![Body Was Completely Burnt and Girl Died In Tiruvalluru - Sakshi](/styles/webp/s3/article_images/2021/10/6/lakshitha.jpg.webp?itok=94pmUmk5)
మృతి చెందిన లక్షిత(ఫైల్)
సాక్షి, తిరువళ్లూరు: వైద్యం వికటించడంతో శరీరం పూర్తిగా కాలిపోయి బాలిక మృతి చెందిన ఘటన తిరువళ్లూరు జిల్లా పొన్నేరి సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎంజీఆర్ నగర్‌కు చెందిన కుమార్‌కు లక్షిత(07) అనే కుమార్తె ఉంది. గతనెల 27న లక్షిత అనారోగ్యానికి గురవడంతో సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చిక్సిత చేయించారు. వైద్యులు ఇచ్చిన మందులను వాడిన రెండు రోజుల్లోనే బాలిక శరీరంపై బొబ్బలు రావడంతో తల్లిదండ్రులు మళ్లీ అదే వైద్యశాలకు తీసుకెళ్లారు.
చదవండి: (తల్లీకొడుకును బలిగొన్న బజ్జీలు)
అయితే ఇక్కడ వైద్యం చేయలేమని ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లాలని సూచించినట్టు తెలుస్తుంది. దీంతో బాలికను పొన్నేరి వైద్యశాలకు తరలించారు. అక్కడ ప్రాథమిక చిక్సిత అందించిన తరువాత చెన్నై ఎగ్మూర్‌లో ఉన్న చిన్నపిల్లల వైద్యశాలకు తరలించారు. అక్కడ బాలిక చిక్సిత పొందుతూ మంగళవారం మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన బంధువులు ప్రైవేటు వైద్యశాల వద్దకు చేరుకుని ఆందోళన నిర్వహించారు. ఆస్పత్రిపై రాళ్లు రువ్వి వీరంగం సృష్టించారు. పోలీసు లు బాలిక బంధువులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు. అనంతరం వైద్యశాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చదవండి: (విద్యుత్ షాక్‌తో దంపతులు మృతి)
Comments
Please login to add a commentAdd a comment