RRR Hindi Version Is Most Popular Film From India On Netflix Around The World - Sakshi
Sakshi News home page

RRR Movie: ఓటీటీలోనూ 'ఆర్‌ఆర్‌ఆర్' రికార్డు..

Published Fri, Jun 24 2022 7:15 AM | Last Updated on Fri, Jun 24 2022 9:48 AM

RRR Hindi Version Create Most Popular Indian Movie In Netflix Globally - Sakshi

RRR Hindi Version Create Most Popular Indian Movie In Netflix Globally: జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్‌గా జక్కన్న రూపొందించిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. విజువల్‌ ఎఫెక్ట్స్‌, మ్యూజిక్‌, యాక్టింగ్‌.. ఇలా అన్ని కోణాల్లో తిరుగులేదు అనిపించింది ఈ మూవీ. థియేటర్లలో కాసుల వర్షం కురిపించిన  ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ప్రస్తుతం ఓటీటీలోనూ దుమ్ములేపుతోంది. 

తమ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ చిత్రంగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ రికార్డు కొట్టినట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. తెలుగులో తెరకెక్కిన ఈ చిత్రం హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 నుంచి స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ మూవీ ఇప్పటివరకు 45 మిలియన్‌ అవర్స్‌ స్ట్రీమింగ్‌ అయిందట. అలా నెట్‌ఫ్లిక్స్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన ఇండియన్‌ సినిమాగా రికార్డు క్రియేట్‌ చేసినట్లు నెట్‌ఫ్లిక్స్‌ తెలిపింది. అలాగే ఈ మూవీ మరో ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ జీ5లో ఈ చిత్రం తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్‌ భాషల్లో స్ట్రీమింగ్‌ అవుతున్నాయి. 

చదవండి: 'పుష్ప 2'లో శ్రీవల్లి చనిపోతుందా ? నిర్మాత క్లారిటీ !
కమెడియన్‌ లైంగిక వేధింపులు.. 50 ఏళ్ల తర్వాత తీర్పు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement