అమెరికా నుంచి వెళ్లిపోతా.. ఎలన్‌ మస్క్‌ కుమార్తె | Vivian Wilson Speaks Out After Donald Trump Victory | Sakshi
Sakshi News home page

అమెరికా నుంచి వెళ్లిపోతా.. ఎలన్‌ మస్క్‌ కుమార్తె

Published Sat, Nov 9 2024 6:13 AM | Last Updated on Sat, Nov 9 2024 6:15 AM

Vivian Wilson Speaks Out After Donald Trump Victory

ఇక్కడ భవిష్యత్‌ కనిపించడం లేదు 

ట్రంప్‌ గెలిచిన తరువాత ఎలన్‌ మస్క్‌ కుమార్తె వివియన్‌ ప్రకటన 

వాషింగ్టన్‌: అమెరికాలో భవిష్యత్‌ కనిపించడం లేదని, దేశాన్ని వీడి వెళ్తానని ఎలన్‌ మస్క్‌ ట్రాన్స్‌జెండర్‌ కుమార్తె వివియన్‌ విల్సన్‌ ప్రకటించారు. 2022 నుంచి తండ్రికి దూరంగా ఉంటున్న వివియన్‌.. ఎన్నికల్లో డోనాల్డ్‌ ట్రంప్‌ విజయం సాధించిన తరువాత మెటా థ్రెడ్స్‌లో తన ఆలోచనలను పంచుకున్నారు. ‘‘నేను కొంతకాలంగా ఈ విషయం మీద ఆలోచిస్తున్నా. నిన్నటిరోజును చూశాక నిర్ణయం తీసుకున్నాను. నేను అమెరికాలో ఉండేలా భవిష్యత్‌ కనిపించడం లేదు’’అని రాసుకొచ్చారు. దీనిపై మస్క్‌ స్పందించారు. ‘‘మైండ్‌ వైరస్‌ నా కొడుకును చంపేసింది’’అని మరోసారి ట్వీట్‌ చేశారు.  

నేను అలసిపోయాను..  
మళ్లీ.. తన తండ్రి పోస్ట్‌ స్క్రీన్‌ షాట్‌ను థ్రెడ్స్‌లో షేర్‌ చేస్తూ.. ‘‘మీరు ఇప్పటికీ నా బిడ్డ ఏదో ఒక వ్యాధి బారిన పడ్డారంటున్నారు. మీరు నన్ను ద్వేషించడానికి పూర్తిగా కారణం అదే. దయచేసి దాని జోలికి పోవద్దు. ప్రతి సన్నివేశంలో నేను బాధితురాలిని తప్ప మరేమి కాదు. నేను అలసిపోయాను. నాకు విసుగ్గా ఉంది’’అని ఆమె జత చేశారు. ఆ తరువాత మరోపోస్ట్‌లో... ఒకరిపై అధికారం కోల్పోయాననే తన తండ్రి అలా పిచి్చగా మాట్లాడుతున్నారని వివియన్‌ పేర్కొన్నారు. ‘‘వ్యక్తిగా పరిణితి చెందని మీరు భ్రమలో ఉన్నారు, ఒకరి మీద నియంత్రణ కోల్పోయాననే కలతతో ఉన్నారు. మీరెలాంటివారో మీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరికీ తెలుసు. అది నా సమస్య కాదు’’అని ఆమె తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement