ఈ స్టార్​ కమెడియన్​ ఒక మిలియనీర్ !.. ఆస్తులు ఎంతంటే ? | Kapil Sharma Will Become Millionaire With His Shows | Sakshi

Kapil Sharma: ఈ స్టార్​ కమెడియన్​ ఒక మిలియనీర్ !.. ఆస్తులు ఎంతంటే ?

Feb 1 2022 1:48 PM | Updated on Feb 1 2022 2:13 PM

Kapil Sharma Will Become Millionaire With His Shows - Sakshi

Kapil Sharma Will Become Millionaire With His Shows: బీటౌన్​లో మోస్ట్ పాపులర్​ కమెడియన్​లో కపిల్ శర్మ ఒకరు. ఆయన పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కామెడీ నైట్స్​ విత్​ కపిల్ శర్మతో స్టార్​ కమెడియన్​గా మారాడు. బాలీవుడ్​లో ఏ స్టార్ హీరో సినిమా రిలీజ్​ అయినా కపిల్​ షోకి వచ్చి ప్రమోట్​ చేసుకోవాల్సిందే అన్నంత రేంజ్​లో కపిల్​ విజయం సాధించాడు. ఇటీవల దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మక చిత్రం ఆర్​ఆర్​ఆర్​ ప్రమోషన్​లో భాగంగా కపిల్​ షోలో సందడి చేసిన సంగతి తెలిసిందే.

అంతేకాకుండా ఈ స్టార్​ కమెడియన్​పై త్వరలో బయోపిక్​ కూడా రానుంది. కపిల్‌ శర్మపై వస్తోన్న ఈ బయోపిక్‌ చిత్రానికి 'ఫంకార్‌' అని టైటిల్‌ పెట్టారు. దీనికి మహావీర్‌ జైన్‌ నిర్మాతగా వ్యవహరించగా మృగ్ధీప్‌ సింగ్‌ లంబ దర్శకత్వం చేయనున్నారు. ఇదిలా ఉంటే పలు నివేదికల ప్రకారం కపిల్ శర్మ మొత్తం ఆస్తులు రూ. 242 కోట్లు అని తెలుస్తోంది. నెలకు రూ. 3 కోట్లకుపైగా సంపాదిస్తున్నాడట కపిల్​. కపిల్​ శర్మ తన నెల మొత్తం సంపాదనతో ఒక లక్జీరియస్​ ఇల్లు కొనగలడని సమాచారం. 

ఇప్పటికే కపిల్ శర్మ ఇల్లు ముంబైలోని చాలా పాష్​ ఏరియాలో ఉందట. ఇంతేకాకుండా అతను టీవీ ఎపిసోడ్ కోసం రూ. 40 నుంచి 90 లక్షల వరకు తీసుకుంటాడని సమాచారం. కపిల్​ శర్మకు దేశవ్యాప్తంగా రియల్​ ఎస్టేట్​ ఆస్తులున్నాయట. ఇవికాకుండా మెర్సిడెస్ బెంజ్​, వోల్వో ఎక్స్​సీ 90, రేంజ్ రోవర్ ఎవోక్ ఎస్​డీ4 వంటి ఖరీదైన వాహనాలు కూడా ఉన్నాయి. ఇవన్ని చూస్తుంటే ఈ స్టార్​ కమెడియన్​ ఒక రకంగా మిలియనీర్​ అని బాలీవుడ్​లో టాక్​ వినిపిస్తోంది. ఇటీవలే ఓటీటీ దిగ్గజ సంస్థ నెట్​ఫ్లిక్స్​లో 'ఐయామ్​ నాట్ డన్​ ఎట్' షోకు హోస్ట్​గా కూడా చేస్తున్నాడు కపిల్​.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement