Ayurvedic doctor
-
హైదరాబాద్‌లో క్షుద్రపూజలు.. నకిలీ ఆయుర్వేద వైద్యుడి అరెస్ట్
హైదరాబాద్: వైద్యం పేరుతో క్షుద్ర పూజలు చేస్తున్న నకిలీ డాక్టర్‌ను ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకుని పీఎస్‌లో అప్పగించారు. సీఐ అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం వనస్థలిపురం సాహెబ్ నగర్లో నివాసం ఉంటున్న దేవులపల్లి కార్తీక్ రాజు ఈ నెల 13న తలనొప్పి, నరాల బాధతో ఎల్బీనగర్లోని సిరీస్ రోడ్‌లోని సిరినగర్ కాలనీలో ఉన్న జీఎన్ఆర్ ఆయుర్వేదిక్ సెంటర్‌కు వచ్చాడు. అక్కడ జ్ఞానేశ్వర్ అనే నకిలీ డాక్టర్ కార్తీక్‌రాజును పరీక్షించి మందులు ఇవ్వకుండా...నీకు చేతబడి చేశారని, పూజలు చేయాలంటూ సలహా ఇచ్చాడు. 22వ తేదీన అమావాస్య నాడు పూజలు జరిపిస్తానని చెప్పి రూ.50 వేలు వసూలు చేశాడు. ఇతని తీరుపై అనుమానం వచ్చిన బాధితుడు ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు ఆదివారం జీఎన్ఆర్ ఆయుర్వేదిక్ హస్పిటల్‌పై దాడి చేసి జ్ఞానేశ్వర్‌ను అదుపులోకి తీసుకుని..అతని వద్ద నుంచి క్షుద్ర పూజలకు సంబంధించిన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మీకు తెలుసా? ప్రతిరోజూ సున్నం తీసుకుంటే ఇన్ని లాభాలున్నాయా?
మనకు వచ్చే వ్యాధులలో సుమారు 70% వాతం వల్ల వచ్చేవే. మన శరీరంలో వచ్చే నొప్పులు 90% వాతం కారణంగానే వస్తాయి. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలి? వాతం రాకముందే ఎలా గుర్తించాలి? నివారణకు ఏం చేయాలి?అన్నది ప్రముఖ ఆయుర్వేదిక్ డా. నవీన్ నడిమింటి మాటల్లోనే.. ►శరీరంలో కాల్షియం తగ్గితే 50కి పైగా జబ్బులు వస్తాయి. ► మన శరీరంలో40-45 ఏళ్ల వరకే మనం తీసుకునే ఆహరం నుంచి కాల్షియం తయారవుతుంది. ► శరీరంలో కాల్షియం తగ్గితే ఎముకలకి సంబంధించిన నొప్పులు, కఫానికి సంబంధించిన జబ్బులు వస్తాయి. ► కీళ్లనొప్పులు, భ/జాల నొప్పులు, మోకాళ్లు, నడుము నొప్పులు వస్తాయి. ► స్త్రీలకు 45ఏళ్లు పూర్తికాగానే, మోనోపాజ్ దశ మొదలవుతుంది. దీంతో శరీరం కాల్షియంను తీసుకునే సామర్థ్యం కోల్పోతుంది. కొందరికి యూరిక్ యాసిడ్ వల్ల మోకాళ్ల నొప్పులు వస్తాయి. ఈ మధ్యకాలంలో వాత రోగాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చలికాలంలో చల్లదనం వల్ల వాతం పెరిగి నొప్పులు మరింత ఎక్కువగా ఉంటాయి. శరీరంలో వాతం పెరిగితే నిద్ర పట్టకపోవచ్చు. కాల్షియం ఎక్కువగా ఉండే పదార్థాలు పాలు, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, అరటిపండు, నారింజ, కమలా, బత్తాయి, ద్రాక్ష, మామిడి పండ్లు 45ఏళ్లు నిండిన తర్వాత,పండ్లు తీసుకున్నా శరీరంలో కాల్షియంను జీర్ణం చేసే హార్మోన్ల ఉత్పత్తి ఆగిపోతుంది. దీంతో బయటి నుంచి కాల్షియంను తీసుకోవాల్సి ఉంటుంది. వాతం..ఇలా గుర్తించండి ► చేతి, కాళ్ల కదలికలు స్టిఫ్ అవుతున్నట్లు, ఏదైనా నొప్పి కలిగిస్తున్నట్లు ఉంటే వాతానికి సంబంధించిన సమస్యలు ఉన్నట్లు గుర్తించండి. ► ఉదయం నిద్రలేచే సమయానికి పూర్తిగా స్టిఫ్‌గా శరీరం ఉంటే వాతం ఉన్నట్లు గమనించండి. ► ఫ్యాన్ వాతాన్ని చాలా ఎక్కువగా పెంచుతుంది. కాబట్టి వేగంగా తిరిగే ఫ్యాన్ కింద నేరుగా పడుకోవద్దు. ► పలుచటి దుప్పటి కప్పుకొని కాస్త పక్కకు పడుకోవాలి. ► గాలి నేరుగా తగలకుండా చూసుకోవాలి. వాతం నివారణకు ఇలా చేయండి. 1. సున్నం తీసుకోండి: 45 ఏళ్లు దాటిన స్త్రీలు, పురుషులు ఎవరైనా తప్పకుండా సున్నం తీసుకోవాలి. సున్నంలో కాల్షియం పరిపూర్ణంగా ఉంటుంది. ఇందులో మన శరీరానికి కావల్సిన సూక్ష్మపోషకాలు ఉన్నాయి. 1.సున్నం ( 1 గ్రాము ) + 1 గ్లాసు నీళ్ళు (1 గ్రాము -- గోధుమ గింజంత మోతాదు ) సున్నంని నీళ్ళలో బాగా కలిపి ఉదయం పరగడుపున తీసుకోవాలి. 2.సున్నం + పెరుగు లేక మజ్జిగ . సున్నంని పెరుగు లేక మజ్జిగలో కలిపి మధ్యాహ్నం భోజనము తర్వాత మాత్రమే తీసుకోవాలి. 3. ఆర్థరైటిస్ ఉన్నవారు రోజుకు రెండు గ్రాముల సున్నం తీసుకోవాలి. గమనిక: శరీరంలో రాళ్లు(కిడ్నీలో స్టోన్స్)ఉన్నవాళ్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సున్నంని తీసుకోరాదు. మెంతులు మంచి ఔషధం 1.మెంతులు ఔషధాల గని. ఇవి వాతం, కఫాన్ని తగ్గిస్తాయి. 2.రాత్రిపూట ఒక గ్లాసు గోరువెచ్చని లేదా వేడి నీటిలో 1 చెంచా మెంతులు నానబెట్టి ఉదయాన్నే పరగడుపున బాగా నమిలితినాలి. మెంతుల కంటే సున్నం వాతనాశినిగా ఆయుర్వేదంలో చెప్పుకుంటారు. 3.పారిజాత వృక్షం చెట్టు ఆకులు ఎక్కువ క్షౌరగుణాన్ని కలిగి ఉంటుంది. ఈ ఆకులను రాత్రిపూట ఒక గ్లాసు నీళ్లలో వేసి ఆ నీటిని అరగ్లాసు అయ్యేదాకా వేడి చేసి, ఉదయం పరగడుపునే ఆకులతో సహా గుటకగా తాగాలి. ఇది అన్ని రకాల ఆర్థరైటిస్‌ను తగ్గిస్తుంది. ఈ కషాయం దీర్ఘకాలిక రోగాలకు మంచి మందులా పనిచేస్తుంది. గమనిక: ఈ కషాయం వాడుతున్నప్పుడు ఎలాంటి ఇతర మందులు వాడరాదు. ఈ కషాయం వల్ల 2-3 నెలల్లోనే సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతం అవుతుంది. ♦ యూరిక్ యాసిడ్ వల్ల మోకాళ్ల నొప్పులు ఉన్నవారు.. నల్ల నువ్వులు,బెల్లాన్ని కలిపి తీసుకోవాలి. ♦ ఆస్తమా + ఆర్ధరైటీస్ ఉన్నవారు దాల్చిన చెక్క + శొంటి కషాయాన్ని తప్పనిసరిగా తాగాలి. ♦ స్థూలకాయం + ఆర్ధరైటీస్ ఉన్నవారు కూడా బెల్లాన్ని తీసుకోవచ్చు. ♦ పెద్ద వయస్సు వారికి మోకాళ్ల నొప్పులు ఉంటే సున్నం తీసుకుంటే సరిపోతుంది. ♦ భుజాల నొప్పులు, మోచేతి నొప్పులకు నీటిని చిన్నగా గుటకగుటకగా తాగితే నొప్పులు తగ్గిపోతాయి. ♦ కీళ్ల నొప్పులు ఉన్నారు భోజనం చేసిన వెంటనే వేడినీళ్లు తాగాలి. ♦ ఉపవాస సమయంలో చల్లటి పండ్లరసాలు తీసుకుంటే చాలా సమస్యలు వస్తాయి. ఎక్కువ సేపు కడుపు ఖాళీగా ఉంటే వాతం పెరిగి కాళ్లు, చేతులు, నడుము నొప్పులు వస్తాయి. వేడినీళ్లు తాగితే ఏ ఇబ్బందీ ఉండదు. మంచినీళ్లు నిలబడి తాగుతున్నారా? ►మంచినీళ్లు తాగేటప్పుడు కూర్చొని తాగాలి. అంతేకాకుండా నీళ్లు ఎప్పుడు తాగినా గుటక గుటకగా తాగాలి. ► నిలబడి నీళ్లు తాగితే మోకాళ్ల నొప్పులు ఎప్పటికీ తగ్గవు. ఏ మందులు వాడినా ఫలితం ఉండదు. ► సైంధవ లవణం ( Rock Salt ),శుద్దమైన వంట నూనె వాతం శాతన్ని పెంచకుండా చేస్తుంది. - డాక్టర్ నవీన్ రోయ్,ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఫోన్ -9703706660 -
గాయాలే! అని కొట్టిపారేయొద్దు! అదే ఒక్కోసారి ప్రాణాంతకం కావొచ్చు!
గాయాలే కదా అని తేలిగ్గా తీసుకోవద్దు. ఒక్కోసారి అవే ప్రాణాంతకంగా మారవచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి. దెబ్బల తగిలిన వెంటనే సత్వరమే తగిన చికిత్స తీసుకుంటే సులభంగా బయటపడొచ్చు అంటున్నారు. దెబ్బల రకాలు, ఎలాంటి చికిత్స తీసుకోవాలి తదితరాలు నవీన్ మాటల్లోనే చూద్దాం!. మనిషికి గాయాలు రెండు రకాలుగా జరుగుతాయి. అవి 1,మానసిక గాయాలు . 2.శారీరక గాయాలు. మానసిక గాయాలు : మనిషికి గాయమైనచో కాలక్రమమున గాయము మానుతుంది. అదే మనసుకు గాయమైనచో ఆ గాయము జీవితాంతము మర్చిపోలేం. మానవుడు మాటలతో చేయు గాయములు అస్త్రములకన్న పరుషములు. ప్రియంగా మాట్లాడుట చేతకనివారు మౌనం వహించుట ముఖ్యము. అని మన పెద్దలు చెబుతుంటారు శారీరక గాయము: శరీరానికి బయట వస్తువుల నుంచి తగిలే దెబ్బలు వలన చర్మము చిట్లడమో, కమిలిపోవడమో, వాయడమో, గీక్కుపోవడమో జరిగితే దాన్ని గాయం అంటాం. ఒకవేళ గాయము కర్రతో కొట్టినందువలన, ముళ్ళు గుచ్చునందువలన, పళ్ళతో కొరికినందువలన, నిప్పుతో కాలినందువలన, సల్ఫూరిక్ ఆమ్లము, జిల్లేడు పాలు వంటి రసాయనాలు వలన, ఇలా ఎన్నో విదములుగా జరుగవచ్చును. గాయమైనచోట ఇన్ఫెక్షన్కి గురయ్యి 1. వాపు , 2. ఎరుపెక్కడం , 3. ఉష్ణోగ్రత పెరగడం , 4. నొప్పి గా ఉండడం , 5. ఆ భాగము పనిచేయకపోవడం అనేవి జరుగుతాయి. చిన్న గాయాలైనప్పుడు సబ్బు నీటితో కడగాలి. రక్తస్రావం తగ్గడానికి గాయంపై పరిశుభ్రమైన గుడ్డతో బాగా బిగించి ఒత్తిడి ఇవ్వాలి. ఎలాంటి ఆయింట్మెంట్, పౌడర్ ఉపయోగించకూడదు. ప్రథమ చికిత్స చేస్తూ అవసరం అనుకుంటే వైద్య సలహా పొందాలి. చెట్లు, మొక్కల వల్ల చర్మానికి దురద వస్తే చర్మాన్ని సబ్బునీటితో బాగా కడగాలి. పరిశుభ్రమైన నీటితో ఎక్కువసేపు కంటిని శుభ్రపరచాలి. కళ్లు నలపకూడదు. గుడ్డతో నలుసు తీయడానికి ప్రయత్నం చేయకూడదు. అవసరమైతే వైద్యుల సలహా తీసుకోవాలి. శారీరక గాయాల రకాలు : బ్రూయీ - : చర్మము క్రింద రక్తము గడ్డకట్టి గీక్కు పోయేలా ఉండే గాయము . గంటు : పదునైన కత్తి, బ్లేడు వంటి వాటితో కోసుకుపోవడము. రక్తము ఎక్కువగా కారును . బొబ్బలు : మండే వస్తువు వలన కాలిపోయి చర్మము ఉబ్బి నీరుచేరడము. బెణుకు : కొన్ని సమయాలలో నడిచేటపుడు ఒడుదుడుకులు గా అడుగులు వేయడము వలన కీళ్ళలోని లిగమెంట్స్ సాగిపోవడము జరిగి వాపు , నొప్పి వచ్చుట. ఒక్కొక్కసారి గాయము వలన ప్రాణాపాయము కలుగవచ్చును. మనిషికి గాయాలు మనుషులు, జంతువులు, పక్షులు, ప్రమాదాలు, వలన కలుగును. అలాంటి సమయంలో ఆయా వ్యక్తులకు ఉపశమనం పొందేలా చికిత్స అందించడం అత్యంత ముఖ్యం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి. కింద పడటం లేదా రోడ్డుపైన కలిగే గాయాలకు ప్రధమ చికిత్స తల, వెన్నుముక్కకు ముఖ్యంగా మెడకు తగిలే గాయాలు చాలా అపాయం తెస్తాయి. ఎందుకంటే, ఈ గాయాలు జీవితాంతం పక్షవాతం కలిగిస్తాయి లేదా ప్రాణాలకు ముప్పు తెస్తాయి. తల, వెన్నుముక్క, కదలికలను తగ్గించండి. తద్వారా వెన్నుముక్క మెలి తిరగకుండా, గాయం తీవ్రం కాకుండా నివారించవచ్చు. కదలలేని లేదా భరించలేని తీవ్రమైన నొప్పి కలిగిన పిల్లవాడికి ఎముక విరిగి ఉండవచ్చు. గాయపడిన ఆ ప్రదేశాన్ని కదపకండి. దానికి ఆధారం ఇచ్చి వెనువెంటనే వైద్య సహాయం పొందండి. ఒకవేళ స్పృహకోల్పోతే, వారిని వెచ్చగా ఉంచి, వెనువెంటనే వైద్య సహాయం తీసుకోండి. బెణిగిన లేదా నలిగిన గాయలకు ప్రథమ చికిత్స.. ►నలిగిన లేదా బెణికిన వాటిపై మంచు ముక్కలు పెట్టండి లేదా గాయలపై భాగాన్ని చల్లని నీటితో ముంచండి. ఇలా 15 నిముషాలు చేయండి. అయితే మంచు ముక్కను నేరుగా చర్మంపైన పెట్టరాదు. చర్మానికి - మంచు ముక్కకు మధ్య ఒక పొర బట్ట ఉండేలా చూడండి. మంచు ముక్కను లేదా నీటిని తొలగించి ఓ పావుగంట సేపు వేచి చూడండి. అవసరమనిపిస్తే, ఈ ప్రక్రియను మరోసారి చేయండి. ఈ చల్ల దనం వల్ల నొప్పి, వాపు తగ్గుతుంది. ►తెగిన గాయాలకు, పుండ్లకు ప్రధమచికిత్స ►తెగిన గాయం లేదా పుండ్లు చిన్న వాటికి అయితే- గాయం లేదా పుండును శుభ్రమైన నీరు, సబ్బుతో కడగండి. ►గాయం పుండు చుట్టు పక్కల చర్మాన్ని ఆరనీయాలి. ►పుండు గాయంపై శుభ్రమైన బట్ట ఉంచి, బ్యాండేజీ కట్టాలి. తెగిన గాయం పుండ్లు పెద్దవి తీవ్రమైనవి అయితే గాజు ముక్క లేదా ఇతర ముక్క లేవైనా గాయానికి అతుక్కొని ఉంటే దాన్ని తొలిగించరాదు. అలా అతుక్కొని ఉన్న ముక్క గాయం నుంచి రక్తం కారకుండా అడ్డుపడి ఉండవచ్చు. ఆ ముక్కను తొలిగిస్తే, గాయం తీవ్రంగా మారవచ్చు. ►గాయం నుంచి ఒకవేళ రక్తం ధారగా ఎక్కువగా కారుతూ ఉంటే, గాయపడిన ప్రదేశాన్ని ఛాతీకన్నా ఎక్కువ ఎత్తులో లేపి ఉంచాలి. శుభ్రమైన బట్టను మడతలుగా పెట్టి ►గాయంపైన ఉంచి గట్టిగా నొక్కాలి. ఒకవేళ గాయంలో ఏదైనా తట్టుకొని ఉంటే, దాని పక్కన మడతల బట్టను పెట్టి నొక్కాలి. రక్తం కారటం ఆగిపోయే దాకా ఇలా చేస్తూనే ఉండండి. ►ఏదైనా మొక్కను గానీ, జంతుసంబంధ వస్తువులను గానీ గాయం పెట్టరాదు. వాటివల్ల ఇన్ ఫెక్షన్ కలుగుతుంది. ►గాయం పైన బ్యాండేజీ కట్టండి. అయితే గట్టిగా కట్టరాదు. గాయానికి వాపు రావటానికి వీలుగా బ్యాడేజీని కొంచెం వదులుగానే కట్టాలి. వ్యక్తికి వెంటనే వైద్య సహాయం అందించాలి లేదా ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళాలి. బిడ్డకు టెట్నస్ (ధనుర్వాతం) ఇంజక్షన్ ఇప్పించాలా అని ఆరోగ్య కార్యకర్తను అడగండి. నొప్పినివారణ మందులు : నొప్పి తగ్గించడానికి అనగా tab. Dolomed (ibuprofe+paracetamol) రోజుకి 2-3 మాత్రలు 4 నుంచి 5 రోజులు వాడాలి. యాంటిబయోటిక్స్ : అనగా tab . ciprobid TZ (ciprofloxacin + Tinidazole) రోజుకి 2-3 మాత్రలు చొ. 4-5 రోజులు. పైపూత మందులు : Ointment MEGADIN-M 1 tube . గాయము బాగా సబ్బునీటితో కడిగి రోజుకు రెండు పూటలు రాయాలి గమనిక: ఈ కథనం కేవలం అవగాహన కోసమే, పైన పేర్కొన్న మందతుల మీకు తగిలన గాయం తీవ్రత, మీకు అంతకుముందున్న వ్యాధుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని వైద్యుని పర్యవేక్షణలోనే ఆయా మందులు వాడాలి. --ఆయుర్వేద నిపుణులు నవీన్ నడిమింటి (చదవండి: తేనె మంచిదని ఎక్కువగా తీసుకుంటున్నారా? ఐతే దుష్ప్రభావాలు తప్పవు) -
హెపటైటిస్-బి అంటే ఏంటి? సూదులు, సిరంజీలతో ఇంత డేంజరా?
ఒకసారి హెపటైటిస్-బి వైరస్ ఒంట్లో ప్రవేశించిందంటే ఒంట్లో దానిసంఖ్య విపరీతంగా లక్షల్లో పెరిగిపోతూ అది లివర్‌ను దెబ్బతీయడం ఆరంభిస్తుంది. ఈ వైరస్ శరీర ద్రవాల ద్వారా వ్యాపిస్తుంది. రక్తమార్పిడి, సూదులు, సిరింజిలు తల్లి నుంచి బిడ్డకు సంక్రమించవచ్చు. 1. పరీక్షల్లో - HBsAg పాజిటివ్‌గా ఉండటమే కాకుండా HBeAg కూడా పాజిటివ్ ఉండి, SGPT (కాలేయానికి సంబంధించిన ఎన్జైమ్) ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉండి వైరల్ లోడ్ 5లక్షల కంటే ఎక్కువ ఉందంటే అర్థం వీరికి భవిష్యత్తులో ఎప్పుడోకప్పుడు లివర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని! 2. ఈ వ్యాధిని నివారించుకోటానికి కావాల్సిన మందులు ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి. వీళ్లు ముందుగానే మందులు తీసుకోవటం ద్వారా వ్యాధి నివారించుకునే అవకాశం ఉంది. 3. వైరస్ సన్నిహితులకు సంక్రమించకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. 4. సిర్రోసిస్ మొదలైన తర్వాత కూడా కొన్ని దశాబ్దాల పాటు జీవించే వాళ్ళు చాలా మంది ఉంటారు. కాబట్టి నిర్వేదంలోకి జారిపోకుండా చికిత్స తీసుకోవటం ముఖ్యం. 5. హెపటైటిస్-బి సోకిన వారు ఆల్కహాల్ ముట్టకూడదు, తరచూ వైద్యుల పర్యవేక్షణ చాలా అవసరం. కొందరికి ఇతరత్రా లివర్ సమస్యలేమీ మొదలవ్వకపోయినా.. దీర్ఘకాలంగా ఒంట్లో హెపటైటిస్-బి వైరస్ ఉన్న కారణంగా లివర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.అందుకే వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ఇది సోకుండా ముందస్తు జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. హెపటైటిస్ - బి సెక్స్ ద్వారా సంక్రమించే అవకాశాలు చాలా ఎక్కువ. కాబట్టి కండోమ్ వంటి సురక్షిత జాగ్రత్తలు తీసుకోకుండా సెక్స్‌లో పాల్గోనవద్దు. ఒకరి టూత్‌బ్రష్‌లు, రేజర్లు, నెయిల్‌కట్టర్లు వంటివి మరోకరు వాడొద్దు. బయట సెలూన్లలో కూడా కచ్చితంగా కొత్త బ్లేడు వాడేలా చూడాలి. ఇంజక్షన్ సూదుల వంటివి ఒకరికి వాడినవి మరొకరు ఉపయోగించవద్దు. డిస్పోజబుల్ సూదులు, సిరంజీలు వాడటం ఉత్తమం. చెవులు కుట్టటం, ముక్కులు కుట్టటం, పచ్చబొట్లు వేయించుకోవటం వీటికి ఒకరికి వాడిన పరికరాలు మీకు వాడకుండా చూసుకోవాలి. రక్తం ఎక్కించేటప్పుడు, రక్తమార్పడి విషయంలో పూర్తి సురక్షితమైన పద్ధతులను అనుసరించటం చాలా అవసరం! పెళ్లి చేసుకోవచ్చా? టీకాలున్నాయి కాబట్టి హెపటైటిస్ -బి బాధితులు ఈ విషయం ముందుగానే అందరికీ తెలిపి, వారి అనుమతితో నిశ్చితంగా పెళ్ళి చేసుకోవచ్చు. భాగస్వామికి తప్పకుండా హెపటైటటిస్ - బి టీకా మూడు డోసులు ఇప్పించాలి. మూడో డోసు కూడా పూర్తయిన రెండు నెలల తర్వాతే సాధారణ సెక్సు జీవితాన్ని ప్రారంభించాలి. కొన్ని సందర్భాల్లో సిరోసిస్ వచ్చిన వాళ్ళు తప్పించి మిగతా అందరూ (అన్అఫెక్టెడ్ క్యారియర్స్ కూడా) పిల్లలను కూడా కనొచ్చు. అలా చేస్తేనే బిడ్డకు క్షేమం గర్భిణులంతా తప్పనిసరిగా HBsAg పరీక్ష చేయించుకోవాలి. హెపటైటిస్-బి ఉన్నా కూడా బిడ్డలను కనొచ్చు. గర్భస్రావాలు చేయించుకోవాల్సిన అవసరమే లేదు. కాకపోతే పుట్టగానే బిడ్డకు ఒక తొడకు Hepatitis-B ఇమ్యూనోగ్లోబ్యులిన్ల ఇంజక్షన్, మరో తొడకి హెపటైటిస్-బి టీకా రెండు తప్పకుండా ఇవ్వాలి. నెల రోజులకు మరో టీకా, ఆర్నెల్లకు మరో టీకా ఇప్పించాలి. దీంతో తల్లి నుంచి బిడ్డకు వైరస్ సంక్రమించకుండా 95 శాతం వరకూ నివారించవచ్చు. తప్పకుండా టీకాలు 1. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా ఏ ప్రామాణిక సంస్థా కూడా ప్రజలంతా హెపటైటిస్ టీకా తప్పకుండా తీసుకోవాలని సిఫార్సు చెయ్యటం లేదు. కొంతమంది మాత్రం తప్పకుండా తీసుకోవాలి. 2. చిన్న పిల్లలకూ, స్కూలు వయసు పిల్లలందరకీ తప్పకుండా టీకా ఇప్పించాలి. 3. కుటుంబంలో ఎవరికన్నా హెపటైటిస్ -బి ఉంటే, ఆ ఇంట్లోని వారంతా తప్పకుండా టీకా తీసుకోవాలి. వైద్య సిబ్బంది, తరచూ రక్తమార్పిడి అవసరమయ్యే రకరకాల వ్యాధి పీడితులకు కూడా టీకా తప్పనిసరి. 4. ఇవాళ మొదటి టీకా వేయించుకుంటే - మళ్ళీ సరిగ్గా నెలకు ఒకటి, ఆర్నెల్లకు మరోకటి, మొత్తం మూడు టీకాలే తీసుకోవాలి , మరియు నివారణ కోసం తప్పనిసరిగా హోమియో మందులు వాడితే మంచి ఫలితాలు వస్తాయి , - డాక్టర్ నవీన్ రోయ్,ఆయుర్వేద వైద్యులు, ఆరోగ్య నిపుణులు ఫోన్ -9703706660 -
Kidney Stones: కాల్షియమ్ ఆక్సలేట్ ఉండే గింజలు తింటే అంతే! మూత్రనాళంలో తట్టుకుంటే..
ఒక వ్యక్తికి కిడ్నీలో నొప్పి వచ్చేంత రాయి తయారు అవ్వడానికి ఎంత కాలం పడుతుంది? నొప్పి రావడానికి ముందే తెలుసుకునే మార్గాలు ఉంటాయా? కిడ్నీ సమస్య వస్తే ఎప్పటికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పాటించాల్సిన ఆహార నియమాలు ఏంటి? సాధారణంగా, మూత్రపిండాల్లో రాళ్ళు మూత్రపిండంలో కదిలే దశ వచ్చే వరకు లేదా మూత్రనాళంలోకి వెళ్ళేవరకు నొప్పి కలిగించవు. రాళ్ళు చిన్నవయితే చాలా సార్లు శరీరం నుండి తక్కువ నొప్పితో లేదా అసలు నొప్పి తెలియకుండానే మూత్రంతో పాటుగా బయటకు వెళ్ళిపోతాయి. ఇవి మూత్రనాళంలో తట్టుకుంటే మాత్రం నొప్పి మొదలవుతుంది. ఇలా తట్టుకున్న రాళ్లు మూత్ర ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. అలాగే మూత్రపిండాల వాపునకు దారి తీస్తాయి. దీని వల్ల మూత్రనాళ దుస్సంకోచానికి (spasm) కారణమవుతుంది. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. సాధారణంగా ఈ రాళ్ళు 85% కాల్షియమ్ ఆక్సలేట్ (calcium oxalate) అన్న రసాయనంతో ఏర్పడుతాయి. ఈ నొప్పులకు రాళ్ళ సైజుతో సంబంధం లేదు. కావున మూత్రం తగ్గడం కానీ ఎక్కువ సార్లు పోవడం, మూత్రం వాసన రావడం వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించడం మంచది. కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు నిర్దారణ అయితే భోజనంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం? 1. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నప్పుడు పెద్ద స్పూన్‌తో తేనే, నిమ్మరసాలను కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. రాళ్లు కరిగిపోవడానికి ఇది దోహాదపడుతుంది. 2. కొండపిండి అనే మొక్కకు చాలా శక్తి ఉంది. మూత్రపిండాలలో కొండలు ఏర్పడినా కరిగించగల సత్తా దీనికి ఉందని అంటారు. ఇది రోడ్డు పక్కన అన్ని ప్రాంతాల్లో ఉచితంగా దొరికే మొక్క. దీనిని శుభ్రం చేసి ఎండబెట్టి దంచి పొడిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక గ్లాసు పాలలో బాగా మరిగించి వడగట్టి తాగాలి. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కచ్చితంగా కరుగుతాయని ఇప్పటికే నిర్దారణ అయింది. 3. భోజనం తిన్న తర్వాత కిడ్నీలో రాళ్లు కొన్నిసార్లు చాలా నొప్పిని కలిగిస్తాయి. తక్కువ భోజనం మరియు మొత్తంలో ఎక్కువగా నీళ్లు తాగడం మంచిది. అలాగే ఇంటి భోజనానికి మాత్రమే పరిమితం కండి. వేపుళ్లు, జంక్‌ఫుడ్ తింటే ఇబ్బంది పెరుగుతుంది. నీళ్లు పుష్కలంగా తాగండి. 4. ఎక్కువగా కూరగాయలు మరియు పండ్లు, తృణధాన్యాలు మరియు తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను అనుసరించండి. చక్కెరతో కూడిన తియ్యని ఆహారాలు (స్వీట్లు) , పానీయాలను తగ్గించండి లేదా ఆపేయండి. 5. ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఎక్కువగా మద్యంలో ఉంటుంది. దీనికి పరిమితి విధించండి లేదా ఆపేయండి. ఆల్కహాల్ ఎందుకు వద్దు అంటే ఇది రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. పైగా ఇతర ఇబ్బందులకు దారి తీస్తుంది. 6. దుంపలు, చాక్లెట్, బచ్చలికూర, టీ వంటి రాళ్లను ఏర్పరిచే ఆహారాలకు దూరంగా ఉండండి. చాలా గింజలలో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దోహదం చేస్తుంది. కాల్షియం ఆక్సలేట్ పుష్కలంగా ఉండే వాటిని తినకూడదు. సరైన ఆహారాన్ని సూచించే పోషకాహార నిపుణుడిని సంప్రదించండి. -డా.నవీన్ నడిమింటి, ఆయుర్వేద నిపుణులు చదవండి: Health: బీరకాయ, నేతి బీరకాయ తరచుగా తింటున్నారా? ఇందులోని అధిక సెల్యులోజ్ వల్ల.. పైనాపిల్, నిమ్మ, కివి పండ్లు తింటున్నారా? తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తాగితే.. -
బయట ఫ్రైడ్ రైస్, పునుగులు, బోండాలు తరచుగా తింటున్నారా? అయితే..
ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న 100 నగరాల్లో 46 మనదేశంలో ఉన్నాయి. వాయు కాలుష్యానికి గుండెపోటుకి సంబంధం ఉన్నట్టు చాలా అధ్యయనాల్లో నిరూపితమైనది. దీనికి తోడు వెంటిలేషన్ లేని స్థలాల్లో ఉండటం, బిర్యానీ, మాంసం ఇతర నూనె ఎక్కువ ఉన్న పదార్థాలు లాంటి చెత్త తినడం, రాత్రిపూట మేలుకోవడం, ఒత్తిడి, తిన్న కాసేపటికి వ్యాయామం చేయడం వంటివి తీవ్ర ప్రభావం చూపుతాయి. ఏం చేయాలంటే! 1. బయట బండి మీద దొరికే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, పునుగులు, బోండాలు తరచుగా తినటం ఆపి వేస్తే సగం జబ్బులు పోతాయి. 2. ఎత్తుకు తగ్గ బరువు ఉంటే ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడవచ్చు. 3. ఉదయాన్నే చద్ది అన్నం ఉల్లిపాయ నంజుకుని ప్రతి రోజు తింటే గుండె జబ్బులు 100% రావని చెప్పవచ్చు. 4. ఎక్కువగా బ్రెయిన్ ఒత్తిడికి గురి అవ్వడం కూడా హార్ట్ ఎటాక్‌లకు కారణం. 5. శరీరంలో అనవసరమైన, అధిక కొవ్వు నిల్వలు ఉండిపోయి రక్తనాళాలు మీద ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల రక్తప్రసరణ కష్టమవుతుంది. ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ స్థాయిలో అవధులు దాటి డిపాజిట్ అవడం వలన గుండెకి రక్తం పంపింగ్ కష్టం అయిపోతుంది. 6. అధిక బరువు వలన గుండె పనితీరులో ఆటంకాలు ఏర్పడి పోటు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఒబెసిటీ ఉన్నవారు ప్రతిరోజు, రోజుకి ఆరుగంటలు కష్టపడి శరీరం అలిసేటట్లు పనిచేయాలి. అరగంట నుండి గంట వరకూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. గుండెనొప్పి, గ్యాస్ నొప్పి - వీటిలో ఏదని ఎలా గుర్తించాలి? గుండెనొప్పి వస్తే గుండె మధ్యన చాలా బరువుగా వుంటుంది. విపరీతమైన చమట పడుతుంది. ఎడమ చెయ్యి, భుజం, ఎడమ వైపు మెడ లాగుతూ వుంటుంది. కొంతమంది లో మోషన్ కూడా అవుతుంది. వాంతులు అవుతాయి. పైన చెప్పిన లక్షణాలు కనపడగానే రోగిని సాధ్య మైనంత తొందరగా హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళాలి. ఎంత తొందరగా తీసుకు వెడితే అంత మంచిది. ఈ లోగా ఆస్ప్రిన్ గాని దిస్ప్రిన్ కానీ నీటిలో కలిపి తాగిస్తే మంచిది. నాలుక కింద సర్బిట్రేట్ మాత్ర ఉంచాలి. ఇది రోగిని హాస్పిటల్‌కి తీసుకు వెళ్ళే లోగా పరిస్థితి మరింత దిగజారకుండా ఉపయోగ పడుతుంది. గ్యాస్ నొప్పి వచ్చినపుడు.. గుండెలో మంట, తెనుపులు, కడుపు వుబ్బరం, తెనుపు వచ్చినప్పుడు గొంతులో మంటగా ఉంటుంది. గుండె నొప్పికి గాస్ నొప్పికికి తేడా కనుక్కోలేక పోయినట్టు అయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నొప్పి అనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించడం చాలా మంచిది. -నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు చదవండి: Stress Relief: పొద్దుతిరుగుడు గింజలు, ఇంకా వీటిని తింటే? వెల్లుల్లిలో ఉండే గ్లటాథియోన్ వల్ల Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే.. -
నోరు తెరిస్తే దుర్వాసన! తౌడు నానబెట్టిన నీటిలో వీటిని కలిపి తాగితే..
Oral Health Tips In Telugu- Bad Breath: ఉదయమే చక్కగా బ్రష్ చేసుకున్నారు. అయినా మధ్యాహ్నం నుంచి నోరు తెరిస్తే చాలు.. దుర్వాసన అని తెలిసిపోతోంది. ఎందుకిలా? బ్రష్ చేసిన తర్వాత కూడా వచ్చే నోటి దుర్వాసనకు కారణం ఏమిటి? దుర్వాసన అనేది చిగుళ్ళ వ్యాధి వంటి పెద్ద దంత సమస్య యొక్క లక్షణం కావొచ్చు. ఇది దంతాలపై ఫలకాన్ని (plaque) తయారు కావడం వల్ల సంభవిస్తుంది. చికిత్స చేయకపోతే, చిగుళ్ళ వ్యాధి దుర్వాసన మరియు దవడ ఎముక దెబ్బతినడం వంటి సమస్యలను సృష్టిస్తుంది. హేలిటోసిస్ అంటే నోటిలో నుంచి దుర్వాసన రావడం. దీనినే దుర్వాసన లేదా బ్యాడ్ బ్రీత్ అని కూడా అంటారు. దీనికి కారణాలు ప్రధానంగా.. 1. ఆహారం- మీ దంతాలలో మరియు చుట్టుపక్కల ఉన్న ఆహార కణాల విచ్ఛిన్నం బ్యాక్టీరియాను పెంచుతుంది మరియు దుర్వాసన కలిగిస్తుంది. 2. పొగాకు ఉత్పత్తులు. ధూమపానం అత్యంత అసహ్యకరమైన నోటి వాసనకు కారణమవుతుంది. 3. పేలవమైన దంత పరిశుభ్రత, అంటే సరిగా బ్రష్ చేసుకోకపోవడం నోటి దుర్వాసన ఇంకా ఏవైనా అనారోగ్యాలకు సంకేతమా? నోటి దుర్వాసన ఇతర వ్యాధులు లేదా అనారోగ్యాలు ఉన్నాయన్న దానికి హెచ్చరిక సంకేతం కూడా కావచ్చు. శ్వాసకోశ మరియు టాన్సిల్ ఇన్ఫెక్షన్లు, సైనస్ సమస్యలు, డయాబెటిస్, కాలేయం మరియు మూత్రపిండాల సమస్యలు, అలాగే కొన్ని రక్త రుగ్మతలలో నోటి దుర్వాసన ఒక సాధారణ లక్షణంగా ఉంటుంది. మనం నోరు బాగా శుభ్రం చేసుకొన్నా దుర్వాసన వస్తోందంటే ఒక సారి డెంటిస్ట్‌ను కలవడం మంచిది. నోటిపూత సాధారణంగా నోటిపూత బి(B) విటమిన్ లోపం వలన వస్తుంది. నివారణకు ముందు రాత్రి ఒక గ్లాస్ నీటిలో ఒక స్పూన్ తౌడుని వేసి తెల్లారి పరగడుపున ఆ నీటిని వడగట్టి అందులో ఒక స్పూన్ తేనె, నిమ్మరసం కలిపి ఓ 15 రోజుల పాటు తీసుకోవాలి. తౌడులో బి విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇక పొట్టలో అల్సర్ వంటివి ఉన్నా నోటిపూత వస్తుంది. ఆహారంలో మసాలాలు లేకుండా, తక్కువ ఆయిల్ తో వండుకొని తినాలి. పండ్లు, కూరగాయలు, జ్యూస్‌లు, తీసుకోవాలి. అలాగే నీరు బాగా త్రాగాలి. -డాక్టర్ నవీన్ నడిమింటి, ప్రముఖ ఆయుర్వేద నిపుణులు చదవండి: Skin Cancer: ఒంటిపై మచ్చలు, గడ్డలు, పులిపిరికాయలు ఉన్నాయా.. ఈ లక్షణాలు కనిపిస్తే మాత్రం.. Essential Bath Rules: స్నానానికి వేణ్ణీళ్లా? చన్నీళ్లా? కడుపు నిండా తిన్న వెంటనే స్నానం చేయవద్దు! -
మోకాలి నొప్పులతో బాధపడుతున్న ధోని.. ట్రీట్మెంట్ ఖర్చు 40 రూపాయలు!
MS Dhoni- Knee Pain: కొన్ని ఆరోగ్య సమస్యలకు పెద్ద ఆస్పత్రులకు వెళ్లినా.. భారీ మొత్తం ఖర్చు చేసినా ఒక్కోసారి పెద్దగా ఫలితం కనిపించదు. అలాంటప్పుడు హస్తవాసి బాగున్న వైద్యుల గురించి తెలిస్తే అక్కడికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవం సహజం. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కూడా ఇందుకు మినహాయింపు కాదు. మోకాలి నొప్పులతో బాధ పడుతున్న ఈ మిస్టర్ కూల్ ఇటీవల ఓ ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించినట్లు సమాచారం. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ప్రయోజనం లేకపోవడంతో ఆఖరికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి, ధోని ట్రీట్మెంట్కు అయిన ఖర్చు ఎంతో తెలుసా? దైనిక్ భాస్కర్ వార్తా పత్రిక కథనం ప్రకారం... జార్ఖండ్ రాజధాని రాంచీకి సుమారు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాపంగ్‌లో గల వందన్ సింగ్ ఖెర్వార్ అనే ఆయుర్వేద వైద్యుడు ఉన్నారు. ఆయన హస్తవాసి గురించి స్థానికంగా మంచి పేరుంది. ఈ విషయం తెలుసుకున్న ధోని ఆయన దగ్గరకు వెళ్లి మోకాలి నొప్పుల సమస్యల గురించి బయటపడే మార్గం గురించి అడిగాడు. కాల్షియం లోపం వల్ల తాను బాధపడుతున్నానని ఖెర్వార్‌కు ధోని చెప్పాడు. దీంతో ప్రతిసారి నాలుగు రోజులకు ఓసారి తన వద్దకు రావాల్సిందిగా సదరు వైద్యుడు సూచించాడు. ఈ విషయాల గురించి ఆయుర్వేద డాక్టర్ వందన్ సింగ్ ఖెర్వార్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ... ‘‘మొదటి సారి ధోని నా దగ్గరకు వచ్చినపుడు ఆయనను గుర్తుపట్టలేకపోయాను. కన్సల్టేషన్ ఫీజు కింద 20 రూపాయలు.. చికిత్సకై మందుల కోసం 20 రూపాయల మేర ప్రిస్కిప్షన్ రాశాను. ధోని తల్లిదండ్రులకు కూడా నేను వైద్యం చేస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఇరుగు పొరుగు వారి గురించి తన గురించి తెలుసుకున్న ధోని తనను సంప్రదించినట్లు పేర్కొన్నారు. కాగా ధోని లాపంగ్‌కు వస్తున్న విషయం తెలుసుకున్న స్థానికులు అతడిని చూసేందుకు తరలివస్తున్నారు. అయితే, ధోని మాత్రం సెల్ఫీలు గట్రా వద్దంటూ వారిని సున్నితంగా వారిస్తున్నాడట. ఇదిలా ఉంటే.. ఇటీవల ముగిసిన ఐపీఎల్-2022లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ పేలవ ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. సీజన్ ఆరంభంలో జడేజాను కెప్టెన్‌గా నియమించిన సీఎస్కే.. వరుస పరాజయాల నేపథ్యంలో మళ్లీ ధోనికే సారథ్య బాధ్యతలు అప్పజెప్పింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన చెన్నైకి ఘోర పరాభవం తప్పలేదు. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. కాగా 40 ఏళ్ల వయస్సులోనూ క్రికెట్ ఆడుతున్న ధోనిని గత కొన్ని రోజులుగా మోకాళ్ల నొప్పి సమస్య వేధిస్తోందట. చదవండి: India Vs England-Rishabh Pant: అద్భుతమైన షాట్లు.. నువ్వో సూపర్‌స్టార్: పంత్‌పై ప్రశంసల జల్లు -
దయనీయ స్థితిలో మాజీ సీఎం జలగం సన్నిహితుడు
సాక్షి, మధిర: నాడు వేలాదిమంది రోగులను పరీక్షించి, వందలాదిమంది రోగులకు ప్రాణం పోసిన ప్రజా వైద్యుడు నేడు అనారోగ్య, ఆర్థిక ఇబ్బందులతో మంచంలో మగ్గుతున్న కడుదయనీయ పరిస్థితి. ఖమ్మం జిల్లా మధిర మండలం మాటూరు గ్రామానికి చెందిన నరగిరి నాధుని వెంకటాచార్యులు, రంగనాయకమ్మ దంపతులకు కృష్ణమాచార్యులు 1941, ఏప్రిల్ 30న జన్మించారు. ప్రాథమిక విద్య పూర్తిచేసుకుని విజయవాడలో ఆయుర్వేద వైద్యకోర్సును చదువుకున్నారు. ఆ తరువాత హైదరాబాద్‌లో హౌస్ సర్జన్ పూర్తిచేసి నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం పులిచెర్ల గ్రామంలో ప్రభుత్వ ఆయుర్వేద డాక్టర్‌గా పనిచేసి అక్కడి ప్రజల మన్ననలు పొందారు. తల్లిదండ్రులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకుని స్వగ్రామానికి వచ్చారు. ఆధునిక దేవాలయంగా పిలువబడే నాటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి కృషిచేసిన ప్రముఖ ఇంజనీర్ మాటూరు గోపాలరావు స్వగ్రామం కూడా మాటూరే. ఆయన సూచనలమేరకు ఆయన తండ్రి అప్పారావు పేరుతో, ఆయన నివాసంలో ప్రజా వైద్యశాలను స్థాపించారు. ఉచిత ఆస్పత్రిని నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించారు. ఈ క్రమంలో రెండుమూడు దశాబ్దాలకుపైగా మధిర ప్రాంతానికి చెందిన వందలాదిమంది రోగులకు సేవలు చేశారు. వేలాదిమందికి ఉచిత వైద్యసేవలు అందించారు. ఒకవైపు మాటూరులోని చెన్నకేశవస్వామి, రామాలయంలో అర్చకత్వం చేస్తూ మరోవైపు డాక్టర్‌గా సేవలందించారు.జలగం వెంగళరావు సహకారంతో ఈ ప్రాంతానికి చెందిన ఎంతోమంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, స్వాతంత్య్ర సమరయోధులకు పెన్షన్ మంజూరు చేయించడం తదితర సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వెన్నుముకకు గాయమై.. మూడు దశాబ్దాలపాటు ఉచిత వైద్యసేవలు అందించిన తరువాత కృష్ణమాచార్యుల ఆర్థిక పరిస్థితులు తెలుసుకున్న కొంతమంది రోగులు జబ్బు తగ్గిన తరువాత కొంత డబ్బును ఆయనకు ఇచ్చేవారు. ఈ ప్రాంతానికి చెందిన బంధువులు, స్నేహితులు కృష్ణమాచార్యులు వైద్య సేవల గురించి తెలుసుకుని దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యసేవలు పొందేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి ఆయన కోసం మాటూరుకు వచ్చేవారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన కృష్ణమాచార్యుల వెన్నుముకకు దెబ్బ తగిలింది. ఆర్థిక ఇబ్బందులతో, అనారోగ్య సమస్యలతో ఆయన ప్రస్తుతం మంచంలో మగ్గుతున్నారు. మంచంలో ఉన్నప్పటికీ ఆయన వద్దకు ఇప్పటికీ రోగులు వస్తుండటం గమనార్హం. వెన్నుముక సమస్యతో పాటు గుండె సమస్య కూడా వేధిస్తోంది. పెద్దాస్పత్రులకు వెళ్లేందుకు ఆయన చేతిలో చిల్లిగవ్వలేదు. నాడు వేలాదిమంది రోగులకు ఉచిత వైద్యసేవలందించిన కృష్ణమాచార్యులను ఈ ప్రాంత ప్రజలు ఇప్పటికీ ‘అబ్బాయి గారు’గా ఆప్యా యంగా పిలుచుకోవడం విశేషం. ప్రభుత్వం సహకారం అందిస్తే.. ఆయన కోలుకునేందుకు, ఆర్థిక చేయూత పొందేందుకు అవకాశాలు ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. -
విజయవాడలో అయుర్వేద వైద్యుడు అనుమానస్పద మృతి
-
ఆయుర్వేద వైద్యుడినంటూ టోకరా
పెంట్లవెల్లి (కొల్లాపూర్) : కిడ్నీ వ్యాధికి సంబంధించి ఆయుర్వేద మందులు ఇస్తానని వచ్చిన ఓ వ్యక్తి టోకరా వేశాడు. ఈ సంఘటన గురువారం మండలంలోని గోప్లాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. బాధితుడి కథనం ప్రకారం.. నాలుగు రోజుల క్రితం ఆయుర్వేదిక్ మందులతో జబ్బులు నయం చేస్తామంటూ కొందరు గ్రామానికి వచ్చి దామోదర్‌రెడ్డి ఇంటికి వచ్చారు. ఆ కుటుంబంలో వరాలు అనే మహిళ గత కొన్నేళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతుండేది. ఆయుర్వేదిక్ మందులతో సమస్యను నయం చేస్తానని చెప్పాడు. మరుసటి రోజు వచ్చి జబ్బు నయం కావాలంటే రూ.12 వేలు ఇవ్వాలని అన్నాడు. ఈ మందులు శ్రీశైలం అడవులు, అచ్చంపేట, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో మాత్రమే దొరుకుతాయని చెప్పి, మీకు నమ్మకం లేకపోతే తన ఆధార్ కార్డు ఇస్తానని నమ్మబలికాడు. దీంతో బాధితులు రూ.12 వేలు ఇవ్వడంతో సదరు వ్యక్తులు మాయమాటలు చెప్పి అక్కడి నుంచి ఉడాయించారు. దీంతో బాధితులు పెంట్లవెల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేసి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. అలాగే చిన్నంబావి, కొప్పునూర్, లక్ష్మిపల్లి గ్రామాలలో కూడా ఇలాంటి పరిస్థితే ఉందని, పోలీసులు వారిని పట్టుకుని శిక్షించాలని కోరుతున్నారు. -
బల్లా దాదా... ఎస్ఎస్సీ!
సాక్షి, సిటీబ్యూరో: అతడి పేరు రాకేష్ వర్మ అలియాస్ బల్లా.. చదివింది కేవలం పదో తరగతి.. తండ్రి నుంచి ‘వారసత్వంగా’ ఆయుర్వేద వైద్యుడిగా మారాడు.. అసలు ఆయుర్వేద మందులు ఖరీదు కావడంతో నకిలీవి తయారు చేసి ఇవ్వడం మొదలెట్టాడు.. క్యాన్సర్, పక్షవాతం సహా ప్రాణాంతక వ్యాధులకూ వైద్యం చేస్తానంటూ అందినకాడికి దండుకుంటున్నాడు... ఈ ఘరానా మోసగాడిని పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసినట్లు డీసీపీ పి.రాధాకిషన్‌రావు తెలిపారు. హర్యానాకు చెందిన బల్లా పదో తరగతిలో చదువుకు స్వస్థి చెప్పాడు. తండ్రి రామ్‌గోపాల్ వర్మ నుంచి ఆయుర్వేద వైద్యం చేయడం నేర్చుకున్నాడు. కొన్నాళ్ళ పాటు హర్యానాలోనే ఈ వృత్తి కొనసాగించాడు. ఎనిమిదేళ్ళ క్రితం ఇతడికి వివాహం కావడంతో పాటు ఇద్దరు పిల్లలు పుట్టారు. దీంతో ఖర్చులు పెరిగి ప్రత్యామ్నాయ ఆదాయ వనరులపై దృష్టి పెట్టాడు. ఇతడి సోదరిని కొన్నేళ్ళ క్రితం చార్మినార్ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. ఇలా నగరంతో సంబంధం ఏర్పడిన బల్లా తరచూ ఇక్కడకు వచ్చి చార్మినార్ ప్రాంతంలోని ఓ లాడ్జిలో బస చేయడం, ఆయుర్వేద వైద్యుడినంటూ ప్రచారం చేసుకోవడం మొదలెట్టాడు. లాడ్జికి వచ్చిన రోగులకు కొన్నాళ్ళ పాటు నిజమైన ఆయుర్వేద మందులే ఇచ్చాడు. అవి ఖరీదు ఎక్కువ కావడం, తనకు గిట్టుబాటు కాకపోవడంతో తానే నకిలీ ఆయుర్వేద మందులు తయారు చేసి ఇవ్వడం మొదలెట్టాడు. ఓ దశలో క్యాన్సర్, పక్షవాతం, పటుత్వంతో పాటు అనేక ప్రాణాంతక వ్యాధులకు వైద్యం చేస్తానంటూ అనేక మందిని నమ్మించాడు. వివాహితులకు మగ పిల్లలు పుట్టేందుకు తన వద్ద మందులు ఉన్నాయంటూ అంటగట్టాడు. నిబంధనలకు విరుద్ధంగా ఇంగ్లీషు మందులు ఇవ్వడం, ఇంజెక్షన్లు చేయడం కూడా చేస్తున్నాడు. ఇతడి చేతిలో మోసపోయిన బాధితులు ఫిర్యాదు చేయడంతో కుల్సుంపురం, చార్మినార్, హుస్సేనిఆలం ఠాణాల్లో బల్లాపై కేసులు నమోదయ్యాయి. వీటిలో వాంటెడ్‌గా ఉండటంతో పోలీసులకు చిక్కుతాననే భయంతో సిటీలో మకాం మార్చాడు. పాతబస్తీకి బదులుగా అమీర్‌పేట, ఆసిఫ్‌నగర్, మెహదీపట్నం ప్రాంతాల్లో ఉన్న లాడ్జిల్లో ఉంటూ రోగుల్ని ఫోన్ చేసి పిలిపించుకుని వైద్యం చేస్తున్నాడు. దీర్ఘకాలిక వ్యాధులున్న వారి నుంచి కనిష్టంగా రూ.50 వేలు, గరిష్టంగా రూ.లక్ష వసూలు చేస్తున్నాడు. బల్లా వ్యవహారాలపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ బి.గట్టుమల్లు నేతృత్వంలో ఎస్సైలు పి.మల్లికార్జున్, ఎం.ప్రభాకర్‌రెడ్డి, వి.కిషోర్, ఎల్.భాస్కర్‌రెడ్డి వారం రోజుల పాటు వలపన్నారు. శుక్రవారం నగరానికి వచ్చిన బల్లాను పట్టుకుని ఇతడి నుంచి నకిలీ ఆయుర్వేద మందులు తదితరాలు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం నిందితుడిని కుల్సుంపుర పోలీసులకు అప్పగించారు. -
వైద్యురాలు ఆత్మహత్య కలకలం
సాక్షి, విశాఖ సిటీ,పెదవాల్తేరు/మధురవాడ : మనస్తాపంతో ఆయుర్వేద వైద్యురాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శివాజీపాలెంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఎంవీపీ పోలీసుల కథనం ప్రకారం.. మధురవాడ ఆయుర్వేద వైద్యశాలలో పనిచేస్తున్న దీప శివాజీపాలెం శివాజీ పార్కు సమీపంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం యథావిధిగా అన్ని పనులు ముగించుకుని ఆస్పత్రికి సంబంధించిన ముఖ్యమైన ఫైల్ వెతుక్కోవాలని తన గదిలోకి వెళ్లింది. ఆమె ఎంతకీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు తెరచి చూసేసరికి ఉరివేసుకొని కనిపించింది. ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది. మృతురాలి భర్త ప్రవీణ్‌కుమార్ సాఫ్ట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి సోదరుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. భర్త, పాపతో మృతురాలు దీప (ఫైల్) హంస యూనియన్ సంతాపం ఆమె మృతికి హంస, ఆయుష్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు నక్కాన చంద్రశేఖర్, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
దోపిడీ దొంగల బీభత్సం
చిత్తూరు: రోడ్డు మీద వెళ్తున్న కారును ఆపి.. కళ్లలో కారం కొట్టి.. డబ్బులు గుంజుకున్న సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరు మండలం కొలమాసనపల్లె అటవీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగింది. వివరాలు.. పలమనేరు మండలం విరూపాక్షపురం గ్రామానికి చెందిన నాటు వైద్యుడు రామోజీరావు బుధవారం తన కారులో పలమనేరుకు వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలో కారు అటవీ ప్రాంతం వద్దకు రాగానే కొంతమంది గుర్తుతెలియని దుండగులు కారు ఆపారు. కారు ఆపగానే అందులో ఉన్న వ్యక్తుల కళ్లలో కారం కొట్టి వాళ్లను అదే కారులో తిరుపతి వైపు గల బంగారుపాలెం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడికి వెళ్లాక వాళ్లను రూ.3 కోట్లు ఇవ్వాల్సిందిగా బెదిరించారు. అంత డబ్బు తన వద్ద లేదని ప్రస్తుతం వెంట ఉన్న రూ.20 వేలతో పాటు బంగారు ఆభరణాలు ఇచ్చాడు. దీంతో కారును వదిలి దుండగులు పారిపోయారు. ఈ విషయాన్ని రామోజీరావు గురువారం తెల్లవారుజామున పలమనేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ దారుణానికి ఒడిగట్టింది జిల్లావాసులేనా ? లేక అంతర్రాష్ట్ర దొంగల ముఠానా అనే కోణంలో విచారణ చేపట్టారు. (పలమనేరు) -
ఆయుర్వేదంతో రోగాలు నయం
కురబలకోట: ఆయుర్వేదం అపర సంజీవని లాంటిదని, ఎలాంటి మొండి రోగాల్నయినా బాగు చేయవచ్చని అంతర్జాతీయ ఆయుర్వేద డాక్టర్, శ్రీమహర్శి మహేష్ యోగి ఆయుర్వేద న్యూఢిల్లీ ఆస్పత్రి డెరైక్టర్ రాజు అన్నారు. కురబలకోట మండలం అంగళ్లు దగ్గరున్న మల్లయ్య కొండను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను ఆయుర్వేదంపై ప్రపంచ దేశాల్లో తిరిగానన్నారు. ఆయుర్వేదంతో ఎలాంటి జబ్బునయినా నయం చేయవచ్చన్నారు. క్యాన్సర్, ఎయిడ్స్ నియంత్రణ, చర్మవ్యాధులు, అధిక బరువు, షుగర్, పోలియో, కీళ్ల నొప్పులు, గుండెజబ్బులు, మూత్ర పిండాలు, సంతానలేమి, కంటి జబ్బులు తదితర వ్యాధులకు వైద్యం చేయవచ్చన్నారు. ఆయుర్వేదానికి మదనపల్లె వాతావరణం అనువుగా ఉందని ఆయన తెలిపారు. దీనిని ఆంగ్లేయులు గుర్తించి ఆరోగ్యవరాన్ని (శానిటోరియం) ఏర్పాటు చేశారన్నారు. త్వరలో మదనపల్లెలోని శ్రీమహర్శి మహేష్ యోగి ధ్యాన మం దిరంలో ఆయుర్వేద వైద్య సేవలు అందుబాటులోకి తేనున్నామన్నారు. మందులను కూడా అందజేస్తామన్నారు. అంగళ్లు మల్లయ్యకొండపై ఆయుర్వేద ఔషధవనాన్ని ఏర్పాటు చే స్తున్నామన్నారు. అలాగే మదనపల్లెలో ఆయుర్వేద కళాశాలను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామన్నారు. ఆయన వెంట హైదరాబాదు ఆయర్వేద హాస్పిటల్ నిపుణులు రాజు, దేవరబురుజు రమణరెడ్డి, కరక్కాయల రంగన్న, మల్లయ్య కొండ చైర్మన్ కాకర్ల కృష్ణమూర్తి, రియల్టర్ రంగనాథం తదితరులు పాల్గొన్నారు.