surfing
-
వివేక్ రామస్వామి సర్ఫింగ్ వీడియో వైరల్: నీళ్లలోకి తోసేసి మరీ..!
అమెరికా అధ్యక్ష పదవి రేసులో ఉన్న భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచారు. 3వ రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి సర్ఫ్ చేయడం నేర్చుకుంటున్న వీడియో ఒకటి వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు ఫన్నీగా స్పందించారు. డిబేట్ తర్వాత మియామీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాజ్ సాయర్ రామస్వామి సర్ఫింగ్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. "కాబోయే ప్రెసిడెంట్‌కి సర్ఫ్ చేయడంఎలాగో నేర్పిస్తున్నా’’ అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను పోస్ట్ చేశారు. మాట్లాడుతూనే ఉన్నట్టుండి వివేక్‌ను నీళ్లలోకి తోసివేయడం, అలాగే గతంలో ఎప్పుడు సర్ఫింగ్ చేయని రామస్వామి, బోర్డు మీద బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నించి రెండుసార్లు నీటిలో పడిపోవండి లాంటి దృశ్యాలను ఈ వీడియోలో చూడొచ్చు. మొత్తానికి నేర్పుగా నేర్చుకుని నీటి అలల్ని ఎదుర్కొని ఈజీగా సర్ఫింగ్ చేశారు. అంతేకాదు నాట్నుంచి పక్కకు తప్పుకొని మరీ సూట్‌తోనే సర్ఫింగ్ చేయాలన్న సాయల్ సవాల్‌ను కూడా స్వీకరించిన రామస్వామి అలవోకగా వేక్ సర్ఫింగ్‌లో విజయం సాధించడం విశేషం. ఇప్పటికే 7 లక్షల 50 వేల మందికిపైగా వీక్షించారు.దీంతో నెక్ట్స్ ప్రెసిడెంట్ అని కొందరు, మేన్ ఆఫ్ యంగ్ పీపుల్ మరికొందరు కమెంట్ చేయగా, ఇంకొందరు నెగిటివ్ కమెంట్స్ కూడా చేశారు. కాగా రిపబ్లికన్ పార్టీ తరఫున పోటీ పడుతున్న సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీపై వివేక్ రామస్వామి వ్యక్తిగత దూషణకు దిగారు. విదేశాంగ విధానంపై చర్చలో భాగంగా వేదికపై ఉన్న ఏకైక మహిళా అభ్యర్థి నిక్కీపై విరుచుకుపడ్డారు వివేక్. ఇద్దరు భారతీయ సంతతి లీడర్ల మధ్య వైరం చర్చకు దారి తీసింది. 2024 నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి View this post on Instagram A post shared by Kaz (@kazsawyer) -
సర్ఫింగ్ ఆటలో ఇవాంక.. మియామీ తీరంలో అలలపై ఆటలు..
న్యూయార్క్: సర్ఫింగ్‌పై తనకున్న ఇష్టాన్ని మరోసారి చాటుకున్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్. సోమవారం తన అద్భుతమైన వేక్బోర్డింగ్ నైపుణ్యాలను ప్రదర్శిస్తూ కనిపించారు. మయామి బీచ్ తీరంలో అలలపై స్వారీ చేస్తున్న వీడియోను ఇవాంక తన ఇన్‌స్టా పోస్టులో పంచుకున్నారు. ఇవాంక వెంటే పడవలో కూర్చున్న ఆమె ఏడేళ్ల కుమారుడు థియో ఆనందంగా కేరింతలు కొడుతూ కనిపించారు. View this post on Instagram A post shared by Ivanka Trump (@ivankatrump) పసుపు రంగు వన్-పీస్ స్విమ్‌సూట్, బ్లాక్ లైఫ్ జాకెట్, బేస్ బాల్ క్యాప్ ధరించారు ఇవాంక. నల్లటి స్విమ్‌సూట్‌లో సర్ఫ్బోర్డ్ను పట్టుకుని, కోస్టారికాలోని బీచ్‌లో చెప్పులు లేకుండా షికారు చేస్తున్న మరొక చిత్రాన్ని కూడా గతంలో షేర్ చేశారు. సర్ఫింగ్‌తో పాటు మిగిలిన అవుట్ డోర్ గేమ్స్‌లలో కూడా ఇవాంక పాలుపంచుకుంటారు. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అరెస్టు తర్వాత ఇన్‌స్టాలో ఆమె పోస్టు చేయడం ఇదే మొదటిసారి. ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై ఆమె చాలావరకు సైలెంట్‌గానే ఉన్నారు. తన తండ్రి ఎన్నికల ప్రచారంలో తాను పాలుపంచుకోనని ఆమె ఇప్పటికే స్పష్టం చేశారు. తన తండ్రి అంటే ఎంతో ఇష్టమని తెలిపిన ఇవాంక తన వ్యక్తిగత కుటుంబానికి సమయం అవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు. View this post on Instagram A post shared by Ivanka Trump (@ivankatrump) 2024 ఎన్నికల్లో ఇవాంక తండ్రి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లిక్ పార్టీ తరుపున పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ పార్టీ నుంచి పోటీ చేయదలచిన అభ్యర్థుల్లో ట్రంప్ ముందు వరుసలో ఉన్నారు. అయితే.. గత ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయన ఇటీవల జైలుకు కూడా వెళ్లారు. ఇదీ చదవండి: మాస్కోకు నార్త్ కొరియా కిమ్.. పుతిన్‌తో రహస్య భేటీ? -
70 ప్లస్... తగ్గేదేల్యా!.. ఫొటో వైరల్
గోవాలో గ్రామీణ బామ్మలు సర్ఫ్బోర్డులతో సర్ఫింగ్‌కు వెళితే? అనే ఊహను ఏఐ సాంకేతికతతో నిజం చేసిన ఫొటో వైరల్ అవుతోంది. ఆశిష్ జోస్ అనే యూజర్ ఈ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘నానీస్ ఎట్ ది బీచ్’ అని క్యాప్షన్ ఇచ్చిన ఈ ఫోటోపై యూజర్స్ నుంచి రకరకాల కామెంట్స్ వచ్చాయి. ‘ఫొటో కాదు. బామ్మలు నిజంగానే సర్ఫింగ్ చేస్తే ఎంత బాగుండేదో’ అని ఒకరు కామెంట్ రాస్తే, మరొకరు ‘వెండి వొరెల్ వీడియో చూడండి చాలు’ అని సలహా ఇచ్చారు. టెక్సాస్‌కు చెందిన వెండి వొరెల్ వయసు 70 సంవత్సరాల పైమాటే. ఈ వయసులోనూ సర్ఫింగ్ చేస్తూ ‘ఉమెన్ ఆఫ్ ది వేవ్’గా పేరు తెచ్చుకొని ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది. చదవండి: ఈమె దెయ్యమా.. మనిషా..? అనుమానం వస్తే తప్పులేదు.. ఎందుకంటే? -
సర్ఫింగ్ క్రీడాకారిణి మృతి.. శిక్షణ సమయంలో ప్రమాదం
శాన్సాల్విడార్: మధ్య ఆమెరికా దేశమైన ఈఐ సాల్వడార్ జాతీయ సర్ఫింగ్ జట్టు క్రీడాకారిణి కేథరీన్ డియాజ్(22) మృతి చెందారు. శిక్షణ పొందుతున్న సయమంలో చోటు చేసున్న ప్రమాదంలో ఆమె మృతి చెందినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ తెలిపింది. దేశంలోని నైరుతి పసిఫిక్ వైపు గల ఎల్ తుంకో బీచ్ల్ ఆమె మృతదేహం బయటపడినట్లు పేర్కొంది. అంతర్జాతీయ సర్ఫింగ్ టోర్నమెంట్లలో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి డియాజ్ సన్నద్ధమవుతోందని సర్ఫింగ్ ఫెడరేషన్ సభ్యుడొకరు తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అధ్యక్షుడు యామిల్ బుకెల్ మాట్లాడుతూ.. ఆమె కుటంబం సభ్యులు, స్నేహితులకు సంఘీభావం తెలిపారు. డియాజ్ మృతి సర్ఫింగ్ జట్టుకు తీరని లోటు అని పేర్కొన్నారు. చదవండి: జపాన్‌లో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ -
షికారుకని వచ్చి షార్క్‌కు చిక్కాడు
-
షికారుకని వచ్చి షార్క్‌కు చిక్కాడు
బ్రిస్బేన్ : బీచ్‌లో సర్ఫింగ్ చేద్దామని వచ్చిన ఒక వ్యక్తిని దాదాపు మూడు మీటర్లు ఉన్న షార్క్(పెద్ద చేప) దాడి చేసిన ఘటన ఆస్ట్రేలియాలో చోటు చేసుకుంది. వివరాలు.. బ్రిస్బేన్‌కు దక్షిణంగా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కింగ్స్క్లిఫ్లోని బీచ్‌కు ఒక వ్యక్తి వచ్చాడు. బీచ్‌లో సర్ఫింగ్ చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా దాదాపు 3మీటర్లు ఉన్న పెద్ద సొరచేప అతనిపై హఠాత్తుగా దాడి చేసింది. ఈ ప్రమాదంలో వ్యక్తి కాలు సొరచేపకు చిక్కడంతో దాని నుంచి బలంగా లాగే క్రమంలో తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో బీచ్‌కు వచ్చిన బోట్ రైడర్లు, ఇతరులు గాయపడిన వ్యక్తిని ఒడ్డుకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స నిర్వహించారు. అయితే గాయం తీవ్రంగా కావడంతో కొద్దిసేపటికే ఆ వ్యక్తి మరణించాడు.(బీరు గుటగుటా తాగిన చేప: మంచిదేనా?) ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించడంతో వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. ఇంకా ఆ వ్యక్తి ఎవరో తెలియదని.. వయసు మాత్రం 60 ఉంటుందని, బహుశా క్వీన్‌లాండ్స్ రాష్ట్రానికి చెందినవాడిగా అనుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియాలో షార్క్ దాడులు ఎక్కువగా ఉంటాయి. అయితే షార్క్ దాడిలో మరణాలు సంభవించడం మాత్రం అరుదుగా జరుగుతుంటుంది. గతేడాది ఆస్ట్రేలియాలో 27 షార్క్ దాడులు జరిగాయి. -
హేడెన్ గాయాన్ని తమిళనాడు మ్యాప్‌తో పోల్చాడు..
కేప్‌టౌన్: ఆసీస్ మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ తలకు అయిన గాయంపై విభిన్నంగా స్పందించాడు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటీ రోడ్స్. మాథ్యూ హేడెన్ గాయాన్ని తమిళనాడు మ్యాప్‌తో పోల్చాడు రోడ్స్. ‘హేడెన్... నీ నుదిటిపై తమిళనాడు మ్యాప్ వేసుకున్నావా? బుడ్డీ నిజమైన నిబద్ధత కలిగి ఉన్నావ్.. నిన్ను అనుసరించి కొంతమంది అదే విధంగా టాటూలు వేసుకునే అవకాశం ఉంది’ అని హేడెన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోకు కామెంట్ చేశాడు. తమిళనాడుతో హేడెన్‌కు ఉన్న అనుబంధాన్ని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన హేడెన్.. తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. దీన్ని ఉదాహరిస్తూ జాంటీ రోడ్స్ కామెంట్ చేశాడు. గత శుక్రవారం హేడెన్ ఫ్యామిలీతో కలిసి క్వీన్స్లాండ్ దీవులకు హాలిడే ట్రిప్‌కు వెళ్లాడు. అక్కడ స్ట్రాడ్‌బ్రోక్ ఐస్‌ల్యాండ్‌లో తన కొడుకు జోష్‌తో కలిసి సరదాగా సర్ఫింగ్ గేమ్ ఆడాడు. అయితే ఈ ఆటలో పట్టుకోల్పయిన హెడెన్ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ఘటనలో అతని తల బోటును ఢీకొట్టడంతో తీవ్రగాయలయ్యాయి. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక ఈ విషయాన్ని హేడెన్ స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో గాయాలతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘జోష్‌తో సర్ఫింగ్ చేస్తూంటే గాయమైంది. కొద్ది రోజులు ఆటకు దూరంగా ఉండాలి. నా మంచి కోరిన నా శ్రేయోభిలాషులందరికి ధన్యవాదాలు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ చేసిన వైద్యులు నా తలకు, మెడకు గాయాలయ్యాయని, మెడలోని సీ6, సీ5, సీ4 లిగ్మెంట్స్ విరిగినట్లు చెప్పారు. త్వరలోనే కోలుకుంటా’ అని పేర్కొన్నాడు. -
తీవ్రంగా గాయపడ్డ ఆసీస్ మాజీ క్రికెటర్
సిడ్నీ: ఆస్ట్రేలియా మాజీక్రికెటర్, విధ్వంసకర బ్యాట్స్‌మన్ మాథ్యూ హెడెన్ ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. అదృష్టవశాత్తు ప్రాణపాయం తప్పినా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. గత శుక్రవారం హెడెన్ ఫ్యామిలీతో కలిసి క్వీన్స్లాండ్ దీవులకు హాలిడే ట్రిప్ వెళ్లాడు. అక్కడ స్ట్రాడ్‌బ్రోక్ ఐస్‌ల్యాండ్‌లో తన కొడుకు జోష్‌తో కలిసి సరదాగా సర్ఫింగ్ గేమ్ ఆడాడు. అయితే ఈ ఆటలో పట్టుకోల్పయిన హెడెన్ ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ఘటనలో అతని తల బోటును ఢీకొట్టడంతో తీవ్రగాయలయ్యాయి. వెంటనే అతన్ని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇక ఈ విషయాన్ని హెడేనే స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో గాయాలతో ఉన్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘జోష్‌తో సర్ఫింగ్ చేస్తూంటే గాయమైంది. కొద్ది రోజులు ఆటకు దూరంగా ఉండాలి. నా మంచి కోరిన నా శ్రేయోభిలాషులందరికి ధన్యవాదాలు. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ చేసిన వైద్యులు నా తలకు, మెడకు గాయాలయ్యాయని, మెడలోని సీ6, సీ5, సీ4 లిగమెంట్స్ విరిగినట్లు చెప్పారు. త్వరలోనే కోలుకుంటాను.’అని పేర్కొన్నాడు. ఆసీస్ తరపున 103 వన్డేలు, 161 టెస్ట్‌లు, 9 టీ20లాడిన హెడెన్ 2009లో దక్షిణాఫ్రికాతో చివరి టెస్ట్ 2008లో భారత్‌తో తన చివరి వన్డే ఆడాడు. View this post on Instagram Ok. Last attention seeking post I promise. Just wanted to say a big thank you to all our mates on Straddie who have been so supportive.✅🏄🏽♂️🙏 Especially Ben & Sue Kelley for the fast diagnosis with MRI, CT scan. Fractured C6, torn C5,C4 ligaments safe to say I truly have dodged a bullet. Thank you everyone ❤️ On the road to recovery 🏄🏽♂️🎣 A post shared by Matthew Hayden (@haydos359) on Oct 7, 2018 at 3:44am PDT -
భయానక దాడి; ప్రపంచ స్థాయి టోర్నీ రద్దు
పెర్త్: రంపంలాంటి పళ్లతో మనుషుల్ని నమిలిమింగే సొర చేపలు(షార్క్‌లు) బీభత్సం సృష్టించాయి. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు సర్ఫర్లపై భయకరంగా దాడిచేశాయి. దీంతో అట్టహాసంగా జరగాల్సిన ప్రపంచ స్థాయి సర్ఫింగ్ పోటీలు అనూహ్యంగా రద్దయ్యాయి. వరల్డ్ సర్ఫ్ లీగ్(డబ్ల్యూఎస్‌ఎల్) ఈ మేరకు బుధవారం ఉదయం అధికారిక ప్రకటన చేసింది. మనిషి నెత్తురు కోసం ఆరాటంగా: ఔత్సాహిక సర్ఫర్లను ప్రోత్సహిస్తూ, సాహసక్రీడను వ్యాప్తి చేయాలన్న ఉద్దేశంతో వరల్ట్ సర్ఫ్ లీగ్ ప్రపంచ స్థాయి టోర్నీలను నిర్వహిస్తుంది. తాజాగా ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ‘మార్గరేట్ రివర్ ప్రో’ కు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. అక్కడి గ్రేస్ టౌన్ చుట్టుపక్క తీరాల్లో సర్ఫర్లు తమ విన్యాసాలు చేశారు. ఏప్రిల్ 22 వరకు జరుగనున్న ఈ ఈవెంట్ సొర చేపల దాడితో అర్ధాంతరంగా రద్దైపోయింది. సర్ఫింగ్ చేస్తోన్న క్రీడాకారులపై వరుసగా సోమ, మంగళవారాల్లో దాడులు జరిగాయి. మనిషి నెత్తురు కోసం ఆరాటపడే షార్క్‌లు చాకచక్యంగా దాడులు చేస్తాయన్న సంగతి తెలిసిందే. షార్క్‌ల దాడిలో తృటిలో ప్రాణాలను దక్కించుకున్న సర్ఫర్లను హుటాహుటిన ఆస్పత్రులకు తరలించారు. వెరీ సారీ: ‘‘సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ సొర చేపలు దాడిని అడ్డుకోలేకపోయాం. క్రీడాకారుల భద్రత దృష్ట్యా ఈ దఫా పోటీలను రద్దు చేస్తున్నాం. గాయపడ్డ ఇద్దరిలో ఒకరి పరిస్థితి కాస్త విషమంగా ఉంది. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. టోర్నీని రద్దు చేయడం బాధాకరమే అయినా, తప్పడంలేదు. క్రీడాకారులందరికీ సారీ.’’ అని డబ్ల్యూఎస్‌ఎల్ అధికారిక ప్రతినిధి సోఫీ మీడియాకు వివరించారు. -
సొర చేపలు బీభత్సం సృష్టించాయి
-
మేము సర్ఫింగ్ చేస్తే... లోకమే చూడదా..!
సాధారణంగా అలలపై ప్రయాణం అంటే మనకు ఒకింత భయం వేస్తుంది.. అదే భీకరంగా ఎగిసే అలల మీద సర్ఫింగ్ అంటే.. ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలలపై తేలుతూ ముందుకు సాగుతుంటూ.. అదొక అనుభూతి. మీరేం గొప్ప మేమూ చేస్తాం.. అని కొన్ని పెంపుడు కుక్కులు అలలపై సర్ఫంగ్ చేస్తూ.. అందరినీ ఆకర్షిస్తున్నాయి. కాలిఫోర్నియాలోని హంటింగ్టన్ బీచ్‌లో ఈ ఏడాది నిర్వహించిన డాగ్స్ సర్ఫింగ్ పోటీల్లో 70 దాకా శునకాలు పాల్గొన్నాయి. ఈ పోటీలను శని, ఆదివారాల్లో నిర్వాహకులు నిర్వహించారు. ఈ పోటీల్లో పెంపుడు కుక్కలు సర్ఫింగ్ చేస్తూ అందరినీ అలరించాయి. ఈ బీచ్‌లో ప్రతి ఏడాది డాగ్స్ సర్ఫింగ్ పోటీలు పెడతామని నిర్వాహకులు చెబుతున్నారు. -
కళ్లుచెదిరే సర్ఫింగ్ ఫొటోలు
-
కోల్పోయింది చెయ్యిని మాత్రమే.. ధైర్యాన్ని కాదు
బెథానీ హామిల్టన్ కు అప్పుడు 13 ఏళ్లు .. షార్క్ దాడి చేసిన ఘటనలో ఎడమ చేతిని కోల్పోయింది. అయితే తాను కోల్పోయింది చెయ్యిని మాత్రమే అని, తన ధైర్యాన్ని, సాహసాన్ని కాదని నిరూపించింది. ప్రస్తుతం ఆమె వయసు 26 ఏళ్లు. సరిగ్గా ఆ ఘటన జరిగి 13 ఏళ్లు గడిచాయి. సర్ఫింగ్ గేమ్ లో మకుటం లేని మహరాణిలా దూసుకుకోతోంది. సర్ఫింగ్ అంటేనే రాకాసి అలలు, ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి. ముఖ్యంగా అలలపై అలా దుసుకెళ్లాలంటే ఎంతో ధైర్యం ఉండాలి. కానీ, ఒక్క చేతితోనే అద్భుతాలను చేస్తోంది హామిల్టన్. గత నెలలో వరల్డ్ సర్ఫింగ్ లీగ్ లో సంచలనమే చేసింది. సర్ఫింగ్ లీగ్ కమిషనర్ జెస్సీ మిలీ డైయర్ ఫిజీలో జరిగిన ఈవెంట్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హామిల్టన్ కు అవకాశాన్ని కల్పించింది. మూడో స్థానంలో నిలిచి తోటి సర్ఫర్స్ కు ప్రేరణగా నిలిచింది. కొడుకును ఎంతో ప్రేమగా పెంచుకున్నట్లు చెప్పిన హామిల్టన్, తన జీవితాన్ని కథాంశంగా చేసుకుని డాక్యుమెంటరీ తీస్తానంటోంది. తాను ఒక చేతితో సర్ఫింగ్ చేయడాన్ని మాత్రమే కాదు, తల్లి అయిన తర్వాత కాంపిటీషన్స్ లో పాల్గొనడాన్ని కూడా ప్రస్తావిస్తానని చెప్పింది. వచ్చే సీజన్లో 'సర్ఫ్ లైక్ ఏ గర్ల్' విడుదల చేస్తానని, ఏ వ్యక్తిని తక్కువగా అంచనా వేయరాదని.. ఒకసారి మనం మాస్టర్ అయితే అందరూ గౌరవిస్తారని అభిప్రాయపడింది. చేతిని కోల్పోయిన 13 వారాలకే సర్ఫింగ్ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అది ఆమె పట్టుదలకు నిదర్శనంగా నిలుస్తోంది.హామిల్టన్ సర్ఫింగ్ స్కిల్స్ ను 11 సార్లు పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన కెల్లీ స్లేటర్ ప్రశంసించాడు. ఆమె తెగువను నిజంగానే మెచ్చుకోవాలన్నాడు. తనలాగే ఒక చెయ్యి ఉన్నవారు సర్ఫింగ్ ట్రై చేయాలని, తాను కూడా మొదట్లో ఎంతో భయపడ్డా చివరికి సాధించానంటూ హామిల్టన్ పిలుపునిచ్చింది. -
సర్ఫింగ్ స్టార్..
-
అంతెత్తున్న అలపై అలవోకగా..
అనకొండలా మింగేయడానికి వస్తున్నట్లు ఉన్న ఈ ‘అల’కొండను చూశారా? దీని ఎత్తు ఏకంగా 80 అడుగులు! అయినా సరే.. అంతెత్తున్న తుపాను అలపై అలవోకగా సర్ఫింగ్ చేసేశాడు బ్రిటన్‌లోని డెవాన్‌కు చెందిన ఆండ్రూ కాటన్. ఆదివారం పోర్చుగీస్‌లోని నజారే తీరంలో ఈ సాహసకృత్యాన్ని చేశాడు. ఇప్పటివరకూ 78 అడుగులున్న అలపై సర్ఫింగ్ చేయడమే ప్రపంచ రికార్డుగా ఉంది. ఇది 80 అడుగుల అల అని చెబుతున్నారు. ఇతడి రికార్డును గిన్నిస్ బుక్ వారు ధ్రువీకరించాల్సి ఉంది.