ఆస్పత్రుల ఆధునికీకరణకు సర్వే | Modernization of Hospitals Survey | Sakshi
Sakshi News home page

ఆస్పత్రుల ఆధునికీకరణకు సర్వే

Published Thu, Jul 21 2016 11:08 PM | Last Updated on Sun, Sep 2 2018 3:26 PM

ఆస్పత్రుల ఆధునికీకరణకు సర్వే - Sakshi

ఆస్పత్రుల ఆధునికీకరణకు సర్వే

  • జిల్లాలో 89 ఆస్పత్రుల భవనాలపై డాక్యుమెంటరీ
  • ఎంకే సీనియర్‌ ఇంజనీర్‌ విద్యాసాగర్‌
  • ఏటూరునాగారం : జిల్లాలోని 89 ఆస్పత్రులను ఆధునికీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎంకే ప్రైవేట్‌ సంస్థ బృందం ఇంజనీర్లు సర్వే చేపట్టారు. గురువారం మండల కేంద్రంలోని సామాజిక ఆస్పత్రి భవనం, పరిసరాలను పరిశీలించారు.  భవనం పరిస్థితి ఎలా ఉందని, శిథిలావస్థకు చేరిందా లేక దీనిని ఆధునీకరణ చేస్తే పనిచేస్తోందని అనే కోణంలో సర్వే చేసినట్లు ఎంకే సీనియర్‌ ఇంజనీర్‌ విద్యాసాగర్‌ తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఎంకే టీం సభ్యులు జి ల్లాలోని 89 ఆస్పత్రులను పరిశీలిస్తున్నామ న్నారు. ఇందులో ఎంజీఎం, సీకేఎం, ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రి, పీహెచ్‌సీలు పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఆస్పత్రి భవనాల అభివృద్ధి, సిబ్బంది క్వార్టర్స్, పరి సర ప్రాంతాల్లో చేపట్టే పనులపై అధ్యయనం చేసి డాక్యుమెంటరీని రూపొందిస్తున్నామన్నారు. ఈ డాక్యుమెంటరీ ఎస్‌ఈ దేవేందర్‌కుమార్‌ సమర్పిస్తామని వెల్లడించారు. ఆయ న ద్వారా తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. అలాగే మరో బృందం వైద్యులు ఖాళీలు, సామగ్రి, ఆపరేషన్‌ పరికరాలు, ఇతర మౌళిక వసతులను కూడా సర్వే చేసేందుకు వస్తోందని చెప్పారు. ఇలా రెండు బృందాలు చేపట్టిన ఆధారాలతో ఆస్పత్రుల రూపురేఖలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మార్చనుందన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లోని శిథి లావస్థ భవనాలు తొలగించి నూతన భవనాలు నిర్మించే ఆలోచన చేస్తోందని వెల్లడిం చారు. ఈ రెండు అంశాలపై సమగ్ర సర్వే చేసేందుకు వచ్చినట్లు ఎంకే సంస్థ సీనియర్‌ ఇంజనీర్‌ విద్యాసాగర్‌ తెలిపారు. ఎంకే ప్రిన్సిపల్‌ కన్సల్‌టెంట్‌ ఎస్‌. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సర్వే చేస్తున్నామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement