
ఇటీవల ఓటీటీలకు ప్రేక్షకుల ఆదరణ బాగా పెరిగింది. చాలా సినిమాలు, షోలు ప్రత్యేకంగా ఓటీటీల్లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ (Netflix)కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే షోలకు కోట్లాది మంది ప్రేక్షకులు ఉన్నారు.
నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత జనాదరణ పొందిన షోలను వీక్షించే ఒక అదృష్ట అభిమాని 2,500 డాలర్లు (రూ.2.07 లక్షలు) గెలుచుకోవచ్చు. ఆన్‌లైన్ క్యాసినోస్ అనే సంస్థ ఈ ఆఫర్ అందిస్తోంది. సెప్టెంబర్ 25న నేషనల్ బింజ్ డే నాటికి విజేతను ఎంపిక చేయనుంది.
విజేతకు పేమెంట్ రూపంలో 2,000 డాలర్లు (రూ.1.65 లక్షలు) అందిస్తారు. అలాగే స్నాక్స్ ఖర్చు కోసం మరో 500 డాలర్లు (రూ.41,000) చెల్లిస్తారు. దీంతోపాటు ఒక వేళ నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ లేకపోతే అదికూడా ఉచితంగానే అందిస్తారు.
(ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్ 20 లిస్ట్! ఐటీ కంపెనీలదే హవా..)
నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే మూడు అత్యంత ప్రజాదరణ పొందిన షోలు ‘స్క్విడ్ గేమ్’ (Squid Game), ‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things), ‘వెనస్‌డే’(Wednesday)లను వీక్షించడానికి విజేతకు ఒక నెల సమయం ఉంటుంది. ఈ సమయంలో ఒక్కో షోకు రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారికి ఎన్ని ఎపిసోడ్‌లు చూస్తున్నారు.. వీక్షిస్తున్నప్పుడు పరధ్యానానికి గురవుతున్నారా.. మళ్లీ ఎలా తిరగి షోలో నిమగ్నమవుతున్నారు..వంటి ప్రమాణాలను ఉపయోగించి ప్రతి షోకి 10కి స్కోర్ ఇవ్వమని అడుగుతారు.
మూడు ప్రోగ్రామ్‌లలో మొత్తం 51 ఎపిసోడ్‌లు ఉన్నాయి. ఇవన్నీ వీక్షించడానికి సుమారు 50 గంటలు పడుతుంది. విజేతను సెప్టెంబర్ 25 నాటికి ఎంపిక చేసి మొదటగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్, స్నాక్స్ ఖర్చు కోసం 500 డాలర్లు అందిస్తారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే మూడు షోలపై రివ్యూలను సమర్పించడానికి అక్టోబర్ 25 వరకు సమయం ఉంటుంది. ఇదంతా పూర్తయ్యాక చివరగా 2,000 డాలర్లు అందిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment