ఒక వ్యక్తికి కిడ్నీలో నొప్పి వచ్చేంత రాయి తయారు అవ్వడానికి ఎంత కాలం పడుతుంది? నొప్పి రావడానికి ముందే తెలుసుకునే మార్గాలు ఉంటాయా? కిడ్నీ సమస్య వస్తే ఎప్పటికీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పాటించాల్సిన ఆహార నియమాలు ఏంటి?
సాధారణంగా, మూత్రపిండాల్లో రాళ్ళు మూత్రపిండంలో కదిలే దశ వచ్చే వరకు లేదా మూత్రనాళంలోకి వెళ్ళేవరకు నొప్పి కలిగించవు. రాళ్ళు చిన్నవయితే చాలా సార్లు శరీరం నుండి తక్కువ నొప్పితో లేదా అసలు నొప్పి తెలియకుండానే మూత్రంతో పాటుగా బయటకు వెళ్ళిపోతాయి. ఇవి మూత్రనాళంలో తట్టుకుంటే మాత్రం నొప్పి మొదలవుతుంది.
ఇలా తట్టుకున్న రాళ్లు మూత్ర ప్రవాహాన్ని అడ్డుకుంటాయి. అలాగే మూత్రపిండాల వాపునకు దారి తీస్తాయి. దీని వల్ల మూత్రనాళ దుస్సంకోచానికి (spasm) కారణమవుతుంది. ఇది చాలా బాధాకరంగా ఉంటుంది. సాధారణంగా ఈ రాళ్ళు 85% కాల్షియమ్ ఆక్సలేట్ (calcium oxalate) అన్న రసాయనంతో ఏర్పడుతాయి.
ఈ నొప్పులకు రాళ్ళ సైజుతో సంబంధం లేదు. కావున మూత్రం తగ్గడం కానీ ఎక్కువ సార్లు పోవడం, మూత్రం వాసన రావడం వంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్‌ను సంప్రదించడం మంచది.
కిడ్నీలో రాళ్లు ఉన్నట్టు నిర్దారణ అయితే భోజనంలో ఎలాంటి జాగ్రత్తలు అవసరం?
1. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నప్పుడు పెద్ద స్పూన్తో తేనే, నిమ్మరసాలను కలిపి రోజుకు మూడుసార్లు తీసుకోవాలి. రాళ్లు కరిగిపోవడానికి ఇది దోహాదపడుతుంది.
2. కొండపిండి అనే మొక్కకు చాలా శక్తి ఉంది. మూత్రపిండాలలో కొండలు ఏర్పడినా కరిగించగల సత్తా దీనికి ఉందని అంటారు. ఇది రోడ్డు పక్కన అన్ని ప్రాంతాల్లో ఉచితంగా దొరికే మొక్క. దీనిని శుభ్రం చేసి ఎండబెట్టి దంచి పొడిని ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక గ్లాసు పాలలో బాగా మరిగించి వడగట్టి తాగాలి. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు కచ్చితంగా కరుగుతాయని ఇప్పటికే నిర్దారణ అయింది.
3. భోజనం తిన్న తర్వాత కిడ్నీలో రాళ్లు కొన్నిసార్లు చాలా నొప్పిని కలిగిస్తాయి. తక్కువ భోజనం మరియు మొత్తంలో ఎక్కువగా నీళ్లు తాగడం మంచిది. అలాగే ఇంటి భోజనానికి మాత్రమే పరిమితం కండి. వేపుళ్లు, జంక్‌ఫుడ్ తింటే ఇబ్బంది పెరుగుతుంది. నీళ్లు పుష్కలంగా తాగండి.
4. ఎక్కువగా కూరగాయలు మరియు పండ్లు, తృణధాన్యాలు మరియు తక్కువ కొవ్వు పాల ఉత్పత్తులను కలిగి ఉన్న ఆరోగ్యకరమైన ఆహార ప్రణాళికను అనుసరించండి. చక్కెరతో కూడిన తియ్యని ఆహారాలు (స్వీట్లు) , పానీయాలను తగ్గించండి లేదా ఆపేయండి.
5. ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ ఎక్కువగా మద్యంలో ఉంటుంది. దీనికి పరిమితి విధించండి లేదా ఆపేయండి. ఆల్కహాల్ ఎందుకు వద్దు అంటే ఇది రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. పైగా ఇతర ఇబ్బందులకు దారి తీస్తుంది.
6. దుంపలు, చాక్లెట్, బచ్చలికూర, టీ వంటి రాళ్లను ఏర్పరిచే ఆహారాలకు దూరంగా ఉండండి. చాలా గింజలలో ఆక్సలేట్ పుష్కలంగా ఉంటుంది, ఇది మూత్రపిండాల్లో రాళ్లకు దోహదం చేస్తుంది. కాల్షియం ఆక్సలేట్ పుష్కలంగా ఉండే వాటిని తినకూడదు. సరైన ఆహారాన్ని సూచించే పోషకాహార నిపుణుడిని సంప్రదించండి.
-డా.నవీన్ నడిమింటి, ఆయుర్వేద నిపుణులు
చదవండి: Health: బీరకాయ, నేతి బీరకాయ తరచుగా తింటున్నారా? ఇందులోని అధిక సెల్యులోజ్ వల్ల..
పైనాపిల్, నిమ్మ, కివి పండ్లు తింటున్నారా? తులసి ఆకులను నీటిలో వేసి మరిగించి తాగితే..
Comments
Please login to add a commentAdd a comment