misused of funds
-
కార్వీ ఉద్యోగులకు డిమాండ్ నోటీసు
న్యూఢిల్లీ: క్లయింట్ల నిధులను దురి్వనియోగం చేసిన కేసులో సుమారు రూ.1.8 కోట్లు చెల్లించాలని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్‌కు (కేఎస్‌బీఎల్) చెందిన ముగ్గురు మాజీ అధికారులకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ బుధవారం డిమాండ్ నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించడంలో విఫలమైతే వారిని అరెస్టు చేసి ఆస్తులతో పాటు బ్యాంకు ఖాతాలను అటాచ్మెంట్ చేస్తామని సెబీ హెచ్చరించింది. ఆస్తులను విక్రయించడం ద్వారా మొత్తాన్ని రికవరీ చేస్తామని స్పష్టం చేసింది. నోటీసులు అందుకున్న వారిలో కేఎస్‌బీఎల్ వైస్ ప్రెసిడెంట్ (ఎఫ్అండ్ఏ) కృష్ణ హరి జి, మాజీ కంప్లైంట్ ఆఫీసర్ శ్రీకృష్ణ గురజాడ, బ్యాక్ ఆఫీస్ ఆపరేషన్ జనరల్ మేనేజర్ శ్రీనివాస రాజు ఉన్నారు. 2023 మే నెలలో విధించిన జరిమానాను చెల్లించడంలో ఈ అధికారులు విఫలమైన నేపథ్యంలో సెబీ తాజాగా డిమాండ్ నోటీసులు పంపింది. ఖాతాదారుల సెక్యూరిటీలను తాకట్టు పెట్టి భారీగా నిధులను సమీకరించారని, అలాగే క్లయింట్లు మంజూరు చేసిన పవర్ ఆఫ్ అటారీ్నని కార్వీ స్టాక్ బ్రోకింగ్ దుర్వినియోగం చేసినట్టు సెబీ విచారణలో తేలింది. సమీకరించిన నిధులను గ్రూప్ కంపెనీలకు మళ్లించడం ద్వారా వివిధ చట్ట నిబంధనలను కేఎస్‌బీఎల్ ఉల్లంఘించింది. కేఎస్‌బీఎల్ 2019 మే నెల వరకు దాని క్లయింట్లుగా ఉన్న తొమ్మిది సంబంధిత సంస్థల ద్వారా రూ.485 కోట్ల అదనపు సెక్యూరిటీలను విక్రయించింది. అలాగే ఈ తొమ్మిది కంపెనీల్లో ఆరింటికి అదనపు సెక్యూరిటీలను కూడా బదిలీ చేసింది. తన ఖాతాదారుల వాటాలను తాకట్టు పెట్టి ఆర్థిక సంస్థల నుండి రుణాలు సేకరించిన కేఎస్‌బీఎల్ మొత్తం రుణం 2019 సెప్టెంబర్ నాటికి రూ.2,032.67 కోట్లు. ఈ కాలంలో కంపెనీ తాకట్టు పెట్టిన సెక్యూరిటీల విలువ రూ. 2,700 కోట్లు. -
ఈఎస్ఐలో ధన్వంతరి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కార్మిక రాజ్యబీమా (ఈఎస్ఐ) ఆస్పత్రుల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడనుంది. గత ప్రభుత్వ హయాంలో రూ.వందలాది కోట్ల నిధులు దుర్వినియోగమైన విషయం తెలిసిందే. ఇకపై ఇలాంటి కొనుగోళ్లలో అవినీతికి తావు లేకుండా ఇ–ఔషధి తరహాలోనే ‘ధన్వంతరి’ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. గతంలోనే ధన్వంతరి సాఫ్ట్వేర్ విధానాన్ని అమలు చేయాలని కేంద్ర కార్మిక శాఖ ఆంధ్రప్రదేశ్‌కు పదేపదే సూచించింది. ఈ విధానం అమల్లోకి తెస్తే.. అవినీతికి ఆస్కారం ఉండదని, నిధులు కాజేసేందుకు అవకాశం ఉండదన్న ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు దీనిని పక్కన పడేసింది. అన్ని విభాగాల్లో అవినీతికి అడ్డుకట్ట వేయాలని నిర్ణయించిన ప్రస్తుత ప్రభుత్వం ఈ నెలాఖరు నాటికి ఈ విధానం అమల్లోకి తీసుకు రావాలని నిర్ణయించింది. దీనివల్ల 14 లక్షల మంది కార్మికులతో పాటు మరో 30 లక్షల మందికి పైగా కార్మికుల కుటుంబ సభ్యులకూ మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలో 78 డిస్పెన్సరీలు, 4 ప్రాంతీయ ఆస్పత్రులు, 4 డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లే కార్మికులకు కొత్త విధానం వల్ల ఊరట కలగనుంది. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే ధన్వంతరి విధానం అమల్లో ఉంది. ఆన్‌లైన్‌లోకి రిఫరల్ ఆస్పత్రులు ఈఎస్ఐ ఆస్పత్రుల్లో తగిన వైద్యం అందుబాటులో లేకపోతే రిఫరల్ ఆస్పత్రులుగా గుర్తించిన ప్రైవేట్ ఆస్పత్రులకు కార్మికులు వెళ్లేవారు. అక్కడ పూర్తిగా మాన్యువల్ బిల్లులే ఉండేవి. దీంతో కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు కార్మికుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి రూ.కోట్లు కొల్లగొట్టేవారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈఎస్ఐ పరిధిలో ఉండే 120 రిఫరల్ ఆస్పత్రులు ధన్వంతరి సాఫ్ట్వేర్ పరిధిలోకి రానున్నాయి. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులకు ఏ విధంగా బిల్లులు చెల్లిస్తున్నారో.. వీటికి కూడా అదే తరహాలోనే చెల్లింపులు చేస్తారు. 10 కిలోమీటర్ల దూరంలో ఈఎస్ఐ ఆస్పత్రి లేకపోతే అక్కడి కార్మికుడు నేరుగా ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లచ్చు. ఆస్పత్రి నుంచి పేషెంట్ వివరాలు ఈఎస్ఐకి అందించాలి. ఆ వెంటనే ఇక్కడ నుంచి అనుమతులు ఇస్తారు. రోగుల చేరిక, ఓపీ, ఐపీ, బిల్లులు పెట్టడం ఇకపై అన్నీ ఆన్లైన్లో చేయాల్సిందే. మందుల కొనుగోళ్లకూ.. ప్రస్తుతం రాష్ట్రంలో ఆన్లైన్లో మందులు కొంటున్నది ఏపీఎంఎస్ఐడీసీ పరిధిలోనే. ఇప్పుడు అదే విధానాన్ని ఈఎస్ఐలోనూ అనుసరించబోతున్నారు. ఇప్పటివరకు మందుల కొనుగోలు పేరిట రూ.వందల కోట్లు దుర్వినియోగమయ్యాయి. గతంలో పితాని సత్యనారాయణ, అచ్చెన్నాయుడు మంత్రులుగా ఉన్న సమయంలో ఇదే తంతు జరిగింది. ఇకపై అలా కాకుండా ఏ ఆస్పత్రికి ఎన్ని మందులు అవసరమో డాక్టర్లు ఇండెంట్ ఇస్తే.. ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ ద్వారా కొనుగోలు చేసేలా ఈఎస్ఐ అధికారులు ఏపీఎంఎస్‌ఐడీసీతో మాట్లాడుతున్నారు. పక్కాగా పేషెంట్ల రిజిస్ట్రీ రాష్ట్రంలో ఈఎస్ఐ సౌకర్యం గల కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కలిపి 44 లక్షల మంది పైనే ఉన్నారు. వీరిలో ఎవరైనా ఈఎస్ఐ ఆస్పత్రులకు వెళితే వారి పేరు, వివరాలు, ఐడీ నంబర్ పక్కాగా ఆన్లైన్లో నమోదు చేస్తారు. వారికి ఏయే మందులు, ఎన్నెన్ని ఇచ్చారు, ఏ డాక్టర్ చికిత్స చేశారు, రక్త పరీక్షలేమైనా చేశారా వంటి వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయాల్సిందే. ఏ ఒక్క రోగికి సంబంధించిన పేరు నమోదు చేయకపోయినా ఆ డిస్పెన్సరీ ఉద్యోగులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇక అన్నీ ఆన్లైన్లోనే.. ‘ధన్వంతరి’ సాఫ్ట్‌వేర్‌ను అమల్లోకి తెస్తున్నాం. రిఫరల్ ఆస్పత్రుల నమోదు పూర్తయింది. పేషెంట్ రిజిస్ట్రీ ఆన్లైన్ చేసేందుకు కసరత్తు జరుగుతోంది. ఇకపై మాన్యువల్‌గా చేసేవేవీ ఉండవు. అన్నీ ఆన్లైన్లో వస్తే అనుమతులు ఇస్తాం. వేలాదిమంది రోగులకు చెల్లించాల్సిన బకాయిలన్నీ చెల్లిస్తున్నాం. ఎన్నో ఏళ్లుగా వారికి బిల్లులు చెల్లించలేదు. –డాక్టర్ కుమార్ లక్కింశెట్టి, డైరెక్టర్, ఈఎస్ఐ -
‘ఫండ్స్’లో దుర్వినియోగానికి బ్రేకులు
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్టర్ల పెట్టుబడులు దుర్వినియోగం కాకుండా సెబీ ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధమైంది. ఇందుకోసం అన్ని ప్లాట్‌ఫామ్‌లలోనూ పూల్ అకౌంట్ల వినియోగాన్ని నిలిపివేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చింది. క్లయింట్ల పెట్టుబడులు, సెక్యూరిటీలను ట్రేడింగ్ ద్వారా లేదా క్లియరింగ్ సభ్యులు మార్జిన్ల కోసం తరలించడం.. తమ సొంత ఖాతాల ద్వారా ఆయా షేర్లపై రుణాలు తీసుకోవడం, సెటిల్మెంట్లకు సర్దుబాటు చేయడం వంటి ఘటనలు తన దృష్టికి వచ్చినట్టు సెబీ మంగళవారం విడుదల చేసిన చర్చా పత్రంలో వెల్లడించింది. మ్యూచువల్ ఫండ్స్ లావాదేవీలను మధ్యవర్తులైన స్టాక్ బ్రోకర్లు, క్లియరింగ్ సభ్యులు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నిర్వహించినప్పుడు అవి దుర్వినియోగం అయ్యే అవకాశాలున్నాయని సెబీ పేర్కొంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులకు సంబంధించి నిధులు పూల్ అకౌంట్లు లేదా ఎస్క్రో ఖాతాల నుంచి వచ్చే అవకాశం ఉన్నందున వీటి మూలాలను అస్సెట్ మేనేజ్మెంట్ కంపెనీలు తెలుసుకోలేవని సెబీ గుర్తించింది. ‘‘ఫండ్స్ యూనిట్లు, నిధులు బ్రోకర్ల ఖాతాల నుంచి రిజి స్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లు లేదా ఏఎంసీల ఖాతాలకు వెళ్లాలి. ఇందుకోసం ఇన్వెస్టర్ల నిధులు మధ్యవర్తుల స్థాయిలో పూలింగ్ ఖాతాల్లోకి వచ్చి వెళుతుంటాయి. దీంతో ఆయా నిధుల మూలాలు, ఇన్వెస్టర్ల వివరాలు ఏఎంసీలకు తెలిసే అవకాశం ఉండడం లేదు’’ అని సెబీ పేర్కొంది. దీంతో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులను సురక్షితంగా మార్చేందుకు స్టాక్‌బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్లు, ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లు, ఇతర ప్లాట్‌ఫామ్‌ల ద్వారా నిధులు లేదా మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల పూలింగ్ను నిలిపివేయాలని ప్రతిపాదించినట్టు సెబీ వెల్లడించింది. కార్వీ స్టాక్ బ్రోకింగ్ తన క్లయింట్ల సెక్యూరిటీలను తన పూల్ అకౌంట్‌కు తరలించి వాటిపై రుణాలు తీసుకోవడం, అనంతరం చెల్లింపుల్లో సమస్య ఏర్పడడం ఇటీవలే జరిగింది. ఈ పరిణామాలతో మ్యూచువల్ ఫండ్స్‌లోనూ ఇదే తరహా రిస్క్ లేకుండా చూడాలన్నది సెబీ ఉద్దేశంగా కనిపిస్తోంది. మధ్యవర్తుల ప్రమేయం తగ్గించడం.. సెబీ తాజా ప్రతిపాదనలకు అనుగుణంగా.. క్లయింట్లు, క్లియరింగ్ కార్పొరేషన్ల మధ్య ప్రత్యక్ష సంబంధాలకు స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు వీలు కల్పించాల్సి ఉంటుంది. ‘‘స్టాక్ బ్రోకర్ల ద్వారా స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో జరిగే లావాదేవీల కోసం.. ఇన్వెస్టర్ల బ్యాంకు ఖాతా నుంచి నేరుగా గుర్తింపు పొందిన క్లియరింగ్ కార్పొరేషన్‌కు నిధులు వెళ్లేందుకు, అలాగే క్లియరింగ్ కార్పొరేషన్ నుంచి నేరుగా క్లయింట్ బ్యాంకు ఖాతాకు నిధులు జమయ్యేం దుకు తగిన వ్యవస్థలను స్టాక్ ఎక్సే్ఛంజ్‌లు ఏర్పా టు చేయాల్సి ఉంటుంది’’అని సెబీ తెలిపింది. ప్రజావేగులకు ప్రోత్సాహకం ఇన్సైడర్ ట్రేడింగ్ కేసుల్లో తగిన సమాచారంతో ముందుకు వచ్చిన ప్రజావేగులను ప్రోత్సహించే నూతన విధానాన్ని సెబీ రూపొందించింది. ఇన్సైడర్ ట్రేడింగ్ నిషేధ నిబంధనల కింద కనీసం రూ.కోటి రూపాయల మేర రికవరీకి అవకాశం ఉన్న కేసుల్లో సమాచారం ఇచ్చిన వారికి ప్రోత్సాహకం ఇవ్వనుంది. అలాగే, తనకు ఏ రూపంలో సమాచారం వచ్చిందన్నది సెబీ వెల్లడించాల్సి ఉంటుంది. అదే సమయంలో ఆ సమాచారం ఇచ్చిన వారి గుర్తింపును గోప్యంగా ఉంచుతుంది. మైనర్ల పేరిట ఫండ్స్‌లో పెట్టుబడులు మైనర్ల పేరిట వారి సంరక్షకులు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టడం, మేజర్లుగా మారిన తర్వాత సాఫీగా బదలాయింపునకు సంబంధించి సెబీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అన్ని ఏఎంసీల పరిధిలో ఈ ప్రక్రియ ఏకరూపంలో ఉండేందుకు ఇవి వీలు కల్పిస్తాయి. పెట్టుబడులు మైనర్ల బ్యాంకు ఖాతాల నుంచి లేదా చెక్ లేదా డీడీ రూపంలో ఇవ్వవచ్చు. మైనర్, సంరక్షకుని సంయుక్త ఖాతా నుంచీ నిధులు పంపొచ్చు. మేజర్ అయిన తర్వాత.. మేజర్‌కు ఉండే పూర్తి హక్కులు దఖలు పడతాయి. -
లెక్కల్లేవ్..!
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : ఎన్ఆర్ఎం కింద మంజూరైన హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ(హెచ్‌డీఎస్) నిధులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు(పీహెచ్సీ), కమ్యూనిటీ, ఏరియా ఆస్పత్రుల అభివృద్ధికి వినియోగిస్తారు. ఈ నిధులు వైద్యాధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. నాలుగేళ్లలో సుమారు రూ.5 కోట్లు మంజూరు కాగా, ఇందులో రూ.3.25 కోట్లకు యూటిలైజేషన్ రశీదులు అందజేశారు. మిగతా రూ.1.74 కోట్ల యూసీలు అందజేయలేదు. ఖర్చయిన నిధుల్లో కూడా అవకతవకలు జరిగాయి. వస్తువులను తక్కువ ధరకు కొనుగోలు చేసి బిల్లులు మాత్రం అధిక ధర చూసి స్వాహా చేశారు. ఇక ఖర్చుకాని నిధులకు లెక్కలు కూడా లేవు. మొత్తానికి వచ్చిన డబ్బులు ఖర్చయినట్లు వైద్యాధికారులు చూపిస్తున్నారు. గతేడాది ఒక్కో పీహెచ్‌సీకి రూ.1.75 లక్షలు వచ్చాయి. ఇందులో నుంచి పలుచోట్ల ఒక ఇన్వర్టర్, వాటర్ ప్యూరీఫైడ్, భవనానికి పెయింటింగ్ చేయించి మిగతా సగానికి పైగా నిధులను హాంఫట్ చేశారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే నిధులు దుర్వినియోగానికి గురయ్యాయి. అధికారులు దృష్టిసారిస్తే అవినీతి బాగోతం బయటపడే అవకాశం ఉంది. చేయాల్సిందిలా... త్వరలో జిల్లాలోని ఒక్కొక్క పీహెచ్‌సీకి రూ.1.75 లక్షలు వచ్చే అవకా శం ఉంది. ఈ నిధుల వినియోగంపై ఆస్పత్రి అభివృద్ధి కమిటీలో చ ర్చించి.. తీసుకున్న తీర్మాణాలకు అనుగుణంగా ఖర్చుచేయాలి. జిల్లా లో 72 పీహెచ్‌సీలు ఉండగా 17 క్లస్టర్లుగా వీటిని విభజించారు. క్లస్టర్‌కు సీనియర్ పబ్లిక్ హెల్త్ ఆఫీసర్(ఎస్పీహెచ్వో) ఉంటారు. మండల పరి షత్ అధ్యక్షుడు ఆస్పత్రి అభివృద్ధి కమిటీకి చైర్మన్‌గా ఉంటాడు. ఎన్నిక లు జరగక పోవడంతో ఎస్పీహెచ్వో చైర్మన్‌గా, మెడికల్ ఆఫీసర్ మెం బర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. వీరిద్దరు జాయింట్ చెక్‌పవర్ కలిగి ఉంటారు. సభ్యులుగా పీహెచ్సీ పరిధిలోని గ్రామాల మహిళ సర్పం చ్‌లు, ఎస్సీ, ఎస్టీ సర్పంచ్‌లు, స్థానిక సర్పంచ్, మహిళ సమైక్య అధ్యక్షురాలు, ఇద్దరు ఎంపీటీసీలు, తహశీల్దార్, ఎంపీడీవో, ఓ సీనియర్ మెడికల్ ఆఫీసర్లు ఉంటారు. వీరందరి సమక్షంలో ఆస్పత్రి అభివృద్ధికి సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఆస్పత్రుల్లో రోగుల సౌకర్యార్థం కుర్చీలు, పడకలు, శానిటేషన్, టాయిలెట్స్, కిటికీల మరమ్మతు, కర్టెన్లు, అత్యవసర మందులు, భవన మరమ్మతులు, తాత్కాలిక షెల్టర్లు నిర్మించవచ్చు. అయితే సమావేశాలు నిర్వహించకుండానే, తీర్మానాలు చేయకుండానే వైద్యాధికారులు నిదులు దుర్వినియోగం చేశారు. సగం నిధులు అభివృద్ధికి వినియోగిస్తూ.. మిగతా నిధులు స్వాహా చేశారు. ఈ విషయమై.. న్యూస్‌లైన్ డీఎంహెచ్‌వో స్వామిని వివరణ కోరగా యూటిలైజేషన్ సర్టిఫికేట్లు ఇవ్వాలని హెచ్‌డీఎస్ చైర్మన్‌కు, వైద్యాధికారులకు పలుమార్లు సర్క్యూలర్లు జారీ చేశాం. ఒకవేళ దుర్వినియోగం చేసినట్లు తేలితే చర్యలు తీసుకుంటాం.