IMDb Releases Top 10 Indian Movies And Web Series Of 2022, Check List Inside - Sakshi
Sakshi News home page

Movies And Web Series 2022: ఐఎమ్‌డీబీ రేటింగ్‌ ఇచ్చిన టాప్‌ 10 సినిమాల లిస్ట్‌ ఇదిగో!

Published Wed, Jul 13 2022 6:19 PM | Last Updated on Wed, Jul 13 2022 9:28 PM

IMDb Releases Top 10 Indian Movies and Web Series of 2022, Check List - Sakshi

కరోనా వల్ల సగటు ప్రేక్షకుడు మళ్లీ థియేటర్‌కు వస్తాడా? లేదా? అన్న అనుమానాలను పటాపంచలు చేశాయి ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌2 చిత్రాలు.. ఇవే కాకుండా ఇంకెన్నో సినిమాలు ఈ ఏడాది సూపర్‌ డూపర్‌ హిట్‌ అందుకున్నాయి. కంటెంట్‌ ఉంటే చాలు ప్రేక్షకులు తప్పకుండా సినిమాను ఆదరిస్తారని నిరూపించాయి. మరీ ముఖ్యంగా ఈసారి సౌత్‌ సినిమాలు బాలీవుడ్‌ను రఫ్ఫాడించాయి.

హిందీలోనూ వసూళ్లలో దూసుకుపోతూ విశ్లేషకులను సైతం ఆశ్చ్యపరిచాయి. తాజాగా ఐఎమ్‌డీబీ(ఇంటర్నెట్‌ మూవీ డాటాబేస్‌) ఈ ఏడాది టాప్‌ టెన్‌ మూవీస్‌ అండ్‌ టీవీ షోల జాబితాను రిలీజ్‌ చేసింది. ఇందులో 8.8 రేటింగ్‌తో విక్రమ్‌ మొదటి స్థానంలో నిలిచింది. మరి తర్వాతి స్థానంలో నిలిచిన సినిమాలేంటో కింద చూసేయండి..

1. విక్రమ్‌: 8.8/10
2. కేజీఎఫ్‌ చాప్టర్‌ 2: 8.5/10
3. ద కశ్మీర్‌ ఫైల్స్‌ : 8.3/10
4. హృదయం: 8.1/10
5.ఆర్‌ఆర్‌ఆర్‌ : 8/10
6. ఎ థర్స్‌డే: 7.8/10
7. ఝండ్‌: 7.4/10
8. సామ్రాట్‌ పృథ్వీరాజ్‌: 7.2/10
9. రన్‌వే 34: 7.2/10
10. గంగూబాయి కథియావాడి: 7/10

టాప్‌ 10 ఇండియన్‌ వెబ్‌ సిరీస్‌
1. క్యాంపస్‌ డైరీస్‌: 9/10
2. రాకెట్‌ బాయ్స్‌: 8.9/10
3. పంచాయత్‌: 8.9/10
4. అపహరణ్‌: 8.4/10
5. హ్యూమన్‌ : 8/10
6. ఎస్కేప్‌ లైవ్‌: 7.7/10
7. ద గ్రేట్‌ ఇండియన్‌ మర్డర్‌: 7.3/10
8. మై: 7.2/10
9. ద ఫేమ్‌ గేమ్‌: 7/10
10: యే కాలి కాలి అంఖేన్‌: 7/10

చదవండి: నితిన్‌ పాటకు మహేశ్‌ బాబు డ్యాన్స్‌ !.. 'వావ్‌' అని హీరో కామెంట్‌
రన్నింగ్‌ సీన్‌లో హీరోకు గాయాలు, అయినా పరుగు ఆపని బాలీవుడ్‌ స్టార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement