![dogs Surf Competition - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/25/dog-1.jpg.webp?itok=pWcR2Iah)
సాధారణంగా అలలపై ప్రయాణం అంటే మనకు ఒకింత భయం వేస్తుంది.. అదే భీకరంగా ఎగిసే అలల మీద సర్ఫింగ్ అంటే.. ఒళ్లు గగుర్పొడుస్తుంది. అలలపై తేలుతూ ముందుకు సాగుతుంటూ.. అదొక అనుభూతి. మీరేం గొప్ప మేమూ చేస్తాం.. అని కొన్ని పెంపుడు కుక్కులు అలలపై సర్ఫంగ్ చేస్తూ.. అందరినీ ఆకర్షిస్తున్నాయి.
కాలిఫోర్నియాలోని హంటింగ్‌టన్ బీచ్‌లో ఈ ఏడాది నిర్వహించిన డాగ్స్ సర్ఫింగ్ పోటీల్లో 70 దాకా శునకాలు పాల్గొన్నాయి. ఈ పోటీలను శని, ఆదివారాల్లో నిర్వాహకులు నిర్వహించారు. ఈ పోటీల్లో పెంపుడు కుక్కలు సర్ఫింగ్ చేస్తూ అందరినీ అలరించాయి. ఈ బీచ్‌లో ప్రతి ఏడాది డాగ్స్ సర్ఫింగ్ పోటీలు పెడతామని నిర్వాహకులు చెబుతున్నారు.
![1](https://www.sakshi.com/gallery_images/2017/09/25/dog-2.jpg)
![2](https://www.sakshi.com/gallery_images/2017/09/25/dog-4.jpg)
![3](https://www.sakshi.com/gallery_images/2017/09/25/dog-1.jpg)
![4](https://www.sakshi.com/gallery_images/2017/09/25/dog-5.jpg)
![5](https://www.sakshi.com/gallery_images/2017/09/25/dog-6.jpg)
![6](https://www.sakshi.com/gallery_images/2017/09/25/dog8.jpg)