What Is Hepatitis Precautionary Methods To Prevent - Sakshi
Sakshi News home page

What Is Hepatitis :హెపటైటిస్‌-బి అంటే ఏంటి? సూదులు, సిరంజీలతో ఇంత డేంజరా?

Published Wed, Aug 9 2023 3:30 PM | Last Updated on Wed, Aug 9 2023 5:04 PM

What Is Hepatitis Precautionary Methods To Prevent - Sakshi

ఒకసారి హెపటైటిస్‌-బి వైరస్‌ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దానిసంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్‌ను దెబ్బతీయడం ఆరంభిస్తుంది. ఈ వైరస్‌ శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. రక్తమార్పిడి, సూదులు, సిరింజిలు తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు. 

1. పరీక్షల్లో - HBsAg పాజిటివ్‌గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్‌ ఉండి, SGPT (కాలేయానికి సంబంధించిన ఎన్‌జైమ్‌) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్‌ లోడ్‌ 5లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్‌ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని!
2. ఈ వ్యాధిని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. వీళ్లు ముందుగానే మందులు తీసుకోవటం ద్వారా వ్యాధి  నివారించుకునే అవకాశం ఉంది.
3. వైరస్‌ సన్నిహితులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. 
4. సిర్రోసిస్‌ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవటం ముఖ్యం.
5. హెపటైటిస్‌-బి సోకిన వారు ఆల్కహాల్‌ ముట్టకూడదు, తరచూ వైద్యుల పర్యవేక్షణ చాలా అవసరం. 

కొందరికి ఇతరత్రా లివర్‌ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్‌-బి వైరస్‌ ఉన్న కారణంగా లివర్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంటుంది.అందుకే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ఇది సోకుండా ముందస్తు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి.

  • హెపటైటిస్‌ - బి సెక్స్‌ ద్వారా సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి కండోమ్‌ వంటి సురక్షిత జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌లో పాల్గోనవద్దు.
  •  ఒకరి టూత్‌బ్రష్‌లు, రేజర్లు, నెయిల్‌కట్టర్లు వంటివి మరోకరు వాడొద్దు. బయట సెలూన్లలో కూడా కచ్చితంగా కొత్త బ్లేడు వాడేలా చూడాలి.
  •  ఇంజక్షన్‌ సూదుల వంటివి ఒకరికి వాడినవి మరొకరు ఉపయోగించవద్దు. డిస్పోజబుల్‌ సూదులు, సిరంజీలు వాడటం ఉత్తమం.
  • చెవులు కుట్టటం, ముక్కులు కుట్టటం, పచ్చబొట్లు వేయించుకోవటం వీటికి ఒకరికి వాడిన పరికరాలు మీకు వాడకుండా చూసుకోవాలి.
  •  రక్తం ఎక్కించేటప్పుడు, రక్తమార్పడి విషయంలో పూర్తి సురక్షితమైన పద్ధతులను అనుసరించటం చాలా అవసరం!

పెళ్లి చేసుకోవచ్చా?
టీకాలున్నాయి కాబట్టి హెపటైటిస్‌ -బి బాధితులు ఈ విషయం ముందుగానే అందరికీ తెలిపి, వారి అనుమతితో నిశ్చితంగా పెళ్ళి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటటిస్‌ - బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్‌ వచ్చిన వాళ్ళు తప్పించి మిగతా అందరూ (అన్‌అఫెక్టెడ్‌ క్యారియర్స్‌ కూడా) పిల్లలను కూడా కనొచ్చు.

అలా చేస్తేనే బిడ్డకు క్షేమం
గర్భిణులంతా తప్పనిసరిగా HBsAg పరీక్ష చేయించుకోవాలి. హెపటైటిస్‌-బి ఉన్నా కూడా బిడ్డలను కనొచ్చు. గర్భస్రావాలు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే పుట్టగానే బిడ్డకు ఒక తొడకు Hepatitis-B ఇమ్యూనోగ్లోబ్యులిన్ల ఇంజక్షన్‌, మరో తొడకి హెపటైటిస్‌-బి టీకా రెండు తప్పకుండా ఇవ్వాలి. నెల రోజులకు మరో టీకా, ఆర్నెల్లకు మరో టీకా ఇప్పించాలి. దీంతో తల్లి నుంచి బిడ్డకు వైరస్‌ సంక్రమించకుండా 95 శాతం వరకూ నివారించవచ్చు.

తప్పకుండా టీకాలు
1. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ఏ ప్రామాణిక సంస్థా కూడా ప్రజలంతా హెపటైటిస్‌ టీకా తప్పకుండా తీసుకోవాలని సిఫార్సు చెయ్యటం లేదు. కొంతమంది మాత్రం తప్పకుండా తీసుకోవాలి.
2. చిన్న పిల్లలకూ, స్కూలు వయసు పిల్లలందరకీ తప్పకుండా టీకా ఇప్పించాలి.
3. కుటుంబంలో ఎవరికన్నా హెపటైటిస్‌ -బి ఉంటే, ఆ ఇంట్లోని వారంతా తప్పకుండా టీకా తీసుకోవాలి. వైద్య సిబ్బంది, తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే రకరకాల వ్యాధి పీడితులకు కూడా టీకా తప్పనిసరి.
4. ఇవాళ మొదటి టీకా వేయించుకుంటే - మళ్ళీ సరిగ్గా నెలకు ఒకటి, ఆర్నెల్లకు మరోకటి, మొత్తం మూడు టీకాలే తీసుకోవాలి , మరియు నివారణ కోసం తప్పనిసరిగా హోమియో మందులు వాడితే మంచి ఫలితాలు వస్తాయి ,

- డాక్టర్ నవీన్ రోయ్,ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు
   ఫోన్ -9703706660

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement