ప్రతీకాత్మక చిత్రం
కేరళకు చెందిన పదేళ్ల చిన్నారి ఫాతిమా నైదా షిహాబుద్దీన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. జాతీయ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఛాంపియన్‌గా నిలవాలన్న తన కోరిక తీరకుండానే మృతి చెందడం విషాదం నింపింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వేదికగా జాతీయ సైక్లింగ్ పోలో చాంపియన్‌షిప్ శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఫాతిమా బుధవారం నాగ్‌పూర్‌కు చేరుకుంది.
అయితే గత రెండు రోజుల నుంచి విరేచనాలతో ఇబ్బంది పడుతున్న ఫాతిమా గురువారం ఉదయం అస్వస్థతకు గురైంది. దీంతో నిర్వాహకులు ఆమెను దంతోలిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఎం-సెట్ అనే ఇంజెక్షన్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఆమె కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫాతిమా చనిపోవడానికి వైద్యులు చేసిన ఇంజెక్షన్ కారణమా లేక వేరే ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే జాతీయ సైక్లింగ్ పోటీల్లో పాల్గొని ఛాంపియన్‌గా నిలవాలనుకున్న 10 ఏళ్ల ఫాతిమా ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అందరిని కలిచివేసింది. కూతురి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
Comments
Please login to add a commentAdd a comment