సాక్షి, విశాఖపట్నం: ఫార్మా మృతుల కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ ఆర్థిక సాయం అందించింది. చనిపోయినవారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, గాయపడ్డ వారికి రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేసినట్లు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో సహాయక కార్యక్రమాల్లో పార్టీ శ్రేణులు పాల్గొనాలని వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. చాలాచోట్ల విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురవుతున్నారని.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి. గుడ్లవల్లేరు ఘటనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’’ అంటూ బొత్స ప్రశ్నించారు.
బాత్‌రూమ్‌లో కెమెరాలు కోసం ఎన్ని రోజులు విచారణ చేస్తారు. కెమెరాలు బాత్ రూమ్‌లో లేకపోతే విద్యార్థులు ఎందుకు ధర్నాలు చేస్తున్నారు.. వీడియోలు ఎందుకు బయటకు వచ్చాయి. చంద్రబాబు, లోకేష్ అక్కడ ఏమి జరగలేదని చెప్పగలరా?. వైఎస్సార్‌సీపీ పాలనలో ఎక్కడ ఇటువంటి సంఘటనలు జరగలేదు. విశాఖలో లోకేష్ విద్యార్థులతో ఇంట్రాక్ట్ అయ్యారు. 47 వేల క్లాస్ రూమ్‌లను గత ప్రభుత్వం డిజిటలైజేషన్ చేసింది. 20 వేల క్లాస్ రూమ్‌ల్లో టీవీలు ఏర్పాటు చేశాం’’ అని బొత్స తెలిపారు.
‘‘విద్యార్థుల కోసం ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టింది. అన్ని వసతులను చూసి లోకేష్ మెచ్చుకున్నారు. ఇది గత ప్రభుత్వ ఘనత. విద్యార్థుల చదువు కోసం వైఎస్ జగన్ సర్కార్ అమ్మఒడి పేరుతో తల్లుల ఖాతాలో డబ్బులు వేశారు. ఈ కూటమి ప్రభుత్వం కనీసం ఒక్క విద్యార్థికి ప్రభుత్వం డబ్బులు వేయలేదు.’’ అంటూ బొత్స సత్యనారాయణ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment