ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఎన్‌ఆర్‌ఎం కింద మంజూరైన హాస్పిటల్ డెవలప్‌మెంట్ సొసైటీ(హెచ్‌డీఎస్) నిధులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్‌సీ), కమ్యూనిటీ, ఏరియా ఆస్పత్రుల అభివృద్ధికి వినియోగిస్తారు. ఈ నిధులు వైద్యాధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. నాలుగేళ్లలో సుమారు రూ.5 కోట్లు మంజూరు కాగా, ఇందులో రూ.3.25 కోట్లకు యూటిలైజేషన్ రశీదులు అందజేశారు.
మిగతా రూ.1.74 కోట్ల యూసీలు అందజేయలేదు. ఖర్చయిన నిధుల్లో కూడా అవకతవకలు జరిగాయి. వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి బిల్లులు మాత్రం అధిక ధర చూసి స్వాహా చేశారు. ఇక ఖర్చుకాని నిధులకు లెక్కలు కూడా లేవు. మొత్తానికి వచ్చిన డబ్బులు ఖర్చయినట్లు వైద్యాధికారులు చూపిస్తున్నారు. గతేడాది ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.75 లక్షలు వచ్చాయి. ఇందులో నుంచి పలుచోట్ల ఒక ఇన్వర్టర్, వాటర్ ప్యూరీఫైడ్, భవనానికి పెయింటింగ్ చేయించి మిగతా సగానికి పైగా నిధులను హాంఫట్ చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే నిధులు దుర్వినియోగానికి గురయ్యాయి. అధికారులు దృష్టిసారిస్తే అవినీతి బాగోతం బయటపడే అవకాశం ఉంది.
చేయాల్సిందిలా...
త్వరలో జిల్లాలోని ఒక్కొక్క పీహెచ్‌సీకి రూ.1.75 లక్షలు వచ్చే అవకా శం ఉంది. ఈ నిధుల వినియోగంపై ఆస్పత్రి అభివృద్ధి కమిటీలో చ ర్చించి.. తీసుకున్న తీర్మాణాలకు అనుగుణంగా ఖర్చుచేయాలి. జిల్లా లో 72 పీహెచ్‌సీలు ఉండగా 17 క్లస్టర్లుగా వీటిని విభజించారు. క్లస్టర్‌కు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్(ఎస్పీహెచ్‌వో) ఉంటారు. మండల పరి షత్ అధ్యక్షుడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి చైర్మన్‌గా ఉంటాడు.
ఎన్నిక లు జరగక పోవడంతో ఎస్పీహెచ్‌వో చైర్మన్‌గా, మెడికల్ ఆఫీసర్ మెం బర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వీరిద్దరు జాయింట్ చెక్‌పవర్ కలిగి ఉంటారు. సభ్యులుగా పీహెచ్‌సీ పరిధిలోని గ్రామాల మహిళ సర్పం చ్‌లు, ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌లు, స్థానిక సర్పంచ్, మహిళ సమైక్య అధ్యక్షురాలు, ఇద్దరు ఎంపీటీసీలు, తహశీల్దార్, ఎంపీడీవో, ఓ సీనియర్ మెడికల్ ఆఫీసర్‌లు ఉంటారు. వీరందరి సమక్షంలో ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఆస్పత్రుల్లో రోగుల సౌకర్యార్థం కుర్చీలు, పడకలు, శానిటేషన్, టాయిలెట్స్, కిటికీల మరమ్మతు, కర్టెన్‌లు, అత్యవసర మందులు, భవన మరమ్మతులు, తాత్కాలిక షెల్టర్లు నిర్మించవచ్చు.
అయితే సమావేశాలు నిర్వహించకుండానే, తీర్మానాలు చేయకుండానే వైద్యాధికారులు నిదులు దుర్వినియోగం చేశారు. సగం నిధులు అభివృద్ధికి వినియోగిస్తూ.. మిగతా నిధులు స్వాహా చేశారు. ఈ విషయమై.. న్యూస్‌లైన్ డీఎంహెచ్‌వో స్వామిని వివరణ కోరగా యూటిలైజేషన్ సర్టిఫికేట్‌లు ఇవ్వాలని హెచ్‌డీఎస్ చైర్మన్‌కు, వైద్యాధికారులకు పలుమార్లు సర్క్యూలర్‌లు జారీ చేశాం. ఒకవేళ దుర్వినియోగం చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.
లెక్కల్లేవ్..!
Published Mon, Feb 10 2014 2:54 AM | Last Updated on Sun, Sep 2 2018 3:26 PM
Advertisement
Advertisement