Shows
-
ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఆరో షోకు అనుమతిచ్చిన ఏపీ ప్రభుత్వం
ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాకు ఏపీ ప్రభుత్వం ఆరో ఆటకు అనుమతులిచ్చారు. ఈ నెల 27న రిలీజవుతోన్న ఈ సినిమాను గురువారం ఉదయం 4.30 నుంచి 8 గంటల వరకు బెనిఫిట్ షోలు ప్రదర్శించేందుకు పర్మిషన్ ఇచ్చారు. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.టికెట్ ధరల పెంపుఇప్పటికే ప్రభాస్ కల్కి 2898 ఏడీ చిత్రానికి రెండు వారాల పాటు టికెట్స్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చారు. మల్టీప్లెక్స్‌లో ఒక్కో టికెట్‌పైన అదనంగా రు.125 వసూలు చేయనున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అదనంగా రూ.75 పెంచుకునేలా ఉత్తర్వులిచ్చారు. అయితే గత ఐదేళ్ల లో ఎన్నడూ లేని భారీ ప్రయోజనాలు చేకూరుస్తూ ఏపీ ప్రభుత్వం ఏకంగా 2 జీవోలు జారీ చేయడం గమనార్హం. రాబోయే రెండు వారాల పాటు ఏపీలో అదనపు ధరలతో పాటు కల్కి సినిమాను 5 షోలు ప్రదర్శించనున్నారు.భారీ అంచనాలుప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వైజయంతి మూవీస్ బ్యానర్లో అశ్వనీదత్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ మూవీలో అమితాబ్, దీపికా పదుకొణె, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటించారు. సైన్స్ ఫిక్షన్‌గా వస్తోన్న ఈ సినిమా కోసం రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
సూపర్ స్టార్ సినిమాకు షాక్.. ఇంత దారుణంగా ఎప్పుడు చూడలేదు!
సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన తాజా చిత్రం లాల్ సలామ్. గతేడాది జైలర్ సినిమాతో హిట్ కొట్టిన తలైవా ఈ ఏడాది తన కూతురి దర్శకత్వంలో నటించారు. యంగ్ హీరో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా అభిమానుల భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో తలైనా మొహిద్దీన్ భాయ్ అనే కీలక పాత్రలో నటించారు. రజినీకాంత్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక కోలీవుడ్‌లో అయితే చెప్పాల్సిన పనిలిదు. రజినీకాంత్ మూవీ అంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దవ్వాల్సిందే. కానీ ఎవరు ఊహించని లాల్ సలామ్ చిత్రానికి బిగ్ షాక్ తగిలింది. కోలీవుడ్‌లో ఫర్వాదలేనిపించినా.. తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ మూవీని అస్సలు పట్టించుకోలేదు. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఏకంగా మార్నింగ్ షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూపర్ స్టార్ సినిమా తొలి రోజే చాలా చోట్ల మార్నింగ్ షోలు రద్దయ్యాయి. దీంతో హైదరాబాద్‌లో అయితే మల్టీప్లెక్స్‌ల్లో రజినీ సినిమా చూడాలనుకున్న తెలుగు ఆడియన్స్‌కు నిరాశే మిగిలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల టికెట్లు కొనేవాళ్లు లేక మార్నింగ్ షోలు రద్దు చేశారు. అయితే ఇప్పటికే కొంత మంది టికెట్స్ బుక్ చేసుకోగా.. థియేటర్ల యాజమాన్యాలు వాళ్లకు డబ్బులు రీఫండ్ చేయడం గమనార్హం. తలైవా నటించిన సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షోలకే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో రవితేజ ఈగల్, జీవా, మమ్ముట్టి యాత్ర-2 సినిమాలు రిలీజ్ కావడం ఒక కారణమని తెలుస్తోంది. ఏది ఏమైనా రజినీకాంత్ ఉన్న ఇమేజ్ ప్రకారం కనీసం సగం థియేటర్లు అయినా నిండి ఉండాల్సింది. ఏకంగా స్టార్ హీరో సినిమాకు ఫస్ట్ షోలు రద్దు కావడంతో ఆడియన్స్ షాక్‌కు గురవుతున్నారు. మరి వీకెండ్లోనైనా లాల్ సలామ్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సిందే. కాగా.. గతంలో రజనీకాంత్ సినిమాలను తెలుగు ఆడియన్స్ బాగానే ఆదరించారు. గతేడాది వచ్చిన జైలర్ మూవీ టాలీవుడ్లో మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఏకంగా రూ.47 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. -
ఆ టోకెన్‌తో థియేటర్లో జీవితాంతం ఉచితంగా సినిమాలు
ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని అంటారు. చాలామంది పాత వస్తువులను జాగ్రత్తగా దాచేందుకు ఇష్టపడతారు. అయితే కొన్నేళ్ల తర్వాత అవి బయట పడినప్పుడు వాటిని చూసినవారు తెగ ఆశ్యర్యపోతుంటారు. అయితే ఇప్పుడు మనం తెలుసుకునేది దీనికి భిన్నం. 1766 నాటి ‘థియేటర్ టోకెన్’ ఇప్పుడు బ్రిటన్‌లో వేలం వేస్తున్నారు. దీని ప్రత్యేకత ఏమిటంటే ఆ టొకెన్ ఉంటే థియేటర్లో రోజూ సినిమాలను ఉచితంగా చూడవచ్చు. అయితే ఈ టోకెన్ కొనుగోలు చేయాలంటే భారీగా సొమ్ము చెల్లించాలివుంటుంది. గార్డియన్ తెలిపిన వివరాల ప్రకారం బ్రిటన్‌లోని బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్‌ను నిర్మించివారు ముందుగా 50 ప్రత్యేకమైన టోకెన్లు తయారు చేశారు. ఈ టోకెన్లు కలిగినవారు థియేటర్లో ప్రదర్శించే ప్రతీ సినిమాను ఉచితంగా చూడవచ్చని ఆ టోకెన్లపై రాసి ఉంది. 250 ఏళ్లపాటు దాచివుంచిన ఈ టోకెన్లు ఇటీవల బయటపడ్డాయి. ఇప్పుడు వీటిని వేలం వేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్ ప్రారంభ సమయంలో ఈ 50 టోకెన్లను తయారు చేశారు. కొందరు వాటిని వినియోగించారు. మరికొందరు విక్రయించారు. ఈ నేపధ్యంలో అనేక నకిలీ టోకెన్లు కూడా తయారయ్యాయట. విల్ట్‌షైర్‌లోని హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్ వేలం హౌస్‌లో ఈ టోకెన్లు విక్రయిస్తున్నట్లు వేలం హౌస్ ప్రతినిధి మీడియాకు తెలిపారు. 1766లో థియేటర్ వాటాదారు విలియం జోన్స్‌కు టోకెన్ నంబర్ 35ను జారీ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 1815 నాటికి ఇది ప్రముఖ బ్రిస్టల్ బ్లూ గ్లాస్ తయారీదారు అయిన జాన్ వాధమ్ దగ్గరకు చేరింది. ఈ టోకెన్ ఇప్పటికీ ఈ కుటుంబం వద్ద ఉంది. మరో టోకెన్ అష్టన్ కోర్ట్‌కు చెందిన స్మిత్ కుటుంబం దగ్గరుంది. వేలం నిర్వహిస్తున్న సంస్థ ఒక టోకెన్ ధరను 2,500 పౌండ్లు అంటే సుమారు రూ. 2.51 లక్షలుగా నిర్ణయించింది. బ్రిస్టల్ ఓల్డ్ విక్ థియేటర్ ప్రతినిధి మాట్లాడుతూ మేము ఈ టోకెన్ల వినియోగానికి అనుమతిస్తాం. వారికి జీవితాంతం ఉచితంగా సినిమాలు చూసే అవకాశాన్ని కల్పిస్తాం. కాగా ఈ థియేటర్‌ను ‘థియేటర్ రాయల్’ అని పిలుస్తారు దీనిని కింగ్ స్ట్రీట్‌లో 1764-1766 మధ్య కాలంలో నిర్మించారు. ఇది కూడా చూడండి: 21 ఏళ్లకు యాసిడ్ బాధితురాలికి న్యాయం! -
రిలీజ్‌కు ముందు హైకోర్టుకు లియో మేకర్స్.. ఎందుకంటే?
కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కాంబోలో వస్తోన్న చిత్రం లియో. ఈ మూవీలో హీరోయిన్గా త్రిష నటించింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం దసరా సందర్భంగా ఈనెల 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదివరకే ట్రైలర్ రిలీజ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేషమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. మూడు రోజుల్లో సినిమా రిలీజవుతుండగా.. తాజాగా చిత్రబృందం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. (ఇది చదవండి: ఎప్పుడు పిలుస్తారా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: సాయి పల్లవి) తమిళనాడులో సినిమా విడుదలైన మొదటి రోజు తెల్లవారుజామున 4 గంటలకు సినిమాను ప్రదర్శించేందుకు అనుమతించాలని లియో మేకర్స్ పిటిషన్ దాఖలు చేశారు. అంతే కాకుండా అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 24 వరకు ఉదయం 7 గంటలకు లియో షోలను అనుమతించాలని నిర్మాతలు కోర్టును అభ్యర్థించారు. కాగా.. చిత్ర నిర్మాతల పిటిషన్‌పై అక్టోబర్ 17న విచారణ చేపట్టనున్నట్లు మద్రాస్ హైకోర్టు వెల్లడించింది. అదనపు షోలకు అనుమతి అయితే ఇప్పటికే లియో చిత్రానికి తమిళనాడు ప్రభుత్వం మొదటి ఆరు రోజుల పాటు ఒక అదనపు షో ప్రదర్శనకు అనుమతి మంజూరు చేసింది. ఈ సినిమా మొదటి షోకు ప్రదర్శనకు ఉదయం 9 గంటలకు మాత్రమే ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు. కాగా.. ఇప్పటికే రిలీజైన లియో ట్రైలర్ రికార్డ్ స్థాయి వ్యూస్‌తో సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో విజయ్ దళపతి మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. 2021లో విడుదలైన మాస్టర్ తర్వాత లోకేశ్ కనగరాజ్, విజయ్‌ల కాంబినేషన్లో వచ్చిన రెండో చిత్రం లియో. ఈ చిత్రంలో సంజయ్ దత్, అర్జున్ సర్జా, హెరాల్డ్ దాస్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, మిస్కిన్, మాయ ఎస్ కృష్ణన్, మాథ్యూ థామస్, మన్సూర్ అలీ ఖాన్, ప్రియా ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. (ఇది చదవండి: నీచమైన బతుకులు, మానసికంగా చంపుతున్నారు.. ఏడ్చేసిన అమర్ తల్లి) -
ఆ ఓటీటీ షోలు చూస్తే డబ్బులే డబ్బులు! స్నాక్స్ ఖర్చు కూడా..
ఇటీవల ఓటీటీలకు ప్రేక్షకుల ఆదరణ బాగా పెరిగింది. చాలా సినిమాలు, షోలు ప్రత్యేకంగా ఓటీటీల్లోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి. ముఖ్యంగా నెట్‌ఫ్లిక్స్ (Netflix)కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఓటీటీ స్ట్రీమింగ్ అయ్యే షోలకు కోట్లాది మంది ప్రేక్షకులు ఉన్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత జనాదరణ పొందిన షోలను వీక్షించే ఒక అదృష్ట అభిమాని 2,500 డాలర్లు (రూ.2.07 లక్షలు) గెలుచుకోవచ్చు. ఆన్లైన్ క్యాసినోస్ అనే సంస్థ ఈ ఆఫర్ అందిస్తోంది. సెప్టెంబర్ 25న నేషనల్ బింజ్ డే నాటికి విజేతను ఎంపిక చేయనుంది. విజేతకు పేమెంట్ రూపంలో 2,000 డాలర్లు (రూ.1.65 లక్షలు) అందిస్తారు. అలాగే స్నాక్స్ ఖర్చు కోసం మరో 500 డాలర్లు (రూ.41,000) చెల్లిస్తారు. దీంతోపాటు ఒక వేళ నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ లేకపోతే అదికూడా ఉచితంగానే అందిస్తారు. (ఈ కంపెనీల్లో సంతోషంగా ఉద్యోగులు.. టాప్ 20 లిస్ట్! ఐటీ కంపెనీలదే హవా..) నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే మూడు అత్యంత ప్రజాదరణ పొందిన షోలు ‘స్క్విడ్ గేమ్’ (Squid Game), ‘స్ట్రేంజర్ థింగ్స్’ (Stranger Things), ‘వెనస్డే’(Wednesday)లను వీక్షించడానికి విజేతకు ఒక నెల సమయం ఉంటుంది. ఈ సమయంలో ఒక్కో షోకు రేటింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కసారికి ఎన్ని ఎపిసోడ్లు చూస్తున్నారు.. వీక్షిస్తున్నప్పుడు పరధ్యానానికి గురవుతున్నారా.. మళ్లీ ఎలా తిరగి షోలో నిమగ్నమవుతున్నారు..వంటి ప్రమాణాలను ఉపయోగించి ప్రతి షోకి 10కి స్కోర్ ఇవ్వమని అడుగుతారు. మూడు ప్రోగ్రామ్‌లలో మొత్తం 51 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇవన్నీ వీక్షించడానికి సుమారు 50 గంటలు పడుతుంది. విజేతను సెప్టెంబర్ 25 నాటికి ఎంపిక చేసి మొదటగా నెట్‌ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్, స్నాక్స్ ఖర్చు కోసం 500 డాలర్లు అందిస్తారు. నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమయ్యే మూడు షోలపై రివ్యూలను సమర్పించడానికి అక్టోబర్ 25 వరకు సమయం ఉంటుంది. ఇదంతా పూర్తయ్యాక చివరగా 2,000 డాలర్లు అందిస్తారు. -
సర్ఫింగ్ ఆటలో ఇవాంక.. మియామీ తీరంలో అలలపై ఆటలు..
న్యూయార్క్: సర్ఫింగ్‌పై తనకున్న ఇష్టాన్ని మరోసారి చాటుకున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్. సోమవారం తన అద్భుతమైన వేక్బోర్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కనిపించారు. మయామి బీచ్ తీరంలో అలలపై స్వారీ చేస్తున్న వీడియోను ఇవాంక తన ఇన్‌స్టా పోస్టులో పంచుకున్నారు. ఇవాంక వెంటే పడవలో కూర్చున్న ఆమె ఏడేళ్ల కుమారుడు థియో ఆనందంగా కేరింతలు కొడుతూ కనిపించారు. View this post on Instagram A post shared by Ivanka Trump (@ivankatrump) పసుపు రంగు వన్-పీస్ స్విమ్‌సూట్, బ్లాక్ లైఫ్ జాకెట్, బేస్ బాల్ క్యాప్ ధరించారు ఇవాంక. నల్లటి స్విమ్‌సూట్‌లో సర్ఫ్బోర్డ్ను పట్టుకుని, కోస్టారికాలోని బీచ్‌లో చెప్పులు లేకుండా షికారు చేస్తున్న మరొక చిత్రాన్ని కూడా గతంలో షేర్ చేశారు. సర్ఫింగ్‌తో పాటు మిగిలిన అవుట్ డోర్ గేమ్స్‌లలో కూడా ఇవాంక పాలుపంచుకుంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు తర్వాత ఇన్‌స్టాలో ఆమె పోస్టు చేయడం ఇదే మొదటిసారి. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై ఆమె చాలావరకు సైలెంట్‌గానే ఉన్నారు. తన తండ్రి ఎన్నికల ప్రచారంలో తాను పాలుపంచుకోనని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. తన తండ్రి అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఇవాంక తన వ్యక్తిగత కుటుంబానికి సమయం అవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. View this post on Instagram A post shared by Ivanka Trump (@ivankatrump) 2024 ఎన్నికల్లో ఇవాంక తండ్రి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ పార్టీ నుంచి పోటీ చేయదలచిన అభ్యర్థుల్లో ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు. అయితే.. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయన ఇటీవల జైలుకు కూడా వెళ్లారు. ఇదీ చదవండి: మాస్కోకు నార్త్ కొరియా కిమ్.. పుతిన్‌తో రహస్య భేటీ? -
వాగ్నర్ చీఫ్ విమానం పేలుడు.. వీడియో వైరల్
పుతిన్ ఒకప్పటి సన్నిహితుడు, రష్యాలో తిరుగుబాటు ఎగరేసిన కిరాయి సైన్యం గ్రూప్ వాగ్నర్ చీఫ్ యెవ్జెనీ ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో మరణించారు. అయితే.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై తిరుగుబాటు చేసిన రెండు నెలల్లోనే ఆయన మృతి చెందడం అనుమానాలకు తావిస్తోంది. ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని అమెరికా నిఘా సంస్థ నుంచి గతంలోనే హెచ్చరికలు వచ్చాయి. పుతిన్ ప్రత్యర్థులందరూ తెరిచి ఉన్న కిటికీల నుంచి జారిపడ్డారని, ఈ క్రమంలో కిటికీలకు దూరంగా ఉండాలనే స్థాయిలో సూచనలు వచ్చాయి. అయినప్పటికీ ధైర్యంగా రష్యాలోనే తిరుగుతున్న ప్రిగోజిన్.. ఇంతలోనే విమాన ప్రమాదంలో మరణించారు. 🚨#BREAKING: Wagner chief Prigozhin has died along with 10 other passengers on the jet that just crashed in Russia's Tver region pic.twitter.com/4kPLrsGANb — R A W S A L E R T S (@rawsalerts) August 23, 2023 30 సెకన్లలోనే.. ప్రిగోజిన్ ప్రాణాలు కోల్పోయిన విమాన ప్రమాదం మాస్కోకు మాస్కోకు 100 కిలోమీటర్ల దూరంలో త్వెర్ ప్రాంతంలో జరిగింది. సవ్యంగా సాగుతున్న విమాన ప్రయాణం అప్పటివరకు బాగానే ఉన్నా.. కేవలం 30 సెకన్ల వ్యవదిలోనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఆకాశం నుంచి విమానం పొగలు వెదజల్లుతూ కిందకు పడుతున్న దృశ్యాలు తాజాగా వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదంలో ఎవరూ బతికే అవకాశాలు లేవని అధికారులు తెలిపారు. అందులో ప్రిగోజిన్ కూడా ఉన్నట్లు స్పష్టం చేశారు. పుతిన్‌పై తిరుగుబాటు.. ఉక్రెయిన్‌పై.. సైనిక చర్యలో భాగంగా కొన్నాళ్లు రష్యా సైనిక బలగాలకు అండగా ఉన్న ప్రిగోజిన్.. జూన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్, ఆయన ప్రభుత్వంపై ఎదురుతిరిగారు. పుతిన్ సైనిక నాయకత్వాన్ని కూలదోసేందుకు.. అన్ని చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా.. రష్యా ఉలిక్కిపడింది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో మధ్యవర్తిత్వంతో వాగ్నర్ బృందాల తిరుగుబాటుకు తెరపడింది. ఎవరీ ప్రిగోజిన్..? రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే ప్రిగోజిన్‌ను.. పుతిన్ షెఫ్‌గా వ్యవహరిస్తుంటారు. 1980ల్లో దొంగతనం, దోపిడీ కేసుల్లో ప్రిగోజిన్ దాదాపు 9 ఏళ్ల జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చారు. 1990ల్లో పుతిన్‌కు-ప్రిగోజిన్‌కు పరిచయం ఏర్పడింది. 2000లో పుతిన్ రష్యా అధ్యక్షుడు అయ్యారు. మరోవైపు.. ప్రిగోజిన్ రెస్టారెంట్లు ఇతర వ్యాపారాలను విస్తరించారు. 2001 నుంచి పుతిన్ సన్నిహిత వర్గాల్లో ప్రిగోజిన్ కనిపిస్తూనే ఉన్నాడు. రష్యా ప్రభుత్వానికి చెందిన సైనిక, పాఠశాల ఫుడ్ కాంట్రాక్టులు ఇతనికే దక్కాయి. ఆ తర్వాత 2014లో వాగ్నర్ పీఎంసీ నిర్వహణలో ప్రిగోజిన్ పాత్ర కూడా బయటకు వచ్చింది. ఇదీ చదవండి: ‘వాగ్నర్’ చీఫ్ ప్రిగోజిన్ ప్రాణాలకు ముప్పు -
నాకు ఆ సినిమా గుర్తొస్తుంది..హర్ష్ గోయెంకా ఆసక్తికర వ్యాఖ్యలు!
షార్క్ ట్యాంక్ ఇండియా..! ప్రతిభావంతులైన ఎంట్రప్రెన్యూర్లను వెలుగులోకి తెచ్చేందుకు సోనీ ఎంటర్టైన్మెంట్ నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. అమెరికాలో విజయవంతమైన ‘షార్క్ ట్యాంక్ షో’ దీనికి స్ఫూర్తి. ఇలాంటి షోలు ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వరకు ఉన్నాయి. అన్ని చోట్లా ప్రజలకు ఉపయోగపడే ఆవిష్కరణలకే అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికే ఈ షో మొదటి సీజన్ 2021లో విజయవంతంగా ముగిసింది. ఇప్పుడు షార్క్ ట్యాంక్ ఇండియా రెండో సీజన్ ప్రారంభమైంది. అయితే విమర్శకుల నుంచి ప్రశంసలు పొందుతున్న ఈ కార్యక్రమంపై భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, ఆర్పీజీ గ్రూప్ ఛైర్మన్ హర్ష్ గోయెంకా ఆసక్తకిర వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్ని షో జడ్జ్ అనుపమ్ మిట్టల్ ఖండించారు. హర్ష్ గోయెంకా ఏమన్నారంటే? ఎప్పుడూ మోటివేషన్, లేదా రోజూ వారి సామాజిక మాద్యమాల్లో జరిగే ఘటనల గురించి మాట్లాడే హర్ష్ గోయెంకా.. ఈ సారి రూటు మార్చారు. షార్క్ ట్యాంక్ షో జడ్జెస్ గురించి, వాళ్లు చేసే బిజినెస్ గురించి స్పందించారు. దేశానికి చెందిన స్టార్టప్‌లు పెద్దమొత్తంలో నష్టపోతున్నాయంటూ.. వారి నష్టాన్ని 1975లో విడుదలైన అడ్వంచర్ అండ్ థ్రిల్లర్ హాలీవుడ్ మూవీ జాస్‌తో పోల్చారు. ఎప్పుడైనా సరే థింక్స్ ఆఫ్ షార్క్స్ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు నిజమనేలా కంపెనీల లాభ నష్టాల డేటా స్క్రీన్ షాట్లను షేర్ చేశారు. వాటిల్లో 2022 ఆర్ధిక సంవత్సరంలో బోట్ కంపెనీ అధినేత అమన్ గుప్త రూ.79 కోట్ల లాభం గడించారు. కార్ దేకో కోఫౌండర్ అమిత్ జైన్ రూ. 246 కోట్లు లాస్ అయ్యారు. లెన్స్ కార్ట్ 102 కోట్లు, షాదీ. కామ్ రూ.27 కోట్లు, సుఘర్ కాస్మోటిక్స్ అధినేత వినీత్ సింగ్ రూ.75కోట్లు నష్టపోయారని ఆ స్క్రీన్ షాట్లను షేర్ చేయగా.. షార్క్ ట్యాంక్ ఇండియా షోని నేను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ప్రతిభావంతులైన ఎంట్రప్రెన్యూర్లను వెలుగులోకి తెస్తుంది’. కానీ నేను షార్క్‌ల గురించి ఆలోచించినప్పుడల్లా, 'జాస్' సినిమా, ఆ సినిమాలోని రక్త పాతం గుర్తుకు వస్తుందని అన్నారు. పక్షపాతంగా, అర్ధరహితంగా ఆ ట్వీట్‌పై షార్క్ ట్యాంక్ జడ్జ్ షాది.కామ్ ఫౌండర్, అనుపమ్ మిట్టల్ స్పందించారు. సార్ మీరు దానిని హాస్యాస్పదంగా చెప్పారని అనిపిస్తుంది. మీరు పక్షపాతంగా, అసంపూర్ణంగా ఉండే అంశాలపై ప్రతిస్పందించారని నేను భావిస్తున్నాను. కానీ మీలాగే..సొరచేపలు నష్టాల్ని కాకుండా లాభాల్ని తెచ్చిపెడుతున్నాయంటూ చమత్కరించారు. I enjoy #SharkTankIndia as a program and I think it is a great platform for our budding entrepreneurs. 1 But whenever I think of sharks, I think of the movie ‘Jaws’ and bleeding 🩸! pic.twitter.com/LAmGxQOiU8 — Harsh Goenka (@hvgoenka) January 22, 2023 I know you meant it in jest so with all due respect sir, I think u reacted to what appears to be superficial, biased & incomplete data. Happy to learn from stalwarts, but just to clarify, like u, the sharks 🦈 don’t bleed red, we bleed blue 🇮🇳 & that’s why we do what we do 🤗 — Anupam Mittal (@AnupamMittal) January 24, 2023 -
మరోసారి మానవత్వాన్ని చాటుకున్న సీఎం వైఎస్ జగన్
-
వైరల్ వీడియో: పిల్ల సింహం గర్జన ఎలా ఉంటుందో తెలుసా ..!
-
ఈ స్టార్ కమెడియన్ ఒక మిలియనీర్ !.. ఆస్తులు ఎంతంటే ?
Kapil Sharma Will Become Millionaire With His Shows: బీటౌన్‌లో మోస్ట్ పాపులర్ కమెడియన్లో కపిల్ శర్మ ఒకరు. ఆయన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెడీ నైట్స్ విత్ కపిల్ శర్మతో స్టార్ కమెడియన్‌గా మారాడు. బాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినా కపిల్ షోకి వచ్చి ప్రమోట్ చేసుకోవాల్సిందే అన్నంత రేంజ్లో కపిల్ విజయం సాధించాడు. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లో భాగంగా కపిల్ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ స్టార్ కమెడియన్‌పై త్వరలో బయోపిక్ కూడా రానుంది. కపిల్ శర్మపై వస్తోన్న ఈ బయోపిక్ చిత్రానికి 'ఫంకార్' అని టైటిల్ పెట్టారు. దీనికి మహావీర్ జైన్ నిర్మాతగా వ్యవహరించగా మృగ్ధీప్ సింగ్ లంబ దర్శకత్వం చేయనున్నారు. ఇదిలా ఉంటే పలు నివేదికల ప్రకారం కపిల్ శర్మ మొత్తం ఆస్తులు రూ. 242 కోట్లు అని తెలుస్తోంది. నెలకు రూ. 3 కోట్లకుపైగా సంపాదిస్తున్నాడట కపిల్. కపిల్ శర్మ తన నెల మొత్తం సంపాదనతో ఒక లక్జీరియస్ ఇల్లు కొనగలడని సమాచారం. ఇప్పటికే కపిల్ శర్మ ఇల్లు ముంబైలోని చాలా పాష్ ఏరియాలో ఉందట. ఇంతేకాకుండా అతను టీవీ ఎపిసోడ్ కోసం రూ. 40 నుంచి 90 లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం. కపిల్ శర్మకు దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ ఆస్తులున్నాయట. ఇవికాకుండా మెర్సిడెస్ బెంజ్, వోల్వో ఎక్స్‌సీ 90, రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్డీ4 వంటి ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి. ఇవన్ని చూస్తుంటే ఈ స్టార్ కమెడియన్ ఒక రకంగా మిలియనీర్ అని బాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. ఇటీవలే ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో 'ఐయామ్ నాట్ డన్ ఎట్' షోకు హోస్ట్‌గా కూడా చేస్తున్నాడు కపిల్. -
మోదీ..కరుణించేనా..?
సంగారెడ్డి రోడ్డు విస్తరణకు నిధులు రాబట్టేందుకు సర్కార్ యత్నం నేడు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నివేదించునున్న ప్రభుత్వం భువనగిరి చిట్యాల– సంగారెడ్డి రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించేందుకు కేంద్రం నుంచి నిధులు రాబట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ఆదివారం మెదక్ జిల్లా గజ్వేల్ నియోజకవర్గానికి వస్తున్న సందర్భంగా చిట్యాల– సంగారెడ్డి రోడ్డు విస్తరణకు నిధులు ఇవ్వాలని విన్నవించనున్నారు. దీంతోపాటు నల్లగొండ, మెదక్ జిల్లాల వాహనాలతో పాటు, ఇతర రాష్ట్రాలకు చెందిన వాహనాలు వెళ్తున్న చిట్యాల– భువనగిరి–గజ్వేల్–సంగారెడ్డి రోడ్డును జాతీయ రహదారిగా ప్రకటించాలని ప్రధానిని కోరనున్నారు. ఐదేళ్ల క్రితమే ప్రతిపాదనలు.. మూడు జాతీయ, మూడు రాష్ట్ర రహదారులను కలుపుతూ అంతర్జిల్లా వ్వాపార వాణిజ్య అవసరాలకు ప్రధాన మార్గంగా ఉన్న భువనగిరి–గజ్వేల్– తూప్రాన్–సంగారెడ్డి లింక్ రోడ్డును నాలుగులేన్లుగా మార్చాలనే ప్రతిపాదనలు ఐదేళ్ల క్రితమే చేశారు. ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ రహదారిని చేపట్టాలని సంకల్పించి, పలుమార్లు ట్రాఫిక్ సర్వే చేసి కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు. ఉమ్మడి ఏపీలో మంజూరు కాని ఈ రోడ్డు స్వరాష్ట్రంలో మంజూరు చేయించుకోవడానికి అధికారులు నివేదికను రూపొందించారు. మూడుసార్లు ప్రకటనలు.. జిల్లాలోని చిట్యాల నుంచి గజ్వేల్ మీదుగా సంగారెడ్డి వరకు 170 కి.మీల పొడవున ఉన్న ఈ లింక్ రోడ్డు 163, 44, 65 మూడు జాతీయ రహదారులతో పాటు రాజీవ్ రహదారి హైదరాబాద్–మెదక్, సంగారెడ్డి రూట్లలో మరో మూడు రాష్ట్ర ర హదారులను కలుపుతుండటం వల్ల వ్వాపార, వాణిజ్య అవసరాలకు ప్రధాన మార్గంగా మారింది. దక్షిణ, ఉత్తర భారతదేశాల మధ్యన నడిచే వ్యాపార, వాణిజ్య వాహనాలకు ఈ రోడ్డు ద్వారా చాలా దూరాభారం తగ్గుతుంది. దీంతో పాటు రాజధాని హైదరాబాద్‌పై వాహనాల భారం పడకుండా నేరుగా సమయం అదా అయ్యే అవకాశం ఉంది. ఈ రోడ్డును పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్) కింద నాలుగు లేన్లుగా మార్చడానికి ఇప్పటివరకు మూడుసార్లు ప్రకటన వెలువడింది. ఈ క్రమంలోనే పలుమార్లు ఈ రోడ్డుపై ట్రాఫిక్ సర్వే కూడా పూర్తి చేశారు. కానీ కార్యాచరణకు అమలుకు నోచుకోలేదు. ప్రధాని పర్యటనలోనైనా రోడ్డు విస్తరణకు మోక్షం లభించే అవకాశం కోసం జిల్లా వాసులతో పాటు అధికారులు ఎదురు చూస్తున్నారు. -
ఇకపై నేర కథనాలను చూపకూడదు!
ఇస్లామాబాద్ః ఎలక్ట్రానిక్ మీడియాలో కాల్పనిక నేర వార్తలు, కథనాల ప్రసారానికి పాకిస్తాన్ ఎలక్ట్రానిక్ మీడియా రెగ్యులేటరీ అథారిటీ (పెమ్రా) అడ్డుకట్ట వేసింది. అత్యాచారాలు, హత్యలు, చోరీలు, ఆత్మహత్యల వంటి నేరాలను నాటక రూపంలో ప్రదర్శించడంపైనా నిషేధం విధిస్తూ ప్రకటన జారీ చేసింది. శుక్రవారం జరిగిన పెమ్రా సదస్సులో ప్రసంగించిన ఛైర్మన్ అబ్సర్ ఆలం... ఆత్మహత్యలు, హత్యలు వంటి నేరాలను ప్రత్యేక షోలుగా ప్రసారం చేయడం, నాటక రూపంలో ప్రదర్శించడాన్ని నిషేధించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. అంతేకాక పరిశోధనాత్మక జర్నలిజం పేరుతో రైడ్ ప్రాంతాలను కూడ చూపించకూడదన్న నిబంధనను వచ్చే నెలనుంచి విధించనున్నట్లు తెలిపారు. ఛానెల్స్ ప్రసారం చేసే అత్యాచారం, ఆత్మహత్యల కేసుల్లో బాధిత కుటుంబాలకు సబంధించిన సభ్యుల పేర్లను ప్రస్తావించకూడదని, ప్రత్యేక ఇంటర్వ్యూలను కూడ ప్రసారం చేయకూడదని పెమ్రా ఛైర్మన్ తెలిపారు. అటువంటి ప్రదర్శనలు, కార్యక్రమాలపై వీక్షకులు పలుమార్లు ఫిర్యాదు చేస్తున్నారని, ఆ కథనాల వల్ల యువత వ్యూహాత్మకంగా కొత్త తరహా నేరాలకు పాల్పడటం నేర్చుకుంటున్నారన్న అభ్యంతరాలు వ్యక్తమవుతుండటంతో తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్టాండింగ్ సెనేట్ కమిటీలు వేసిన ఓ పిటిషన్ విచారణ సందర్భంగా నేరాలను తిరిగి చూపడం నిషేధించాలని లాహోర్ హైకోర్టు ఆదేశించింది. టీవీ షోల్లో నేర కథనాల ప్రసారం విషయంలో పంజాబ్ అసెంబ్లీ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కూడ ఆమోదించినట్లు తెలిపింది. ప్రస్తుతం పరిశోధనాత్మక జర్నలిజంపై కూడ దృష్టి పెట్టామని, దానికి సంబంధించిన నియమ నిబంధనలతో త్వరలో ఛానెల్స్ కు నోటిఫికేషన్ అందించనున్నట్లు పెమ్రా తెలిపింది. -
విషాద రాగం
ఫొటో స్టోరీ కాంతులు నిండాల్సిన కళ్లల్లో నీరు పొంగి పొర్లుతోంది. చురుకుతనం ఉండాల్సిన చూపుల్లో దైన్యత చోటు చేసుకుంది. పాలుగారాల్సిన ముఖం కన్నీటి వరదలో తడిసి ముద్దయ్యింది. హుషారుగా కదలాల్సిన చేతులు వాయులీనపు తీగెలపై విషాద రాగాలను వాయిస్తున్నాయి. ఆ దృశ్యం చూసిన ఎవరి మనసైనా చలించకుండా ఉంటుందా? ఆ చిట్టితండ్రి బాధ చూసినవారెవరి కన్నయినా చెమ్మగిల్లకుండా ఉంటుందా?! బ్రెజిల్‌కి చెందిన ఈ చిన్నారి పేరు... డీగో ఫ్రాజో టార్క్వాటో. పేదరికంలో పుట్టాడు. బాధల్లో పెరిగాడు. అలాంటి సమయంలో వారి ప్రాంతానికి జాన్ ఎవాండ్రో డిసిల్వా అనే వ్యక్తి వచ్చాడు. ఆయన డీగో లాంటి పిల్లలందరినీ చేరదీశాడు. వారికి అండగా నిలిచాడు. సంగీతం నేర్పించాడు. ప్రదర్శనలు ఇప్పించాడు. ఉపాధి మార్గాన్ని ఏర్పరచి పేదరికాన్ని దూరం చేశాడు. కానీ ఆయన ఉన్నట్టుండి అనారోగ్యంతో మరణించాడు. అది తట్టుకోలేకపోయారు ఆ చిన్నారులు. ముఖ్యంగా డీగో కదలిపోయాడు. తమ మాస్టారిని సమాధి చేస్తుంటే తన స్నేహితులతో కలిసి సంగీతాంజలి ఘటించాడు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ఇలా కన్నీటి పర్యంతమయ్యాడు. అంతకన్నా విషాదం ఏమిటంటే... ఇది జరిగిన మూడేళ్లకి డీగో కూడా మరణించాడు... లుకేమియాతో! -
నాటకమే జీవితం..
‘రంగస్థలంపై 53 ఏళ్ల అనుభవం నాది. దాదాపు ఎనిమిదివేల ప్రదర్శనలు ఇచ్చి ఉంటా. ఆత్మతృప్తి కోసం నాటకాన్ని ఇష్టపడతా. భుక్తికోసం సినీ, టీవీ రంగాలపై ఆధారపడక తప్పడం లేదు’ అని తమిళ సినీ, రంగస్థల నటుడు వైజీ మహేంద్రన్ అన్నారు. గవర్నర్ నరసింహన్ తనకు పెద్ద అభిమాని అని, తన డ్రామాలన్నింటినీ సతీసమేతంగా వచ్చి మరీ ఆసక్తిగా తిలకిస్తారని చెప్పారు. తమిళంలో శివాజీ గణేశన్, తెలుగులో అక్కినేని నాగేశ్వరరావు తన అభిమాన నటులని చెప్పారు. మద్రాసు తర్వాత తాను ఎక్కువగా ఇష్టపడే నగరం హైదరాబాదేనని చెప్పారు. భాగ్యనగరంతో తనకు గల అనుబంధంపై మహేంద్రన్ ‘సిటీ ప్లస్’తో పంచుకున్న అనుభూతులు ఆయన మాటల్లోనే... హైదరాబాద్‌తో పాతికేళ్ల అనుబంధం.. హైదరాబాద్‌తో పాతికేళ్ల అనుబంధం నాది. హైదరాబాద్ తర్వాత ఇప్పుడిప్పుడే వైజాగ్‌ను ఇష్టపడుతున్నా. ‘సీతారాముల సినిమాగోల’ టీవీ సీరియల్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చింది. కుటుంబ సభ్యులు మొత్తం కలసి ఆహ్లాదకరంగా పగలబడి నవ్వుతూ నా నాటకాలు చూడాలనేదే నా ఆశయం. అయితే, నాటకాలకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేదు. స్పాన్సర్ల సౌజన్యంతోనే ప్రదర్శనలు చేస్తున్నాం. తమిళనాడులో పాఠశాలలకు రంగస్థలానుబంధం తమిళనాడులో పాఠశాలలకు రంగస్థలంతో అనుబంధం ఉంది. ఆంధ్రాలో ఆ పరిస్థితి ఉన్నట్లు లేదు. హైదరాబాద్‌లో ఇప్పటి వరకు నలభై, వైజాగ్‌లో పది ప్రదర్శనలు చేశాను. తొలిసారిగా 1971లో ‘నవగ్రహం’ సినిమాలో నటించా. హిందీ, తెలుగు, తమిళం, మలయాళాలలో దాదాపు 300 సినిమాల్లో నటించా. ఇటీవల తమిళంలో నిర్మించిన రామానుజన్ సినిమా ఇంగ్లిష్ వెర్షన్లోనూ నటించా. నేను నటించిన వాటిలో ‘రగస్యం... పరమరగస్యం’ నాటకం బాగా పేరు తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకు ఆ నాటకాన్ని 700 సార్లు ప్రదర్శించా. ఇప్పటికీ అందులో కాలేజీ స్టూడెంట్ వేషం నేనే వేస్తా. నటవారసత్వం మా నాన్న వైజీ పార్థసారథి దక్షిణాదిలోనే గొప్ప రంగస్థల నటుడు. నాన్న నుంచే నాకు నట వారసత్వం వచ్చింది. ఆయన స్థాపించిన యునెటైడ్ అమెచ్యూర్ ఆర్టిస్ట్స్ (యూఏఏ) సంస్థ ద్వారానే ఎదిగాను. తమిళనాడు సీఎం జయలలిత కూడా అప్పట్లో యూఏఏ సభ్యురాలే. నాటక రంగానికి చావు లేదు నాటక రంగానికి చావు లేదు. నెలకు యాభై సిని మాలు వస్తున్నాయి. అందులో నిలిచేవి రెండు మూడే. నాటకాలకు మాత్రం ప్రేక్షకాదరణ తగ్గడం లేదు. శ్రీలంక, బ్యాంకాక్, సింగపూర్, మలేసియా, హాంకాం గ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఇంగ్లాండ్, డెన్మా ర్క్, స్వీడన్, అమెరికా, గల్ఫ్ దేశాల్లో నాటకాలు వేశాను. రాజమౌళి డెరైక్షన్‌లో ఒక్కసారైనా..వందల సినిమాలు, వేల డ్రామాల్లో నటించాను కానీ రాజమౌళి డెరైక్షన్‌లో ఒక్క సినిమాలోనైనా నటించాలని నా ఆశ. ..:: కోన సుధాకర్‌రెడ్డి -
కారు.. ఆరు
అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నల్లగొండపై ఇంకా సస్పెన్సే పెండింగులోనే భువనగిరి పొత్తులకు ఇబ్బంది లేకుండా కసరత్తు సాక్షిప్రతినిధి, నల్లగొండ, టీఆర్ఎస్ తొలి జాబితా విడుదలైంది. ఈ ఎన్నికల్లో దాదాపు ఒంటరి పోరాటమే చేసేలా ఉన్న టీఆర్ఎస్ ఎలాంటి ఇబ్బందులు, బహునాయకత్వం లేని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. తెలంగాణ మలి ఉద్యమ తొలి అమరుడు కాసోజు శ్రీకాంతా చారి తల్లి శంకరమ్మకు హుజూర్నగర్ సీటును ఖాయం చేశారు. ముందునుంచీ అంతా ఊహించిన విధంగానే ఆలేరుకు గొంగిడి సునీత, సూర్యాపేటకు గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి పేర్లను ప్రకటించారు. మిర్యాలగూడ - అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, దేవరకొండ - లాలూనాయక్, నకిరేకల్ - వేముల వీరేశం పేర్లను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మొత్తం పన్నెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మరో ఆరు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండు లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థిత్వాలనూ ఖరారు చేయాల్సి ఉంది. చివరి నిమిషంలో ఏ పార్టీతోనైనా పొత్తులు కుదిరినా, ఇబ్బంది లేదనుకున్న స్థానాలకే ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా తొలి జాబితాలోని అభ్యర్థులు, ఆ స్థానాలు తమకు అత్యంత ముఖ్యమైనవని ప్రకటించినట్లయింది. టికెట్ కోసం పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలను పెండింగ్‌లో పెట్టారు. నల్లగొండ నియోజకవర్గంలో ఇన్చార్జ్ చకిలం అనిల్‌కుమార్, దుబ్బాక నర్సింహారెడ్డి మధ్య టికెట్ కోసం పోటీ ఉంది. మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కర్నె ప్రభాకర్ టికెట్ ఆశిస్తున్నారు. భువనగిరిలో ఎలిమినేటి కృష్ణారెడ్డి, కొనపురి రాములు పోటీ పడుతుండగా, ఇటీవలే పార్టీలో చేరిన పైళ్ల శేఖర్‌రెడ్డి సైతం క్యూలో ఉన్నారు. ఆయన శుక్రవారం భువనగిరిలో నామినేషన్ కూడా దాఖలు చేశారు. టికెట్ కోసం ఏమాత్రం పోటీ లేని కోదాడ, నాగార్జునసాగర్ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఇంకా ప్రకటించలేదు. పార్టీ ఆవిర్భావం నుంచి టీఆర్ఎస్తోనే ఉన్న గొంగిడి సునీతకు గత ఎన్నికల్లో అవకాశం దక్కలేదు. అంతకుముందు ఎస్సీ రిజర్వుడు స్థానం కావడం వల్ల రేసులో నిలిచే అవకాశమే రాలేదు. కాగా, పునర్విభజనలో భాగంగా ఆలేరు జనరల్ స్థానమైనా గత ఎన్నికల్లో కళ్లెం యాదగిరిరెడ్డికి అవకాశం ఇవ్వడంతో సునితకు టికెట్ రాలే దు. కానీ ఈసారి మాత్రం తొలి జాబితాలోనే ఆమె పే రును ప్రకటించారు. జిల్లాలో టీఆర్ఎస్ గతంలో ప్రాతినిథ్యం వహించిన ఏకైక స్థానమైన ఆలేరు నుంచి ఆమె అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అధినేత కేసీఆర్‌కు సన్నిహితుడైన పార్టీ అధికార ప్రతినిధి గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి సూర్యాపేట నుంచి పోటీకి దిగుతున్నారు. గత ఎన్నికల్లో ఆయన హుజూర్నగర్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కానీ ఈసారి సూర్యాపేటపై మొదటి నుంచి దృష్టి పెట్టి ఏర్పాట్లు చేసుకున్నారు. పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యుడిగా ఉన్న డాక్టర్ చెరుకు సుధాకర్‌ను పక్కన పెట్టి మరీ నకిరేకల్ ఇన్చార్జిగా అవకాశం ఇచ్చిన వేముల వీరేశానికి టికె ట్ ప్రకటించారు. ఇటీవలే సుధాకర్ పార్టీని వీడారు. ఆ ప్రభావం పార్టీపై పడకుండా ముందు జాగ్రత్తగా తొలి జాబితాలో నకిరేకల్‌ను చేర్చారు. గత ఎన్నికల్లో పీఆర్పీ అభ్యర్థిగా మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఓటమిపాలైన అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి ఆ తర్వాత టీఆర్ఎస్లో చేరారు. ఆయన మిరాల్యగూడ ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. కాగా, తొలి జాబితాలో అవకాశం దక్కించుకున్నారు.కొద్దిరోజుల కిందటి దాకా ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేసిన లాలూ నాయక్ ఇటీవలే ఉద్యోగానికి రాజీనామా చేయడంతో ఆయనకు దేవరకొండ టికెట్‌ను ప్రకటించారు. గతంలో లాలూనాయక్ భార్య టీడీపీ తరపున దేవరకొండ ఎంపీటీసీ సభ్యురాలిగా పనిచేశారు. టీఆర్ఎస్లో చేరిన వారి కుటుంబం ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్‌ను దక్కించుకుంది. -
కరుణించు..మేరీమాత
విజయవాడ, న్యూస్‌లైన్ : గుణదల మేరీమాత ఉత్సవాల మొదటిరోజు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. విజయవాడ కథోలిక పీఠం గురువులు లాంఛనప్రాయంగా ఉత్సవాలను ప్రారంభించగా, బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వేదికపై ఉదయం 7 గంటలకు తొలి సమష్టి దివ్యబలి పూజ సమర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గుడివాడ విచారణ జుబిలేరియన్ గురువు ఫాదర్ గూడా మెల్కియార్ రాజు ప్రథమ సందేశాన్ని అందించారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు మేరీమాత ఆశీస్సులతో క్షేమంగా జీవించాలని ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పుణ్యక్షేత్ర గురువులు సమష్టి దివ్యబలిపూజ సమర్పించారు. అనంతరం భక్తులకు దివ్యసత్ప్రసాదాన్ని అందజేశారు. గురుత్వసేవలో 25 సంవత్సరాలు పూర్తిచేసుకున్న ఫాదర్ గూడా మెల్కియార్రాజును సన్మానించారు. ఈ కార్యక్రమంలో పుణ్యక్షేత్ర రెక్టర్ ఫాదర్ మెరుగుమాల చిన్నప్ప, సోషల్ సర్వీస్ సెంటర్ డెరైక్టర్ ఫాదర్ మువ్వల ప్రసాద్, చాన్సలర్ ఫాదర్ జె.జాన్‌రాజు, ఫాదర్ వెంపని, కథోలిక నాయకులు మద్దాల అంతోని, వడ్లపాటి డేవిడ్‌రాజు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మేరీమాత తేరు ప్రదక్షిణ వైభవంగా జరిగింది. మాజీ మంత్రి దేవినేని నెహ్రూ, యువజన నాయకుడు దేవినేని అవినాష్ ముఖ్యఅతిథులుగా పాల్గొని ప్రదక్షిణను ప్రారంభించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం మేరీమాత స్వరూపాన్ని గుణదల పురవీధులైన లూర్దునగర్, బెత్లహాంనగర్ తదితర ప్రాంతాల్లో ఊరేగించారు. సాయంత్రం ఆరు గంటలకు ఫాదర్ గోరంట్ల జాన్నేసు సమష్టి దివ్యబలిపూజ సమర్పించారు. భక్తుల వెల్లువ ఆదివారం సెలవు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. ప్రధానాలయం నుంచి కాలినడకన మేరీమాత స్వరూపం వద్దకు చేరుకున్న భక్తులు అక్కడ అమ్మను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండ శిఖరాగ్రాన ఉన్న ఏసుక్రీస్తు శిలువ వద్దకు చేరుకుని కొవ్వొత్తులు వెలిగించారు. సాయంత్రానికి భక్తుల రద్దీ మరింత పెరిగింది. మొదటిరోజు దాదాపు రెండు లక్షల మంది భక్తులు దర్శనానికి వచ్చారని ఉత్సవ కమిటీ అంచనా వేసింది. ఏర్పాట్లు భేష్ ఉత్సవ కమిటీ చేసిన ఏర్పాట్లపై భక్తులు ప్రశంసలు కురిపించారు. బిషప్ గ్రాసీ పాఠశాల ఆవరణలోని చలువ పందిళ్లలో ఒకేసారి చాలామంది భక్తులు సేదతీరారు. ఎండలు పెరుగుతున్న దృష్ట్యా తాగునీటి సౌకర్యం ఎక్కువగా కల్పించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ నిర్వహించారు. అన్ని ప్రాంతాల్లోనూ బాంబ్ స్క్వాడ్ బృందాలు నిరంతరం తనిఖీలు చేపట్టాయి. ఆకట్టుకున్న బైబిల్ ప్రదర్శన ఉత్సవాల్లో భాగంగా బిషప్ గ్రాసీ పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన బైబిల్ ప్రదర్శన భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మేరీమాత దర్శనాలు, ఏసుక్రీస్తు జననం, పది ఆజ్ఞలు పొందిన మోషే భక్తుడి చరిత్ర వంటి అంశాలతో కూడిన ప్రదర్శనను భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. దేవదూత ప్రత్యక్షమై మేరీమాతకు ఏసుక్రీస్తు జన్మిస్తాడని ప్రకటించే ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఏసుక్రీస్తుకు శిష్యుడైన పేతురు జీవితంలో ఎదురైన ‘పడవలో చేపలు పట్టు అనుభవం’ అంశాన్ని వివరిస్తూ ప్రదర్శనను చూడచక్కగా ఏర్పాటుచేశారు. -
మేరీమాత ఉత్సవాలకు సర్వం సిద్ధం
విజయవాడ, న్యూస్‌లైన్ : గుణదల పుణ్యక్షేత్రంలో మూడురోజుల పాటు జరిగే మేరీమాత ఉత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 7 గంటలకు విజయవాడ కథోలిక పీఠం పాలనాధికారి బిషప్ గోవింద్ జోజి, పుణ్యక్షేత్ర గురువులు తొలి సమిష్టి దివ్య బలి పూజ చేయడంతో ఉత్సవాలు మొదలవుతాయి. తిరునాళ్లకు లక్షలాదిగా హాజరయ్యే భక్తుల సౌకర్యార్థం ఉత్సవ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మేరీమాత ఆలయాన్ని రంగు రంగుల తోరణాలు, విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ప్రధానంగా బిషప్‌గ్రాసి పాఠశాల ఆవరణలో జరిగే సమిష్టి దివ్యబలి పూజ కార్యక్రమాలకు హాజరవుతారు. ఇక్కడ భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పుణ్యక్షేత్ర పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచే నిమిత్తం కార్పొరేషన్ అధికారులు దాదాపు 150 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు. ఆలయ కమిటీ వారు మరో 150 మందిని ఏర్పాటు చేశారు. వీరంత వివిధ షిఫ్టుల్లో 24 గంటల పాటు తమ సేవలందిస్తారు. బిషప్ గ్రాసి ఆవరణ, ప్రధానాలయం వద్ద దాదాపు 6 ప్రదేశాలలో మంచి నీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేశారు.గుణదల వంతెన వద్ద గల బూస్టర్ నుంచి నీటి ట్యాంకుల ద్వారా మంచినీరు సరఫరా చేయనున్నారు. ఇందుకోసం దాదాపు 80 మంది సిబ్బంది పనిచేస్తారు. శాంతి భద్రతలు పరిర క్షించేందుకు పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టారు. పుణ్యక్షేత్ర పరిసరాలన్నిటితో పాటు కొండ శిఖరాగ్రం వరకు అన్ని ప్రదేశాలలో పోలీస్ గస్తీ ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పోలీసు బలగాలను మోహరించారు. మూడు రోజులపాటు రాత్రి పగలు సేవలందించే దిశగా పోలీసులు మూడు షిఫ్టుల్లో డ్యూటీ చేయనున్నారు. ఏలూరు రోడ్డు పై భక్తులకు అసౌకర్యం ఏర్పడకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. దాదాపు 1200 మంది పోలీసు సిబ్బంది, అధికారులు విధులు నిర్వహించనున్నారు. పుణ్యక్షేత్రంలోని ప్రధానాలయం, బిషప్‌గ్రాసి ప్రాంగణాలలో ఉచిత వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు.