అంతెత్తున్న అలపై అలవోకగా..
అనకొండలా మింగేయడానికి వస్తున్నట్లు ఉన్న ఈ ‘అల’కొండను చూశారా? దీని ఎత్తు ఏకంగా 80 అడుగులు! అయినా సరే.. అంతెత్తున్న తుపాను అలపై అలవోకగా సర్ఫింగ్ చేసేశాడు బ్రిటన్‌లోని డెవాన్‌కు చెందిన ఆండ్రూ కాటన్. ఆదివారం పోర్చుగీస్‌లోని నజారే తీరంలో ఈ సాహసకృత్యాన్ని చేశాడు. ఇప్పటివరకూ 78 అడుగులున్న అలపై సర్ఫింగ్ చేయడమే ప్రపంచ రికార్డుగా ఉంది. ఇది 80 అడుగుల అల అని చెబుతున్నారు. ఇతడి రికార్డును గిన్నిస్ బుక్ వారు ధ్రువీకరించాల్సి ఉంది.