ivanka
-
రూ.199 కోట్లతో ఇవాంకా ఇంటి పనులు
అమెరికా అధ్యక్షుడి పీఠాన్ని రెండోసారి అధిరోహించనున్న డొనాల్డ్ట్రంప్ కూతురు ఇవాంకాట్రంప్ ఇటీవల తన పాత మాన్షన్‌ను పునరుద్దరించినట్లు తెలిపారు. ఇందుకోసం 24 మిలియన్ డాలర్లు(సుమారు రూ.199 కోట్లు) ఖర్చు చేసినట్లు ‘బెంజింగా’ అనే రియల్ ఎస్టేట్ రిసెర్చ్ సంస్థ నివేదించింది. కొత్తగా పునరుద్ధరించిన ఇవాంకా మాన్షన్ ‘బిలియనీర్ బంకర్’లో ఉంది. మియామిలో అత్యంత గుర్తించదగిన ఆధునిక భవనాల జాబితాలో తన మాన్షన్ ఒకటిగా నిలిచినట్లు బెంజింగా తెలిపింది.ఇవాంకా మాన్షన్ ఫ్లోరిడాలోని మియామి డెడ్ కౌంటీలో ఉన్న ఇండియన్ క్రీక్ ఐల్యాండ్‌లో ఉంది.ఈ ఇండియన్ క్రీక్ ఐల్యాండ్‌ను బిలియనీర్ బంకర్ అని పిలుస్తారు.ఈ ఐల్యాండ్ ఒక ప్రైవేట్, గేటెడ్ కమ్యూనిటీ. దీనికి అత్యంత భద్రత ఉంటుంది.ఫ్లోరిడా స్టేట్ పోలీసు ఫోర్స్, 24/7 ఆర్మ్డ్ మిలిటరీ దీనికి గస్తీ కాస్తోంది.ఈ ద్వీపంలో కేవలం 41 నివాస గృహాలు మాత్రమే ఉన్నాయి.ఇది యునైటెడ్ స్టేట్స్‌లోని అత్యంత ప్రత్యేకమైన, సంపన్న వర్గాలకు చెందిందిగా ప్రసిద్ధి.ఇండియన్ క్రీక్‌లో లగ్జరీ సౌకర్యాలున్నాయి.ప్రముఖ సింగర్ జూలియో ఇగ్లేసియాస్, ఎన్ఎఫ్ఎల్ లెజెండ్ టామ్ బ్రాడీ, గిసెల్ బాండ్చెన్, ఇవాంకా ట్రంప్, జారెడ్ కుష్నర్, కార్ల్ ఇకాన్లతో సహా మరికొందరు ప్రముఖులు ఇక్కడ నివాసముంటున్నారు.ఇదీ చదవండి: 10 కి.మీ ఎత్తులో బూడిద! విమాన సర్వీసులు రద్దు -
సర్ఫింగ్ ఆటలో ఇవాంక.. మియామీ తీరంలో అలలపై ఆటలు..
న్యూయార్క్: సర్ఫింగ్‌పై తనకున్న ఇష్టాన్ని మరోసారి చాటుకున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్. సోమవారం తన అద్భుతమైన వేక్బోర్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కనిపించారు. మయామి బీచ్ తీరంలో అలలపై స్వారీ చేస్తున్న వీడియోను ఇవాంక తన ఇన్‌స్టా పోస్టులో పంచుకున్నారు. ఇవాంక వెంటే పడవలో కూర్చున్న ఆమె ఏడేళ్ల కుమారుడు థియో ఆనందంగా కేరింతలు కొడుతూ కనిపించారు. View this post on Instagram A post shared by Ivanka Trump (@ivankatrump) పసుపు రంగు వన్-పీస్ స్విమ్‌సూట్, బ్లాక్ లైఫ్ జాకెట్, బేస్ బాల్ క్యాప్ ధరించారు ఇవాంక. నల్లటి స్విమ్‌సూట్‌లో సర్ఫ్బోర్డ్ను పట్టుకుని, కోస్టారికాలోని బీచ్‌లో చెప్పులు లేకుండా షికారు చేస్తున్న మరొక చిత్రాన్ని కూడా గతంలో షేర్ చేశారు. సర్ఫింగ్‌తో పాటు మిగిలిన అవుట్ డోర్ గేమ్స్‌లలో కూడా ఇవాంక పాలుపంచుకుంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు తర్వాత ఇన్‌స్టాలో ఆమె పోస్టు చేయడం ఇదే మొదటిసారి. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై ఆమె చాలావరకు సైలెంట్‌గానే ఉన్నారు. తన తండ్రి ఎన్నికల ప్రచారంలో తాను పాలుపంచుకోనని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. తన తండ్రి అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఇవాంక తన వ్యక్తిగత కుటుంబానికి సమయం అవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. View this post on Instagram A post shared by Ivanka Trump (@ivankatrump) 2024 ఎన్నికల్లో ఇవాంక తండ్రి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ పార్టీ నుంచి పోటీ చేయదలచిన అభ్యర్థుల్లో ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు. అయితే.. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయన ఇటీవల జైలుకు కూడా వెళ్లారు. ఇదీ చదవండి: మాస్కోకు నార్త్ కొరియా కిమ్.. పుతిన్‌తో రహస్య భేటీ? -
వ్యక్తిగత సిబ్బందికి షాకిచ్చిన ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలైన మడేలీన్ వెస్టర్‌హౌట్‌ను పదవి నుంచి తొలగిస్తున్నట్టు వైట్‌హౌస్ ప్రకటించింది. ఆమె ఇకపై వైట్‌హౌస్‌లోకి అడుగుపెట్టడానికి వీల్లేదంటూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. కాగా, అధ్యక్ష కార్యాలయానికి సంబంధించిన కీలక సమాచారాన్ని మడేలీన్ బహిర్గతం చేసిన ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. అంతేగాకుండా, ఓ ప్రెస్మీట్లో ట్రంప్ కుటుంబ సభ్యులకు సంబంధించిన కీలక సమాచారాన్ని లీక్ చేశారు. ట్రంపు కుమార్తె టిపానీ అధిక బరువు కారణంగా ఆయన తన కుమార్తె ఫోటోను చూడడానికి కూడా ఇష్టపడేవారు కాదని మడేలీన్ అన్నట్లు తెలిసింది. దీంతో, ఆమెపై వేటు పడినట్టు వైట్‌హౌస్ ప్రకటిచింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ 2016లో బధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ట్రంప్ వ్యక్తిగత సహాయకురాలిగా ఆమె పనిచేస్తున్నారు. మడేలీస్ పనితీరుపై ట్రంప్ అనేక సందర్భాల్లో ప్రశంసలు కురిపించారు. మడేలీస్ను పదవి నుంచి తొలగించడం పట్ల ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు రిపబిక్లన్ పార్టీ నేతలు కూడా ఒకింత విస్మయానికి గురవుతున్నారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ కుమార్తెలంటే తనకు ఎనలేని ప్రేమని విలేకరుల సమావేశంలో తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ అంశం పై వెస్టర్‌హౌట్ తో మాట్లాడానని.. ఆమె చాలా ఆవేదనలో ఉన్నారని, అనుకోకుండా జరిగిన సంఘటనని అన్నారు. విలేకరుల విందులో భాగంగా అలా మాట్లాడారని, ఆ సమయంలో మద్యం కూడా సేవించినట్లు మడేలిన్ తనతో చెప్పారని ట్రంప్ అన్నారు. -
HICCలో చర్చా కార్యక్రమం
-
హైదరాబాద్‌లో ఇవాంక
-
ఇవాంకా విచ్చేశారు.. సగం సమయం ‘రిజర్వ్’కే
సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె, సలహాదారు ఇవాంకా హైదరాబాద్ పర్యటన సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. అమెరికా నుంచి ప్రతినిధులు, డెలిగేట్ల బృందంతో కలసి బయలుదేరిన ఆమె.. షెడ్యూల్ ప్రకారం మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. నలుపు రంగు దుస్తుల్లో మెరిసిపోతూ ఇవాంకా ఉల్లాసంగా కనిపించారు. ఎయిర్‌పోర్టులో అమెరికన్, తెలంగాణ అధికారులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. తర్వాత నేరుగా ఆమె బస చేసే హోటల్‌కు వెళ్ళారు. అయితే తొలి నుంచీ ఇవాంకా పర్యటన వివరాలను గోప్యంగా ఉంచిన ప్రభుత్వాలు.. తుదివరకు అదే గోప్యతను పాటించాయి. హెచ్ఐసీసీకి పది నిమిషాల ప్రయాణ దూరంలో ఉండే ట్రైడెంట్ హోటల్లో ఇవాంకా బస ఏర్పాట్లు చేసినట్లు పర్యటన తుది షెడ్యూల్ విడుదలైంది. కానీ పోలీసు యంత్రాంగం, అమెరికా నుంచి వచ్చిన సీక్రెట్ సర్వీస్ ఏజెన్సీ అధికారులు ట్రైడెంట్‌తో పాటు వెస్టిన్ హోటల్లోనూ పకడ్బందీగా రక్షణ ఏర్పాట్లు చేశారు. బుధవారం రాత్రి 9.20 గంటల వరకు ఇవాంకా హైదరాబాద్ పర్యటన కొనసాగుతుంది. సుమారు 40 గంటల పాటు సాగే ఈ పర్యటనలో.. ఏకంగా 18 గంటల పాటు రిజర్వ్ టైమ్‌గా నిర్దేశించారు. మంగళవారం తెల్లవారుజామున విమానాశ్రయం నుంచి నేరుగా హోటల్‌కు చేరుకోనున్న ఇవాంకా మధ్యాహ్నం 2.50 గంటల వరకు విశ్రాంతి తీసుకుంటారు. ఈ సమయాన్ని షెడ్యూల్లో ‘రిజర్వ్’గా చూపారు. సాయంత్రం ప్రధాని మోదీతో కలిసి ప్రపంచ పారిశ్రామిక సదస్సు ప్రారంభోత్సవంలో.. రాత్రికి భారత ప్రభుత్వం ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ఇచ్చే విందులో పాల్గొంటారు. రెండో రోజు బుధవారం ఉదయం పారిశ్రామిక సదస్సు ప్లీనరీ సెషన్లో ప్రసంగిస్తారు. తర్వాత తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో ట్రైడెంట్ హోటల్లో భేటీ అవుతారు. సాయంత్రం 5:35 గంటలకు హోటల్ ఖాళీ చేయనున్న ఇవాంకా.. రాత్రి 8.20కి శంషాబాద్ విమానాశ్రయం చేరుకుంటారు. మధ్యలో ఏం చేస్తారన్నది షెడ్యూల్లో పేర్కొనలేదు. అయితే ఇలా షెడ్యూల్లో చూపని, ‘రిజర్వ్’గా పేర్కొన్న ఖాళీ సమయాల్లో ఇవాంకా పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారా..? లేక హైదరాబాద్‌లోని పలు చారిత్రక, పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారా.. అన్నది ఆసక్తి రేపుతోంది. ఆమె చార్మినార్‌ను సందర్శించే అవకాశముందన్న నేపథ్యంలో.. పోలీసు యంత్రాంగం ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇవాంకా పర్యటన వివరాలు 28వ తేదీ (మంగళవారం) - 3.00 తెల్లవారుజామున: ఇవాంకా శంషా బాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా తాను బస చేసే హోటల్‌కు వెళ్ళారు. - మధ్యాహ్యం 2.50 వరకు: రిజర్వ్ సమ యం (అధికారులు వివరాలు వెల్లడించకుండా.. ‘రిజర్వు’గా పేర్కొన్నారు) - 3.00: ఇవాంకా హెచ్ఐసీసీకి చేరుకుంటారు. - 3.10– 3.25: విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌తో భేటీ - 3.35– 3.55: ప్రధాని మోదీతో భేటీ - 4.00–4.25: భారత స్టార్టప్‌ల అధునాతన ప్రదర్శన ‘ది ఇండియన్ ఎడ్జ్’ను తిలకిస్తారు. - 4.25: ప్రధాని మోదీతో కలసి ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొంటారు. - 4.45–4.50: ప్రారంభోత్సవ వేదికపై ప్రసంగిస్తారు. - 5.15–5.45: ప్లీనరీ సెషన్లో ‘మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు– నాయక త్వం’పై నిర్వహించే చర్చాగోష్టికి ప్యానెల్ స్పీకర్‌గా ఉంటారు. - 5.50–6.00: హెచ్ఐసీసీ నుంచి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. - 7.15: హోటల్ నుంచి బయల్దేరుతారు. - 8.00: ఫలక్‌నుమా ప్యాలెస్‌కు చేరుకుంటారు. - 8.05–8.20: ‘ట్రీ ఆఫ్ లైఫ్’పేరుతో ఏర్పాటు చేసే భారతీయ కళలు, దుస్తుల ప్రదర్శనను తిలకిస్తారు. - 8.20–8.35: భారత చారిత్రక వారసత్వంపై లైవ్‌షోను తిలకిస్తారు. - 8.45: ప్రధాని మోదీ, ఇతర ప్రముఖులతో కలసి విందులో పాల్గొంటారు. - 10.00: ఫలక్‌నుమా నుంచి బయల్దేరుతారు. - 10.40: హోటల్‌కు చేరుకుని బస చేస్తారు. 29వ తేదీ (బుధవారం) - ఉదయం 9.00: అమెరికా బృందంతో బ్రేక్‌ఫాస్ట్ - 9.50: హోటల్ నుంచి హెచ్ఐసీసీకి బయలుదేరుతారు. - 10.00: సదస్సు ప్లీనరీ సెషన్లో ‘వి కెన్ డూ ఇట్.. అన్ని రంగాల్లో పెరుగుతున్న మహిళా భాగస్వామ్యం’ అంశంపై చర్చాగోష్టి లో పాల్గొంటారు. - 11.00: హెచ్ఐసీసీ నుంచి తిరిగి హోటల్‌కు చేరుకుంటారు. భోజన విరా మం అనంతరం మహిళా పారిశ్రామిక ప్రతి నిధులతో ట్రైడెంట్ హోటల్లో ముఖాముఖి - 5.35: హోటల్లోనే సిబ్బందితో విందు చేసి విమానాశ్రయానికి బయల్దేరుతారు - 8.20: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంటారు - 9.20: దుబాయ్ ఎమిరేట్స్ విమానంలో అమెరికాకు తిరుగు ప్రయాణమవుతారు. ఇవాంకా కాన్వాయ్ రిహార్సల్స్ అమెరికా అధ్యక్షుడి కుమార్తె ఇవాంకా నగరానికి వస్తున్న నేపథ్యంలో సోమవారం రాజేంద్రనగర్‌లో కాన్వాయ్ రిహార్సల్స్ నిర్వహించారు. ఓఆర్ఆర్పై నుంచి భారీ కాన్వాయ్ హిమాయత్‌సాగర్, రాజేంద్రనగర్, పీడీపీ చౌరస్తా, శివరాంపల్లి, ఆరాంఘర్, మైలార్‌దేవ్‌పల్లి, బండ్లగూడ మీదుగా ఫలక్‌నుమా ప్యాలెస్ వరకు నిర్వహించారు. దాదాపు 40 వాహనాలతో ఉదయం 10 గంటలకు ఒకసారి, సాయంత్రం 5 గంటలకు మరోసారి రిహార్సల్స్ నిర్వహించారు. అడుగడుగునా పోలీసులను మోహరించి బందోబస్తును నిర్వహించారు. రహదారులకు ఇరువైపులా ఉన్న భవనాలపై సైతం పోలీసులను బందోబస్తు కోసం వినియోగించారు. మంగళవారం సాయంత్రం ఇవాంకా ఈ దారిగుండానే ఫలక్‌నుమా ప్యాలెస్‌కు వెళ్లనున్నారు. ఇవాంకా కాన్వాయ్‌లో 17 యూఎస్ఏ వాహనాలు ఉండగా పోలీసుల వాహనాలు మరో నాలుగు ఉన్నట్లు తెలిసింది. ఇవాంకా కాన్వాయ్‌లో మరో మూడు యూఎస్ఏ వాహనాలు చేరనున్నట్లు సమాచారం. కాన్వాయ్ మరికొద్ది నిమిషాల్లో రానుందనగా రాజేంద్రనగర్ ప్రధాన రహదారిపై కుక్కలు పరుగులు తీశాయి. దీంతో పోలీసులు అప్రమత్తమై వాటిని తరిమేశారు. (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
లక్కీ ఇవాంక
ఇవాళ సాయంత్రమే ఇవాంక హైదరాబాద్‌లో లాండ్ అవుతున్నారు. అంతకంటే ముందు ఆమెతో షేక్ హ్యాండ్ కోసం 1500 మంది ఇండియన్ సెలబ్రిటీలు మన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కి రెడీ అయిపోయారు. షారుక్ ఖాన్‌కి అయితే ఆమె కూర్చొనే వరసలోనే సీట్ అరేంజ్ చేశారు. సరసన అరేంజ్ చేస్తారనుకుంటే వరసతో సరిపెట్టేశారేంటని షారుక్ పెద్దగా ఫీల్ కాకపోవచ్చు. నైస్ జంటిల్మన్ కాబట్టి. మరి ఆయనకు తోడెవరు? ఆయన పక్కన ఎవరు కూర్చుంటే వాళ్లు! ఎందుకంటే.. దీపికా పదుకోన్ వస్తానన్నారు కానీ, ‘పద్మావతి’ గొడవలతో లాస్ట్ మినిట్‌లో ‘రాను’ అనేశారు. హౌ లక్కీ ఇవాంక! అదేంటి? దీపిక రాకపోతే, ఇవాంక ఎందుకు లక్కీ అవుతుంది? ఎందుకా? ఒక్కసారి ఇవాంకను, దీపికను పక్కపక్కన ఊహించుకోండి. ఎవరి పక్కన ఎవరు వెలిగిపోతూ కనిపిస్తున్నారు మీకు?! ఒకవేళ దీపిక మనసు మార్చుకుని ఈవెంట్‌కి వచ్చేస్తే? అప్పుడు కూడా ఇవాంకానే లక్కీ అవుతారు. దీపిక వెలుగు ఇవాంక మీద పడకుండా ఉంటుందా?! -
ఇవాంకతో డిన్నర్!
తెలంగాణ ప్రభుత్వం ఇవాంక గౌరవార్థం... గోల్కొండ కోటలో పెద్ద విందు ఏర్పాటు చేసింది. హైదరాబాదీ స్పెషల్స్ ఆ విందులో హైలైట్. దాదాపు వంద రకాల వంటకాలు ఉంటాయట! మనం అక్కడ ఎలాగూ తినలేం... ఓ నాలుగు రకాలు చేసుకుని... మనింట్లోనే ఇవాంక డిన్నర్ కానిచ్చేద్దాం. డబుల్ కా మీఠా (స్లైస్) కావలసినవి : బ్రెడ్ ముక్కలు – 10 ,పంచదార – 1 కప్పు, పాలు – 1 కప్పు ,నెయ్యి – పావు కప్పు,ఏలకులు – 4,జీడిపప్పులు – 10,బాదం పప్పులు – 10,పిస్తా – 10 తయారి : ఒక్కొక్క బ్రెడ్‌ను నాలుగుముక్కలు చేసి నేతిలో వేయించుకోవాలి. పాలు మరిగించి పక్కనుంచాలి. మరొక పాత్రలో పంచదారను పాకం పట్టుకోవాలి. బ్రెడ్ ముక్కలను పాకంలో వేసి మరిగించిన పాలుపోసి ముక్క చెదరకుండా, పాలు, పాకం కలిసేలా చూడాలి. బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నని ముక్కలుగా తరిగి నేతిలో వేయించి కలుపుకోవాలి. షీర్ ఖుర్మా కావలసినవి : సేమ్యా – 2 కప్పులు (సన్నని సేమ్యా), పంచదార – 1 కప్పు, నెయ్యి – 4 టీ స్పూన్లు, బాదం – గుప్పెడు, జీడిపప్పులు – గుప్పెడు, పిస్తా – గుప్పెడు, చార్మస్ (తర్బూజ గింజలు) – 2 టీ స్పూన్లు తయారి : సేమ్యా, బాదం, పిస్తా, జీడిపప్పులను సన్నగా తరిగి నేతిలో వేయించాలి. అడుగు మందంగా వున్న పాత్రలో పాలు మరగనివ్వాలి. మరిగిన పాలకు పంచదార కలిపి మరో పదినిమిషాలు మరిగించాలి. వేయించిన సేమ్యా, బాదం, పిస్తా, జీడిపప్పులు కలిపి రెండు నిమిషాలు ఉడికించి స్టౌ పైనుంచి దించేయాలి. ఖుబానీ కా మీఠా కావలసినవి: ఖుబానీ (డ్రై ఆప్రికాట్స్) – కేజీ; పంచదార – ఒకటిన్నర కేజీ; రాస్ప్బెర్రీ సిరప్ – 100 మి.లీ. (బేకరీలలో దొరుకుతుంది); రాస్స్బెర్రీ కలర్ – రెండు టీ స్పూన్లు తయారి: ఒక పాత్రలోకి ఖుబానీలను తీసుకుని అందులో నీరు పోసి రాత్రంతా నానబెట్టాలి. (ఖుబానీలు మునిగాక వాటి మీద రెండు అంగుళాల మేరకు నీరు ఉండాలి). మరుసటిరోజు వాటిలోని గింజలను వేరుచేయాలి. ఇప్పుడు ఈ పాత్రను ఆ నీటితోనే స్టౌ మీద ఉంచాలి. ఒక నిముషం అయిన తరువాత అందులో పంచదార వేయాలి. పంచదార పూర్తిగా కరిగి, ఖుబానీలు మెత్తగా, చిక్కగా అయ్యి, గోధుమ రంగులోకి వచ్చేవరకు ఉంచాలి. ఇప్పుడు స్టౌమీద నుంచి దింపేసి, అందులో రాస్ప్బెర్రీ సిరప్, రాస్ప్ బెర్రీ కలర్ వేసి కలిపి, ఒక బౌల్లోకి తీసుకోవాలి. క్రీమ్‌తో గార్నిష్ చేయాలి. దమ్ బిర్యానీ కావలసినవి : చికెన్ – అర కిలో, బాస్మతి బియ్యం – 1 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూను, గరం మసాలా – అర టీ స్పూను, పసుపు – అర టీస్పూను, దాల్చిన చెక్క – చిన్న ముక్క, ఏలకులు – 4, లవంగాలు – 5, కుంకుమ పువ్వు – చిటికెడు, కారం – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత, ఉల్లిగడ్డ – 1, పాలు – 1 కప్పు తయారి : చికెన్‌ను శుభ్రపరచి కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, గరం మసాలా పట్టించి అరగంట పాటు పక్కనుంచాలి. బాస్మతి బియ్యాన్ని సగం ఉడకనిచ్చి నీళ్ళు వడకట్టి పక్కనుంచాలి. అడుగు మందంగా వున్న పాత్రలో అడుగున చికెన్‌ను పేర్చి దానిమీద సగం ఉడికించిన బియ్యాన్ని అమర్చాలి. దీనిని తక్కువ మంటమీద ఉడికించాలి. పాలలో కుంకుమపువ్వు కలిపి ఉడికిన బిర్యానీ పైన చల్లి మూత పెట్టుకోవాలి. ఉల్లిగడ్డని పొడవుగా తరిగి అర టీ స్పూను అల్లంవెల్లుల్లి పేస్ట్, చిటికెడు ఉప్పు కలిపి వేయించాలి. ఉల్లిగడ్డ మిశ్రమాన్ని ఉడికిన బిర్యానీ పైన చల్లి మరో పదినిమిషాలపాటు మగ్గనిచ్చి స్టౌపైనుంచి దించేయాలి. పత్తర్ కా ఘోష్ కావలసినవి: బోన్‌లెస్ మటన్– ఒక కేజీ ,మారినేట్ చేయడానికి: ,అల్లం వెల్లుల్లి పేస్ట్– ఒక టేబుల్ స్పూన్ ,కారం పొడి– ఒక టేబుల్ స్పూన్ ,పసుపు– పావు టేబుల్ స్పూన్ ,పచ్చి బొప్పాయి పేస్ట్– రెండు టేబుల్ స్పూన్లు ,గరం మసాలా– ఒక టేబుల్ స్పూన్ ,మిరియాల పొడి– ఒక టేబుల్ స్పూన్ ,పచ్చిమిర్చి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్ ,నిమ్మకాయ రసం– ఒక ,టేబుల్ స్పూన్ ,పత్తర్ కే ఫూల్ పౌడర్ – ఒక టేబుల్ స్పూన్ ,ఉప్పు– రుచికి తగినంత ,నూనె లేదా నెయ్యి– నాలుగు టేబుల్ స్పూన్లు ,గార్నిష్ చేయడానికి: ,ఉల్లిపాయ చక్రాలు– ఒక పెద్ద ఉల్లిపాయవి ,నిమ్మకాయ ముక్కలు– నాలుగు నిమ్మకాయలవి ,కొత్తిమీర తరుగు– ఒక కప్పు ,పుదీన తరుగు– ఒక కప్పు తయారీ: 1. పెద్ద పాత్రలో మాంసం ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బొప్పాయి గుజ్జు, పచ్చిమిర్చి పేస్టు, నిమ్మరసం కలిపి 15 నిమిషాల సేపు పక్కన ఉంచాలి. 2. మరొక పాత్రలో నెయ్యి, కారం, పసుపు, మిరియాల పొడి, గరం మసాలా, పత్తర్ కే ఫూల్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇందులో పైన కలిపి పెట్టుకున్న మాంసం ముక్కలను వేసి మసాలా సమంగా పట్టేటట్లు కలపాలి. ఈ మిశ్రమాన్ని నాలుగు గంటల సేపు ఫ్రిజ్‌లో పెట్టాలి. 3. పత్తర్ కా ఘోష్ చేసే రాయి (పెనం లాంటిది)ని వేడి చేయాలి. రాయి మీద నీటిని చల్లి వేడి చూసుకోవాలి. బాగా వేడెక్కిన తర్వాత మాంసం ముక్కలను రాయి మీద వరుసగా పేర్చాలి. ముక్కలనీ తీసిన తర్వాత పాత్రలో మిగిలి పోయిన మసాలా నీటిని కొద్ది కొద్దిగా ముక్కల మీద వేయాలి. నీరు ఆవిరైన తర్వాత ముక్కలను తిరగవేయాలి. చపాతీని తిరగేస్తూ కాల్చినట్లు మాంసం ముక్కలను అనేక సార్లు తిరగవేస్తూ బంగారు రంగులోకి వచ్చే వరకు కాల్చాలి. 4. రాయి మీద నుంచి తీసి ఉల్లిపాయ చక్రాలు, నిమ్మకాయ ముక్కలు, కొత్తిమీర, పుదీన తరుగుతో గార్నిష్ చేయాలి. -
కూతురి బాధ తట్టుకోలేకే...ట్రంప్ నిర్ణయం
లండన్: సిరియా వైమానిక స్థావరంపై దాడి చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకోవడానికి ఆయన కుమార్తె ఇవాంకా వేదన కూడా కారణమని ట్రంప్ కుమారుడు ఎరిక్ తెలిపారు. సిరియా గ్యాస్ దాడిలో గాయపడిన చిన్నారులపై మందును స్ప్రే చేస్తున్న చిత్రాలను చూసి తన తండ్రి చలించిపోయారని ఆయన చెప్పారు. గ్యాస్ దాడిలో తన గుండె పగిలిపోయిందని ఇవాంకా చెప్పినట్లు ‘టెలిగ్రాఫ్ పత్రిక’ పేర్కొంది. దాడి భయంకరంగా ఉందని, తన తండ్రి సకాలంలో చర్య తీసుకుంటాడని ఆమె చెప్పంది. కాగా యుద్దవిమానాలు విష రసాయనాలతో వాయువ్య సిరియాపై జరిపిన దాడిలో 72మందికి పైగా అమాయకుల ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల్లో ఎక్కువమంది చిన్నారులే ఉన్నారు. రెబెల్స్ ఆధీనంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ పరిధిలోగల ఖాన్ షేఖున్ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ దళాల మద్దతున్న కుర్దిష్–అరబ్ కూటమి లక్ష్యంగా చేసుకుని గత కొద్ది రోజులుగా దాడులు ముమ్మరం చేసింది. -
ట్రంప్ కూతురు ఇవాంకకు వైట్‌హౌస్ ప్రమోషన్
-
కూతురిపైనా ట్రంప్ కారుకూతలు
• ఇవాంకా శరీర సౌష్టవంపై అసభ్య వ్యాఖ్యలు • తెరపైకి ట్రంప్ పాత ఇంటర్వ్యూ వీడియోలు • ఈ వ్యాఖ్యలు సరికావు: ట్రంప్ భార్య మెలానియా వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఇబ్బందుల్లో కూరుకుపోతున్నారు. మహిళలపై చేసిన వ్యాఖ్యలపై దుమారం చల్లారకముందే.. ఏకంగా తన కూతురిపైనే అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వీడియో బయటపడటంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. 17 ఏళ్ల క్రితం హోవార్డ్ స్టెర్న్ అనే రేడియో జర్నలిస్టుకు ఇచ్చిన ఇంటర్వ్యూ బహిర్గతమైంది. ఈ ఇంటర్వ్యూలో తన కూతురు ఇవాంకా ట్రంప్‌పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. ఎత్తు, బరువుతో పాటు శరీర సౌష్టవం చక్కగా ఉందని చాలాసార్లు ట్రంప్ వ్యాఖ్యానించినట్లు సీఎన్ఎన్ కథనం ప్రచురించింది. ఆ వీడియోలో ‘చాలా మంది మహిళలు నేనంటే పడిచచ్చేవారు. నాకోసం ఏం చేసేందుకైనా వెనుకాడేవారుకాదు’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. 2006లో మరో ఇంటర్వ్యూలోనూ తన కూతురు మరింత సెక్సీగా కనబడుతోందని ట్రంప్ వ్యాఖ్యానించిన విషయాన్ని సీఎన్ఎన్ ప్రచురించింది. ట్రంప్ వ్యాఖ్యలు ఆక్షేపణీయమని ఆయన భార్య మెలానియా ట్రంప్ అన్నారు. అయితే, ఇదంతా గతమని.. అప్పటికీ, ఇప్పటికీ తన భర్త చాలా మారారన్న మెలానియా.. ట్రంప్ క్షమాపణలు కోరిన విషయాన్ని గుర్తుచేశారు. క్లింటన్‌కు భారతీయ అమెరికన్ల మద్దతు మహిళలపై వ్యాఖ్యలతో సొంతపార్టీతోపాటు జనాల్లోనూ ట్రంప్ పట్టుకోల్పోతున్నారు. తాజా వీడియోతో.. భారత అమెరికన్లు చాలా మంది క్లింటన్‌కు మద్దతు ప్రకటించారు. మెజారిటీ భారతీయ అమెరికన్లు మొదట్నుంచీ డెమొక్రాట్లకే మద్దతుగా నిలుస్తున్నారు. పాక్ ఉగ్రవాదం, ఇస్లామిక్ టైస్టులపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో ఓ వర్గం ఆయనకు మద్దతుగా నిలిచింది. అయితే.. తాజా పరిణామాల నేపథ్యంలో వీరూ హిల్లరీకే మద్దతు తెలిపారు. ‘ట్రంప్‌ను శ్వేతసౌధం చేరకుండా ఆపాలి.మహిళలపై ఆయన వ్యాఖ్యలు దారుణం. తల్లి, చెల్లి, భార్య, సమాజంపై గౌరవం లేని వ్యక్తి ట్రంప్’ అని కమలా హారిస్ (కాలిఫోర్నియా నుంచి సెనెట్‌కు పోటీ పడుతున్న భారత సంతతి మహిళ) తెలిపారు. హిల్లరీకే చాన్స్: నిపుణులు డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ నిపుణులంటున్నారు. ఫ్లోరిడాతోపాటు పెద్ద రాష్ట్రాలైన ఉత్తర కరోలినా, ఒహియో, పెన్సిల్వేనియాలో ఏదైనా ఒక రాష్ట్రంలో గెలిస్తే సరిపోతుందని తెలిపారు. ఆదివారం రాత్రి జరిగే రెండో ‘అధ్యక్ష అభ్యర్థుల డిబేట్’లో హిల్లరీ గెలుస్తుందన్నారు. ట్రంప్‌ను ఎలా తప్పించాలి?: నెల రోజుల్లో ఎన్నికలుండగా అభ్యర్థిగా ట్రంప్‌ను తప్పించాలని పార్టీ పావులు కదుపుతోంది. కీలకనేతలు సహా మెజారిటీ సభ్యులు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉండటంతో రిపబ్లికన్ నేషనల్ కమిటీ (ఆర్ఎన్సీ) ఈ దిశగా అన్ని న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తోంది. ‘పార్టీ నిబంధనల్లోని 9వ నియమం ప్రకారం ఆర్ఎన్సీలో ఓటింగ్ ద్వారా అధ్యక్ష అభ్యర్థిని మార్చవచ్చు. దీనికి అభ్యర్థి చనిపోవటమో, ఆరోగ్యం క్షీణించటమో లేదా ఇతర కారణాలను చూపించో తప్పించవచ్చు’ అని పార్టీ చెబుతోంది. ట్రంప్ తనంతటతానుగా తప్పుకోవటం లేదా, 168 మంది డెలిగేట్లున్న ఆర్ఎన్సీ భేటీలో పూర్తిస్థాయి మెజారిటీ లభిస్తే.. కొత్త అభ్యర్థిని (ఉపాధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న మైక్ పెన్స్) బరిలో దించే వీలుంది. ట్రంప్‌కు దూరమవుతున్న రిపబ్లికన్లు ట్రంప్‌కు సొంతగూటిలో కుంపటి రాజుకుంటోంది. రిపబ్లికన్ పార్టీలోని కీలక నేతలు (సెనెటర్లు, గవర్నర్లు) ట్రంప్ శిబిరం నుంచి దూరమవుతున్నారు. ఎన్నికలనుంచి తప్పుకోవాలని పార్టీలో వ్యతిరేకత పెరుగుతోంది. ఆయన కలలు కూడా ఒక్కొక్కటిగా కూలుతున్నాయి. ‘ఇకచాలు. ట్రంప్ తప్పుకోవాలి’ అంటూ మాజీ విదేశాంగ మంత్రి కండోలిజా రైస్ ఫేస్బుక్లో తెలిపారు. కాలిఫోర్నియా మాజీ గవర్నర్ ఆర్నాల్డ్ స్క్వార్జ్‌నెగ్గర్, ఒహియో సెనెటర్ రాబ్ పోర్ట్మాన్, దక్షిణ డకోటా గవర్నర్ డెన్నిస్ డగర్డ్ తదితరులు బహిరంగంగానే ట్రంప్‌కు దూరమవుతున్నట్లు ట్విటర్లో ప్రకటించారు. రిపబ్లికన్ల ఉపాధ్యక్ష అభ్యర్థి మైక్ పెన్స్ మాత్రం జాగ్రత్తగా మాట్లాడారు. ‘ట్రంప్ వ్యాఖ్యలు సమర్థనీయం కాదు. కానీ ఆయన గొప్ప మనసుతో క్షమాపణలు కోరారు. ఆదివారం (భారత కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున) జరిగే రెండో డిబేట్లో ఆయనే దేశానికి సమాధానం చెబుతారు’ అని తెలిపారు. కీలకదశకు ఎన్నికలు అధ్యక్ష్య ఎన్నికలు కీలకదశకు చేరుకున్నాయి. అమెరికా ఎన్నికల చరిత్రలోనే గత సాంప్రదాయానికి భిన్నంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని మీడియా పేర్కొంది. ఇద్దరు అసమర్థ అభ్యర్థులు బరిలో ఉన్నారంటూ ఓటర్లంటున్నారు. ఇటీవలి ఓ సర్వేలో 55 శాతం మంది హిల్లరీ, ట్రంప్‌లపై అభ్యంతరం తెలిపారు. ఆయా పార్టీల్లోనూ వీరిద్దరిపై సానుకూల అభిప్రాయం లేదు.