్తారు. దీంతోపాటు ఒక వేళ నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లేకపోతే అదికూడా ఉచితంగానే అందిస్తారు. (ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్ 20 లిస్ట్! ఐటీ కంపెనీలదే హవా..) నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే మూడు అత్యంత ప్రజాదరణ పొందిన షోలు ‘స్క్విడ్ గేమ్’ (Squid Game), ‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things), ‘వెనస్డే’(Wednesday)లను వీక్షించడానికి విజేతకు ఒక నెల సమయం ఉంటుంది. ఈ సమయంలో ఒక్కో షోకు రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారికి ఎన్ని ఎపిసోడ్లు చూస్తున్నారు.. వీక్షిస్తున్నప్పుడు పరధ్యానానికి గురవుతున్నారా.. మళ్లీ ఎలా తిరగి షోలో నిమగ్నమవుతున్నారు..వంటి ప్రమాణాలను ఉపయోగించి ప్రతి షోకి 10కి స్కోర్ ఇవ్వమని అడుగుతారు. మూడు ప్రోగ్రామ్‌లలో మొత్తం 51 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇవన్నీ వీక్షించడానికి సుమారు 50 గంటలు పడుతుంది. విజేతను సెప్టెంబర్ 25 నాటికి ఎంపిక చేసి మొదటగా నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్, స్నాక్స్ ఖర్చు కోసం 500 డాలర్లు అందిస్తారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే మూడు షోలపై రివ్యూలను సమర్పించడానికి అక్టోబర్ 25 వరకు సమయం ఉంటుంది. ఇదంతా పూర్తయ్యాక చివరగా 2,000 డాలర్లు అందిస్తారు. -
ఈ ఏడాది దుమ్మురేపిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
IMDB Top 10 Most Popular Indian Movies And Web Series 2022: ఓటీటీలు వచ్చాక సినీ ప్రియుల నుంచి ప్రేక్షకుల దాకా అభిరుచి మారింది. రొటీన్, రొడ్డకొట్టుడు సినిమాలకు స్వస్తి పలుకుతూ కొత్త తరహా కథాంశాలతో వచ్చిన చిత్రాలకు సై కొడుతున్నారు. సినిమాలో ఎంత పెద్ద తారాగణం ఉన్నప్పటికీ కథలో దమ్ము, కథనంలో బలం లేకుంటా చూసేదే లే అంటున్నారు. ఇక ప్రస్తుతం విభిన్నమైన స్టోరీస్‌తో వచ్చే సినిమాలే కాకుండా వెబ్ సిరీస్‌లను కూడా మూవీ లవర్స్ హిట్టు బాట పట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే 2022లో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు విడుదల కాగా ప్రేక్షకులు కొన్నింటిని ఆదరిస్తే.. మరికొన్నింటిని తిరస్కరించారు. ప్రేక్షకుల ఆదరణను బట్టి తాజాగా ఐఎమ్‌డీబీ (ఇంటర్నెట్ మూవీ డేటాబేస్) టాప్ 10 మోస్ట్ పాపులర్ మూవీస్, వెబ్ సిరీస్‌ల జాబితాను విడుదల చేసింది. ఇండియాలోని ఐఎమ్‌డీబీ (IMDB)ఆడియెన్స్ పేజీ వీక్షణ ఆధారంగా ఈ రేటింగ్లను కేటాయిస్తారనే విషయం తెలిసిందే. 2022 జనవరి 1 నుంచి జులై 5 వరకు ఇటు థియేటర్స్, అటు ఓటీటీలో విడుదలైన సినిమాలు, వెబ్ సిరీస్‌లకు ఈ రేటింగ్స్‌ను ఇచ్చింది. మరి ఆ సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఆ రేటింగ్స్ ఏంటో ఓ లుక్కేయండి. మోస్ట్ పాపులర్ ఇండియన్ చిత్రాలు.. 1. విక్రమ్- 8.8 2. కేజీఎఫ్ 2- 8.5 3. ది కశ్మీర్ ఫైల్స్- 8.3 4. హృదయం- 8.1 5. ఆర్ఆర్ఆర్- 8.0 6. ఏ థర్స్ డే- 7.8 7. ఝుండ్- 7.4 8. రన్‌వే-34- 7.2 9. సామ్రాట్ పృథ్వీరాజ్- 7.2 10. గంగూబాయి కతియావాడి- 7.0 View this post on Instagram A post shared by IMDb (@imdb) మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్‌లు.. 1. క్యాంపస్ డైరీస్ (ఎమ్ఎక్స్ ప్లేయర్)- 9.0 2. రాకెట్ బాయ్స్ (సోనీ లివ్)- 8.9 3. పంచాయత్ 2 (అమెజాన్ ప్రైమ్ వీడియో)- 8.9 4. అపహరణ్ (వూట్/ఆల్ట్ బాలాజీ)- 8.4 5. హ్యూమన్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- 8.0 6. ఎస్కేప్ లైవ్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- 7.7 7. ది గ్రేట్ ఇండియన్ మర్డర్ (డిస్నీ ప్లస్ హాట్‌స్టార్)- 7.3 8. మాయి (నెట్‌ఫ్లిక్స్)- 7.2 9. యే కాళీ కాళీ ఆంఖే (నెట్‌ఫ్లిక్స్)- 7.0 10. ది ఫేమ్ గేమ్ (నెట్‌ఫ్లిక్స్)- 7.0 View this post on Instagram A post shared by IMDb (@imdb) -
ఓటీటీలోనూ రికార్డులు క్రియేట్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్'..
RRR Hindi Version Create Most Popular Indian Movie In Netflix Globally: జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ మల్టీస్టారర్‌గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, యాక్టింగ్.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ మూవీ. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. తమ ఓటీటీ ప్లాట్ఫామ్లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు కొట్టినట్లు నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగులో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ డబ్బింగ్ వెర్షన్ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఇప్పటివరకు 45 మిలియన్ అవర్స్ స్ట్రీమింగ్ అయిందట. అలా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్ తెలిపింది. అలాగే ఈ మూవీ మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5లో ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ ! కమెడియన్ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు.. RRR is now the most popular Indian film on Netflix around the world 🕺🕺 Sending the biggest 🤝 to fans everywhere! pic.twitter.com/WEOw0nb515 — Netflix India (@NetflixIndia) June 23, 2022 -
2021లో అత్యంత ఆదరణను పొందిన క్రిప్టోకరెన్సీ ఏదంటే..?
ప్రపంచవ్యాప్తంగా డిజిటల్ కరెన్సీకి భారీ ఆదరణ లభిస్తోంది. పలు దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీపై ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అనేక దేశాల్లో నిషేధం ఉన్నప్పటికీ.. ఆయా దేశాల ప్రజలు క్రిప్టోకరెన్సీలను భారీగా ఆదరిస్తున్నారు. 2021లో చూసుకుంటే క్రిప్టో పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్ అత్యంత ప్రజాదరణను పొందింది. అయితే గత ఏడాదిలో బిట్‌కాయిన్ కాకుండా ఇతర ఆల్ట్ కాయిన్స్ భారీ ఆదరణను పొందాయి. బిట్‌కాయిన్ కంటే దీనిపైనే..! క్రిప్టోకరెన్సీల్లో బిట్‌కాయిన్ కంటే షిబా ఇను గత 12 నెలల్లో సుమారు 188 మిలియన్లకు పైగా ఇన్వెస్టర్లు వీక్షించినట్లు కాయిన్‌మార్కెట్‌క్యాప్ వెల్లడించింది. అదే సమయంలో ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ 145 మిలియన్ల వీక్షణలతో రెండవ స్థానంలో ఉంది. షిబా ఇను అనేది ఇప్పటికే ఉన్న మీమ్ కాయిన్ డోజ్‌కాయిన్‌కు స్పిన్-ఆఫ్. ఎలన్ మస్క్ అపారంగా నమ్మే డోజీకాయిన్ సుమారు 107 మిలియన్ వీక్షణలతో జాబితాలో 3వ స్థానంలో నిలిచింది. కారణం అదే..! క్రిప్టోకరెన్సీలో బిట్‌కాయిన్ అత్యంత విలువను కల్గి ఉంది. ఒకానొక సమయంలో బిట్‌కాయిన్ సుమారు 50 లక్షలకు కూడా చేరింది. ఈ కాయిన్ ఇన్వెస్ట్ చేయాలంటే పెట్టుబడిదారులు కొంతమేర భయపడ్డారు. బిట్‌కాయిన్ కంటే ఆల్ట్‌కాయిన్స్ విలువ తక్కువగా ఉండడంతో వీటిపై ఇన్వెస్ట్ చేయడానికి పెట్టుబడిదారులు మొగ్గుచూపారు. ఇకపోతే షిబా ఇను వచ్చి కేవలం 15 నెలలు అయినప్పటికీ, ప్రస్తుతం 18 బిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్‌తో ప్రపంచంలోనే 13వ అతిపెద్ద క్రిప్టోకరెన్సీగా ఉంది. అక్టోబర్‌లో ఈ క్రిప్టోకరెన్సీ నాలుగు రోజుల్లోనే 133 శాతం పెరిగి, ఆల్-టైమ్ గరిష్ట స్థాయి 0.000088 డాలర్లకు చేరింది. రాబిన్ హుడ్ యాప్‌లో షిబా ఇను ప్రముఖ స్టాక్ ట్రేడింగ్ యాప్, రాబిన్‌హుడ్‌లో జాబితా చేయబడే అవకాశం ఉందనే పుకార్లు ఈ కాయిన్ విలువ భారీగా పెరిగింది. షిబా ఇను ఇన్వెస్టర్లు రాబిన్ హుడ్ లో లిస్ట్ చేయాలని ఆన్లైన్లో సంతకాల సేకరణ కూడా చేపట్టారు. షిబా ఇను కాయిన్‌ను ఇప్పటికే ప్రసిద్ధ క్రిప్టోకరెన్సీ ట్రేడింగ్ ప్లాట్‌ఫారమ్ కాయిన్‌బేస్‌లో లిస్ట్ అయ్యింది. చదవండి: క్రిప్టో లావాదేవీల్లో అక్రమాలు.. రూ. 49 కోట్ల ఫైన్.. -
టాప్ ట్రెండ్స్ 2015
ఈ ఏడాదికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమవుతోంది. ఈ సందర్భంగా ట్విట్టర్ ఇండియా 2015 సంవత్సరంలో ట్విట్టర్ టాప్ ట్రెండ్స్‌ను, ఎక్కువగా రీట్వీట్ చేసిన ట్వీట్స్,మోస్ట్ పాపులర్ ట్వీట్లను వెల్లడించింది. చెన్నై వర్షాలు..వరదలు..పునరావాస, సహాయ కార్యక్రమాల నిర్వహరణ దగ్గర నుంచి ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు, మోదీ పిలుపిచ్చిన 'మేకిన్ ఇండియా'.ఇలా అనేక విషయాలు ట్విట్టర్ ట్రెండ్స్‌లో చోటు సంపాదించాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం. గోల్డెన్ ట్వీట్..షారూఖ్దే గోల్డెన్ ట్వీట్ ఘనత బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్‌కు దక్కింది. లండన్‌లో జరిగిన ఏషియన్ అవార్డుల కార్యక్రమంలో షారూఖ్‌ఖాన్ ప్రముఖ ఇంగ్లిష్ గాయకుడు జైన్ మాలిక్‌తో సెల్ఫీ దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి అత్యధికంగా 1,41,000పైగా రీట్వీట్స్, 18.3 మిలియన్ వ్యూస్, 2 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. ఏప్రిల్ 17న చేసిన ఈ ట్వీట్ గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది. కీ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా ప్రజలపై ఎక్కువగా ప్ర భావం చూపించిన అంశాలు..ఎక్కువగా ప్రజలు భాగస్వాములై ట్వీట్లు చేసిన సందర్భాలు.. ♦ క్రికెట్ ప్రపంచ కప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లు-1.7 మిలియన్ ట్వీట్లు ♦ ఢిల్లీ ఎన్నికలు-10.8 మిలియన్ ట్వీట్లు ♦ దీపావళి శుభాకాంక్షలు-1.8 మిలియన్ ట్వీట్లు ♦ చెన్నై వర్షాలు(డిసెంబర్ 1 నుంచి 4వరకు కురిసిన వర్షాలు)-1.4 మిలియన్ ట్వీట్లు ♦ భారత స్వాతంత్య్ర దినోత్సవం-లక్ష ట్వీట్లు మోస్ట్ ఫాలోడ్ యూజర్స్ 'ఇయర్ ఇన్ ట్విట్టర్ 2015'నివేదిక ప్రకారం బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ 18.1 మిలియన్ల ఫాలోవర్లతో తొలిస్థానంలో ఉన్నారు. షారూఖ్ ఖాన్ 16.5 మిలియన్ల ఫాలోవర్లతో రెండోస్థానంలో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ 16.4 మిలియన్ల ఫాలోవర్లతో మూడోస్థానంలో ఉన్నారు. అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ వరసగా 15.5 మిలియన్లు, 15 మిలియన్ల ఫాలోవర్లతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. భారత్‌లో మోస్ట్ ఫాలోవుడ్ టాప్ టెన్ పర్సన్స్‌లో 9 ట్విట్టర్ అకౌంట్లు బాలీవుడ్ స్టార్లకు చెందినవే కావటం విశేషం. మోస్ట్ పాపులర్ హాష్‌ట్యాగ్ ట్రెండ్స్ ట్విట్టర్లో మోస్ట్ పాపులర్ హాష్‌ట్యాగ్ ట్రెండ్స్ క్రీడలు, వినోదం, రాజకీయం, సామాజిక కార్యక్రమాల మిశ్రమంగా ఉన్నాయి. ♦ ఐపీల్-9 మిలియన్ ట్వీట్లు ♦ సెల్ఫీవిత్డాటర్-3,75,000 ట్వీట్లు ♦ బిహార్ ఎన్నికల ఫలితాలు-2,60,000 ట్వీట్లు ♦ నరేంద్ర మోదీ ఏడాది పాలన-1,79,000 ట్వీట్లు ♦ దిల్వాలే దుల్హనియా లేజాయింగే సినిమాకు 20 ఏళ్లయిన సందర్భం-1,40,000 ట్వీట్లు అమెరికా బ్రాండ్ కాకుండా సొంతంగా ట్విట్టర్ ఇమోజీ పొందిన తొలి హ్యాష్‌ట్యాగ్ 'మేకిన్ ఇండియా' ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండ్స్ ట్విట్టర్ ఈ ఏడాదిని 'సంఘీభావ సంవత్సరం' గా పేర్కొంది. టర్కీ సముద్రతీరంలో శవమై పడిఉన్న..సిరియాకు చెందిన మూడేళ్ల బాలుడి చిత్రం ప్రపంచాన్ని కదిలించింది. సిరియా, ఇతర మధ్యప్రా చ్య దేశాల నుంచి వచ్చే శరణార్థులను యూరప్ దేశాల్లోకి అనుమతించాలంటూ అనేక మంది ప్రజలు చేసిన ట్వీట్లు..ట్విట్టర్లో ఎక్కువ చర్చిం చుకున్న అంశాల్లో నాలుగోస్థానంలో నిలిచింది. పారిస్‌పై ఉగ్రదాడి సంఘటన.. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో ఎక్కువగా చర్చించుకున్న విషయంగా నిలిచింది. అమెరికాలో జరిగిన 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్మెంట్' ట్విట్టర్లో ఎక్కువగా చర్చించుకున్న విషయాల్లో రెండోస్థానంలో నిలిచింది. అమెరికాలోని ఫెర్గూసన్, చార్లెస్టన్,బ్లాతిమోర్లలో పోలీసులు నల్లజాతీయులను కాల్చి చంపటంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. అమెరికాకు చెందిన 14ఏళ్ల బాలుడు అహ్మద్ మొహమ్మద్ అనే బాలుడు రూపొందిన హోమ్మేడ్ క్లాక్‌ను బాంబుగా భావించి స్కూలు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అహ్మద్‌ను అరెస్ట్ చేశారు. 'ఐ స్టాండ్ విత్ అహ్మద్'అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రపంచం మొత్తం అహ్మద్‌కు మద్దతు పలికింది. చివరికి అధ్యక్షుడు ఒబామా స్పందించి. అహ్మద్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. ఈ సంఘటన ఐదోస్థానంలో నిలిచింది. అమెరికా, ఐర్లాండ్‌లు స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేశాయి. ఈ విషయం ఎక్కువ మంది చర్చించిన అంశంగా మూడోస్థానంలో నిలిచింది. స్వలింగ సంపర్కుల విహహానికి సంబంధించిన చట్టాన్ని యూఎస్ సుప్రీం కోర్టు జూన్ 26న ధ్రువపరిచింది. ఇంగ్లండ్, కెనడా, ఇండియాలో జాతీయస్థాయిలో జరిగిన ఎన్నికలు..ట్వీట్లు, హ్యాష్‌ట్యాగ్‌లతో ట్విట్టర్ టైమ్ లైన్లను హోరెత్తించాయి. ఈ అంశం ఆరోస్థానంలో నిలిచింది. -
'ఫేస్బుక్లో కేసీఆర్‌కు అత్యంత ఆదరణ'
న్యూఢిల్లీ: దేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల కంటే తెలంగాణ సీఎం కే చంద్రశేఖర్ రావుకు ఫేస్బుక్లో అత్యంత ఆదరణ ఉందని రాష్ట్ర మంత్రి కేటీఆర్ చెప్పారు. ఢిల్లీలో జరిగిన జాతీయ నీటి సదస్సులో మంత్రి పాల్గొన్నారు. సోషల్ మీడియా ద్వారా సుపరిపాలన అనే అంశంపై కేటీఆర్ ఈ సమావేశంలో మాట్లాడారు. సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోందని కేటీఆర్ అన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం కోసమే గాక ప్రజల ఫిర్యాదులను పరిరక్షించేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నామని చెప్పారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో ప్రతి ఇంటికి నల్లాతో పాటు బ్రాడ్ బ్యాండ్‌ను అందిస్తామని కేటీఆర్ అన్నారు.