అభాగ్యురాలైన ఒక తల్లి తన బిడ్డను ఆస్పత్రి వద్ద విడిచిపెట్టి వెళ్లిపోతే, క్షణాల్లోనే ఆ పసికందు పందుల పాలైంది.
రాయగడ (ఒడిశా), న్యూస్‌లైన్: అభాగ్యురాలైన ఒక తల్లి తన బిడ్డను ఆస్పత్రి వద్ద విడిచిపెట్టి వెళ్లిపోతే, క్షణాల్లోనే ఆ పసికందు పందుల పాలైం ది. రాయగడ జిల్లా బిసంకటక్ ఆస్పత్రి వద్ద మంగళవారం జరిగిన ఈ ఘటన స్థానికులను కలచివేసింది.ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం... గుర్తుతెలియని ఒక మహిళ మధ్యాహ్నం అప్పుడే పుట్టిన పసికందును ఆస్పత్రి గోడ వద్ద విడిచిపెట్టి వెళ్లిపోయింది. అంతలోనే అక్కడకు వచ్చిన రెండు పందులు ఆ పసికందును లాక్కెళ్లి పీక్కు తినేశాయి. బిడ్డ రోదించడంతో చుట్టుపక్కల జనం పరుగున అక్కడకు చేరుకున్నారు. అప్పటికే పసికందు ప్రాణాలు కోల్పోయింది.