చిత్ర వైవిధ్యం | art with diversity | Sakshi
Sakshi News home page

చిత్ర వైవిధ్యం

Published Fri, Jan 16 2015 11:06 PM | Last Updated on Sat, Sep 2 2017 7:46 PM

చిత్ర వైవిధ్యం

చిత్ర వైవిధ్యం

ఆ ప్రదర్శనలో ఉన్న చిత్రాలను గమనిస్తే, గ్రూప్ షో మాదిరిగా అనిపిస్తుంది. ఒక్కో చిత్రానిదీ ఒక్కో శైలి. స్టిల్‌లైఫ్, పోర్టరైట్స్, ఫిగరేటివ్స్, సెమీ ఫిగరేటివ్స్, డిస్టార్షన్స్.. అన్నీ విభిన్నమే. చిత్రంగా.. వాటన్నింటిపైనా ఒకే సంతకం.. ఇది గ్రూప్ షో కాదు, సోలో షో. నగర కళాకారుడు హరి ‘అఫిసియోనాడోస్’ పేరిట బంజారాహిల్స్ హోటల్ తాజ్ దక్కన్‌లో ఏర్పాటు చేసిన వైవిధ్య భరిత చిత్ర ప్రదర్శన కళాభిమానులకు కనువిందు చేస్తోంది.

బసవతారకం ఇండో-అమెరికన్ కేన్సర్ ఆస్పత్రి సహాయార్థం ఈ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. శుక్రవారం జరిగిన ప్రారంభోత్సవంలోభారతీ సిమెంట్స్ సీవోవో అనూప్‌కుమార్ సక్సేనా, నటి జయసుధ, బసవతారకం కేన్సర్ ఆస్పత్రి సీఈవో ఆర్.పి.సింగ్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సీఎండీ వి.బి.గాడ్గిల్, పింకీరెడ్డి హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement