రాష్ట్ర సైక్లింగ్‌ జట్టు కెప్టెన్‌ ఆకాశ్‌ | akash leads as telangana cycling team | Sakshi
Sakshi News home page

రాష్ట్ర సైక్లింగ్‌ జట్టు కెప్టెన్‌ ఆకాశ్‌

Dec 31 2017 10:44 AM | Updated on Dec 31 2017 10:45 AM

akash leads as telangana cycling team - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సీనియర్, జూనియర్, సబ్‌ జూనియర్‌ ట్రాక్‌ సైక్లింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర బృందాన్ని శనివారం ప్రకటించారు. 25 మంది సభ్యులతో కూడిన ఈ జట్టుకు కె. ఆకాశ్‌ సారథ్యం వహించనున్నాడు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జనవరి 2 నుంచి 6 వరకు ఈ టోర్నమెంట్‌ జరుగనుంది.  


రాష్ట్ర సైక్లింగ్‌ బృందం: కె. ఆకాశ్, సోను గుప్తా, ఎ. రాజ్‌కుమార్, బి. ముగేశ్, కె. అనిరుధ్, ఎం. తనిష్క్‌ (హైదరాబాద్‌), వి. శైలేంద్రనాథ్, టి. అఖిల్, కౌషిక్‌ (కరీంనగర్‌), కె. ప్రణయ్, ఎ. అరుణ్, బి. మహేశ్, కె. శ్రీరామ్, శ్రీనివాస్‌ (జనగాం), జె. రాకేశ్, టి. సాయి తరుణ్, వి. ఉదయ్‌ కుమార్‌ (సిద్దిపేట్‌), సీహెచ్‌. రణధీర్, జె. ప్రణయ్, మొహమ్మద్‌ సమీర్, కె. శ్రీరామ్‌ నాయక్‌ (వరంగల్‌), పాండు (ఆదిలాబాద్‌), ఎన్‌. రమేశ్‌బాబు (సీనియర్‌ మేనేజర్‌), విజయ్‌ భాస్కర్‌రెడ్డి (సీనియర్‌ కోచ్‌).  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement