సర్ఫింగ్ ఆటలో ఇవాంక.. మియామీ తీరంలో అలలపై ఆటలు.. | Donald Trump's Daughter Ivanka Shows Off Her Surfing Skills - Sakshi
Sakshi News home page

సర్ఫింగ్ ఆటలో ట్రంప్ కూతురు.. అలలపై ఇవాంక ఆటలు..

Published Tue, Sep 5 2023 12:17 PM | Last Updated on Tue, Sep 5 2023 12:53 PM

Donald Trump Daughter Ivanka Shows Off Her Surfing Skills  - Sakshi

న్యూయార్క్‌: సర్ఫింగ్‌పై తనకున్న ఇష్టాన్ని మరోసారి చాటుకున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్. సోమవారం తన అద్భుతమైన వేక్‌బోర్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కనిపించారు. మయామి బీచ్ తీరంలో అలలపై స్వారీ చేస్తున్న వీడియోను ఇవాంక తన ఇన్‌స్టా పోస్టులో పంచుకున్నారు. ఇవాంక వెంటే పడవలో కూర్చున్న ఆమె ఏడేళ్ల కుమారుడు థియో ఆనందంగా కేరింతలు కొడుతూ కనిపించారు. 

పసుపు రంగు వన్-పీస్ స్విమ్‌సూట్, బ్లాక్ లైఫ్ జాకెట్, బేస్ బాల్ క్యాప్ ధరించారు ఇవాంక. నల్లటి స్విమ్‌సూట్‌లో సర్ఫ్‌బోర్డ్‌ను పట్టుకుని, కోస్టారికాలోని బీచ్‌లో చెప్పులు లేకుండా షికారు చేస్తున్న మరొక చిత్రాన్ని కూడా గతంలో షేర్ చేశారు. సర్ఫింగ్‌తో పాటు మిగిలిన అవుట్ డోర్ గేమ్స్‌లలో కూడా ఇవాంక పాలుపంచుకుంటారు. 

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు తర్వాత ఇన్‌స్టాలో ఆమె పోస్టు చేయడం ఇదే మొదటిసారి. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై ఆమె చాలావరకు సైలెంట్‌గానే ఉన్నారు. తన తండ్రి ఎన్నికల ప్రచారంలో తాను పాలుపంచుకోనని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. తన తండ్రి అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఇవాంక తన వ్యక్తిగత కుటుంబానికి సమయం అవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. 

2024 ఎన్నికల్లో ఇవాంక తండ్రి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ పార్టీ నుంచి పోటీ చేయదలచిన అభ్యర్థుల్లో ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు. అయితే.. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయన ఇటీవల జైలుకు కూడా వెళ్లారు.

ఇదీ చదవండి: మాస్కోకు నార్త్‌ కొరియా కిమ్.. పుతిన్‌తో రహస్య భేటీ?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement