మాస్కో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఈనెల 22, 23 తేదీల్లో రష్యాలోని కజాన్ వేదికగా జరిగే 16వ బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనాలని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆహ్యానించారు. దీంతో ప్రధాని మోదీ.. రష్యా పర్యటనకు మరోసారి వెళ్లనున్నారు.
ఈ నేపథ్యంలో అధ్యక్షుడు పుతిన్ రష్యా మీడియాతో మాట్లాడుతూ.. భారతీయు సినిమాలు, బాలీవుడ్‌పై ప్రసంశలు కురిపించారు. భారతీయ సినిమాలకు తమ దేశంలో అత్యంత ప్రజాదరణ ఉందని అన్నారు. బ్రిక్స్ సభ్య దేశాలలో సినిమా షూటింగ్‌లకు రష్యా ప్రోత్సాహకాలు అందిస్తుందా? అని మీడియా అడిగిన ప్రశ్నకు.. పుతిన్ మాట్లాడుతూ..‘‘ బ్రిక్స్ సభ్య దేశాలను పరిశీలిస్తే.. రష్యాలో భారతీయ చలనచిత్రాలకు అధిక ప్రజాదరణ ఉందని నేను భావిస్తున్నా. మాకు ప్రత్యేకంగా టీవీ ఛానెల్ ఉంది. భారతీయ చలనచిత్రాలపై చాలా ఆసక్తిని కలిగి ఉన్నాం. ఈ ఏడాది మాస్కో అంతర్జాతీయ చలనచిత్రోత్సవం సందర్భంగా బ్రిక్స్ దేశాల్లోని సినిమాలను పరిచయం చేస్తాం.
#WATCH | On being asked about if Russia will give incentives to BRICS memeber states for shooting of films in the country, Russian President Putin says, "If we look at BRICS member states, I think in this country Indian films are most popular. We have a special TV channel with… pic.twitter.com/w0QGNdH0IV
— ANI (@ANI) October 18, 2024
..నేను భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో భేటీ కావడానికి సిద్ధంగా ఉన్నా. ఈ ప్రతిపాదనపై నా స్నేహితుడు మోదీతో చర్చించడానికి ఎదురు చూస్తూన్నా. తమ మధ్య మా మధ్య 100 శాతం సానుకూల ఒప్పందాలు జరుగుతాయని నమ్మకం ఉంది. ఇక.. భారతీయ చలనచిత్రాలు మాత్రమే కాకుండా వారి సంస్కృతులకు ప్రాతినిధ్యం వహించే బ్రిక్స్ దేశాల నటీనటులు, చైనీస్, ఇథియోపియన్ నటులు ఉన్నారు. అదేవిధంగా మేం థియేట్రికల్ ఫెస్టివల్ నిర్వహించాలని బ్రిక్స్ దేశాలతో చర్చించాం. సినిమా అకాడమీని కూడా నెలకొల్పాం’’ అని పుతిన్ అన్నారు.
ఇక.. గడిచిన నాలుగు నెలల్లో ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర తరువాత తొలిసారి మాస్కోలో ఈ ఏడాది జులై నెలలో మోదీ పర్యటించారు. ఆ సమయంలో 22వ భారత్–రష్యా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. 2006లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా దేశాలు బ్రిక్ గ్రూపును ప్రారంభించాయి. 2010లో దక్షిణాఫ్రికా చేరిన తరువాత అది బ్రిక్స్‌గా మార్చారు. 2024 జనవరిలో ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా చేరాయి. ప్రస్తుతం ఈ బ్రిక్స్ గ్రూపులో పది దేశాలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment