Hepatitis B
-
హెపటైటిస్-బి అంటే ఏంటి? సూదులు, సిరంజీలతో ఇంత డేంజరా?
ఒకసారి హెపటైటిస్-బి వైరస్ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దానిసంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్‌ను దెబ్బతీయడం ఆరంభిస్తుంది. ఈ వైరస్ శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. రక్తమార్పిడి, సూదులు, సిరింజిలు తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు. 1. పరీక్షల్లో - HBsAg పాజిటివ్‌గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్ ఉండి, SGPT (కాలేయానికి సంబంధించిన ఎన్జైమ్) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్ లోడ్ 5లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని! 2. ఈ వ్యాధిని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. వీళ్లు ముందుగానే మందులు తీసుకోవటం ద్వారా వ్యాధి నివారించుకునే అవకాశం ఉంది. 3. వైరస్ సన్నిహితులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. 4. సిర్రోసిస్ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవటం ముఖ్యం. 5. హెపటైటిస్-బి సోకిన వారు ఆల్కహాల్ ముట్టకూడదు, తరచూ వైద్యుల పర్యవేక్షణ చాలా అవసరం. కొందరికి ఇతరత్రా లివర్ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్-బి వైరస్ ఉన్న కారణంగా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.అందుకే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ఇది సోకుండా ముందస్తు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. హెపటైటిస్ - బి సెక్స్ ద్వారా సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి కండోమ్ వంటి సురక్షిత జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌లో పాల్గోనవద్దు. ఒకరి టూత్‌బ్రష్‌లు, రేజర్లు, నెయిల్‌కట్టర్లు వంటివి మరోకరు వాడొద్దు. బయట సెలూన్లలో కూడా కచ్చితంగా కొత్త బ్లేడు వాడేలా చూడాలి. ఇంజక్షన్ సూదుల వంటివి ఒకరికి వాడినవి మరొకరు ఉపయోగించవద్దు. డిస్పోజబుల్ సూదులు, సిరంజీలు వాడటం ఉత్తమం. చెవులు కుట్టటం, ముక్కులు కుట్టటం, పచ్చబొట్లు వేయించుకోవటం వీటికి ఒకరికి వాడిన పరికరాలు మీకు వాడకుండా చూసుకోవాలి. రక్తం ఎక్కించేటప్పుడు, రక్తమార్పడి విషయంలో పూర్తి సురక్షితమైన పద్ధతులను అనుసరించటం చాలా అవసరం! పెళ్లి చేసుకోవచ్చా? టీకాలున్నాయి కాబట్టి హెపటైటిస్ -బి బాధితులు ఈ విషయం ముందుగానే అందరికీ తెలిపి, వారి అనుమతితో నిశ్చితంగా పెళ్ళి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటటిస్ - బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్ వచ్చిన వాళ్ళు తప్పించి మిగతా అందరూ (అన్అఫెక్టెడ్ క్యారియర్స్ కూడా) పిల్లలను కూడా కనొచ్చు. అలా చేస్తేనే బిడ్డకు క్షేమం గర్భిణులంతా తప్పనిసరిగా HBsAg పరీక్ష చేయించుకోవాలి. హెపటైటిస్-బి ఉన్నా కూడా బిడ్డలను కనొచ్చు. గర్భస్రావాలు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే పుట్టగానే బిడ్డకు ఒక తొడకు Hepatitis-B ఇమ్యూనోగ్లోబ్యులిన్ల ఇంజక్షన్, మరో తొడకి హెపటైటిస్-బి టీకా రెండు తప్పకుండా ఇవ్వాలి. నెల రోజులకు మరో టీకా, ఆర్నెల్లకు మరో టీకా ఇప్పించాలి. దీంతో తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించకుండా 95 శాతం వరకూ నివారించవచ్చు. తప్పకుండా టీకాలు 1. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ఏ ప్రామాణిక సంస్థా కూడా ప్రజలంతా హెపటైటిస్ టీకా తప్పకుండా తీసుకోవాలని సిఫార్సు చెయ్యటం లేదు. కొంతమంది మాత్రం తప్పకుండా తీసుకోవాలి. 2. చిన్న పిల్లలకూ, స్కూలు వయసు పిల్లలందరకీ తప్పకుండా టీకా ఇప్పించాలి. 3. కుటుంబంలో ఎవరికన్నా హెపటైటిస్ -బి ఉంటే, ఆ ఇంట్లోని వారంతా తప్పకుండా టీకా తీసుకోవాలి. వైద్య సిబ్బంది, తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే రకరకాల వ్యాధి పీడితులకు కూడా టీకా తప్పనిసరి. 4. ఇవాళ మొదటి టీకా వేయించుకుంటే - మళ్ళీ సరిగ్గా నెలకు ఒకటి, ఆర్నెల్లకు మరోకటి, మొత్తం మూడు టీకాలే తీసుకోవాలి , మరియు నివారణ కోసం తప్పనిసరిగా హోమియో మందులు వాడితే మంచి ఫలితాలు వస్తాయి , - డాక్టర్ నవీన్ రోయ్,ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఫోన్ -9703706660 -
హెచ్ఐవీ కంటే హెపటైటిస్ ప్రమాదకరమా? అందులో నిజమెంత?
హెపటైటిస్ అనేది జబ్బు కాదు.. కొన్ని ఇన్ఫెక్షన్ల సమాహారం. హెపటైటిస్‌లో ఏ, బీ, సీ, డీ, ఈ అనే ఐదు రకాలు ఉన్నాయి. హెపటైటిస్ చాలా మందిలో ఉన్నప్పటికీ అది తమకు ఉన్నట్టే తెలియదు. సాధారణంగా 2, 3 వారాల్లో తగ్గిపోతుంది. కొద్ది మందిలో మాత్రం దీర్ఘకాలికంగా ఉండిపోతుంది. మొత్తం జనాభాలో 3 నుంచి 5 శాతం మంది హెపటైటిస్ బారిన పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. హెపటైటిస్ ముదిరితే లివర్ గట్టి బడి లివర్ సిర్రోసిస్, మరికొందరిలో లివర్ క్యాన్సర్‌కు దారితీయవచ్చు. ఇంతటి ప్రమాదకరమైన హెపటైటిస్ నుంచి ముందు జాగ్రత్త చర్యలు పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా రక్షణ పొందవచ్చని 40 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉన్న ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఇ.పెదవీర్రాజు సూచిస్తున్నారు. వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. – సీతంపేట(విశాఖ ఉత్తర) సాక్షి: హెపటైటిస్ అంటే ఏమిటి, ఎన్ని రకాలు, ఏ విధంగా వస్తుంది? డాక్టర్ పెదవీర్రాజు: హెపటైటిస్ నాలుగైదు రకాల వైరస్ల వల్ల వ్యాపిస్తుంది. హెపటైటిస్ ఏ, బీ, సీ,డీ, ఈ ఇలా ఐదు రకాల వైరస్ల వల్ల వ్యాధి బారిన పడతారు. ఇందులో హెపటైటిస్ బీ, సీ రకాలు కలుషితమైన రక్తం ఎక్కించుకోవడం, స్టెరిలైజ్ చేయని ఇంజక్షన్ సూదుల వల్ల, ఎక్కువ సార్లు శస్త్ర చికిత్సలు చేయించుకోవడం వల్ల వస్తుంది. ఏ, ఈ రకాలు కలుషితమైన నీరు, పాడైపోయిన ఆహారం వల్ల వ్యాపిస్తుంది. ముందు జాగ్రత్త చర్యలు పాటించం ద్వారా హెపటైటిస్ బారిన పడకుండా ఉండవచ్చు. సాక్షి: హెపటైటిస్ లక్షణాలు ఏమిటి? డాక్టర్ : హెపటైటిస్‌కు గురైన వారిలో జ్వరం, ఆకలి లేకపోవడం, నీళ్ల విరేచనాలు, తెలుపు రంగులో మోషన్, కడుపులో ఇబ్బంది, దురదలు, మూత్రం పచ్చగా రావడం, చర్మం, కంటిలోని తెల్లభాగం పసుపుగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రెండు నుంచి ఆరు వారాల లోపు వ్యాధి లక్షణాలు బయటపడతాయి. సాక్షి: హెపటైటిస్ బీ బారిన పడకుండా ఉండాలంటే ఏం చేయాలి? డాక్టర్ : హెపటైటిస్ బీని నివారించడానికి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. హెపటైటిస్ బీ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకుంటే రక్షణ ఉంటుంది. ఈ వ్యాక్సిన్ లివర్ క్యాన్సర్ బారిన పడకుండా కూడా రక్షణ కల్పిస్తుంది. భర్తకు హెపటైటిస్ బీ వస్తే భార్య.. ఇంటిలో ఒకరికి వస్తే మిగిలిన వారందరూ వ్యాక్సిన్ కచ్చితంగా తీసుకోవాలి. సాక్షి: హెపటైటిస్ సీ వైరస్ నుంచి రక్షణ పొందాలంటే..? డాక్టర్ : హెపటైటిస్ సీ కి గతంలో మందులు ఉండేవి కాదు. నాలుగేళ్ల నుంచి అద్భుతమైన మందులు అందుబాటులోకి వచ్చాయి. ఈ మందులు మూడు నెలలు వాడినట్లయితే హెపటైటిస్ సీ 95 శాతం నయం అవుతుంది. సాక్షి: హెపటైటిస్ ఏ, ఈ బారిన పడకుండా ఉండాలంటే..? డాక్టర్ : కలుషితం కాని ఆహారం, నీరు తీసుకోవడం వంటి ముందు జాగ్రత్త చర్యలు ద్వారా హెపటైటిస్ ఏ, ఈ బారిన పడుకుండా ఉండొచ్చు. హెపటైటిస్ ఏకు వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే వినియోగిస్తున్నారు. మనదేశంలో వ్యాక్సిన్ వినియోగించడం లేదు. హెపటైటిస్ ‘ఈ’కి వ్యాక్సిన్ లేదు. పరిసరాల పరిశుభ్రత, ఆహార నియమాలు పాటించడం ద్వారా ఏ, ఈ వైరస్ వ్యాప్తికి గురికాకుండా ఉండొచ్చు. సాక్షి: గర్భిణికి హెపటైటిస్ వస్తే పుట్టే శిశువుకు సంక్రమిస్తుందా? డాక్టర్ : గర్భిణికి హెపటైటిస్ బి ఉంటే పుట్టే శిశువుకు వచ్చే అవకాశం ఉంది. తల్లి గర్భంతో ఉన్నపుడు చేసే రక్త పరీక్షలో వ్యాధి నిర్ధారణ అయితే, బిడ్డ పుట్టగానే వ్యాక్సిన్‌తో పాటు హెచ్‌బీఐజీ ఇంజక్షన్ చేస్తారు. దీనివల్ల తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా కాపాడవచ్చు. ఇటీవల టెనోఫెవర్ మాత్రలు అందుబాటులోకి వచ్చాయి. గర్భిణికి హెపటైటిస్‘బి’ వ్యాధి సోకి ఉండి, వైరస్ శాతం బాగా ఎక్కువగా ఉంటే.. ఆమెకు చివరి మూడు నెలలు ఈ మాత్రలు ఇవ్వాలి. దీని వల్ల ఆమె నుంచి శిశువుకు వ్యాధి వ్యాప్తి చెందకుండా ఆపొచ్చు. సాక్షి: ప్రస్తుతం ఈ వ్యాధి తీవ్రత ఏ మేరకు ఉంది? డాక్టర్ : డాక్టర్ బ్లూమ్ బెర్గ్ తన బృందంతో విస్తృత పరిశోధనల ఫలితంగా 1967లో హెపటైటిస్ బీ వైరస్‌ను గుర్తించారు. ఆ తర్వాత 1969లో హెపటైటిస్ బీ వ్యాక్సిన్ కనిపెట్టారు. అప్పటి వరకు జాండిస్ ఎందుకు వస్తుందో తెలిసేది కాదు. పరిశోధనల వల్ల రక్తం ద్వారా వస్తుందని తెలిసింది. ఇప్పుడు రక్తం ఎక్కించే ముందు స్క్రీనింగ్ పరీక్షలు చేస్తున్నారు. అందువల్ల రక్తం ద్వారా హెపటైటిస్ బీ, సీ కూడా వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోయాయనే చెప్పాలి. సాక్షి: ఈ వ్యాధి బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డాక్టర్ : కలుషితం కాని ఆహారం, నీరు తీసుకోవడం ద్వారా హెపటైటిస్ ఏ, ఈ బారిన పడకుండా ఉండొచ్చు. వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా హెపటైటిస్ బీ రాకుండా రక్షణ పొందవచ్చు. హెపటైటిస్ బీ నివారణకు వ్యాక్సినే బెస్ట్ ప్రీవెన్షన్. రక్తం ఎక్కించే ముందు సరైన స్క్రీనింగ్ పరీక్షలు చేయడం ద్వారా హెపటైటిస్ బీ, సీ బారిన పడకుండా ఉండొచ్చు. హెపటైటిస్ డీ మన దేశంలో చాలా అరుదుగా వస్తుంది. ఇటలీలో కనిపిస్తుంది. ఒకప్పుడు హెపటైటిస్ వల్ల లివర్ సమస్యలు ఎక్కువగా వచ్చేవి. ప్రస్తుతం ఆల్కాహాల్, ఊబకాయం వల్ల ఎక్కువగా లివర్ సమస్యలు వస్తున్నాయి. ఢిల్లీ, బెనారస్ ప్రాంతాల్లో హెపటైటిస్ ఎక్కువగా ఉంది. ఆయా ప్రాంతాలకు వెళ్లి వచ్చిన వారు హెపటైటిస్ పరీక్ష చేయించు కోవడం మంచిది. సాక్షి: హెచ్ఐవీ కంటే హెపటైటిస్ ప్రమాదకరమా? డాక్టర్ : హెపటైటిస్ హెచ్ఐవీ కంటే ప్రమాదమన్న అపోహ ఉంది. అది నిజం కాదు. ఎందుకంటే చెమట ద్వారా, ముట్టుకోవడం, ముద్దు పెట్టుకోవడం వల్ల హెపటైటిస్ వ్యాపించదు. ఇంజక్షన్, శరీరంలోకి రక్తం ఎక్కించడం ద్వారా వ్యాపిస్తుంది. వ్యాధిగ్రస్తుడు వాడే రేజర్, బ్రష్, నెయిల్ కట్టర్ వేరుగా ఉంచాలి. భర్తకు హెపటైటిస్ బీ వస్తే భార్య వ్యాక్సిన్ తీసుకోవాలి. ఆ వ్యాక్సిన్ పని చేసే వరకు అంటే.. ఆరు నెలల వరకు కండోమ్ వాడాలి. సాక్షి: జాండిస్ తగ్గడానికి అల్లోపతి వైద్యం పనికిరాదనే అపోహ ఉంది. నిజమేనా? డాక్టర్ : జాండిస్ రాగానే అల్లోపతిలో మందు లేదని చాలా మందిలో అపోహ ఉంది. నాటు వైద్యానికి వెళ్లిపోతున్నారు. హైపటైటిస్ ఏ, బీ, సీ వచ్చినా సాధారణంగా రెండు మూడు వారాల్లో తగ్గిపోతుంది. అందువల్ల పసరు మందు రెండు మూడు వారాలు వాడగానే తగ్గిపోతుంది. అప్పటికీ తగ్గకపోతే వైద్యుడిని సంప్రదిస్తారు. ఈ లోగా వ్యాధి ముదిరిపోతుంది. జాండిస్ చాలా కారణాల వల్ల వస్తుంది. మలేరియా, లివర్‌లో స్టోన్, ట్యూమర్ వల్ల జాండిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. హెపటైసిస్ వల్ల వచ్చే జాండిస్ 2, 3 వారాల్లో తగ్గిపోతుంది. 3 నుంచి 5 శాతం మందికి దీర్ఘకాలికంగా శరీరంలో ఉండిపోతుంది. దీని వల్ల లివర్ గట్టిపడి లివర్ సిర్రోసిస్‌కు దారితీస్తుంది. పొట్టలో నీరు చేరడం, కళ్లు పచ్చబడటం, కాళ్లు పొంగడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యం ఢిల్లీ ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గౌతమ్ హెపటైటిస్‌కు కారణమయ్యే వైరస్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే ప్రాణాలకే ప్రమాదం వాటిల్లుతుందని ఢిల్లీ ఎయిమ్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ బుడిమూరి గౌతమ్ అన్నారు. హెపటైటిస్ దినోత్సవం పురస్కరించుకుని విశాఖ ప్రజల అవగాహన కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. వైరల్ హెపటైటిస్ గురించి అవగాహన కల్పించాలన్న థీమ్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన నేపథ్యంలో ఆ దిశగా తాను కృషి చేస్తున్నట్టు తెలిపారు. లివర్ హెపటైటిస్ వ్యాధి తీవ్రత గణాంకాల ప్రకారం పరిశీలిస్తే.. భారతదేశంలో 4 శాతంగా ఉందన్నారు. ఒకసారి లివర్ పూర్తిగా పాడైన తర్వాత కాలేయ మార్పిడి ద్వారా మాత్రమే శాశ్వత పరిష్కారం ఉంటుందన్నారు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ ఉన్న రోగుల్లో ఫ్లూ వంటి జ్వరం, ఆకలి తగ్గడం, వికారం, పొత్తి కడుపులో నొప్పి, పచ్చ కామెర్లకు దారి తీస్తుందని, వ్యాధి అత్యంత తీవ్రమైన సందర్భాల్లో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందన్నారు. వ్యాధి సోకిన వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకుని మందులు సక్రమంగా వాడితే.. ఆదిలోనే నివారించడంతో పాటు లివర్ వ్యాధుల నుంచి తప్పించుకోవచ్చని వివరించారు. 2030 నాటికి హెపటైటిస్ నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. -
బీమాకు.. హెపటైటిస్ అడ్డుకాదు!
కీళ్ల నొప్పులు, అలసట, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే... ‘హెపటైటిస్ బీ’ పరీక్షలు చేయించమని సలహా ఇస్తారు. ప్రధానంగా లివర్ దెబ్బతినడంతో పాటు పలు రకాల జబ్బులకు దారితీసే ఈ వ్యాధికి అపరిశుభ్రత, సురక్షితం కాని శృంగార విధానాల వరకూ పలు కారణాలున్నాయి. దాదాపు 4 కోట్ల మంది రోగులతో చైనా తరువాత ఇండియా ఈ వ్యాధి విషయంలో రెండో స్థానం లో ఉందని ఇటీవలే ఒక సర్వే తెలిపింది. అయితే హెపటైటిస్‌కు గురయిన వ్యక్తి జీవిత బీమా రక్షణ అవకాశాన్ని కోల్పోతాడని చాలా మంది భావిస్తుం టారు. ఇదెంతమాత్రం నిజం కాదు. వారు కూడా జీవిత బీమాకు అర్హులే. వ్యక్తులు జీవిత బీమా పొం దేందుకు అవకాశం లేని కొన్ని ప్రాణాంతక వ్యాధుల (కోవర్డ్ డిసీజెస్) జాబితాలోకి హెపటైటిస్ రాదు. అయితే కొన్ని విషయాలు మాత్రం గమనించాలి. ♦ వాస్తవ కవరేజ్ ఎంత? ప్రీమియం వ్యయాలెంత? వంటివి వ్యాధికి సంబంధించిన పలు అంశాలపై ఆధారపడి ఉంటాయి. వ్యాధి తీవ్రత, గత చికిత్స రికార్డు, మెడికల్ హిస్టరీ ఇవన్నీ దీన్ని ప్రభావితం చేస్తాయి. ♦ ఎలాంటి చికిత్స తీసుకున్నాడు? భవిష్యత్తులో తీసుకోబోయే చికిత్స విధానాలేంటి? వైద్యుడు చెప్పిన జాగ్రత్తలు పాటిస్తున్నారా? అనేవి బీమా కంపెనీలు పరిశీలిస్తాయి. ♦ ఏ వయసులో ఈ వ్యాధి వచ్చింది? లివర్ పనితీరు పరీక్షల (ఎల్ఎఫ్టీ) రీడింగ్స్ ఏమిటి? వ్యాధి వచ్చినప్పటితో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి మెరుగుపడిందా? మీరు వ్యాధిని తగ్గించుకోవటానికి ఎంత కృషి చేస్తున్నారు? మీరు వాడుతున్న మందులేంటి? వంటి అంశాలపై మీ ప్రీమియం, కవరేజీ ఆధారపడి ఉంటాయి. రిస్క్ అధికంగా ఉంటే... అధిక ప్రీమియం చెల్లించాలి. పూర్తిగా వ్యాధి తగ్గిన వారు మామూలు పాలసీలు, సగటు ప్రీమియం రేటుకు పొందే వీలూ ఉంది. -
ప్రేమకు ప్రతిరూపం.. చింపూ
పాతికేళ్లయినా మరువని వానరాలు... మానవత్వం, ప్రేమ, అనురాగాలు మనుషుల్లో ఉండే సహజ గుణాలు. కానీ ఇవి అందరికీ ఉండవు. ఉన్నా.. ఎక్కువ కాలం కొనసాగడం కష్టమే. ఎవరైన మనకు సహాయం చేస్తే వాళ్లను కొంతకాలం గుర్తుంచుకుంటాం. ఎదుటి వ్యక్తులు చేసిన సహాయాన్ని ఏళ్ల తరబడి గుర్తుంచుకోవాలంటే వారు మనల్ని తరచూ కలుస్తూ ఉండాలి. వరుసగా ఓ పదేళ్లు కనబడకుంటే దాదాపు మరచిపోతాం. మానవులను మించి తమకు ప్రేమానురాగాలు ఉన్నాయంటూ నిరూపించాయి ఫ్లోరిడాలోని చింపాంజీలు. ఏకంగా 25 ఏళ్ల తర్వాత తమకు శిక్షణ ఇచ్చిన ట్రెయినీని మాత్రం మర్చిపోలేదు. తల్లిలా పెంచి పోషించిన ఆ శిక్షకురాలిని చూడగానే తమలో ప్రేమానురాగాలను ఆనంద భాష్పాల రూపంలో చూపిస్తూ.. ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాయి. మూగ సైగలతో తమ ప్రేమను చాటుకున్నాయి. ప్రయోగాల కోసం... సాధారణంగా శాస్త్రవేత్తలు మానవులకు వచ్చే పలు రోగాలకు సంబంధించి ఏ ఒక్క మందును కనిపెట్టినా మొదటగా చింపాంజీలపై ప్రయోగిస్తారు. ఇప్పటివరకు కనుగొన్న మందుల్లో 95 శాతం వీటిపై ప్రయోగించినవే. దీనికి కారణం చింపాంజీల డీఎన్ఏ 98.8 శాతం మానవుల డీఎన్ఏను పోలి ఉండడం. 1974 వచ్చిన హెపటైటిస్ వ్యాధికి పరిశోధకులు మందు కనిపెట్టారు. దీన్ని చింపాంజీలపై ప్రయోగించేందుకు అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలో ఓ ల్యాబరేటరీని ఏర్పాటు చేశారు. ఇందులో కొన్ని చింపాంజీలను బంధించి వాటికి ఆవాసం కల్పించారు. వీటిపై పరిశోధన చేస్తున్న సమయంలోనే వాటిని బయటి ప్రపంచంలో ఎలా బతకాలో నేర్చించేందుకు కొంత మంది శిక్షకులను నియమించారు. వీరిలో దక్షిణ ఫ్లోరిడాకు చెందిన‘ లిండా కోబనార్’ కూడా ఉన్నారు. అప్పటికే కోబనార్ జంతువుల ప్రవర్తన విభాగంలో డిగ్రీ పూర్తి చేశారు. చింపాంజీలపై పరిశోధనతో పాటు శిక్షణ కూడా ఆరేళ్ల పాటు కొనసాగింది. ఈ సమయంలో కోబనార్ చింపాంజీలను ఎంతో ప్రేమగా చూసేవారు. వాటికి కావాల్సిన అన్ని ఆహార పదార్థాలను సమయానుసారంగా అందించేది. ఆప్యాయతగా వాటికి పాలు పట్టించేది. ఆరేళ్ల అనంతరం హెపటైటిస్పై చేసిన ప్రయోగం విజయవంతమవడంతో వాటికి లాబరేటరి నుంచి విముక్తి లభించింది. అనంతరం ఫ్లోరిడాలోని అటవీ ప్రాంతంలో చింపాజీలు ఉండేందుకు ఓ విశాలమైన ఆవాసాన్ని ఏర్పాటు చేశారు. లూసియానాకు పయనం చింపాజీలకు శిక్షణ అనంతరం కోబనార్ అక్కడి నుంచి అమెరికాకు దక్షిణాగ్రంలో ఉన్న లూసియానా రాష్ట్రానికి వెళ్లిపోయింది. జంతువులపై తనకు ఉన్న ప్రేమానురాగాలతో అక్కడ కూడా ఓ చింపాంజీ అభయారణ్యం పేరుతో మరికొన్ని చింపాజీలను పెంచింది. అలా నాలుగేళ్లపాటు వాటి ఆలనాపాలనా చూసింది. అనంతరం చింపాజీలపై 1998లో కోబనార్ ఓ చిత్రాన్ని నిర్మించింది. విస్డమ్ వరల్డ్ పేరుతో తెరకెక్కించిన ఈ చిత్రంలో సమాజంతో ఎలా మెలగాలి అనే విషయం మానవులు చింపాజీల నుంచి తెలుసుకోవచ్చని తెలియజేశారు. ఈ జంతువులు మనుషుల్లాగానే ప్రేమానురాగాలను పంచుకుంటాయని ఈ చిత్రంలో చూపించారు. గుర్తున్నానా? దాదాపు 25 ఏళ్ల అనంతరం కోబనార్ ఫ్లోరిడాలోని చింపాజీల ఆవాసానికి వెళ్లాల్సి వచ్చింది. గతంలో ఆమె శిక్షణ ఇచ్చిన చింపాంజీల్లో కొన్ని అక్కడ ఉన్నాయి. చాలా ఏళ్లు గడవడంతో కోబనార్ వాటిని దూరం నుంచే చూడాలనుకుంది. మీకు నేను గుర్తున్నానా? అంటూ వాటిని పలకరించింది. వెంటనే అక్కడ ఉన్న స్వింగ్ అనే చింపాజీ కోబనార్ వైపుకు దూసుకువచ్చింది. దాని ముఖంలో నవ్వులు విరజిమ్ముతూ కోబనార్ దగ్గరకు వచ్చి ఆమె రెండు చేతులను పట్టుకుంది. నన్ను గుర్తుపట్టావా? అని కోబనార్ మళ్లీ అనడంతో ఒక్క సారిగా తన రెండు చేతులతో ఆమెను కౌగిలించుకొని తన మనసులోని ప్రేమను వెలుబుచ్చింది. కోబనార్ ఎంతో ఆనందంతో ఆ చింపూని బిగ్గరగా ఆలింగనం చేసుకుంది. స్వింగ్ వెనకాలే పరిగెత్తుకుంటూ వచ్చిన ‘డాల్’ అనే మరో చింపాజీ కూడా కౌగిలించుకొని ఆనంద భాష్పాలు కురిపించింది. 25 ఏళ్ల తర్వాత తనను గుర్తు పెట్టుకుని ప్రేమగా కురిపించడంతో కోబనార్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. (25 ఏళ్ల క్రితం ఫోటో) -
రక్తనాళాల్లో బ్లాక్స్? ఇవీ జాగ్రత్తలు...
హోమియో కౌన్సెలింగ్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేసేవాణ్ణి ఈమధ్య రాత్రి నిద్రపట్టడం లేదు. చెమటలు పట్టడం, ఆందోళన, ప్రతి చిన్న విషయానికి ఆదుర్దాపడటం లాంటి లక్షణాలు ఉన్నాయి. ఈమధ్యనే తీవ్రమైన ఒత్తిడి వల్ల నా ఉద్యోగం కూడా వదులుకున్నాను. అయినా నా మనసు, శరీరం నా అదుపులో ఉండటం లేదు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా? - రవి, హైదరాబాద్ ఈ ఆధునిక యుగంలో శారీరక శ్రమ తగ్గి, ఒత్తిడి తీవ్రంగా పెరిగిపోతోంది. స్ట్రెస్ కలిగించే సందర్భాన్ని, సమయాన్నీ, శారీరక, మానసిక పరిస్థితిని బట్టి... ఒత్తిడి (స్ట్రెస్) తాలూకు తీవ్రత ఒక్కో వ్యక్తిలో ఒక్కో రకంగా ఉంటుంది. ఆకస్మికంగా అధిక ఒత్తిడి లేదా దీర్ఘకాలిక ఒత్తిడి కలుగుతూ పోతూ ఉండే అది ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. ఇటీవల చూస్తున్న చాలా ప్రధాన వ్యాధుల్లో 80 శాతంపైగా ఒత్తిడి కారణంగానే వస్తున్నాయని పరిశోధకులు వెల్లడించిన అధ్యయన ఫలితాల వల్ల తెలుస్తోంది. ఒత్తిడికి కారణాలు: ఆర్థిక సమస్యలు ఉద్యోగాల్లో, పనుల్లో ఒత్తిడి దీర్ఘకాలిక ఆందోళన తీవ్రమైన నిరాశ నిస్పృహలు పరిణామాలు: ఒత్తిడి వల్ల మన శరీర రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడటం వల్ల క్యాన్సర్, డయాబెటిస్, రుమాటిజమ్, జీర్ణకోశ వ్యాధులు పెరుగుతాయి. లక్షణాలు : ఆవేశంగా ఉండటం లేదా చిన్న చిన్న విషయాలకు కోపం రావడం వికారం, తలతిరగడం ఛాతీనొప్పి, గుండె స్పందనల వేగం పెరగడం చిరాకు, ఒంటరితనం విరేచనాలు లేదా మలబద్దకం నిద్రలేకపోవడం. చికిత్స: ఒత్తిడిని, దాని వల్ల కలిగే దుష్పరిణామాలను తగ్గించడానికి హోమియోలో మంచి చికిత్స ఉంది. ఒత్తిడి తగ్గించడానికి హోమియోలో యాసిడ్ ఫాస్, ఇగ్నీషియా, కాక్యులస్ ఇండికస్, నేట్రమ్ మ్యూర్... మొదలైన మందులు బాగా పనిచేస్తాయి. అయితే ఒక వ్యక్తి ఎంత ఒత్తిడితో ఉన్నాడు అన్న అంశంతో పాటు వారి కుటుంబ, సామాజిక పరిస్థితులతో పాటు అతడు పనిచేసే వాతావరణాన్ని సైతం పరిగణనలోకి తీసుకొని చికిత్సను సూచిస్తారు. వాటిని అనుభవజ్ఞులైన నిపుణుల పర్యవేక్షణలో వాడితే మంచి ఫలితం కనిపిస్తుంది. గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ మా నాన్నగారి వయసు 50 ఏళ్లు. ‘హెపటైటిస్-బి’తో బాధపడుతూ, చికిత్స పొందుతున్నారు. కానీ అప్పుడప్పుడూ కడుపులో నొప్పి, కొద్దిరోజులుగా బరువు తగ్గడం, మనిషి కూడా నీరసం అయిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. మా నాన్నగారి విషయంలో మాకు తగిన సలహా ఇవ్వండి. - చైతన్య, నెల్లూరు మీరు తెలిపిన విషయాలను పరిశీలిస్తే మీ నాన్నగారికి జీర్ణాశయంలో క్యాన్సర్ ఉండే అవకాశం ఉన్నట్లు అనిపిస్తోంది. హెపటైటిస్-బితో బాధపడుతున్న చాలామందిలో ఇలా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఒకసారి స్క్రీనింగ్ పరీక్షలు చేయడం వల్ల విషయం తెలిసే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఒకసారి మీ నాన్నగారికి ఈ కింద పేర్కొన్న స్క్రీనింగ్ పరీక్షలు చేయించడం మంచిది. ఫుల్ బ్లడ్ కౌంట్ టెస్ట్ మూడు రోజులు వరసగా మలపరీక్ష సిగ్మాయిడోస్కోపీ సీటీస్కాన్ పెట్ స్కాన్, ఎండోస్కోపీ, అల్ట్రాసౌండ్ స్కాన్ ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాన్జియో పాంక్రియాటోగ్రఫీ... వంటి పరీక్షలు చేయించడం వల్ల విషయం తెలుస్తుంది. మీరు వెంటనే మీకు దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను కలిసి ఈ పరీక్షలు చేయించడం మంచిది. నా వయసు 45 ఏళ్లు. నేను గృహిణిని. మా నాన్నగారు పెద్దపేగు క్యాన్సర్‌తో చనిపోయారు. ఈ క్యాన్సర్ వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉందా? అలా వచ్చే అవకాశం ఉంటే ముందుగా గుర్తించడం ఎలా? - సాయిలక్ష్మి, అమలాపురం పెద్దపేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలావరకు వంశపారంపర్యంగానే స్తుంటాయి. కాబట్టి మీరు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు ఎలాంటి లక్షణాలూ లేకపోయినా ఒకసారి క్యాన్సర్ స్క్రీనింగ్ చేయించుకోవడం మంచిది. పెద్దపేగుల క్యాన్సర్‌ను కొలనోస్కోపీ పరీక్ష ద్వారా ప్రాథమిక దశలోనే గుర్తించవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ఈ పరీక్ష చేయించుకోండి. నార్మల్‌గా ఉన్నట్లయితే మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పదేళ్ల తర్వాత ఒకసారి ఈ పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 45 ఏళ్లు. బరువు 120 కేజీలు. నాకు డయాబెటిస్ ఉంది. ఈ మధ్య గుండెపోటు వచ్చింది. దగ్గర్లో ఉన్న డాక్టర్‌ను కలిస్తే గుండెలోని రక్తనాళాల్లో బ్లాక్స్ ఉన్నాయని చెప్పారు. ఈ బ్లాక్స్ ఎవరిలో ఎక్కువగా వస్తాయి? వాటి చికిత్సలు, జాగ్రత్తలు తెలుపగలరు. - సంతోష్మోహన్, మెదక్ మొదట మీరు బరువు తగ్గించుకోవడం చాలా అవసరం. డయాబెటిస్, హైబీపీతో బాధపడేవారిలో, కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నవారిలో, పొగతాగేవారిలో, స్థూలకాయులు, తగినంత శారీరక శ్రమ చేయనివారిలో రక్తనాళాలు పూడుకుపోవడం ఎక్కువ. ఇవేకాకుండా రక్తంలో లైపోప్రొటీన్-ఏ, హోమోసిస్టిన్, కార్డియోలిపిన్, ఫైబ్రినోజెన్ వంటివి ఉన్నవారికి సైతం రక్తనాళాల్లో పూడికలు పేరుకుపోయే ముప్పు ఎక్కువ. పైన పేర్కొన్న అంశాలలో రెండు కంటే ఎక్కువగా ఉన్నవారు గుండె పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. వాళ్లతో పాటు... కాస్త శ్రమ చేస్తే గుండెనొప్పి/ఆయాసం వస్తున్నవారు, కుటుంబంలో గుండెపోటు చరిత్ర ఉన్నవారు, శారీరకంగా అధికంగా శ్రమించే క్రీడాకారులు, పోలీసు వంటి ఉద్యోగాల కోసం ఫిట్నెస్ పరీక్షలకు వెళ్తున్నవారు, తరచు ఫిట్నెస్ పరీక్షలు అవసరమయ్యే పైలట్ల వంటి ఉద్యోగులు సైతం గుండెలో పూడికలు ఉన్నాయేమో అని పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. అందరికీ గుండెకు సంబంధించిన అన్ని పరీక్షలూ అవసరం ఉండదు. కానీ శారీరక వ్యాయామంతో కూడుకున్న ‘ట్రెడ్మిల్’ పరీక్షతో మంచి ప్రయోజనం ఉంటుంది. దీని ఫలితాల ఆధారంగా చాలావరకు పెద్ద, ప్రమాదకరమైన పూడికలు లేవని మాత్రం నిర్ధారణ అవుతుంది. కొలెస్ట్రాల్, హైబీపీ వంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవారు, 40 ఏళ్లు పైబడిన వాళ్లు ప్రతి రెండేళ్లకోసారి, 50 ఏళ్లు పైబడిన వారు ప్రతి ఏడాదీ ట్రెడ్మిల్, ఎకో, ఈసీజీ... ఈ మూడు పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఇతరత్రా సాధారణ పరీక్షలలో పూడికలు ఉన్నాయని అనుమానం వ్యక్తమైనప్పుడు కచ్చితంగా గుర్తించి నిర్ధారణ చేసేందుకు యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తారు. పూడికలు ఉన్నట్లు ఈ పరీక్ష సమయంలోనే గుర్తిస్తే అప్పటికప్పుడు ‘స్టెంట్స్’ అమర్చుతారు. చికిత్స : సాధారణంగా 40-60 ఏళ్ల మధ్య వయసువారిలో ఒకటిగానీ, రెండు గానీ పూడికలు ఉంటే స్టెంట్లు అమర్చి రక్తప్రసారాన్ని చక్కదిద్దుతారు. రెండుకంటే ఎక్కువ రక్తనాళాల్లో పూడికలు ఉంటే, ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవారిలో ‘బైపాస్’ ఆపరేషన్ ఉత్తమం. జాగ్రత్తలు: పీచు ఎక్కువగా ఉండే శాకాహారం తీసుకోవడం యోగా, ధ్యానం చేయడం నిత్యం వ్యాయామం చేయడం డయాబెటిస్, హైబీపీ, కొలెస్ట్రాల్, ట్లైగ్లిజరైడ్స్ వంటి కొవ్వులను కచ్చితంగా అదుపులో ఉంచుకోవడం కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గుండెపోటు ఉంటే ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. -
హోమియో వైద్యంతో ‘హెపటైటిస్-బి’కి చెక్
లైంగిక వ్యాధులు అంటే ఒక భయం, ఎన్నో రకాలసమస్యలు, అవగాహన లోపం, తెలియని ఆతృత. ఏదో ఒక మందుతో దాన్ని తగ్గించుకోవాలనే ఆరాటం. వీటన్నిటి మధ్య నలిగిపోయేవారు ఎందరో ! సరైన చికిత్స లేక ఎంతోమంది తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. సత్వరమైన పరిష్కారంతో, నమ్మకమైన చికిత్సతో మంచి ఫలితాలు సాధించవచ్చని అంటున్నారు. ప్రముఖ హోమియో వైద్యులు డాక్టర్ మధు వారణాశి. లైంగిక వ్యాధులలో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి హెపటైటిస్ బి. ఒక సర్వే ప్రకారం ప్రపంచంలో సుమారు 200 కోట్ల మంది జనాభా హెపటైటిస్ బి బారిన పడినట్లుగా తెలుస్తోంది. వైరల్ సంబంధిత వ్యాధులలో హెపటైటిస్ బి ఒక మహమ్మారిగా మారే సూచికలు ఉన్నాయి. భారతదేశంలో నాలుగు కోట్ల మంది హెపటైటిస్ బి తో బాధపడుతున్నారని అంచనా. ప్రతి సంవత్సరం లక్ష మందికి పైగా భారతీయులు హెపటైటిస్ బి మూలంగా మరణిస్తున్నారు. రక్తం, లాలాజలం, వీర్యం, యోని ద్రవం లాంటి పదార్థాలలో వైరస్ ఉంటుంది. అసురక్షితమైన లైంగిక సంపర్కం వల్ల ఇది సంక్రమిస్తుంది. తల్లులనుంచి పిల్లలకు, శిశువు నుండి శిశువుకు సంక్రమిస్తుంది. అవగాహన లోపంతో ఎంతో మంది దీని బారినపడి ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారు. హెపటైటిస్ బి అంటే? మానవ శరీరంలో కాలేయం ముఖ్యమైన భా గం. ఎన్నో కార్యక్రమాలను కాలేయం నిర్వహిస్తుంది. అలాంటి కాలేయం దెబ్బతింటే ఎన్నో బాధలు, ఎన్నో విపత్తులు ఎదురవుతాయి. కొన్ని రకాలైవైరస్ కారణంగా కాలేయానికి ఇన్ఫెక్షన్ వచ్చి హెపటైటిస్ వ్యాధి వస్తుంది. వీటిలో ప్రమాదకరమైనవి హెపటైటిస్ బి, హెపటైటిస్ సివీటిని హెపటోట్రోఫిక్ వైరసస్ అని అంటారు. హెపటైటిస్ బి మొదట మామూలు లక్షణాలతో వచ్చి, అది దీర్ఘకాలికంగా మారి, కాలేయాన్ని మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తూ ప్రాణాంతకంగా మారుస్తుంది. లివర్ కేన్సర్,సిర్రోసిస్,వైరల్ హెపటైటిస్ వ్యాధులు రావడానికి మూలకారణం అవుతుంది. హెపటైటిస్ బి వల్ల కాలేయంలోని కణజాలం క్రమక్రమంగా పాడవుతుంది. రోగ నిరోధక వ్యవస్థ తగ్గడం వల్ల కాలేయం నిర్వహించే విధులకు ఆటంకం ఏర్పడుతుంది. దీని వల్ల కాలేయంలో వాపు వచ్చి పలు రకాలసమస్యలకు తోడ్పడుతుంది. కారణాలు ఏమిటి? స్టెరిలైజ్ చేయని సిరంజీలు, లైంగిక సంపర్కం ద్వారా. పటైటిస్ బి ఉన్న వ్యక్తి నుండి నేత్రాలు, త్రపిండాలు, రక్తం తీసుకోవడం వల్ల. పటైటిస్ బి సోకిన వారి రక్తం, గాయాల ద్వారా, ఏ కారణం చేతనైనా వీరి రక్తం వేరేవాళ్లకు తాకడం ద్వారా. చ్చబొట్టు, ఒకే బ్లేడ్, ఒకే సిరంజి ఎక్కువ మంది వాడినపుడు, కలుషితమైన ఆహారం.బ్యాక్టీరియా, అమీబాలవంటి పరాన్నజీవులవల్ల హెపటైటిస్ బి వ్యాప్తిస్తుంది. ఎయిడ్స్కన్నా ప్రమాదకరమైన వ్యాధిగా గుర్తించవచ్చును. లక్షణాలు సాధారణంగా ఈ వ్యాధి లక్షణాలు నిశ్శబ్దంగా ఉంటాయి.హెపటైటిస్ బి వైరస్ ఎన్నో సంవత్సరాలు శరీరంలో ఉంటుంది. శరీరం వెలుపల సాధారణ ఉష్ణోగ్రత వద్ద వారం రోజులు మాత్రమే సజీవంగా ఉండగలదు. కొంత మందిలో ఈ వైరస్ ప్రవేశించిన కొద్ది రోజులకే కామెర్లు వస్తాయి. దీనిని అక్యూట్ స్టేజ్‌గా చెప్పవచ్చును. ఈ దశలో దానంతటదే తగ్గుతుంది. కొంత మందిలో ఈ వైరస్ తొలగిపోకుండా, శాశ్వతంగా శరీరంలో ఉంటూ బలం పెంచుకుంటూపోతుంది. దీనిని క్రానిక్ స్టేజ్ అంటారు. ఇదే అత్యంత ప్రమాదకరంగా మారుతుంది. హెపటైటిస్ బి కారణంగా కాలేయం వ్యాధిగ్రస్తమై భవిష్యత్తులో మరిన్ని సమస్యలు తెచ్చిపెడుతుంది. కాళ్లవాపు, పొట్ట ఉబ్బరం, వాంతులు లక్షణాలు కనబడతాయి. ఎలా నివారించాలి? విచ్చలవిడి శృంగారానికి దూరంగా ఉండాలి. అపరిచితులతో శృంగార జీవితంలో సురక్షితమైన పద్ధతులు అవలంబించాలి. డిస్పోజబుల్ సూదులు, సిరంజీలు వాడాలి. ఒకరు వాడిన షేవింగ్ రేజర్లు, బ్లేడ్లను వాడరాదు. రక్తం తీసుకోవలసి వస్తే, హెపటైటిస్ బి పరీక్ష చేసి రక్తం ఎక్కించుకోవాలి. వ్యాధి నిర్ధారణ: హెచ్బిఎస్ ఎజి అనే రక్తపరీక్ష, లివర్ ఫంక్షన్ టెస్ట్, సిబిపి, లివర్ బయాప్సి, వైరల్ లోడ్ ద్వారా రోగ తీవ్రతను గుర్తించవచ్చు. హోమియో చికిత్ససహజసూత్రాలపైన ఆధారపడిన హోమియో వైద్యం వ్యాధిని పూర్తిగా నిర్మూలించగలసత్తా కలిగినది హోమియోపతి రోగనిరోధక శక్తిని పెంచి ఇమ్యునో మాడ్యులేటర్స్గా పనిచేస్తుంది. అందువల్ల మూలకారణాన్ని గుర్తించి చికిత్స చేస్తే ఎలాంటి సమస్య అయినా తగ్గుతుంది. హెపటైటిస్ బి లాంటి కేసులలో ఆధునిక హోమియో చికిత్సతో రోగిలోని రోగనిరోధక శక్తిని పెంచి దుష్ఫలితాలు లేకుండా వ్యాధిని నివారించవచ్చు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుని పర్యవేక్షణలో చికిత్స చేయించుకుంటే హెపటైటిస్ బి లేదా హెపటైటిస్ సి వ్యాధులను నయం చేయవచ్చు. డా.మధు వారణాశి, ఎం.డి. ప్రముఖ హోమియో వైద్యులు, ఫ్లాట్ నం.188, వివేకానందనగర్ కాలనీ, కూకట్పల్లి, హైదరాబాద్, ఫోన్: 8897331110, 8886509509