దీప (ఫైల్)
సాక్షి, విశాఖ సిటీ,పెదవాల్తేరు/మధురవాడ : మనస్తాపంతో ఆయుర్వేద వైద్యురాలు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన శివాజీపాలెంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. ఎంవీపీ పోలీసుల కథనం ప్రకారం.. మధురవాడ ఆయుర్వేద వైద్యశాలలో పనిచేస్తున్న దీప శివాజీపాలెం శివాజీ పార్కు సమీపంలో కుటుంబంతో నివాసం ఉంటున్నారు. సోమవారం ఉదయం యథావిధిగా అన్ని పనులు ముగించుకుని ఆస్పత్రికి సంబంధించిన ముఖ్యమైన ఫైల్ వెతుక్కోవాలని తన గదిలోకి వెళ్లింది. ఆమె ఎంతకీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపులు తెరచి చూసేసరికి ఉరివేసుకొని కనిపించింది.
ఆమెను ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందింది. మృతురాలి భర్త ప్రవీణ్‌కుమార్ సాఫ్ట్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతురాలి సోదరుడు రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.
భర్త, పాపతో మృతురాలు దీప (ఫైల్)
హంస యూనియన్ సంతాపం
ఆమె మృతికి హంస, ఆయుష్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు నక్కాన చంద్రశేఖర్, తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.