COVID-19 Vaccine: నోటి ద్వారా కరోనా టీకా.. ప్రపంచంలో ఇదే మొదటిది | China launches a COVID-19 vaccine inhaled through the mouth | Sakshi
Sakshi News home page

COVID-19 Vaccine: నోటి ద్వారా కరోనా టీకా.. ప్రపంచంలో ఇదే మొదటిది

Published Thu, Oct 27 2022 5:36 AM | Last Updated on Thu, Oct 27 2022 9:35 AM

China launches a COVID-19 vaccine inhaled through the mouth - Sakshi

బీజింగ్‌:  సూది(సిరంజీ)తో అవసరం లేకుండా నోటి ద్వారా తీసుకొనే కోవిడ్‌–19 టీకా చైనాలోని షాంఘై నగరంలో బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఈ తరహా టీకా ప్రపంచంలో ఇదే మొదటిదని చెబుతున్నారు. టీకా తీసుకున్న తర్వాత 5 సెకండ్ల పాటు శ్వాస పీల్చుకోవడం ఆపేయాల్సి ఉంటుంది.

ఒక్కొక్కరికి మొత్తం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ 20 సెకండ్లో పూర్తవుతుంది. ఈ టీకా తీసుకుంటే ఒక కప్పు టీ తాగినట్లే ఉందని షాంఘై వాసి ఒకరు తన అనుభవాన్ని పంచుకున్నారు. ఇన్‌హేలర్‌ లాగా నోటి ద్వారా తీసుకొనే ఈ టీకాను బూస్టర్‌ డోసుగా ఉచితంగా ఇస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. సూదితో కంటే ఇది సులభంగా అందజేయవచ్చన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement