రికార్డ్ ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ ప్రతి నెలా దేశంలోని సెలబ్రిటీలపై సర్వే నిర్వహించి, టాప్ ΄పోజిషన్‌లోని వారి జాబితాలను విడుదల చేస్తుంటుంది. అందులో భాగంగా నవంబరు నెలకుగాను మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను ప్రకటించగా హీరో ప్రభాస్ మొదటి స్థానంలో నిలిచారు. హీరోయిన్లలో సమంత తొలి స్థానాన్ని దక్కించుకున్నారు. అంతేకాదు... కథానాయికల జాబితాలో సమంత వరుసగా మూడో సారి (సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్) ఫస్ట్ ప్లేస్‌లో నిలవడం విశేషం.
ప్రభాస్ వరుసగా రెండో సారి (అక్టోబర్, నవంబర్) నిలిచారు. ఇక నవంబర్ నెలకు ప్రకటించిన మోస్ట్ పాపులర్ స్టార్ జాబితాలో ప్రభాస్ తర్వాతి స్థానంలో విజయ్ రెండో స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వరుసగా అల్లు అర్జున్, షారుక్ ఖాన్, ఎన్టీఆర్, అజిత్ కుమార్, మహేశ్‌బాబు, సూర్య, రామ్‌చరణ్, అక్షయ్ కుమార్ నిలిచారు.
ఇక హీరోయిన్ల విషయానికొస్తే... సమంత తొలి స్థానంలో నిలిచారు. వరుసగా మూడు నెలలపాటు ఆర్మాక్స్ మోస్ట్ పాపులర్ హీరోయిన్‌ల జాబితాలో తొలి స్థానంలో నిలిచి, హ్యాట్రిక్ రికార్డ్ సృష్టించారు సమంత. దీంతో ఆమె అభిమానులు ఖుషీ అవుతున్నారు. ఈ జాబితాలో సమంత తర్వాతి ప్లేస్‌లలో ఆలియా భట్, నయనతార, సాయి పల్లవి, దీపికా పదుకోన్, త్రిష, కాజల్ అగర్వాల్, రష్మికా మందన్నా, శ్రద్ధా కపూర్, కత్రినా కైఫ్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment