cycling championship
-
12 రోజులు.. 5000 కిలోమీటర్లు!
సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచ సైక్లింగ్ పోటీల్లో అత్యంత కఠినమైన రేస్ ఎక్రాస్ అమెరికా (వరల్డ్ అల్ట్రా సైక్లింగ్ ఛాంపియన్షిప్ ట్రోఫీ) సైక్లింగ్ ఈవెంట్. దీనికి అర్హత సాధించానని హైదరాబాద్ బండ్లగూడకు చెందిన రవీందర్‌రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది జూన్ 10 నుంచి సైక్లింగ్ పోటీలు ప్రారంభం కానున్నాయన్నారు. భారత్ నుంచి తొలిసారి ఈ పోటీల్లో పాల్గొంటున్న తొలి వ్యక్తి తానేనని, 12 రోజులు, 12 నగరాల మీదుగా 5 వేల కిలో మీటర్ల నిరంతరాయంగా సైక్లింగ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు.ఈస్ట్ అమెరికాలోని కాలిఫోర్నియాలో ప్రారంభమై న్యూజెర్సీలో ముగుస్తుందన్నారు. ప్రపంచంలో 60 ఏళ్ల పైబడిన వారు ఇద్దరు, 50 ఏళ్ల నుంచి 59 ఏళ్ల వయసులో 5 గరు పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత నుంచి ప్లస్ 50 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండే ప్రాంతాల్లో ఈ సైక్లింగ్ ఉంటుందన్నారు. పేద పిల్లలకు ఫండ్ రైజింగ్‌లో భాగంగా ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నారని, గతంలో 29 మంది సైక్లిస్టులు రూ.100 కోట్ల ఫండ్ రైజ్ చేశారని గుర్తుచేశారు.గతంలో రేస్ ఎక్రాస్ ఇండియా, రేస్ ఎక్రాస్ ఆసియా పోటీల్లో విజేతగా నిలిచానని తెలిపారు. రేస్ ఎక్రాస్ అమెరికా ఈట్లోనూ 50 ఏళ్ల కేటగిరిలో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. ముందస్తు ట్రయల్స్‌లో భాగంగా ప్రస్తుతం అమెరికాలో సైక్లింగ్ చేయనున్న రూట్లో ట్రయల్ వేస్తున్నారు.ఇవి చదవండి: Singer Smita: ఓల్డ్ స్కూల్ బృందావనం! నగరంలో కొత్త కాన్సెప్ట్.. -
"టూర్ డి ఫ్రాన్స్" టైటిల్ గెలిచిన బినియం గిర్మే.. తొలి ఆఫ్రికన్‌గా రికార్డు
ట్యురిన్‌లో జరిగిన సైక్లింగ్ పోటీల్లో ఎరిట్రియాకు చెందిన బినియం గిర్మే చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మకమైన టూర్ డి ఫ్రాన్స్ (ఫ్రాన్స్‌లో జరిగే పురుషుల మల్టీ స్టేజ్ సైకిల్ రేసు) స్టేజ్ టైటిల్ గెలిచిన తొలి నల్లజాతి ఆఫ్రికన్ రైడర్‌గా రికార్డు నెలకొల్పాడు. సోమవారం జరిగిన మూడో దశ స్ప్రింట్‌లో గిర్మే విజయం సాధించాడు. ఇంటర్‌మార్చే వాంటీ జట్టుకు చెందిన గిర్మే.. ఫెర్నాండో గవిరియా, ఆర్నాడ్ డి లీ కంటే ముందే రేస్ ఫినిష్ చేసి టైటిల్ గెలిచాడు.Biniam Girmay makes history as the first African rider to win a Tour de France stage🇪🇷 pic.twitter.com/AB8xvzyxox— Typical African (@Joe__Bassey) July 3, 202424 ఏళ్ల గిర్మేకు ఇది రెండో టూర్. గిర్మే 2022లో గిరో డి'ఇటాలియా స్టేజ్ టైటిల్ గెలిచాడు. మరోవైపు టూర్ డి ఫ్రాన్స్‌లో రిచర్డ్ కరాపాజ్.. తదేజ్ పొగాకర్ నుంచి పసుపు జెర్సీని (రేస్ లీడర్) దక్కించుకున్నాడు. తద్వారా కరాపాజ్ ఈ ఘనత సాధించిన మొదటి ఈక్వెడారియన్గా రికార్డుల్లోకెక్కాడు. ఇంకో వైపు గిర్మే గెలుపుతో స్టేజ్ విజయాల రికార్డు బద్దలు కొట్టాలన్న మార్క్ కావెండిష్ ఆశలు అడియాశలయ్యాయి.టూర్ డి ఫ్రాన్స్ గెలిచిన అనంతరం గిర్మే మాట్లాడుతూ.. నేను సైక్లింగ్ ప్రారంభించినప్పటి నుండి ఈ టైటిల్ గురించి కలలు కంటున్నాను. రెండో ప్రయత్నంలోనే టైటిల్ గెలవడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది వ్యక్తిగతంగా నాకు, నా ప్రాంతానికి (ఆఫ్రికా) గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. -
ఛాంపియన్ అవ్వాలని వచ్చింది.. అనుమానాస్పద మృతి
కేరళకు చెందిన పదేళ్ల చిన్నారి ఫాతిమా నైదా షిహాబుద్దీన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. జాతీయ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వచ్చిన ఆమె ఛాంపియన్‌గా నిలవాలన్న తన కోరిక తీరకుండానే మృతి చెందడం విషాదం నింపింది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్ వేదికగా జాతీయ సైక్లింగ్ పోలో చాంపియన్‌షిప్ శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ పోటీల్లో పాల్గొనడానికి ఫాతిమా బుధవారం నాగ్‌పూర్‌కు చేరుకుంది. అయితే గత రెండు రోజుల నుంచి విరేచనాలతో ఇబ్బంది పడుతున్న ఫాతిమా గురువారం ఉదయం అస్వస్థతకు గురైంది. దీంతో నిర్వాహకులు ఆమెను దంతోలిలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. చిన్నారిని పరీక్షించిన వైద్యులు ఎం-సెట్ అనే ఇంజెక్షన్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే ఆమె కుప్పకూలి అక్కడికక్కడే మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫాతిమా చనిపోవడానికి వైద్యులు చేసిన ఇంజెక్షన్ కారణమా లేక వేరే ఏదైనా ఉందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. అయితే జాతీయ సైక్లింగ్ పోటీల్లో పాల్గొని ఛాంపియన్‌గా నిలవాలనుకున్న 10 ఏళ్ల ఫాతిమా ఇలా అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం అందరిని కలిచివేసింది. కూతురి మరణవార్త తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
తీవ్రంగా గాయపడిన ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్
ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్.. నెదర్లాండ్స్‌కు చెందిన మహిళా సైక్లిస్ట్ అనెమిక్ వాన్ లూటెన్కు పెను ప్రమాదం తప్పింది.సైక్లింగ్ రేసింగ్‌లో పట్టుతప్పడంతో బారియర్‌కు తాకి కిందపడిన లూటెన్ తీవ్ర గాయాలపాలైంది. విషయంలోకి వెళితే ఆస్ట్రేలియాలోని వోల్లోంగాంగ్లోలో నిర్వహిస్తున్న రోడ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో బుధవారం మిక్స్డ్ టీమ్ ట్రయల్ రెండో రౌండ్ జరిగింది. టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన వాన్ లూటెన్ ర్యాంప్ నుంచి స్టార్ట్ తీసుకోగానే.. డౌన్‌కు వెళుతున్న సమయంలో సైకిల్ పట్టుతప్పింది. దీంతో బారియర్‌కు తాకి కిందపడిన ఆమె తలకు చేతులను అడ్డుపెట్టింది. ఈ నేపథ్యంలో ఆమె మోచేతికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే ఆమె వెనకాల ఉన్న రేసర్ వాన్ జిక్తో పాటు ముందు వెళ్తున్న రిజనే మార్కస్లు షాక్‌కు గురయ్యారు. కానీ అప్పటికే గేమ్ ప్రారంభం కావడంతో సైక్లింగ్‌ను కంటిన్యూ చేశారు. దీనికి సంబంధించిన వీడియో (UCI World Tour) తన ట్విటర్లో షేర్ చేయగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ''మెకానికల్ సమస్య వల్ల డచ్ సూపర్‌స్టార్‌కు ప్రమాదం జరిగింది. నిజంగా డచ్‌కు ఈరోజు నిరాశపరిచింది'' అంటూ క్యాప్షన్ జత చేసింది. కాగా ప్రమాదంపై అనెమిక్ వాన్ లూటెన్ స్పందించింది. ''కాసేపు ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ సైకిల్ టైర్ పగలడంతో స్కిడ్ అయ్యాను. అంతే రోడ్డు పక్కనున్న బారియర్‌కు గుద్దుకుంది. బ్యాలెన్సింగ్ చేయకపోవడం వల్ల ఇది జరిగిందని అనుకుంటున్నా. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నా'' అంటూ పేర్కొంది. కాగా నెదర్లాండ్స్‌కు చెందిన అనెమిక్ వాన్ లూటెన్.. టోక్యో ఒలింపిక్స్ 2020లో టైమ్ ట్రయల్‌లో స్వర్ణం, రోడ్ రేస్‌లో రజతం గెలిచి చరిత్ర సృష్టించింది. ⚠️ CRASH for @AvVleuten!! ⚠️ Mechanical issue causes horrible crash for the Dutch superstar. Really disappointing day for the Dutch. #Wollongong2022 pic.twitter.com/rU5LYNnlcu — UCI (@UCI_cycling) September 21, 2022 చదవండి: రోజర్ ఫెదరర్ కీలక వ్యాఖ్యలు.. కోహ్లిని కలిసిన వివాదాస్పద పారిశ్రామికవేత్త -
జాతీయ సైక్లింగ్‌లో తెలంగాణ కుర్రాడి సత్తా.. ఒకేసారి రెండు పతకాలు
జాతీయ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ సైక్లిస్ట్ ఆశీర్వాద్ సక్సేనా రెండు పతకాలతో ఆకట్టుకున్నాడు. జైపూర్‌లో జరుగుతున్న ఈ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన ఆశీర్వాద్ రజతం, కాంస్యం సాధించాడు. అండర్–16 విభాగం 2000 మీటర్ల వ్యక్తిగత పర్సూ్యట్ ఈవెంట్లో ఆశీర్వాద్ మూడో స్థానంలో నిలిచాడు. ఆశీర్వాద్, చిరాయుష్ పట్వర్ధన్, ఎ.రామకృష్ణలతో కూడిన తెలంగాణ బృందం టీమ్ స్ప్రింట్ ఈవెంట్లో రజతం సాధించింది. భారత స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలోని ఖేలో ఇండియా శిబిరంలో ఈ ముగ్గురు శిక్షణ పొందారు. -
సైక్లింగ్ కోచ్‌గా పాండు జాదవ్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ కోచ్‌గా వ్యాయామ విద్య (ఫిజికల్ ఎడ్యుకేషన్) విద్యార్థి పాండు జాదవ్ ఎంపికయ్యాడు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పాండు జాదవ్ ఓయూ పరిధిలోని వ్యాయామ విద్య కాలేజీలో ఎంపీఈడీ కోర్సు చదువుతున్నాడు. నేటి నుంచి శనివారం వరకు ఉత్తరాఖండ్‌లో జరిగే జాతీయ సైక్లింగ్ పోటీల్లో రాష్ట్ర సీనియర్, జూనియర్ జట్లకు పాండు జాదవ్ కోచ్‌గా వ్యవహరించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సైక్లింగ్ అధ్యక్షులు మల్లారెడ్డి, కార్యదర్శి దత్తాత్రేయ తెలిపారు. -
భారత సైక్లింగ్ జట్టులో తనిష్క్
సాక్షి, హైదరాబాద్: యూసీఐ క్లాస్–1 ఆసియా కప్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జూనియర్ పురుషుల జట్టుకు తెలంగాణ సైక్లిస్ట్ ఎం. తనిష్క్ ఎంపికయ్యాడు. జాతీయ స్థాయి టోర్నీల్లో నిలకడగా రాణిస్తూ పతకాలు సాధిస్తున్న తనిష్క్.. ఆసియా కప్ టోరీ్నలో భారత స్పోర్ట్స్ అథారిటీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తాడు. తాజాగా జరిగిన జాతీయ రోడ్ అండ్ ట్రాక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన తనిష్క్ రెండు స్వర్ణాలతో మెరిశాడు. అతను యూసీఐ ప్రపంచ సైక్లింగ్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. -
రాష్ట్ర సైక్లింగ్ జట్టు కెప్టెన్ ఆకాశ్
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ ట్రాక్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బృందాన్ని శనివారం ప్రకటించారు. 25 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు కె. ఆకాశ్ సారథ్యం వహించనున్నాడు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జనవరి 2 నుంచి 6 వరకు ఈ టోర్నమెంట్ జరుగనుంది. రాష్ట్ర సైక్లింగ్ బృందం: కె. ఆకాశ్, సోను గుప్తా, ఎ. రాజ్‌కుమార్, బి. ముగేశ్, కె. అనిరుధ్, ఎం. తనిష్క్ (హైదరాబాద్), వి. శైలేంద్రనాథ్, టి. అఖిల్, కౌషిక్ (కరీంనగర్), కె. ప్రణయ్, ఎ. అరుణ్, బి. మహేశ్, కె. శ్రీరామ్, శ్రీనివాస్ (జనగాం), జె. రాకేశ్, టి. సాయి తరుణ్, వి. ఉదయ్ కుమార్ (సిద్దిపేట్), సీహెచ్. రణధీర్, జె. ప్రణయ్, మొహమ్మద్ సమీర్, కె. శ్రీరామ్ నాయక్ (వరంగల్), పాండు (ఆదిలాబాద్), ఎన్. రమేశ్‌బాబు (సీనియర్ మేనేజర్), విజయ్ భాస్కర్‌రెడ్డి (సీనియర్ కోచ్). -
తెలంగాణకు మూడు పతకాలు
సాక్షి, హైదరాబాద్: జాతీయ రోడ్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ క్రీడాకారులు రాణించారు. కర్ణాటకలోని జామకండిలో జరిగిన ఈ టోర్నీలో మూడు పతకాలను సాధించారు. 120 కి.మీ రోడ్ మాస్ స్టార్ట్ ఈవెంట్లో బి. ముగేశ్, 40 కి.మీ ఈవెంట్లో అమన్ పుంజరి చెరో రజత పతకాన్ని గెలుచుకున్నారు. 50 కి.మీ క్రిటోరియమ్ ఈవెంట్లో పరశురామ్ చెంజి కాంస్యాన్ని దక్కించుకున్నాడు. జాతీయ స్థాయిలో రాణించిన సైక్లిస్టులను ‘శాట్స్’ చైర్మన్ ఎ. వెంకటేశ్వర్ రెడ్డి, ఎండీ ఎ. దినకర్‌బాబు బుధవారం అభినందించారు. భవిష్యత్‌లో మరిన్ని పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. , -
సైక్లింగ్ చాంపియన్ నార్త్ వెస్ట్రన్ రైల్వే
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా రైల్వేస్ సైక్లింగ్ చాంపియన్‌షిప్‌లో నార్త్ వెస్ట్రన్ రైల్వే చాంపియన్‌షిప్‌ను దక్కించుకుంది. సౌత్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స అసోసియేషన్ (ఎస్‌సీఆర్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ సైక్లింగ్ ట్రాక్‌పై జరిగిన ఈ పోటీల్లో మొత్తం 64 పాయింట్లతో నార్త్ వెస్ట్రన్ రైల్వే అగ్రస్థానాన్ని దక్కిం చుకోగా... నార్తర్న్ రైల్వే (43) రెండో స్థానంలో నిలిచింది. మొత్తం 9 జోన్లు పాల్గొన్న ఈ టోర్నీలో సౌత్ సెంట్రల్ రైల్వే 30 పాపాయింట్లతో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. 4కి.మీ టీమ్ పర్స్యూట్ విభాగంలో విజేత నార్త్ వెస్టన్ర్ రైల్వే జట్టుకు సౌత్ సెంట్రల్ రైల్వే (ఎస్సీఆర్) గట్టి పోటీనిచ్చింది. అయినప్పటికీ ఎస్సీఆర్ రన్నరప్‌గా నిలిచి రజత పతకంతో సరిపెట్టుకుంది. విజేతలకు ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తా బహుమతులు ప్రదానం చేశారు. విజేత ఆర్నిరెడ్డి జంట సాక్షి, హైదరాబాద్: చాంపియన్‌షిప్ సిరీస్ అండర్-14 టెన్నిస్ టోర్నమెంట్లో ఆర్ని రెడ్డి జోడి విజేతగా నిలిచింది. బోయిన్‌పల్లిలోని ఎమ్మాన్యుయేల్ టెన్నిస్ కోచింగ్ సెంటర్లో శుక్రవారం జరిగిన బాలికల డబుల్స్ ఫైనల్లో ఆర్ని రెడ్డి- పి. అమూల్య ద్వయం 7-5, 7-5తో సాయి ధన్వి-శ్రేష్టజోడిపై విజయం సాధించింది. బాలుర డబుల్స్ ఫైనల్లో కోట శశిధర్- కౌశిక్ కుమార్ ద్వయం 6-3, 6-2తో కార్తీక్ నీల్- శ్రీశరణ్ జోడీపై నెగ్గి చాంపియన్‌గా నిలిచింది. సింగిల్స్ విభాగంలోనూ శశిధర్ 6-4, 6-4తో వరుణ్ కుమార్‌పై గెలుపొందాడు. బాలికల సింగిల్స్ ఫైనల్లో తనుషిత 6-3, 5-7, 7-6 (5)తో సాయి ధన్వి లాలసను ఓడించి విజేతగా నిలిచింది. అనంతరం విజేతలకు ట్రోఫీలను అందజేశారు.