ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న 100 నగరాల్లో 46 మనదేశంలో ఉన్నాయి. వాయు కాలుష్యానికి గుండెపోటుకి సంబంధం ఉన్నట్టు చాలా అధ్యయనాల్లో నిరూపితమైనది. దీనికి తోడు వెంటిలేషన్ లేని స్థలాల్లో ఉండటం, బిర్యానీ, మాంసం ఇతర నూనె ఎక్కువ ఉన్న పదార్థాలు లాంటి చెత్త తినడం, రాత్రిపూట మేలుకోవడం, ఒత్తిడి, తిన్న కాసేపటికి వ్యాయామం చేయడం వంటివి తీవ్ర ప్రభావం చూపుతాయి.
ఏం చేయాలంటే!
1. బయట బండి మీద దొరికే నూడిల్స్, ఫ్రైడ్ రైస్, మంచూరియా, పునుగులు, బోండాలు తరచుగా తినటం ఆపి వేస్తే సగం జబ్బులు పోతాయి.
2. ఎత్తుకు తగ్గ బరువు ఉంటే ఎలాంటి సమస్యల నుంచైనా బయటపడవచ్చు.
3. ఉదయాన్నే చద్ది అన్నం ఉల్లిపాయ నంజుకుని ప్రతి రోజు తింటే గుండె జబ్బులు 100% రావని చెప్పవచ్చు.
4. ఎక్కువగా బ్రెయిన్ ఒత్తిడికి గురి అవ్వడం కూడా హార్ట్ ఎటాక్‌లకు కారణం.
5. శరీరంలో అనవసరమైన, అధిక కొవ్వు నిల్వలు ఉండిపోయి రక్తనాళాలు మీద ఒత్తిడి పెరుగుతుంది. అందువల్ల రక్తప్రసరణ కష్టమవుతుంది. ట్రైగ్లిజరైడ్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ స్థాయిలో అవధులు దాటి డిపాజిట్ అవడం వలన గుండెకి రక్తం పంపింగ్ కష్టం అయిపోతుంది.
6. అధిక బరువు వలన గుండె పనితీరులో ఆటంకాలు ఏర్పడి పోటు రావడానికి అవకాశం ఏర్పడుతుంది. కనుక ఒబెసిటీ ఉన్నవారు ప్రతిరోజు, రోజుకి ఆరుగంటలు కష్టపడి శరీరం అలిసేటట్లు పనిచేయాలి. అరగంట నుండి గంట వరకూ వ్యాయామం తప్పనిసరిగా చేయాలి.
గుండెనొప్పి, గ్యాస్ నొప్పి - వీటిలో ఏదని ఎలా గుర్తించాలి?
గుండెనొప్పి వస్తే గుండె మధ్యన చాలా బరువుగా వుంటుంది. విపరీతమైన చమట పడుతుంది. ఎడమ చెయ్యి, భుజం, ఎడమ వైపు మెడ లాగుతూ వుంటుంది. కొంతమంది లో మోషన్ కూడా అవుతుంది. వాంతులు అవుతాయి.
పైన చెప్పిన లక్షణాలు కనపడగానే రోగిని సాధ్య మైనంత తొందరగా హాస్పిటల్కి తీసుకు వెళ్ళాలి. ఎంత తొందరగా తీసుకు వెడితే అంత మంచిది. ఈ లోగా ఆస్ప్రిన్ గాని దిస్ప్రిన్ కానీ నీటిలో కలిపి తాగిస్తే మంచిది. నాలుక కింద సర్బిట్రేట్ మాత్ర ఉంచాలి. ఇది రోగిని హాస్పిటల్కి తీసుకు వెళ్ళే లోగా పరిస్థితి మరింత దిగజారకుండా ఉపయోగ పడుతుంది.
గ్యాస్ నొప్పి వచ్చినపుడు.. గుండెలో మంట, తెనుపులు, కడుపు వుబ్బరం, తెనుపు వచ్చినప్పుడు గొంతులో మంటగా ఉంటుంది. గుండె నొప్పికి గాస్ నొప్పికికి తేడా కనుక్కోలేక పోయినట్టు అయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా నొప్పి అనిపించిన వెంటనే డాక్టర్‌ని సంప్రదించడం చాలా మంచిది.
-నవీన్ నడిమింటి, ఆయుర్వేద వైద్యులు
చదవండి: Stress Relief: పొద్దుతిరుగుడు గింజలు, ఇంకా వీటిని తింటే? వెల్లుల్లిలో ఉండే గ్లటాథియోన్ వల్ల
Pomegranate: 3 నెలల పాటు ప్రతిరోజు తింటే! ఇక తొక్కలు పొడి చేసి నీళ్లలో కలిపి తాగారంటే..
Comments
Please login to add a commentAdd a comment