టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలక ప్రకటన చేశాడు. ఈ నెల 30 నుంచి రైల్వేస్‌తో జరిగే రంజీ మ్యాచ్‌లో ఆడతానని స్పష్టం చేశాడు. విరాట్ దేశవాలీ క్రికెట్‌లో ఢిల్లీ తరఫున ఆడతాడు. విరాట్ రంజీల్లో ఆడటం 12 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. విరాట్ ఈ నెల 23న సౌరాష్ట్రతో జరుగబోయే మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. మెడ నొప్పి కారణంగా విరాట్ సౌరాష్ట్రతో జరిగే మ్యాచ్‌లో ఆడటం లేదు. ఈ మ్యాచ్ కోసం ఎంపిక చేసిన ఢిల్లీ జట్టులో మరో టీమిండియా స్టార్ రిషబ్ పంత్ ఉన్నాడు.
సౌరాష్ట్ర తరఫున టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బరిలోకి దిగనున్నాడు. ఈ నెల 23 నుంచి జరిగే రంజీ మ్యాచ్‌ల్లో చాలా మంది భారత స్టార్ క్రికెటర్లు బరిలోకి దిగనున్నారు. ముంబై తరఫున రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్.. పంజాబ్ తరఫున శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగనున్నారు. టెస్ట్‌ల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో ఘోర పరాజయాలు ఎదుర్కొన్న నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లు తప్పక రంజీల్లో ఆడాలని బీసీసీఐ అల్టిమేటం జారీ చేసిన విషయం తెలిసిందే. దీంతో భారత ఆటగాళ్లంతా రంజీ బాట పట్టారు.
రేపటి నుంచి (జనవరి 22) టీమిండియా ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. విరాట్ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో ఈ సిరీస్‌కు ఎంపిక కాలేదు. విరాట్‌తో పాటు రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో సూర్యకుమార్ యాదవ్ టీమిండియా సారథిగా వ్యవహరిస్తాడు. అతనికి డిప్యూటీగా (వైస్ కెప్టెన్) హార్దిక్ పాండ్యాను కాదని అక్షర్ పటేల్‌ను ఎంపిక చేశారు.
ఈ సిరీస్‌కు యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా లాంటి కీలక ఆటగాళ్లకు రెస్ట్ ఇచ్చారు. ఇదే సిరీస్‌తో స్టార్ పేసర్ మహ్మద్ షమీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ జనవరి 22న కోల్‌కతా వేదికగా జరుగనుంది. అనంతరం జనవరి 25 (చెన్నై), 28 (రాజ్‌కోట్), 31 (పూణే), ఫిబ్రవరి 2వ (ముంబై) తేదీల్లో మిగతా నాలుగు టీ20లు జరుగనున్నాయి.
టీ20 సిరీస్ అనంతరం భారత్, ఇంగ్లండ్ జట్లు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తలపడతాయి. ఈ సిరీస్ ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమయ్యే ఛాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఉండనుంది. వన్డే సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఫిబ్రవరి 6న నాగ్‌పూర్‌లో జరుగనుండగా.. ఫిబ్రవరి 9, 12 తేదీల్లో రెండు, మూడు మ్యాచ్‌లు కటక్, అహ్మదాబాద్ వేదికలుగా జరుగనున్నాయి.
ఇంగ్లండ్‌తో టీ20ల కోసం ఎంపిక చేసిన భారత జట్టు: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజూ శాంసన్ (వికెట్‌కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ (వికెట్‌కీపర్)
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, హర్షిత్ రానా
ఛాంపియన్స్ ట్రోఫీ కోసం ఎంపిక చేసిన భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్ (విసి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా.
ట్రావెలింగ్ రిజర్వ్స్: వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్, నితీశ్ కుమార్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment