
ఇవాళ సాయంత్రమే ఇవాంక హైదరాబాద్‌లో లాండ్ అవుతున్నారు. అంతకంటే ముందు ఆమెతో షేక్ హ్యాండ్ కోసం 1500 మంది ఇండియన్ సెలబ్రిటీలు మన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్‌కి రెడీ అయిపోయారు. షారుక్ ఖాన్‌కి అయితే ఆమె కూర్చొనే వరసలోనే సీట్ అరేంజ్ చేశారు.
సరసన అరేంజ్ చేస్తారనుకుంటే వరసతో సరిపెట్టేశారేంటని షారుక్ పెద్దగా ఫీల్ కాకపోవచ్చు. నైస్ జంటిల్మన్ కాబట్టి. మరి ఆయనకు తోడెవరు? ఆయన పక్కన ఎవరు కూర్చుంటే వాళ్లు! ఎందుకంటే.. దీపికా పదుకోన్ వస్తానన్నారు కానీ, ‘పద్మావతి’ గొడవలతో లాస్ట్ మినిట్‌లో ‘రాను’ అనేశారు.
హౌ లక్కీ ఇవాంక! అదేంటి? దీపిక రాకపోతే, ఇవాంక ఎందుకు లక్కీ అవుతుంది? ఎందుకా? ఒక్కసారి ఇవాంకను, దీపికను పక్కపక్కన ఊహించుకోండి. ఎవరి పక్కన ఎవరు వెలిగిపోతూ కనిపిస్తున్నారు మీకు?! ఒకవేళ దీపిక మనసు మార్చుకుని ఈవెంట్‌కి వచ్చేస్తే? అప్పుడు కూడా ఇవాంకానే లక్కీ అవుతారు. దీపిక వెలుగు ఇవాంక మీద పడకుండా ఉంటుందా?!
Comments
Please login to add a commentAdd a comment