కరెంటు కోతలు లేని ప్రభుత్వం ఇది | no powr cuts in tdp government | Sakshi
Sakshi News home page

కరెంటు కోతలు లేని ప్రభుత్వం ఇది

Published Tue, Dec 20 2016 10:39 PM | Last Updated on Mon, Sep 4 2017 11:12 PM

కరెంటు కోతలు లేని ప్రభుత్వం ఇది

కరెంటు కోతలు లేని ప్రభుత్వం ఇది

వరహాపట్నం (కైకలూరు) : గతంలో కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడేవారని, నేడు కోతలు లేని గ్రామాలను చూస్తున్నారని ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ అన్నారు. ఆయన స్వగ్రామైన వరహాపట్నంలో దీన్‌ దయాల్‌ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకంలో రూ.కోటీ 20 లక్షలతో మంజూరైన 33/11కెవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ ఇక్కడ నిర్మించే సబ్‌స్టేషన్‌ వల్ల 14 గ్రామాలకు మేలు జరుగుతుందన్నారు. అక్వా చేపల రైతు సాగుదారులకు సబ్‌స్టేషన్‌ నుంచి నాణ్యమైన కరెంటు అందుతుందన్నారు. ఇంటి అవసరాల నిమిత్తం మట్టిని తరలించే వాహనాలపై చర్యలు వద్దని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్‌ పళ్ళెం సరవమ్మ, ఎంపీటీసీ జయదేవ్‌కుమార్, కైకలూరు, కలిదిండి ఏఎంసీ చైర్మన్లు వీరరాజరాజేశ్వరీ, తాడినాడ బాబు, టీడీపీ నాయకులు గుర్రాజు, త్రినాథరాజు, విజయవాడ ఆపరేషన్‌ ఎస్‌ఈ ఎం.విజయ్‌కుమార్, గుడివాడ డీఈఈ కేవీఎస్‌.సూర్యనారాయణ, కైకలూరు ఏడీఈ జీబీ.శ్రీనివాసరావు, కైకలూరు రూరల్‌ ఏఈ బి.లక్ష్మానాయక్‌లు పాల్గొన్నారు.
క్రిస్మస్‌ సరుకులు పంపిణీ
కైకలూరులో క్యాంపు కార్యాలయం వద్ద చంద్రన్న క్రిస్మస్‌ కానుక సరుకులను మంగళవారం మంత్రి శ్రీనివాస్‌ అందించారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరికి సీఎం రిలీఫ్‌ ఫండ్‌ను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ బండి సత్యవతి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేంపాటి విష్ణురావు, సర్పంచ్‌ నర్సిపల్లి అప్పారావు, గుడివాడ ఆర్డీవో చక్రపాణి, కైకలూరు తహశీల్దారు శ్రీనునాయక్, రేషన్‌ డీలర్లు పాల్గొన్నారు.

20కెకెఎల్‌ఆర్‌06–27040006– వరహాపట్నంలో సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తున్న మంత్రి కామినేని

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement