అమెరికాలో మరో దారుణం చోటు చేసుకోంది. భారత సంతతికి చెందిన ఓ వ్యక్తి ఓక్లహోమా రాష్ట్రంలో మృతి చెందారు. ఆయన గుజరాత్‌కు చెందిన హెమంత్ మిశ్రాగా పోలీసులు గుర్తించారు. ఆయన ఓక్లహోమాలోని ఓ హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నారు. జూన్ 22 రాత్రి 10 గంటల సమయంలో హోటల్ నుంచి వెళ్లిపోవాలని రిచర్డ్ లూయిస్ అనే వ్యక్తిని హెమంత్ కోరారు. దీంతో అతను కోపంతో హెమంత్ మిశ్రా ముఖంపై దాడి చేశాడు.
దీంతో ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ హెమంత్ మిశ్రా మరణించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఓ హోట్‌ల్‌లో దాక్కున్న నిందితుడు రిచర్డ్ లూయిస్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. రిచర్డ్‌ను హోటల్ నుంచి హెమంత్ ఎందుకు వెళ్లిపోవాలన్నాడు అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment