నిజామాబాద్ అర్బన్ : పట్టణ ఆరోగ్య కేంద్రాలు మరింత బలోపేతం కానున్నాయి. ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు వీలుగా వీటిని నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ పరిధిలోకి చేర్చుతున్నారు. దీంతో వీటి నిర్వహణ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలోకి వెళ్లనుంది. 2000 సంవత్సరంలో ప్రభుత్వం పట్టణ ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేసింది.
నిర్వహణను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించింది. జిల్లాలో పది అర్బన్ హెల్త్ సెంటర్లు కొనసాగుతున్నాయి. జిల్లా కేంద్రంలో ఏడు, కామారెడ్డిలో ఒకటి, బోధన్ లో రెండు చొప్పున యూహెచ్‌సీలు ఉన్నాయి. ఒక్కో కేంద్రంలో మెడికల్ ఆఫీసర్, కమ్యూనిటీ ఆర్గనైజర్, స్వీపర్, నైట్ వాచ్‌మన్, ఇద్దరు ఎఎన్‌ఎంలు వైద్యసేవ లు అందిస్తున్నారు. వీరికి అవసరమైన మందులను ప్రభుత్వ మే సరఫరా చేస్తోంది. ఒక్కో కేంద్రం నిర్వహణకు ప్రతి నెల రూ. 66,700 వేలు కేటాయిస్తుంది. సిబ్బంది వేతనాలను ఎన్‌జీఓలు సమకూరుస్తారు. కానీ, వీటి నిర్వహణ తీరు సక్రమంగా లేకపోవడంతో మున్సిపల్ పరిధికి తీసుకురావాలని భావిస్తున్నారు.
పెలైట్ ప్రాజెక్టుగా జిల్లా ఎంపిక
పట్టణ ఆరోగ్య కేంద్రాలను జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ పరిధిలోకి చేర్చేందుకు దేశవ్యాప్తంగా కొన్ని జిల్లాలను పెలైట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అందులో తెలంగాణ నుంచి నిజామాబాద్ జిల్లా కూడా ఉంది. గత నెల రో జుల నుంచే పట్టణ ఆరోగ్య కేంద్రాలు నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ పరిధిలో కొనసాగుతున్నాయి. దీంతో పట్టణవాసులకు మెరుగైన వైద్యసేవలు అందే అవకాశం ఉంది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు దీటుగా వీటిని తీర్చిదిద్దేందుకు పాటుపడుతున్నారు.
ఇప్పటి వరకు 15 వేల జనాభాకు ఒక పట్టణ ఆరోగ్య కేం ద్రాన్ని మంజూరు చేసిన ప్రభుత్వం, త్వరలో 50 వేల జనాభాకు ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. ఇప్పుడు కేంద్రానికి ఒక మెడికల్ ఆఫీసర్ మాత్రమే ఉన్నారు. ఇక నుంచి కనీస ముగ్గురు వైద్యులు ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అదనంగా ముగ్గురు ఎఎన్‌ఎంలు, ల్యాబ్ టెక్నీషియషన్లు, హెల్త్ సూపర్‌వైజర్లతోపాటు, జిల్లాకు నోడల్ అధికారిని నియమించనున్నారు. అద్దె భవనాలలో కొనసాగుతున్నవాటికి సొంత భవనాలను సమ కూర్చనున్నారు. ఇప్పటికే జి ల్లా వైద్యాధికారులు, మున్సిపాలిటీ అధికారులతో హైదరాబాద్‌లోని వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పలుమార్లు సమావేశాలు నిర్వహించారు.
మున్సిపల్ పరిధిలోకే
పట్టణ ఆరోగ్య కేంద్రాల నిర్వహణ మున్సిపల్ పరిధిలోకి వెళ్లనుంది. ఇదివరకే వీటి నిర్వహణ తీరు వివరాలను మున్సిపల్ అధికారులకు అందజేశాం,ఉన్నతాధికారు ల నుంచి పూర్తి స్థాయి ఆదేశాలు రాగానే పట్టణ ఆరోగ్య కేంద్రాలను వారికి స్వాధీనం చేస్తాం. -గోవింద్ వాఘ్మారే, జిల్లా వైద్యాధికారి
నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్
Published Fri, Sep 5 2014 2:26 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM
Advertisement
Advertisement