![Surfing Player Katherine Diaz Deceased In Salvadoran - Sakshi](/styles/webp/s3/article_images/2021/03/20/surfing.jpg.webp?itok=X9tYoBga)
శాన్‌సాల్విడార్: మధ్య ఆమెరికా దేశమైన ఈఐ సాల్వడార్ జాతీయ సర్ఫింగ్ జట్టు క్రీడాకారిణి కేథరీన్ డియాజ్(22) మృతి చెందారు. శిక్షణ పొందుతున్న సయమంలో చోటు చేసున్న ప్రమాదంలో ఆమె మృతి చెందినట్లు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ తెలిపింది. దేశంలోని నైరుతి పసిఫిక్ వైపు గల ఎల్ తుంకో బీచ్‌ల్ ఆమె మృతదేహం బయటపడినట్లు పేర్కొంది. అంతర్జాతీయ సర్ఫింగ్ టోర్నమెంట్లలో తమ దేశానికి ప్రాతినిధ్యం వహించడానికి డియాజ్ సన్నద్ధమవుతోందని సర్ఫింగ్ ఫెడరేషన్ సభ్యుడొకరు తెలిపారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అధ్యక్షుడు యామిల్ బుకెల్ మాట్లాడుతూ.. ఆమె కుటంబం సభ్యులు, స్నేహితులకు సంఘీభావం తెలిపారు. డియాజ్ మృతి సర్ఫింగ్ జట్టుకు తీరని లోటు అని పేర్కొన్నారు.
చదవండి: జపాన్‌లో భారీ భూకంపం.. సునామి హెచ్చరికలు జారీ
Comments
Please login to add a commentAdd a comment