అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయంలో అపరకుబేరుడు ఎలాన్ మస్క్ పాత్రను తీసిపారేయలేం. మొదటి నుంచి ట్రంప్‌కు మద్ధతు పలుకుతూ వచ్చిన మస్క్.. బైడెన్ ప్రభుత్వంపైనా, పోటీదారు కమలా హారిస్‌పైనా అదే స్థాయిలో విమర్శలతో చెలరేగిపోయాడు. అదే టైంలో.. సోషల్ మీడియా దిగ్గజం ‘ఎక్స్’కి బాస్‌గా ఎలాన్ మస్క్ నడిపించిన ఉద్యమం కూడా ట్రంప్ గెలుపులో కీలకభూమిక పోషించింది.
మస్క్ ఫాలోయింగ్
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపులో ఎలాన్ మస్క్‌కు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ పరోక్షంగా ఉపయోగపడింది. మస్క్ తన సోషల్ మీడియా వేదికలపై ప్రముఖులతో కలిసి ట్రంప్‌కు అనుకూలంగా ప్రచారం చేశారు. అభిప్రాయాల్ని వ్యక్తం చేయడం, ట్రంప్ గెలుపుతో అమెరికన్లకు కలిగే ప్రయోజనాలతో పాటు వివిధ సున్నిమైన అంశాల గురించి చర్చించారు. ఆ చర్చలే ఓటర్లకు దగ్గరయ్యేలా చేసింది. పలు సందర్భాల్లో ప్రజల్లో ట్రంప్‌పై ఉన్న వ్యతిరేకతను సైతం అనుకూలంగా మార్చేలా మస్క్ తన వ్యూహ, ప్రతివ్యూహాలతో ఆకట్టుకున్నారు. అన్నింటికంటే ముందు.. ట్రంప్‌పై గతంలో విధించిన సోషల్ మీడియా బ్యాన్‌ను ఎత్తిపారేశారాయన.
ట్రంప్‌కు బహిరంగ మద్దతు
వ్యాపార వ్యవహరాల్లోనే కాదు రాజకీయంగా మస్క్.. ట్రంప్‌కు ప్రత్యక్షంగా మద్దతు పలికారు. వాస్తవానికి 2016, 2020 ఎన్నికలలో ట్రంప్‌కు మస్క్ పరోక్ష మద్దతిచ్చారు. అలాగే ఈ ఎన్నికల్లో మస్క్ ఓ అడుగు ముందుకు వేసి ట్రంప్‌కు మద్దతు పలికారు. అలాగే.. ట్రంప్ హామీలు, గత పాలనలో నిర్ణయాలను విపరీతంగా ప్రమోట్ చేశారు. కుటుంబ నియంత్రణ, అంతరిక్ష పరిశోధనలు, ఆర్థిక జాతీయవాదం వంటి అంశాలపై మద్దతు పలకడంతో కోట్లాది మంది మస్క్ అభిమానులు సైతం ట్రంప్‌కు ఓటు వేసేందుకు ఉపయోగపడింది.
మస్క్‌ను నమ్మారు!
ట్రంప్‌కు మస్క్ మద్దతు ఇవ్వడంతో.. ఆయన కంపెనీలైన టెస్లా, స్పేస్‌ఎక్స్ ఆవిష్కరణలతో పాటు పెట్టుబడిదారులు, వినియోగదారులు లబ్ధి చేకూరొచ్చని భావించారు. పన్నులు, ఇంధనం, రాయితీ వంటి హామీలపై మస్క్ ఎక్కువ ఫోకస్ చేశారు. పెట్టుబడిదారుల నుంచి వినియోగదారుల వరకు మస్క్ మాటల్ని నమ్మారని, కాబట్టే మస్క్ అభిమానుల ఓట్లు ట్రంప్‌కు పడేలా చేశాయని విశ్లేషకుల అభిప్రాయం.
ఎలాన్ మస్క్ చేసిన పోస్టులే..
సోషల్ మీడియాలో ఎలాన్ మస్క్ క్రేజ్ అంతా ఇంతా కాదు. స్వేచ్ఛ పేరుతో.. ఎలాంటి అంశంపైన అయినా స్పందిస్తుంటారు. మీడియా, టెక్నాలజీలతో పాటు ఉన్నత రంగాల ప్రముఖుల పట్ల జోబైడెన్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును పలుమార్లు ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. ఈ అంశం ట్రంప్‌కు బాగా కలిసొచ్చింది. ప్రపంచకుబేరుల జాబితాలో మస్క్ ముందు వరుసలో ఉండడం, ఆకట్టుకునేలా మాటలు ట్రంప్‌కు అనుకూలంగా పనిచేశాయి.
ప్రజాభిప్రాయాన్ని రూపొందించడంలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో మస్క్ మరింత చురుకైన పాత్ర పోషిస్తే, ట్రంప్‌కు ప్రయోజనం చేకూర్చేలా అమెరికన్లు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్ని ఆయా సోషల్ మీడియా వేదికలపై ప్రస్తావించారు. టెక్నాలజీ, ఆర్థిక సమస్యలు, సంస్కృతి వంటి అంశాల ట్రంప్‌కు అనుకూలంగా మారాయి.
వాక్ స్వాతంత్య్రం, ప్రభుత్వ జోక్యం, వ్యక్తిగత స్వేచ్ఛపై మస్క్ వ్యక్తిగత విశ్వాసాలు ట్రంప్‌కు మద్దతు పలికేలా చేశాయి. వాక్ స్వాతంత్య్రం, సోషల్ మీడియాపై ఆంక్షలు విధించడంపై మస్క్.. ట్రంప్‌తో జతకట్టేలా చేశాయి. ట్రంప్ గెలుపులు ఈ అంశాలు కలిసొచ్చాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా ఎలాన్ మస్క్ చేసిన ప్రచారం ఓటర్ల శైలిని మార్చేసిందనే చెప్పొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment