సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన తాజా చిత్రం లాల్ సలామ్. గతేడాది జైలర్ సినిమాతో హిట్ కొట్టిన తలైవా ఈ ఏడాది తన కూతురి దర్శకత్వంలో నటించారు. యంగ్ హీరో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ సినిమా అభిమానుల భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో తలైనా మొహిద్దీన్ భాయ్ అనే కీలక పాత్రలో నటించారు. రజినీకాంత్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక కోలీవుడ్‌లో అయితే చెప్పాల్సిన పనిలిదు. రజినీకాంత్ మూవీ అంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దవ్వాల్సిందే.
కానీ ఎవరు ఊహించని లాల్ సలామ్ చిత్రానికి బిగ్ షాక్ తగిలింది. కోలీవుడ్‌లో ఫర్వాదలేనిపించినా.. తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ మూవీని అస్సలు పట్టించుకోలేదు. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఏకంగా మార్నింగ్ షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూపర్ స్టార్ సినిమా తొలి రోజే చాలా చోట్ల మార్నింగ్ షోలు రద్దయ్యాయి.
దీంతో హైదరాబాద్‌లో అయితే మల్టీప్లెక్స్‌ల్లో రజినీ సినిమా చూడాలనుకున్న తెలుగు ఆడియన్స్‌కు నిరాశే మిగిలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల టికెట్లు కొనేవాళ్లు లేక మార్నింగ్ షోలు రద్దు చేశారు. అయితే ఇప్పటికే కొంత మంది టికెట్స్ బుక్ చేసుకోగా.. థియేటర్ల యాజమాన్యాలు వాళ్లకు డబ్బులు రీఫండ్ చేయడం గమనార్హం. తలైవా నటించిన సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షోలకే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అయితే తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో రవితేజ ఈగల్, జీవా, మమ్ముట్టి యాత్ర-2 సినిమాలు రిలీజ్ కావడం ఒక కారణమని తెలుస్తోంది. ఏది ఏమైనా రజినీకాంత్ ఉన్న ఇమేజ్ ప్రకారం కనీసం సగం థియేటర్లు అయినా నిండి ఉండాల్సింది. ఏకంగా స్టార్ హీరో సినిమాకు ఫస్ట్ షోలు రద్దు కావడంతో ఆడియన్స్ షాక్‌కు గురవుతున్నారు. మరి వీకెండ్‌లోనైనా లాల్ సలామ్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సిందే.
కాగా.. గతంలో రజనీకాంత్ సినిమాలను తెలుగు ఆడియన్స్ బాగానే ఆదరించారు. గతేడాది వచ్చిన జైలర్ మూవీ టాలీవుడ్‌లో మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఏకంగా రూ.47 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment