hepatitis-B
-
హెపటైటిస్-బి అంటే ఏంటి? సూదులు, సిరంజీలతో ఇంత డేంజరా?
ఒకసారి హెపటైటిస్-బి వైరస్ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దానిసంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్‌ను దెబ్బతీయడం ఆరంభిస్తుంది. ఈ వైరస్ శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. రక్తమార్పిడి, సూదులు, సిరింజిలు తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు. 1. పరీక్షల్లో - HBsAg పాజిటివ్‌గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్ ఉండి, SGPT (కాలేయానికి సంబంధించిన ఎన్జైమ్) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్ లోడ్ 5లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని! 2. ఈ వ్యాధిని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. వీళ్లు ముందుగానే మందులు తీసుకోవటం ద్వారా వ్యాధి నివారించుకునే అవకాశం ఉంది. 3. వైరస్ సన్నిహితులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. 4. సిర్రోసిస్ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవటం ముఖ్యం. 5. హెపటైటిస్-బి సోకిన వారు ఆల్కహాల్ ముట్టకూడదు, తరచూ వైద్యుల పర్యవేక్షణ చాలా అవసరం. కొందరికి ఇతరత్రా లివర్ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్-బి వైరస్ ఉన్న కారణంగా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.అందుకే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ఇది సోకుండా ముందస్తు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. హెపటైటిస్ - బి సెక్స్ ద్వారా సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి కండోమ్ వంటి సురక్షిత జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌లో పాల్గోనవద్దు. ఒకరి టూత్‌బ్రష్‌లు, రేజర్లు, నెయిల్‌కట్టర్లు వంటివి మరోకరు వాడొద్దు. బయట సెలూన్లలో కూడా కచ్చితంగా కొత్త బ్లేడు వాడేలా చూడాలి. ఇంజక్షన్ సూదుల వంటివి ఒకరికి వాడినవి మరొకరు ఉపయోగించవద్దు. డిస్పోజబుల్ సూదులు, సిరంజీలు వాడటం ఉత్తమం. చెవులు కుట్టటం, ముక్కులు కుట్టటం, పచ్చబొట్లు వేయించుకోవటం వీటికి ఒకరికి వాడిన పరికరాలు మీకు వాడకుండా చూసుకోవాలి. రక్తం ఎక్కించేటప్పుడు, రక్తమార్పడి విషయంలో పూర్తి సురక్షితమైన పద్ధతులను అనుసరించటం చాలా అవసరం! పెళ్లి చేసుకోవచ్చా? టీకాలున్నాయి కాబట్టి హెపటైటిస్ -బి బాధితులు ఈ విషయం ముందుగానే అందరికీ తెలిపి, వారి అనుమతితో నిశ్చితంగా పెళ్ళి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటటిస్ - బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్ వచ్చిన వాళ్ళు తప్పించి మిగతా అందరూ (అన్అఫెక్టెడ్ క్యారియర్స్ కూడా) పిల్లలను కూడా కనొచ్చు. అలా చేస్తేనే బిడ్డకు క్షేమం గర్భిణులంతా తప్పనిసరిగా HBsAg పరీక్ష చేయించుకోవాలి. హెపటైటిస్-బి ఉన్నా కూడా బిడ్డలను కనొచ్చు. గర్భస్రావాలు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే పుట్టగానే బిడ్డకు ఒక తొడకు Hepatitis-B ఇమ్యూనోగ్లోబ్యులిన్ల ఇంజక్షన్, మరో తొడకి హెపటైటిస్-బి టీకా రెండు తప్పకుండా ఇవ్వాలి. నెల రోజులకు మరో టీకా, ఆర్నెల్లకు మరో టీకా ఇప్పించాలి. దీంతో తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించకుండా 95 శాతం వరకూ నివారించవచ్చు. తప్పకుండా టీకాలు 1. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ఏ ప్రామాణిక సంస్థా కూడా ప్రజలంతా హెపటైటిస్ టీకా తప్పకుండా తీసుకోవాలని సిఫార్సు చెయ్యటం లేదు. కొంతమంది మాత్రం తప్పకుండా తీసుకోవాలి. 2. చిన్న పిల్లలకూ, స్కూలు వయసు పిల్లలందరకీ తప్పకుండా టీకా ఇప్పించాలి. 3. కుటుంబంలో ఎవరికన్నా హెపటైటిస్ -బి ఉంటే, ఆ ఇంట్లోని వారంతా తప్పకుండా టీకా తీసుకోవాలి. వైద్య సిబ్బంది, తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే రకరకాల వ్యాధి పీడితులకు కూడా టీకా తప్పనిసరి. 4. ఇవాళ మొదటి టీకా వేయించుకుంటే - మళ్ళీ సరిగ్గా నెలకు ఒకటి, ఆర్నెల్లకు మరోకటి, మొత్తం మూడు టీకాలే తీసుకోవాలి , మరియు నివారణ కోసం తప్పనిసరిగా హోమియో మందులు వాడితే మంచి ఫలితాలు వస్తాయి , - డాక్టర్ నవీన్ రోయ్,ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఫోన్ -9703706660 -
ప్రమాదకర హెపటైటిస్.. మరో 18 ఆస్పత్రుల్లో వైద్యం.. వివరాలివే!
సాక్షి, అమరావతి: అత్యంత ప్రమాదకరమైన హెపటైటిస్ వ్యాధి నియంత్రణ, నివారణ చర్యలపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రస్తుతం 13 ఆస్పత్రుల్లో ఈ వ్యాధికి వైద్యం అందిస్తుండగా, కొత్తగా మరో 18 వైద్య విధాన పరిషత్ ఏరియా, జిల్లా ఆస్పత్రుల్లో స్క్రీనింగ్, వైద్య సేవలకు సన్నాహాలు చేస్తోంది. ఈ ఆస్పత్రుల్లో హెపటైటిస్ బాధితులకు వైద్యానికి జనరల్ మెడిసిన్ లేదా గ్యాస్ట్రో ఎంటరాలజీ లేదా హెపటాలజీ వైద్యుల్లో ఒకరిని ప్రత్యేకంగా నియమిస్తారు. రాష్ట్రంలో 2.3 శాతం జనాభా హెపటైటిస్ – బి, 0.3 శాతం హెపటైటిస్ – సి తో బాధపడుతున్నట్టు అంచనా. వ్యాధిని త్వరగా గుర్తించి, అరికట్టడానికి ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మందికి హెపటైటిస్ స్క్రీనింగ్ నిర్వహించాలన్నది వైద్య శాఖ లక్ష్యం. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 2 లక్షల మందికి స్క్రీనింగ్ చేశారు. 1.41 లక్షల మంది రక్త దాతలకు, 5,840 మంది ఖైదీలు, 30 వేల మంది సాధారణ ప్రజలు, 20 వేల మందికి పైగా ఎయిడ్స్ బాధితులకు స్క్రీనింగ్ చేశారు. వీరిలో 1,500 మందికి పైగా హెపటైటిస్ బి, సి వ్యాధిగ్రస్తులను గుర్తించారు. వీరందరికీ ప్రభుత్వమే ఉచితంగా వైద్యం అందిస్తోంది. హై రిస్క్ వర్గానికి చెందిన హెచ్ఐవీ రోగులకు 45 యాంటీ రిట్రోవల్ థెరఫీ (ఏఆర్టీ) సెంటర్లలో స్క్రీనింగ్, వైద్య సేవలు అందిస్తున్నారు. దేశంలో హెచ్ఐవీ బాధితులకు హెపటైటిస్ స్క్రీనింగ్, వైద్య సేవలు అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఏపీకి ఘనత దక్కింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అవార్డు సైతం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖకు వచ్చింది. హైరిస్క్ వర్గాల వారికి టీకా హెపటైటిస్ బీ వ్యాధి నియంత్రణకు టీకా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే వైద్య శాఖలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది లక్ష మందిలో 99 శాతం మందికి తొలి డోసు టీకా ఇచ్చారు. 95 శాతం మందికి రెండో డోసు, 89 శాతం మందికి మూడో డోసు పూర్తయింది. హైరిస్క్ వర్గానికి చెందిన హెచ్ఐవీ బాధితులు, సెక్స్‌వర్కర్లు, ఇంజెక్షన్ల ద్వారా మాదక ద్రవ్యాలు తీసుకునే 2 లక్షల మందికి టీకా ఇవ్వాలని నిర్ణయించారు. తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలి హెపటైటిస్ బి, సి కాలేయంపై ప్రభావం చూపుతాయి. అనారోగ్య సమస్యలు కలిగిస్తాయి. వ్యాధి పట్ల అవగాహనతో నియంత్రణ సాధ్యం అవుతుంది. రక్తమార్పిడి, సురక్షితం కాని శృంగారం, సిరంజుల ద్వారా ఇవి సోకుతాయి. తల్లి నుంచి బిడ్డకు హెపటైటిస్ బి సోకుతుంది. ఇంట్లో ఎవరికైనా హెపటైటిస్ బి ఉంటే కుటుంబ సభ్యులు అందరూ స్క్రీనింగ్ చేయించుకోవాలి. గర్భిణులు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలి. తద్వారా బిడ్డకు వ్యాధి సోకకుండా నియంత్రించవచ్చు. – డాక్టర్ ఎస్.నూర్‌బాషా, గుంటూరు జీజీహెచ్ అసిస్టెంట్ ప్రొఫెసర్, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, లివర్ స్పెషలిస్ట్ -
గుండెపోటును గుర్తుపట్టడం ఎలా?
హెపటైటిస్–బి అంటున్నారు...చికిత్స లేదా? నా వయసు 23 ఏళ్లు. నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్‌గా పనిచేస్తున్నాను. రొటీన్ హెల్త్ చెక్అప్లో భాగంగా నేను కొన్ని టెస్టులు చేయించుకున్నాను. అయితే వాటికి సంబంధించిన రిపోర్టులలో నాకు హెపటైటిస్–బి ఉన్నట్లు తేలింది. అసలు నాకు ఈ అనారోగ్య సమస్య రావడానికి కారణమేమిటి? దీనివల్ల నాకేమైనా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందా? నా సమస్యకు శాశ్వతమైన చికిత్స అందుబాటులో ఉందా? మానసికంగా కుంగిపోతున్నాను. దయచేసి నాకు తగిన పరిష్కారం చూపండి. – అజయ్‌కుమార్, హైదరాబాద్ హెపటైటిస్–బి అనేది ఒక వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఇది నేరుగా మన శరీరంలోని కాలేయంపై ప్రభావం చూపుతుంది. నిజానికి ఈ అనారోగ్యానికి గురైనప్పటికీ... అంటే శరీరంలో వైరస్ ఉన్నప్పటికీ వ్యాధి లక్షణాలు బయటపడే అవకాశాలు చాలా తక్కువ. ఇది వైరస్ ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి వ్యాధి సోకిన వారి నుంచి ఇది మీకు సంక్రమించి ఉంటుంది. ఒకవేళ ఏదైనా లక్షణాలు కనిపించినప్పటికీ అవి సాధారణ జ్వరం, ఫ్లూ లాగే అనిపిస్తాయి. కాబట్టి నిర్దిష్టంగా వైద్య పరీక్షలలో తేలినప్పుడు తప్ప, అది హెపటైటిస్–బి అని చెప్పడం కష్టమవుతుంది. ఇక మీకు హెపటైటిస్–బి సోకినప్పటికీ మీరు ఎలాంటి మానసిక ఆందోళనకు గురి కానవసరం లేదు. కాకపోతే మీరు ‘లివర్ పనితీరు’, అల్ట్రాసౌండ్ అబ్డామెన్ లాంటి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అలాగే హెపటైటిస్–బి ప్రొఫైల్‌లో డీఎన్ఏ ఆధారిత పరీక్ష చేయించుకోవడం ద్వారా మీ శరీరంలో వైరస్ క్రియాశీలతను అంచనా వేయవచ్చు. దాదాపు 60 శాతం పేషెంట్లలో ఈ వైరస్ సాధారణ స్థాయిలో ఉండడం వల్ల కేవలం టాబ్లెట్స్తోనే వ్యాధి నయమవుతుంది. ప్రస్తుతం ఈ వ్యాధికి మంచి వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. దీనికి వ్యాక్సిన్‌తో కట్టడి చేయవచ్చని మీరు గుర్తుంచుకోండి. మీరు వెంటనే డాక్టర్‌ను కలిసి, తగిన చికిత్స తీసుకోండి. అంతేకాకుండా మీ కుటుంబ సభ్యులు కూడా హెపటైటిస్–బి నిర్ధారణ పరీక్ష చేయించుకోవడం మంచిది. తద్వారా భవిష్యత్తులో ‘హెపటైటిస్–బి’ వైరస్ వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలూ రాకుండా ముందే జాగ్రత్త వహించవచ్చు. డా. రవిశంకర్ రెడ్డిగ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,మ్యాక్స్క్యూర్హాస్పిటల్స్,సెక్రటేరియట్,హైదరాబాద్ గుండెజబ్బును ముందుగా తెలుసుకొనేదెలా? మా నాన్నగారి వయసు 49 ఏళ్లు. ఈ మధ్య అకస్మాత్తుగా గుండెపోటు వచ్చి కొద్దిసేపట్లోనే కన్నుమూశారు. ఆయనకు ఇదివరకు ఎలాంటి గుండెజబ్బుల లక్షణాలు కూడా కనిపించలేదు. గుండెజబ్బును ముందుగానే తెలుసుకోవడం ఎలా? – చిన్నారావు, అమలాపురం మీ నాన్నగారికి వచ్చిన గుండెపోటును సడన్ కార్డియాక్ డెత్ లేదా సడన్ కార్డియాక్ అరెస్ట్ అంటారు. అప్పటివరకు చురుకుగా పనిచేసిన మనిషి... హఠాత్తుగా గుండెపట్టుకుని విలవిలలాడుతూ పడిపోవడం, కుటుంబ సభ్యులో, స్నేహితులో తక్షణం ఆసుపత్రికి తరలించే లోపే మనకు దక్కకుండా పోవడం వంటి ఉదంతాలు సడెన్ కార్డియాక్ అరెస్ట్ జరిగినప్పుడు కనిపిస్తాయి. ఎవరిలో ఎక్కువగా కనిపిస్తుంది? ⇔ గతంలో ఒకసారి గుండెపోటు బారిన పడ్డవారు ⇔ గుండె కండరం బలహీనంగా ఉన్నవారు ⇔ కుటుంబంలో హఠాన్మరణం చరిత్ర ఉన్నవారు ⇔ కుటుంబంలో గుండె విద్యుత్ సమస్యలు ఉన్నవారు ⇔ గుండె లయ అస్తవ్యస్తంగా ఉన్నవారు ⇔ పైన పేర్కొన్న వారితో పాటు ఇప్పటికే గుండెజబ్బు తీవ్రంగా ఉన్నవారిలో కూడా అకస్మాత్తుగా మరణం సంభవించవచ్చు. రక్షించే అవకాశం ఉంది! గుండెపోటు అన్నది క్షణాల్లో మనిషిని మృత్యుముఖానికి తీసుకెళ్లిపోయే సమస్య. అయితే ఎవరికైనా గుండెపోటు వస్తున్న ఘడియల్లో తక్షణం స్పందించి వారిని వేగంగా హాస్పిటల్‌కు తీసుకెళ్లగలిగితే వారిని రక్షించే అవకాశాలూ ఉంటాయి. అందుకే ప్రతి ఒక్కరూ హార్ట్ ఎటాక్ పై అవగాహన కలిగి ఉంటే మృత్యుముఖంలోకి వెళ్లిన మనిషిని కూడా తిరిగి బతికించే అవకాశాలుంటాయి. అందుకే దీనిపై ప్రతి ఒక్కరూ అవగాహనను పెంచుకోవాలి. గుండెపోటును గుర్తుపట్టడం ఎలా? ఎవరైనా హఠాత్తుగా ఛాతీలో అసౌకర్యంతో కుప్పకూలిపోతుంటే... వెంటనే వాళ్లు స్పృహలో ఉన్నారా, శ్వాస తీసుకుంటున్నారా లేదా అన్న అంశాలను చూడాలి. అవసరాన్ని బట్టి గుండె స్పందనల్ని పునరుద్ధరించే ప్రథమ చికిత్స (కార్డియో– పల్మనరీ రిససియేషన్–సీపీఆర్) చేయాలి. సీపీఆర్ వల్ల కీలక ఘడియల్లో ప్రాణం పోసినట్లు అవుతుంది. చాలా దేశాల్లో సీపీఆర్‌పై శిక్షణ ఉంటుంది. గుండె స్పందనలు ఆగిన వ్యక్తికి సీపీఆర్ ఇచ్చి అంబులెన్స్ వచ్చే వరకు రక్షించగలిగితే దాదాపు కోల్పోయిన జీవితాన్ని నిలబెట్టినట్లవుతుంది. అందుకే సీపీఆర్‌పై శిక్షణ ఇవ్వడం, ఆ ప్రక్రియపై అవగాహన కలిగించడం అవసరం. డాక్టర్ హేమంత్ కౌకుంట్ల కార్డియో థొరాసిక్ సర్జన్, సెంచరీ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
గతేడాది 361 మంది హెపటైటిస్-బి మృతులు
లోక్‌సభలో ఎంపీ పొంగులేటి పశ్నకు కేంద్ర మంత్రి సమాధానం న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా హెపటైటిస్-బి తో 2014లో 361 మంది మృత్యువాత పడినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా వెల్లడించారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాధితో బాధపడుతున్న వారి సమాచారం లేదన్నారు. ప్రధానంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రబలుతున్న హెపటైటిస్-బి వ్యాధి అరికట్టేందుకు కేంద్రం తీసుకుంటున్న చర్యలు తెలపాలంటూ శుక్రవారం లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. ఆయనతోపాటు టీడీపీ ఎంపీ కొనకళ్ల నారాయణ, మరో ఇద్దరు ఎంపీలు అడిగిన ప్రశ్నలకు జేపీ నడ్డా శుక్రవారం లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. 12వ పంచవర్ష ప్రణాళికలోనూ వైరల్ హెపటైటిస్‌ను అరికట్టేందుకు ప్రణాళికలు రూపొం దించి అమలు చేస్తున్నామని, పలు జాతీయస్థాయి పరిశోధనా సంస్థలు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులకు అవసరమైన మందులను ప్రభుత్వ రంగ సంస్థలతోపాటు, ప్రైవేటు కంపెనీల నుంచి అంతర్జాతీయంగా టెండర్లు నిర్వహించి సేకరిస్తున్నట్లు కేంద్ర మంత్రి నడ్డా తెలిపారు.