ఇంజెక్షన్ వికటించి క్యాబ్ డ్రైవర్ హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన పరిథిలో మరణించాడు.
అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి చికిత్స కోసం ఆస్పత్రికి వస్తే.. వైద్యుడు నిర్లక్ష్యంతో సరైన ఇంజక్షన్ ఇవ్వకపోవ డంతో.. సూది మందు వికటించి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన నగరంలోని రాయదుర్గంలో శుక్రవారం వెలుగుచూసింది. స్థానికంగా నివాసముంటున్న వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అనారోగ్యంతో బాధపడుతుండటంతో.. స్థానిక రాఘవేంద్ర క్లినిక్‌కు వెళ్లాడు. అక్కడ ఇచ్చిన ఇంజెక్షన్ వికటించడంతో.. మృతిచెందాడు. దీంతో మృతుని బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.